Breaking News

Daily Archives: December 16, 2015

ప్రమాదంలో హిందూమతం

హిందూ మతాన్ని నాశనం చెయ్యడానికి రెండు వర్గాలు పోటీపడుతున్నాయి. ఒకరు కుటుంబ నియంత్రణ అవసరం లేదనీ, ఎందరినైనా కని తమ మతాన్ని వ్యాప్తిచేయమని చెబుతుండగా, మరి ఇంకో మతం ప్రలోభాలకు గురిచేస్తూ మా మతానికి రండి.. ఫీజులు కట్టనవసరం లేదు. డబ్బులు ఇస్తాం. ఉపాధి కల్పిస్తాం. పాపాలన్నీ క్షమింపజేస్తాం అంటూ ఎన్నికల పోటీలాగా ప్రచారం చేస్తున్నది. హిందూ ధార్మిక సంస్థలు మాత్రం ఏమీ పట్టనట్టు ఉన్నాయి. దౌర్జన్యం చెయ్యడం సనాతన ధర్మం అభిమతం కాదు. హిందూ సంప్రదాయం ప్రతీ హిందూ వ్యక్తి పాటించాలి. పండుగలు, ...

Read More »

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ ఎల్వీ సీ-29

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆధ్వర్యంలో పీఎస్ఎల్వీ సీ-29 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహారికోట షార్‌ కేంద్రం నుంచి బుధవారం సాయంత్రం 7.00 గంటలకు ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. సింగపూర్‌కు చెందిన ఆరు ఉపగ్రహాలను మోసుకెళ్లుతున్న రాకెట్‌ ప్రస్తుతం వివిధ దశలను ఉత్కంఠభరితంగా దాటుతోంది. 59 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం విజయవంతంగా పీఎస్‌ఎల్వీ సీ29 రాకెట్‌ నింగిలోకి ఎగిరింది. ఉత్కంఠభరితంగా నింగిలోకి దూసుకుపోతూ వివిధ దశలను దాటుకుంటూ ఉపగ్రహాలను లక్ష్యం దిశగా సాగుతోంది. ఇది ఇస్రో చేపట్టిన 33వ ప్రయోగం

Read More »

ఏటీఎంలపై బీహార్, మహారాష్ట్ర ముఠాల కన్ను

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లోగల ఏటీఎంలపై బీహార్, మహారాష్ట్రలకు చెందిన బడా గ్యాంగ్‌ల కన్ను పడింది. ఇప్పటికే ఐదు ఏటీఎంలను ఈ గ్యాంగ్‌లు పగులగొట్టి లక్షలాది రూపాయలను అపహరించారు. ప్రధానంగా నేషనల్ హైవే పక్కన ఉన్న ఏటీఎంలను ఈ ముఠాలు లక్ష్యంగా చేసుకుని చోరీ చేస్తున్నాయి. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా వర్నీ, కోటగిరిలలోగల ఏటీఎంలను గ్యాస్ కట్టర్‌లతో కట్ చేసి నగదను తస్కరించారు. తాజాగా మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోగల టాటా ఇండికాం ఏటీఎంను పగులగొట్టి అందులో ఉన్న రూ. 3.20లక్షలను ...

Read More »

అర్ధరాత్రి అలజడి

నిజామాబాద్‌ నేరవార్తలు : కొద్ది రోజులుగా అలజడి సృష్టిస్తున్న దొంగలు సోమవారం అర్ధరాత్రి బరితెగించారు. నిజామాబాద్‌ గంజ్‌లోని ఏడు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. కోటగిరి, వర్ని మండలాల్లోని మూడు ఏటీఎంలలో రూ.43.32 లక్షలు దోచుకెళ్లారు. ఎక్కడా ఎటువంటి ఆధారాలు దొరక్కుండా తెలివిగా తప్పించుకుపోయారు. తాజా కరవు పరిస్థితులకు తోడు రానున్నది వేసవి కావటంతో దొంగతనాలు వూహించని రీతిలో పెరుగవచ్చని పోలీసు అధికారులు గతంలో సూచనాత్మకంగా చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలోనూ కరవు భీకరంగా ఉండటంతో అక్కడి ముఠాలు జిల్లాలో రెచ్చిపోయే అవకాశాలు ఉంటాయని సదరు అధికారులు చెప్పారు. ...

Read More »

హిందీ భాషాభివృద్ధికి కృషిచేసిన ప్రవీణాబాయి

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ : తెలంగాణ యూనివర్సిటీలో హిందీ విభాగం అధ్యక్షురాలు ప్రవీణబాయిని ఢిల్లీలోని భారతీయ దళిత సాహిత్య అకాడమీ కన్వీనర్ సుమనాక్షర్ జ్యోతిరావ్ పూలే నేషనల్ ఫెల్లోషిప్ అవార్డుతో సన్మానించడం ఆమె కృషికి నిదర్శనమని రిజిస్ట్రార్ లింబాద్రి అన్నారు. అవార్డు అందుకున్న సందర్భంగా మంగళవారం వర్సిటీలో ఏ ర్పాటు చేసిన ప్రవీణాబాయి సన్మాన కార్యక్రమానికి హాజరైన రిజిస్ట్రార్ మాట్లాడారు. హిందీ భాషాభివృద్ధికి చేస్తున్న సేవకు అవార్డు రావడం ప్రశంసనీయమన్నారు. రాబోవు రోజుల్లో ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకోవాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపాల్ కనకయ్య మాట్లాడుతూ ...

Read More »

‘ధోనీ ఏ టీమ్ లో ఉన్నా అదే ఫేవరెట్’

న్యూఢిల్లీ: ఐపీఎల్ కొత్త ప్రాంఛైజీ రాజ్ కోట్ కెప్టెన్ గా భారత క్రికెటర్ నే నియమించాలని టీమిండియా మాజీ కెప్టెన్ గవాస్కర్ సూచించాడు. స్థానిక ఆటగాళ్ల ప్రతిభ గురించి భారత ఆటగాడికే బాగా తెలుసునని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ‘రాజ్ కోట్ జట్టుకు భారతీయ క్రికెటర్ కెప్టెన్ గా ఉండాలి. అతనికి స్థానిక ఆటగాళ్ల బలాలు, బలహీనతల గురించి తెలుసు. కోచ్ గా భారతీయుడు అవసరమైతే.. కెప్టెన్ గా బ్రెండన్ మెకల్లమ్ ను నియమించుకోవచ్చు’ అని సన్నీ అన్నాడు. వచ్చే రెండు సీజన్ల కోసం రాజ్ ...

Read More »

మళ్లీ తగ్గిన పెట్రో ధరలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ తగ్గాయి. పెట్రోల్‌పై 50 పైసలు, డీజిల్‌పై 46 పైసలు తగ్గించాలని ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయి. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పదకొండేళ్ల కనిష్ఠ స్థాయికి చేరడంతో దేశీయ ఆయిల్ కంపెనీలు పెట్రో ధరలను తగ్గించాయి. నవంబర్ 16న పెట్రో ధరలను పెంచిన కంపెనీలు, అదే నెల 31వ తేదీన ధరలను తగ్గించాయి. నవంబర్ 16న పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచిన ...

Read More »

దీనదయాల్‌జీ ప్రతిపాదించిన సమన్వయ వాదం

భారతదేశంలో అనాదిగా మనం సహనాబవతు అనే మంత్రం పఠిస్తున్నాము. ఐనా మనకు సహనం లేదని విదేశీ మానసపుత్రులు ఆరోపిస్తున్నారు. సహనం సమన్వయం భారతీయతాత్విక చింతనకు మూలస్తంభాలు. వాటిని ఆధునికంగా ఆవ్కిరించిన కర్మయోగి ఋషి పండిత దీనదయాల్ ఉపాధ్యాయ భారతీయ జనసంఘ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత వారు పార్టీ అధ్యక్షులైనారు. జనసంఘ్ పార్టీ తర్వాతికాలంలో జనతా పార్టీలో విలీనమైంది. అక్కడ ఇమడలేక బయటకు వచ్చి భారతీయ జనతాపార్టీగా అవతరించింది. అంటే నేటి బిజెపి విజయాలకు పునాదిరాళ్లు వేసిన వారిలో దీనదయాల్‌జీ ప్రథముడు. దీనదయాల్‌జీ ప్రతిపాదించిన ...

Read More »