Breaking News

Daily Archives: December 18, 2015

రేపు సాయంత్రం టీవీ ప్రసారాలు బంద్

ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన ఎంఎస్ఓ మల్లెల నాగేశ్వర్ రావు హత్యకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా శనివారం సాయంత్రం టీవీ ప్రసారాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఎంఎస్ఓల జేఏసీ. 19న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ప్రసారాలన్నీ నిలిపివేస్తున్నట్లు తెలిపారు జేఏసీ కన్వీనర్ సుభాష్ రెడ్డి.

Read More »

కూలీలకు ఉపాధి గిట్టుబాటు అయ్యేలా చూడాలి

  కమ్మర్‌పల్లి, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని హాసకొత్తూరు గ్రామ శివారులో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకం పనుల్లో కందకాల తవ్వకం పనులు మండల ప్రత్యేకాధికారి వెంకట రవిందర్‌ శుక్రవారం పరిశీలించారు. కూలీలకు గిట్టుబాటు అయ్యేలా కొలతలు ఇవ్వాలని సూచించారు. అనంతరం రోజువారి కూలీ వివరాలను కూలీలను అడిగి తెలుసుకున్నారు. కూలీల హాజరు శాతం, మస్టర్లను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని మారుతి నగర్‌ కాలనీలో ఇంకుడు గుంతలను పరిశీలించి ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. ఆయన ...

Read More »

అర్హులందరికి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళు

  – మంత్రి పోచారం బీర్కూర్‌, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో అర్హులందరికి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళ నిర్మాణం చేపడతామని రాష్ట్రవ్యవసాయ శాఖ మంత్రిపోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండలంలోని దుర్కి గ్రామంలో 25 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం దేశంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేపట్టలేదని, పేదవారి సొంతింటి కల నెరవేర్చేందుకు డబుల్‌ బెడ్‌ రూం ఇల్ళ ...

Read More »

స్త్రీనిధి రుణాలు సద్వినియోగం చేసుకోవాలి

  కమ్మర్‌పల్లి, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళా సంఘాల సభ్యులకు వ్యాపారం కోసం అందించే స్త్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సెర్చ్‌ ఏపిఎం కుంట గంగాధర్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని బషీరాబాద్‌లో గ్రామ మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాధర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం స్త్రీనిధి రుణ పరిమితిని రూ. 25 వేల నుంచి అర్హతను బట్టి రూ. లక్ష వరకు పెంచడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామంలో మరుగుదొడ్లు ...

Read More »

గ్యాస్‌ లీకేజీ ఘటనలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి

  బీర్కూర్‌, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 11 శుక్రవారం మండల కేంద్రంలోని పోచారం కాలనీలో గ్యాస్‌ లీకేజీ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. క్షతగాత్రుల్లో చాకలి గంగవ్వ ఈనెల 14న చికిత్స పొందుతూ మృతిచెందగా, చాకలి గంగారాం, సాయవ్వల కుమార్తె గంగోత్రి (8) హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఈనెల 10 సాయంత్రం గురువారం మృతురాలు గంగోత్రి తన పెద్దనాన్న ...

Read More »

అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై 19న మంత్రి సమీక్ష

  నిజామాబాద్‌, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం 19వ తేదీన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షిస్తారని జిల్లాకలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది పథకాలపై జిల్లాలో వాటి అమలుపై స్థానిక ప్రగతిభవన్‌లో ఉదయం 10 గంటలకు సంబంధిత అదికారులతో సమీక్షిస్తారని కలెక్టర్‌ తెలిపారు. ఈ శాఖలకు సంబంధించిన అధికారులు పూర్తి వివరాలతో, సకాలంలో సమావేశానికి హాజరు కావాలని, ...

Read More »

దాతృత్వం చూపిన ముస్లింలు

  నందిపేట, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని రాజ్‌నగర్‌ దబ్బలో నివసిస్తున్న రియాజ్‌ పేద దంపతుల కూతురు వివాహం ఈనెల 20న చేయడానికి నిర్ణయించారు. కానీ ఆ పేద దంపతుల వద్ద వివాహానికి కావాల్సిన డబ్బు లేదన్న విషయాన్ని స్థానికులు గమనించారు. ఇరుగు పొరుగు వారు పెళ్ళి భారం మొత్తం తమ భుజాలపై వేసుకొని పేద దంపతులకు అండగా నిలబడ్డారు. అందరు తమకు తోచినంత సహాయం చేస్తూ గ్రామస్తులను కలిసి విరాళాలు సేకరించారు. వచ్చిన డబ్బుతో కట్నకానుకలు ...

Read More »

పదిలో వంద శాతం ఫలితాలు సాధించాలి

  కమ్మర్‌పల్లి, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించాలని ఎంఇవో ఆంధ్రయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత ప్రధానోపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 10వ తరగతి పరీక్షలు దగ్గర్లో ఉన్నందున సమయం వృధా చేయకుండా సిలబస్‌ జనవరి నెలాఖరువరకు పూర్తిచేయాలని సూచించారు. విద్యార్థులను పరీక్షలకు సిద్దమయ్యేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద వహించాలని తెలిపారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు చదవడం, రాయడం పూర్తి కావాలన్నారు. ఈ ...

Read More »

‘బాలయ్య’ కోసం భారీ ర్యాలీ..ఎందుకంటే..?

ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పడిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లోని అమరావతి లో మొదటిసారిగా బాలకృష్ణ నటిస్తున్న డిక్టేటర్ చిత్ర ఆడియో వేడుక జరుపుకోబోతున్న సంగతి తెల్సిందే..బాలయ్య రేంజ్ కి తగట్టు నందమూరి ఫాన్స్ భారీ ఎత్తున కారు ర్యాలీ నిర్వహించి తమ అబిమానాన్ని చాటుకోబోతున్నారు.. సత్తెనపల్లి బస్సు స్టాండ్ నుండి అమరావతి వరకు ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. డిసెంబర్ 20న జరగబోయే ఆడియో రిలీజ్ మధ్యాహ్నం 3 గంటలకు ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది. కార్ల ర్యాలీకి అభిమానులు భారీగా తరలిరావాలంటూ నందమూరి అభిమాన ...

Read More »

లోఫర్ రివ్యూ

వరుణ్‌తేజ్‌, దిశా పటాని, రేవతి, పోసాని కృష్ణమురళి పూరి జగన్నాథ్‌ సి. కళ్యాణ్ సునీల్‌ కశ్యప్‌ ‘ముకుంద’, ‘కంచె’ వంటి డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను అలరించిన వరుణ్ తేజ్ , మొదటిసారిగా తన జోనర్ ని మార్చుకొని పూరి తో కలిసి కమర్షియల్ కథ ని ఎంచుకొని ‘లోఫర్ ‘ గా మనముందుకు వచ్చాడు..మరి లోఫర్ గా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకున్నాడో ఇప్పుడు చూద్దాం. రాజా (వరుణ్ తేజ్ ) జోద్పూర్ లో దొంగతనాలు చేస్తూ కాలం గడిపేస్తుంటాడు..ఇలా రాజా లోఫర్ గా ...

Read More »

బహ్రెయిన్ లో తెలుగు వారి ‘భాగవత కథామృతం’

బహ్రెయిన్ లో కన్నుల పండుగగా  ‘భాగవత కథామృతం’ ఇస్కాన్ సంస్థల ఆధ్వర్యం లో ప్రత్యేకముగా తెలుగు వారు అంతా కలసి మొట్ట మొదటి సారిగా  జరుపుకున్నారు. ఈ కార్యక్రమము ఆధ్యంతం భక్తి భావాలు పెంపొందించే విధంగా సంస్కృతీ సాంప్రదాయాలు ప్రజలు కి తెలియపరిచే విధంగా గౌరవ నీయులు పూజ్య శ్రీ సత్య గోపినాద్ దాస్ ప్రభు జి తన ప్రవచనం లో తెలియజేసారు . ఈ కార్యక్రమము లో తెలుగు వారు అంతా కుటుంబ సమేతం గా పాల్గొని ఆధ్యాత్మిక ప్రవచానాలును మరియు భగవంతుని లీల ...

Read More »

ప్రచారంలో వెనుకబడిన మోదీ ప్రభుత్వం

బిహార్ ఎన్నికలు ముగిసాయి. అవార్డు వాపసీ ప్రహసనం ముగిసింది. రాహుల్‌గాంధీ హుషారుగా ఉన్నా రు. కాంగ్రెస్ బలం 4నుంచి 24 వరకు బిహార్ అసెంబ్లీలో పెరిగింది. ప్రజాస్వామ్యం గెలిచిందన్నారంతా. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లను నాశనం చేస్తానని (ఉత్తర) ప్రగల్భాలు పలికాడు రాహుల్. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. మళ్లీ కాంగ్రస్ రగడ ప్రారంభించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో తమను బిగించినందుకు న్యాయస్థానం మీది కోపం పిఎమ్‌మీద పార్లమెంట్ మీద చూపిస్తూ తమ స్కంధావారాల్ని రెచ్చగొట్టి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సైతం సరిగా జరగకుండా ప్రజోపకరమైన బిల్లులు ...

Read More »