Breaking News

Daily Archives: December 15, 2015

ఏమిటీ కాల్ మనీ?, బిజినెస్‌లో ఎన్నారైలు: కాలువల్లోకి బ్లూఫిలింలు, పత్రాలు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాల్ మనీ సంచలనం సృష్టిస్తోంది. బాధితులు పోలీసు స్టేషన్‌కు వరుస కడుతున్నారు. కాల్ మనీ బాధితుల నుంచి నిర్వాహకులు బలవంతంగా భూములు లాక్కోవడం, డబ్బులు తీసుకోవడం, అధిక వడ్డీని వసూలు చేయడం వెలుగు చూస్తున్నాయి. మరో షాకింగ్ విషయమేమంటే, మహిళా బాధితులను బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ‘కాల్ మనీ’ సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. డబ్బులు అవసరమైన వారికి ‘కాల్ మనీ’ ద్వారా సులభంగా వడ్డీకి డబ్బులు పొందవచ్చు. ఓ కాల్ ద్వారా డబ్బును సులభంగా పొందవచ్చు. ...

Read More »

నిజామాబాద్‌ జిల్లాలో కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఆర్మూర్‌

  – చిరకాల స్వప్నం సాకారమైందని ప్రజల హర్షం – వ్యాపార, వాణిజ్య రంగాల అభివృద్దికి మార్గం సుగమం – రెవెన్యూ కార్యకలాపాల కోసం తీరిన ప్రజల ఇక్కట్లు నిజామాబాద్‌, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం పది జిల్లాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పరిపాలన కూడా ప్రజలకు అత్యంత సులభతరమయ్యేలా తెలంగాణ సర్కారు అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే నిజామాబాద్‌ జిల్లాలో ఆర్మూర్‌ను రెవెన్యూ ...

Read More »

విద్యార్థులు క్రీడల్లో జాతీయ స్థాయికి ఎదగాలి

  కామారెడ్డి, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యం సాధించి గ్రామ స్తాయి నుంచి జాతీయ స్తాయికి ఎదగాలని కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌ అన్నారు. సదాశివనగర్‌ మండలం గిద్ద గ్రామంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం, క్రీడాకారులకు క్రీడా సామగ్రి పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరై డిఎస్పీ మాట్లాడారు. గ్రామీణ క్రీడాకారులు తమ నైపున్యానికి సానబెట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఫ్రెండ్లీ ...

Read More »

బికాం టాపర్లకు గోల్డ్‌మెడల్‌ ప్రదానం

  కామారెడ్డి, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు డి.స్రవంతి, భాగ్యలక్ష్మిలకు బికాంలో టాపర్లుగా నిలిచినందుకు మంగళవారం గోల్డ్‌మెడల్‌ ప్రదానం చేశారు. వంగల విఠల్‌రెడ్డి మెమోరియల్‌ ట్రస్టు ఆద్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రభాకర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఎం.యాదగిరి విద్యార్థినిలకు మెడల్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థుల్లో సంపూర్ణ మూర్తిమత్వ ...

Read More »

నందిపేట గ్రామ పంచాయతీ రికార్డుల సీజ్‌

  నందిపేట, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మేజర్‌ గ్రామపంచాయతీ పరిధిలో బహుళ అంతస్తుల భవనాలకు, అసైన్‌మెంట్‌ భూమిలో ఇళ్ల నిర్మాణాల కొరకు గ్రామ పంచాయతీ సిబ్బంది లంచాలు తీసుకుంటూ ఇష్టారీతిగా, నిబంధనలకు విరుద్దంగా అనుమతులు ఇస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ఇపిఆర్డీవో అధికారులు శనివారం రికార్డుల పరిశీలనకు వచ్చినపుడు సర్పంచ్‌ షాకీర్‌ రికార్డులు ఇవ్వడానికి నిరాకరించి వారితో దురుసుగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. కాగా మంగళవారం డిఎల్‌పివో శ్రీకాంత్‌ గ్రామ పంచాయతీని సందర్శించి ...

Read More »

నిర్మాణ పనులను పరిశీలించిన ప్రజాప్రతినిధులు

  ఎడపల్లి, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని జాన్కంపేట గ్రామంలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను మంగళవారం ఎంపిపి వైస్‌ఛైర్మన్‌ వరదగౌడ్‌, సర్పంచ్‌ దశరథ్‌, పాఠశాల విద్యాకమిటీ ఛైర్మన్‌ లక్ష్మణ్‌బాబు పరిశీలించారు. ఎస్‌ఎంసి పథకం కింద సుమారు రూ. 28 లక్షలు మంజూరుకాగా నిధులతో అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నట్టు విద్యాకమిటీ ఛైర్మన్‌ తెలిపారు. వీరితోపాటు ఎస్‌ఎంసి డిప్యూటి డిఇ సంజయ్‌, ఎఇ తదితరులున్నారు.

Read More »

రెవెన్యూ సదస్సులో 15 పట్టా పుస్తకాల పంపిణీ

  ఎడపల్లి, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలం జంలం గ్రామంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 15 మందికి పట్టా పాసుపుస్తకాలను పంపిణీ చేసినట్టు తహసీల్దార్‌ గఫర్‌మియా తెలిపారు. ఇందులో వారసత్వంగా ఇతరత్రా మార్పిడిలు చేయడం జరిగిందని, అలాగే కొత్తగా పొందే పట్టా పుస్తకాలను వారికి అందజేసినట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్‌ఐ దివ్య, విఆర్వో రాంచందర్‌, సర్పంచ్‌ సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

బడిబయటి పిల్లలకు పలకల పంపిణీ

  ఎడపల్లి, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని జాన్కంపేటగ్రామ పరిధిలో బడి బయట ఉన్న బాల కార్మికులను మంగళవారం ప్రైమరీ పాఠశాలలో చేర్పించారు. పాఠశాల విద్యాకమిటీ ఛైర్మన్‌ లక్ష్మణ్‌బాబు, స్తానిక సర్పంచ్‌ బండారు దశరథ్‌, ఎంఇవో రామారావు బడి బయట ఉన్న బాలకార్మికులను గుర్తించి బడిలో చేర్పించి పలకలు అందజేశారు. ఇటుక బట్టీల్లో, కంకర మిషన్ల వద్ద పనులు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపిపి వైస్‌ ఛైర్మన్‌ వరదాగౌడ్‌, జడ్పిపాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, ప్రైమరీ పాఠశాల ప్రధానోపాద్యాయులు వర ...

Read More »

మొరం తవ్వకాన్ని అడ్డుకున్న గ్రామస్తులు

  ఎడపల్లి, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని జాన్కంపేట గ్రామంలో కొందరు వ్యక్తులు అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతుండడంతో మంగళవారం స్తానికులు అడ్డుకున్నారు. అటవీశాఖ భూమిలో, అక్కడే ఉన్న స్మశాన వాటిక పరిధిలో అక్రమ మొరం తవ్వకాలు చేపడుతున్నారని స్థానిక సర్పంచ్‌ బండారు దశరథ్‌ తెలిపారు. అసైన్‌మెంట్‌ భూమి, శ్మశాన వాటిక ఉండడం వల్ల మొరం తవ్వకాలు అడ్డుకున్నట్టు ఆయన తెలిపారు. సంబంధిత అధికారులు ఇష్టారీతిగా మొరం తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. బడా కాంట్రాక్టర్‌ ఇచ్చే ముడుపులకు ...

Read More »

వలస బాటలో కూలీలు

  బాన్సువాడ, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరువు పరిస్థితులు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపాయి. గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక వ్యవసాయ కూలీలు వలస బాట పడుతున్నారు. బోధన్‌ డివిజన్‌లో ఖరీఫ్‌ సాగు కష్టాలు మిగల్చగా రబీ సాగుకు నోచుకోవడం లేదు. నీటి వనరులు నీరులేక బోసిపోతుండగా గొట్టపు బావులకు జీవనాధారంగా భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. ముఖ్యంగా బోధన్‌ డివిజన్‌ ప్రాంతానికి జీవనదులుగా ఉండే మంజీర, గోదావరి నదులు ఈయేడు పూర్తిగా ఎండిపోయి ఎడారిని తలపిస్తున్నాయి. దీంతో వీటి ...

Read More »

18న సహాయ ఉపకరణాల పంపిణీ

  ఆర్మూర్‌, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 18న వికలాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేయనున్నట్టు మండల విద్యాధికారి రాజగంగారాం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వికలాంగులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు.

Read More »

క్రిస్మస్‌ సందర్భంగా 16న దుస్తుల పంపిణీ

  ఆర్మూర్‌, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం క్రిస్మస్‌ పండగ పురస్కరించుకొని క్రైస్తవ సోదరులకు దుస్తులు పంపినీ చేయనున్నట్టు తహసీల్దార్‌ శ్రీధర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చేతుల మీదుగా దుస్తుల పంపినీ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన చెప్పారు.

Read More »

ఖానాపూర్‌లో సక్సేషన్‌ డ్రైవ్‌

  ఆర్మూర్‌, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం ఖానాపూర్‌ గ్రామంలో తహసీల్దార్‌ శ్రీధర్‌ ఆద్వర్యంలో మంగళవారం సక్సేషన్‌ డ్రైవ్‌ ఏర్పాటు చేశారు. ఇందులో 19 మ్యూటేషన్స్‌కు అనుమతులు ఇచ్చి పట్టా పాసుపుస్తకాలను పంపిణీ చేసినట్టు తహసీల్దార్‌ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌, ఏఆర్‌ఐ, విఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

వేసవికల్లా నీటిసమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయాలు

  కామారెడ్డి, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి కల్లా నీటి సమస్య తలెత్తే గ్రామాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా సంబంధిత అదికారులను ఆదేశించారు. మంగళవారం కామారెడ్డిలోని ఎంపిడివో కార్యాలయంలో డివిజన్‌ స్థాయి అదికారులతో సమీక్షించారు. పంచాయతీరాజ్‌ నీటి పారుదల , ఆర్‌అండ్‌బి, ఓడిఎఫ్‌, ఐఎల్‌సిపి తదితర అంశాలపై అధికారులతో కొనసాగుతున్న పనుల అభివృద్దిపై మాట్లాడారు. తీవ్ర కరువు దృస్ట్యా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఏర్పడే అవకాశమున్నందున జనవరి, మార్చి ...

Read More »

19న క్రిస్మస్‌ ఉత్సవాలు

  కామారెడ్డి, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రిస్టమస్‌ పండగను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈనెల 19న నిర్వహిస్తున్నందున జిల్లాలోని 9 వేల మంది క్రిస్టియన్లకు ఈనెల 16 న దుస్తులు పంపినీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. మంగళవారం సిసిఎల్‌ఎ రేమండ్‌ పీటర్‌ క్రిస్టమన్‌ పండగ ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు.’ కామారెడ్డిలోని ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్పరెన్సులో హాజరైన జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 9 నియోజకవర్గాల స్థాయిలో నియోజకవర్గానికి ...

Read More »

లింగ రూపంలో వెలిసిన నరసింహస్వామి

నరసింహస్వామి అనగానే సింహం ముఖంతో, మానవ రూపంతో రౌద్ర రూపాన్నే వూహించుకుంటాంకదా.  కానీ నరసింహస్వామి లింగ రూపంలో కూడా దర్శనమిస్తాడని తెలుసా మీకు!?  నమ్మలేకపోతే మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలో వున్న సింగోటం వెళ్ళండి.  అక్కడ నరసింహస్వామి లింగ రూపంలోనే దర్శనమిస్తాడు.  ఆలయం బయట లక్ష్మీ గణపతి, ఆంజనేయ స్వామి విగ్రహాలున్నాయి.  ఆ స్వాముల దర్శనం చేసుకుని లోపలకి వెళ్తే, అక్కడ పత్రం (రోట్లో పిండి రుబ్బేది) సైజులో వున్న లింగాన్ని చూడవచ్చు.  నరసింహస్వామే అక్కడ ఆ రూపంలో వెలిశాడు.  దాని కధేమిటంటే… ...

Read More »

మహేష్ లిప్ లాక్ ఛాన్స్ ఆ హీరోయిన్ కొట్టేసింది.

శ్రీమంతుడు తో సూపర్ హిట్ ని సొంతం చేసుకున్న మహేష్ బాబు..అదే జోరు తో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న బ్రహ్మోత్సవం లో బిజీ బిజీ గా షూటింగ్ చేస్తున్నాడు..తెలుగు , తమిళ్ లో ఏక కాలంలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఫై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. గత కొన్ని రోజులగా ఈ చిత్రం లో మహేష్ లిప్ లాక్ గురించి హాట్ హాట్ గా మాట్లాడుకుంటున్నారు సినీ ప్రేమికులు. ముగ్గురు హీరోయిన్స్ ఉన్న ఈ చిత్రం లో ఎవరితో లిప్ లాక్ ...

Read More »

తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. ఈ నెల మొదలు స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ఫోలియో మదుపరు (ఎఫ్‌పిఐ)లు దాదాపు 5,500 కోట్ల రూపాయల పెట్టుబడులను లాగేసుకున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్‌పర్సన్ జనెట్ యెల్లెన్ వడ్డీరేట్ల పెంపు సంకేతాలు ఇవ్వడం మదుపరులను కొనుగోళ్ళ వైపు నడిపించింది. నవంబర్‌లోనూ ఎఫ్‌పిఐలు స్టాక్ మార్కెట్ల నుంచి 7,074 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే అక్టోబర్‌లో 6,650 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. ...

Read More »

ఆఫ్రికా.. కొన్ని అపోహలు, వాస్తవాలు

భారతదేశం వలెనే ఆఫ్రికా ఖండం కూడా సుదీర్ఘకాలంపాటు యూరోపియన్ వలస పాలనకు, దోపిడీకి గురైంది. భారతీయులవలెనే ఆఫ్రికన్లు కూడా అనేక త్యాగాలతో మహత్తర పోరాటాలు జరిపి స్వాతంత్య్రం సాధించుకున్నారు. ఆ విధంగా ఉభయుల మధ్య గొప్ప అవగాహనలు, సంఘీభావాలు ఉండాలి. తమ భవిష్యత్తును నిర్మించుకునేందుకు సాగుతున్న కృషిలో ఇరువురి మధ్య గణనీయమైన సహకారం కన్పించాలి. కాని దురదృష్టవశాత్తు ఇవేమీ జరగనట్లు ఆఫ్రికాను కొన్ని రోజులపాటు సందర్శించిన వారికి విచారం కలుగుతుంది. సందర్శించటమన్నది కేవలం టూరిస్టులవలె అక్కడి నగరాలను, ఇతర ఆకర్షణీయ ప్రదేశాలను చూడటం కాదు. ...

Read More »

కోర్టు ధిక్కరణకు ఏడాది జైలు శిక్ష–బహ్రెయిన్

తీవ్రవాద చర్యలకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కోర్టు ధిక్కరణ కింద ఏడాది అదనంగా శిక్ష విధిస్తూ హై క్రిమినల్‌ కోర్ట్‌ తీర్పు వెల్లడించింది. ఇంతకు ముందు అతనికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధింపబడింది. కోర్టు తీర్పు, కోర్టు చర్యలకు ధిక్కారంగా మాట్లాడినందున అదనంగా మరో ఏడాది జైలు శిక్షను ఆ వ్యక్తికి విధించినట్లు ప్రాసిక్యూటర్‌ మహమ్మద్‌ అల్‌ నౌమి చెప్పారు.

Read More »