Breaking News

Daily Archives: December 19, 2015

బాలసదనంలో దుప్పట్ల వితరణ

  కామారెడ్డి, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని బాలసదన్‌లోని విద్యార్థులకు శనివారం మైవిలేజ్‌ మాడల్‌ విలేజ్‌ ఫౌండేషన్‌ ఆద్వర్యంలో దుప్పట్లు పంపినీ చేశారు. ఫౌండేషన్‌ వ్యవస్తాపకుడు బాల్‌రాజ్‌గౌడ్‌, ఆయన సోదరి ఉమ కుటుంబ సభ్యులు వీటిని అందజేశారు. కార్యక్రమంలో బాలసదనం వార్డెన్‌ రమాదేవి, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

పాఠశాలలో బాలసభ

  కామారెడ్డి, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని హనుమాన్‌ మందిర్‌ జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో శనివారం బాల సభ నిర్వహించారు. మై విలేజ్‌ మాడల్‌ విలేజ్‌ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బాలసభ జరిపారు. బాలలచేత బాలల కోసం నిర్వహించడాన్నే బాలసభ అంటారని, బాలలలోని నైపుణ్యాన్ని వెలికితీయడానికి బాలసభ ఉపయోగపడుతుందని ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు బాల్‌రాజ్‌గౌడ్‌ అన్నారు. సభలో విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఇవో రవిందర్‌, ఎస్‌ఎంసి ఛైర్‌పర్సన్‌ రాజు, రిటైర్డ్‌ ఎంఇవో నారాగౌడ్‌, తదితరులున్నారు.

Read More »

వైభవంగా సామూహిక కుంకుమార్చనలు

  కామారెడ్డి, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని శ్రీ సీతారామ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో శనివారం సామూహిక కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా మహిళలు తమ సౌభాగ్యాల కోసం సకల వర్షాలకోసం అమ్మవారి అనుగ్రహం కోసం కుంకుమార్చనలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు.

Read More »

డిగ్రీ కళాశాల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి

  కామారెడ్డి, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్‌చేసింది. శనివారం కళాశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థి జేఏసినాయకులు మాట్లాడుతూ ఏడాది క్రితం ఈ విషయమై జేఏసి ఆధ్వర్యంలో పోరుబాట పట్టగా కళాశాల కమిటీ రాజీనామా చేసిందన్నారు. ఇప్పటివరకు విలువైన ప్రభుత్వ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోవడం గర్హణీయమన్నారు. వెంటనే ముఖ్యమంత్రి స్పందించి కళాశాల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ ...

Read More »

విశ్రాంత ఉద్యోగులు అవిశ్రాంత శ్రామికులు

  – ఎటివో మస్తాన్‌రావు కామారెడ్డి, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విశ్రాంత ఉద్యోగులు అవిశ్రాంత శ్రామికులని కామారెడ్డి ఎటివో మస్తాన్‌రావు అన్నారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పెన్షనర్స్‌డే ఉత్సవాలు శనివారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మస్తాన్‌రావు మాట్లాడారు. పదవీ విరమణ పొందినప్పటికి విశ్రాంత ఉద్యోగులు అవిశ్రాంతంగా అన్నింట్లో పాల్గొంటూ సమాజానికి తమవంతు సేవలు అందించడాన్ని కొనియాడారు. అనంతరం పెన్షనర్స్‌డే పోటీల్లో పాల్గొని విజేతలైనవారికి బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయం ...

Read More »

ప్రధాని నరేంద్రమోడి దిష్టిబొమ్మ దగ్దం

  బీర్కూర్‌, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హెరాల్డ్‌ జాతీయ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాందీ, ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీని అరెస్టుకు నిరసనగా మండల కేంద్రంలోని కామప్ప చౌరస్తాలో ప్రధాని నరేంద్రమోడి దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు పోగు నారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ గత పదిసంవత్సరాలు అధికారంలోఉండి పలు సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిందని అన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి దేశాలు పట్టి తిరుగుతున్న ప్రధాని నరేంద్రమోడి దేశానికి ఏం సేవచేశాడో తెలపాలని ...

Read More »

వాహనాల తనికీ

  బీర్కూర్‌, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నసురుల్లా బాద్‌ గండిలో శనివారం ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి ఆద్వర్యంలో పోలీసులు వాహనాలు తనికీ చేశారు. గత కొన్ని రోజుల క్రితం ఎటిఎం దొంగలను దృష్టిలో పెట్టుకొని వాహనాల తనిఖీ చేస్తున్నట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో నూతన వ్యక్తులు కనబడినా, వాహనాల్లో ఎదురు పడినా సమాచారం అందించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులకు సరైన దృవపత్రాలు లేనివారికి జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదని సూచించారు. ఆటోల్లో పరిమితికి ...

Read More »

ఏకరూప దుస్తుల పంపిణీ

  బీర్కూర్‌, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోగల జడ్పిహెచ్‌ఎస్‌లో శనివారం సర్పంచ్‌ నర్సయ్య ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు శివరాజ్‌ విద్యార్తులకు ఏకరూప దుస్తులను పంపినీ చేశారు. 120 మంది విద్యార్థులకు, 104 మంది విద్యార్థినిలకు రెండు జతల చొప్పున ఏకరూప దుస్తులు పంపినీ చేశారు. ఈసందర్భంగా గ్రామ సర్పంచ్‌ నర్సయ్య మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, భవిష్యత్తులో ఉన్నత స్థితిలో ఉండాలనిసూచించారు. 2015-16 విద్యాసంవత్సరంలో బీర్కూర్‌ పాఠశాలకు చెందిన 10వతరగతి విద్యార్థులు మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చాలని ...

Read More »

నాక్‌ గుర్తింపు కోసం విద్యార్థులు సహకరించాలి

  – విసి పార్థసారధి డిచ్‌పల్లి, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాక్‌ గుర్తింపు కోసం యూనివర్సిటీ చేస్తున్న ప్రయత్నాల్లో విద్యార్థులు మమేకం కావాలని వైస్‌ చాన్స్‌లర్‌ సి.పార్థసారధి పిలుపునిచ్చారు. శనివారం కంప్యూటర్‌ సైన్స్‌ కళాశాల సెమినార్‌ హాల్‌లో నాక్‌ బృందం రాక నేపథ్యంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నాక్‌ గుర్తింపుఅనేది విద్యార్థుల పట్టాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, వర్సిటీకి కొత్త గుర్తింపునిస్తుందని అందరూ విద్యార్థులు తమ శాయశక్తులా కృసి చేయాలన్నారు. విద్యార్తులు చదువుతున్న తమ సంస్థకు నాక్‌ ద్వారా మంచి ...

Read More »

నాన్‌ టీచింగ్‌ సిబ్బంది నాక్‌ సన్నద్దత పెంచాలి

  – రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి డిచ్‌పల్లి, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెవివి నాన్‌ టీచింగ్‌ సిబ్బంది నాక్‌ కోసం తమ సన్నద్దతను మరింత పెంచాలని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయానికి డిసెంబరు 21 నుంచి మూడు రోజుల పాటు నాక్‌ పరిశీలన బృందం రానున్నందు వల్ల అధ్యాపకేతర సిబ్బంది తమ సన్నద్దతలోమరింత చొరవ చూపాలని పిలుపునిచ్చారు. నాక్‌ టీం రాక నేపథ్యంలో శనివారం ఆయన నాన్‌ టీచింగ్‌ సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ...

Read More »

నేడు మాల మహానాడు మండల కమిటీ ఎన్నిక

  రెంజల్‌, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ఉదయం రెంజల్‌ మండల మాలమహానాడు సమావేశం నిర్వహించనున్నట్టు మండల నాయకులు శనివారం తెలిపారు. మండల కేంద్రంలోని జడ్పిహెచ్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షులు దశరథ్‌, డివిజన్‌ అధ్యక్షుడు మొగులయ్య హాజరవుతున్నట్టు పేర్కొన్నారు. ఈసమావేశానికి మండలంలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ఉద్యోగులు అధికసంఖ్యలో పాల్గొనాలని వారు సూచించారు.

Read More »

లక్షలు ఇవ్వమంటలేం… పేదోడికి పింఛన్‌ ఇవ్వమంటున్నాం…

  – రెంజల్‌ సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఆగ్రహం రెంజల్‌, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన ప్రతి ఒక్కరికి పించన్‌ ఇప్పించాలని మండల ఎంపిటిసిలు, సర్పంచ్‌లు అన్నారు. ఈ మేరకు శనివారం మండల సర్వసభ్య సమావేశం ఎంపిపి మోబిన్‌ఖాన్‌ అధ్యక్షతన రెంజల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగింది. కొందరు ఎంపిటిసిలు, సర్పంచ్‌లు ఎంపిడివోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు గ్రామాల్లో అర్హులైన వారికి పింఛన్లురావడం లేదని, పలుమార్లు అధికారుల దృస్టికి తెచ్చినా కూడా ఫలితం లేకుండా పోయిందని ...

Read More »

ఎండిన 80 ఎకరాల పసుపు పంట

  ఆర్మూర్‌, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఇస్సాపల్లిగ్రామంలో వర్షాభావ పరస్థితుల వల్ల 80ఎకరాల పసుపు పంట పూర్తిగా ఎండిపోయింది. వర్షాభావ పరిస్థితులకు భూగర్భ జలాలు తగ్గిపోయి బోర్లు ఎత్తిపోవడంతో అన్నదాత కళ్ళల్లో కన్నీరే నిండింది. 80 ఎకరాల పంట పూర్తిగా ఎండిపోవడంతో రైతన్నలకు ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు. పంట ఎండినరైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. వేల రూపాయలు కర్చుచేసి పెట్టిన పెట్టుబడి వెనక్కి రాకపోగా వడ్డిల రూపంలోతీసుకున్న అప్పులుపెరిగి పోవడంతో అన్నదాత దిగాలు చెందుతున్నాడు.

Read More »

క్రైస్తవులకు విందు భోజనం

  ఆర్మూర్‌, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని క్రైస్తవులకు క్రిస్మస్‌ పండగ పురస్కరించుకొని పట్టణంలోని సీయోను చర్చిలో సామూహిక విందు భోజనం శనివారం ఏర్పాటు చేశారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలోని నందిపేట, మాక్లూర్‌, ఆర్మూర్‌ మండలాల నుంచి వచ్చిన క్రైస్తవులకు మాంసాహార విందు భోజనం అధికారులు ఏర్పాటుచేశారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి క్రిస్మస్‌ కేక్‌ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. పాస్టర్లు ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు శ్రీధర్‌, బావయ్య, లత, ఎంపిడివో లింగయ్య, తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

టెర్ఫాలిన్‌ కవర్లకోసం దరఖాస్తు చేసుకోవాలి

  ఆర్మూర్‌, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులు టెర్పాలిన్‌ కవర్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి గోపి శనివారం తెలిపారు. కవర్లు కావాల్సిన రైతులు రూ. 1200 డిడితో పాటు మీ సేవాలో దరఖాస్తు చేసుకొని కార్యాలయంలో సమర్పించాలన్నారు.

Read More »

పన్నులు సకాలంలో చెల్లించాలి

  ఆర్మూర్‌, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఇంటి, కుళాయి పన్నులుసకాలంలో చెల్లించి సహకరించాలని ఇవో పిఆర్‌డి దామోదర్‌ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఇప్పటికే పన్నుల బకాయి పెరిగి పోయి ఉందని, పన్నులను సకాలంలో చెల్లిస్తే ఆ నిదులతో గ్రామాల్లో ఎన్నో అభివృద్ది పనులు చేపడతామని తెలిపారు. గ్రామస్తులు చెల్లించినపన్నులతో వారు కోరిన విధంగా సిసి రోడ్లు, మురికి కాలువలు, కల్వర్టులు, వీది దీపాలు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ...

Read More »

111 గ్రామాల్లో 6950 రెండు పడక గదుల ఇళ్లు

  – మార్చి నాటికి పూర్తిచేయడానికి సత్వర చర్యలు – జిల్లా సమీక్షలో మంత్రి పోచారం వెల్లడి నిజామాబాద్‌, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేదలకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా 60 వేల రెండు పడకగదుల ఇళ్లు మంజూరు చేసిందని, వీటిని మార్చి నాటికి పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక ప్రగతిభవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో మంత్రి ...

Read More »

గుండెపోటుతో వ్యక్తి మృతి

  బోధన్‌, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని చౌడిగల్లికి చెందిన శంకర్‌ (55) శనివారం గుండెపోటు తో మృతి చెందాడు. కాగా శంకర్‌ బోధన్‌లోని నీటిపారుదల శాఖలో అటెండరుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం గుండెపోటు రావడంతో ఆసపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ శనివారం మృతి చెందినట్టు కుటుంబీకులు తెలిపారు.

Read More »

నిర్భయ కేసులో బాల నేరస్తుడికి ఊరట

ఢిల్లీ: గత మూడు సంవత్సరాల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న నిర్భయ అత్యాచారం కేసులో జువైనల్ నేరస్తుడికి ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం జరిగిన వాదనలు సందర్భంగా జువైనల్ నేరస్తుడి విడుదల నిలుపుదలపై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. జువైనల్ నేరస్తుడి విడుదలను ఆపలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో జువైనల్ నేరస్తుడు ఈ నెల 20న విడుదలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కాగా, నిర్భయ కేసులో తమకు న్యాయం జరగలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ...

Read More »

‘నిజమైన రావణులను శిక్షించరెందుకు’

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో టాలీవుడ్ నటి, నిర్మాత రేణుదేశాయ్ ఒకరు. దేశంలో మహిళలు, ప్రస్తుత పరిస్థితులపై ఆమె పూర్తి అసంతృప్తితో ఉన్నట్లు ట్విట్టర్ పోస్ట్ ద్వారా తెలిపింది. మహిళలు, బాలికలపై దేశ వ్యాప్తంగా జరుగుతున్న అకృత్యాలపై ఆమె మండిపడ్డారు. భారతీయ సంప్రదాయాలను అనుసరించి ప్రతి ఏడాది రావణదహనం చేస్తుంటాం. కానీ దేశంలో మహిళలపై దురాగతాలకు పాల్పడుతున్న నిజమైన దుర్మార్గులను (రావణులను) శిక్షించడంలో ఎందుకు విఫలమవుతున్నామని ప్రశ్నించారు. నిర్భయ లాంటి ఘటనతో పాటు పన్నుల అంశంపై కొన్ని వ్యంగ్యాస్త్రాలను ఆమె పోస్ట్ ...

Read More »