Breaking News

Daily Archives: December 21, 2015

ర్యాగింగ్‌ నిరోధంపై అవగాహన సదస్సు

  ఆర్మూర్‌, డిసెంబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడడం చట్టరీత్యా నేరమని, కలిసి మెలిసి ఉంటూ బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలని ఆర్మూర్‌ ఎస్‌హెచ్‌వో సీతారాం అన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం సోషల్‌ వెల్పేర్‌ బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన ర్యాగింగ్‌ నిరోధంపై అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ర్యాగింగ్‌ చట్టంలో ఉండే సెక్షన్లన్నింటిని వివరించారు. ఆర్మూర్‌ను ర్యాగింగ్‌ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌, హాస్టల్‌ డైరెక్టర్‌ దేవరాం, విద్యార్తులు పాల్గొన్నారు.

Read More »

ఇళ్ళు మంజూరు చేయాలని ఆర్డీవోకు వినతి

  కామారెడ్డి, డిసెంబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కూరగాయల వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తున్న తమకు ప్రభుత్వం రెండు పడకల ఇళ్ళు మంజూరు చేయాలని సోమవారం కామారెడ్డి డెయిలీ కూరగాయల మార్కెట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఆర్డీవో నగేశ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా కామారెడ్డిలో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నామన్నారు. ఇళ్ళ స్థలాలు, ఇళ్ళ కోసం ఎన్నో ఏళ్ళుగా అధికారులకు విన్నవించుకుంటున్నా తమను కనికరించలేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వ పథకాల్లో తమను భాగస్వాములను ...

Read More »

కళాశాల ఆస్తుల విషయమై షబ్బీర్‌ అలీకి వినతి

  కామారెడ్డి, డిసెంబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తులను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని కోరుతూ శాసనమండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీకి విద్యార్థి జేఏసి నాయకులు సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాల కమిటీ రాజీనామా చేసి 11 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఆస్తులను స్వాధీనం చేసుకోవడం లేదని తెలిపారు. దీనివల్ల ఏటా రెండు కోట్ల రూపాయలను కళాశాల నష్టపోతుందని తెలిపారు. కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా ...

Read More »

భారతీయ ఆత్మ భగవద్గీత

  కామారెడ్డి, డిసెంబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ ఆత్మ మహాభారత కథలని, భగవద్గీత భారతీయ జీవనానికి మార్గదర్శనమని ప్రముఖ కవి అయాచితం నటేశ్వర శర్మ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సరస్వతి శిశుమందిర్‌ పాఠశాలలో సోమవారం గీతా జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గీతాసారాన్ని వివరించారు. ఎన్ని ఇతర భౌతిక విద్యలున్న, భగవద్గీతయే మానసిక ఆనందాన్ని ఇస్తుందని, మహాభారతం నుంచి భగవద్గీత ఉద్భవించిందన్నారు. శ్లోకాలు మన జీవన సరళిని నిర్ణయిస్తామని చెప్పారు. గీతా శ్లోకాలు గోవునుంచి లభించిన ...

Read More »

భక్తిశ్రద్దలతో వైకుంఠ ఏకాదశి పూజలు

  కామారెడ్డి, డిసెంబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం పట్టణంలోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి కావడంతో భక్తులు వేకుం జామునుంచే ఆలయాల వద్ద బారులు తీరారు. పట్టణంలోని పంచముఖి హనుమాన్‌ ఆలయం వద్ద భక్తులరద్దీ భారీగా ఉంది. ఆలయంలోని వెంకటేశ్వరస్వామి వారిని భక్తులు శ్రద్దతో పూజించారు. అభిషేకం, హారతి, అర్చన, పూలతో అలంకరణ, నైవేద్యం, తీర్థ ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

Read More »

విద్యార్థులకు పలకల పంపిణీ

  బోధన్‌, డిసెంబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం కోటగిరి లయన్స్‌ క్లబ్‌, బోధన్‌ లయన్స్‌ క్లబ్‌ సంయుక్త ఆద్వర్యంలోపలకలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా బోధన్‌ లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధి శ్రీనివాస్‌ మాట్లాడుతూ విద్యార్థులు బాగాచదువుకొని పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో క్లబ్‌ సభ్యులు హన్మంత్‌రావు, ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More »

నేడు ఎమ్మెల్యే రాక

  ఆర్మూర్‌, డిసెంబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మంగళవారం ఆర్మూర్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొననున్నట్టు తెరాస నియోజకవర్గ వ్యవహారాల ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి సోమవారం తెలిపారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఉదయం 10 గంటలకు మానస పాఠశాల, 11 గంటలకు పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో ఎమ్మెల్యే స్వగృహంలో పిఆర్‌ రివ్యు ఉంటుందన్నారు. 12 గంటలకు ప్రజలు, కార్యకర్తలతో ముఖాముఖిలో పాల్గొంటారన్నారు. సాయంత్రం 4 గంటలకు వెల్మల్‌గ్రామంలోగంగపుత్ర సంఘానికి భూమిపూజ చేస్తారన్నారు. 6 ...

Read More »

జాతీయ స్తాయి కబడ్డి పోటీలకు ప్రజ్ఞా విద్యార్థుల ఎంపిక

  ఆర్మూర్‌, డిసెంబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని ప్రజ్ఞా పాఠశాలకు చెందిన విద్యార్థిని సోనాలిక జాతీయ స్తాయి కబడ్డి పోటీలకు ఎంపికైనట్టుపాఠశాల కరస్పాండెంట్‌ గంగామోహన్‌ సోమవారం తెలిపారు. ఎంపికైన విద్యార్థిని రంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్రస్తాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభకనబరిచిందన్నారు. దీంతో జాతీయ స్తాయి ఎంపికైనట్టు ఆయన తెలిపారు. విద్యార్థిని పలువురు అభినందించారు.

Read More »

ఘనంగా వైకుంఠ ఏకాదశి

  ఆర్మూర్‌, డిసెంబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని పట్టణంలోని ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాల్లో ఉత్తర ద్వారం వద్ద నుంచిదర్శనం చేసుకోవడానికి ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. పట్టనంలోని జండా గల్లిలోని వెంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 5 గంటలకు క్షీరాభిషేకం,6 నుంచి 7 గంటల వరకు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. మండలంలోని పెర్కిట్‌గ్రామంలో శ్రీరామసత్యనారాయణ స్వామి ఆలయంలోకూడా భక్తులుపెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొనిస్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ...

Read More »

ప్రజావాణికి 8 ఫిర్యాదులు

  ఆర్మూర్‌, డిసెంబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం తహసీల్‌ కార్యాలయంలో నిర్వహించే మండల స్తాయి ప్రజావాణి ఈ సోమవారం కూడా కొనసాగింది. తహసీల్దార్‌ శ్రీధర్‌ ఫిర్యాదులు స్వీకరించారు. ఈవారం ప్రజావాణికి 8 పిర్యాదులు వచ్చినట్టుఆయన పేర్కొన్నారు. అందులో 5 ఆహారభద్రత కార్డులకు సంబంధించి, 1 పింఛన్‌కు సంబంధించి, 2 ఆన్‌లైన్‌ పహానీలకు సంబంధించిన పిర్యాదులు వచ్చినట్టు ఆయన తెలిపారు.

Read More »

నందిపేట సర్పంచ్‌పై ప్రజావాణిలో ఫిర్యాదు

  నందిపేట, డిసెంబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట గ్రామ సర్పంచ్‌ షాకీర్‌ హుస్సేన్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రజాగ్రహం రోజురోజుకు పెరిగిపోతుంది. అవినీతి అంతం అదే నినాదంతో గెలిచిన సర్పంచ్‌, గెలిచిన నాటికి అక్రమ సంపాదనే ధ్యేయంగా ప్రజా సంపద దోచుకుంటున్నాడని ఆగ్రహించి సోమవారం జిల్లా కేంద్రంలో ప్రజావాణిలో నందిపేట గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు, యువజన సంఘాల సభ్యులు సర్పంచ్‌కు వ్యతిరేకంగాకలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేసి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో వివరాలు ఇలాఉన్నాయి… నందిపేట లో ...

Read More »

తెయులో నాక్‌ బృందం

  -సర్వాంగ సుందరంగా విభాగాలు డిచ్‌పల్లి, డిసెంబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీకి సోమవారం 8 మంది సభ్యుల నాక్‌బృందం పరిశీలనకు వచ్చింది. వీరు బుధవారం వరకు క్యాంపస్‌లో వివిధ వసతులు, సౌకర్యాలు పరిశీలిస్తారు. సోమవారం ఉదయం వారు పరిపాలనా భవనం చేరుకోగానే జిల్లా పోలీస్‌ వారికి గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ ఇచ్చారు ఎన్‌సిసి సభ్యులు కూడా గౌరవ వందనం చేశారు. తర్వాత ఎగ్జిక్యూటివ్‌ కమిటి హాల్‌లో విసి ప్రజెంటేషన్‌ ఇచ్చారు. విసి సి.పార్థసారధి దాదాపు గంట పాటు ...

Read More »

ప్రజావాణిలో 8 దరఖాస్తులు

  ఎడపల్లి, డిసెంబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 8 దరకాస్తులు వచినట్టు తహసీల్దార్‌ గఫర్‌మియా తెలిపారు. ఇందులో 4 పహాణీల కోసం, 3 ఆహారభద్రత కార్డుల కోసం, 1 ఆర్‌వోఆర్‌ దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. సంబంధిత అదికారులకు ఫిర్యాదులను అప్పగించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయనసూచించారు.

Read More »

30 మందికి వారసత్వ పట్టా పాసుపుస్తకాలు

  ఎడపల్లి, డిసెంబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మంగల్‌పాడ్‌ గ్రామంలోసోమవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో తహసీల్దార్‌ గఫర్‌మియా 30 మందికి పట్టా పాసుపుస్తకాలను అందజేశారు. రెవెన్యూ సదస్సులో వారసత్వంగా ఉన్న వ్యక్తుల పేరుతో ఉన్న పట్టాపాసుపుస్తకాలను కుమారులు, వారసుల పేరుతో కొత్త పాసుపుస్తకాలు అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మంగళవారం అంబం (వై) గ్రామంలో రెవెన్యూ సదస్సు ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ జ్యోతి, సర్పంచ్‌ ...

Read More »

జిల్లాలో కోటికిపైగా ఉపాధి కూలీ

  – అధికారులను అభినందించిన జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌, డిసెంబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో తీవ్ర కరవుపరిస్థితుల దృష్ట్యా పెద్ద సంఖ్యలో కూలీలకు పని కల్పిస్తూ ప్రతిరోజు కోటి రూపాయలకు పైగా కూలీ చెల్లిస్తున్నందుకు అధికారులను అభినందిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా అన్నారు. ప్రతి సోమవారం లాగే స్థానిక వీడియో కాన్ఫరెన్సు ద్వారా మండల స్థాయి అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లాలో 4 నెలల క్రితం కేవలం 13 వేల ...

Read More »

డయల్‌ యువర్‌ ఎస్‌పికి 12 ఫిర్యాదులు

  నిజామాబాద్‌, డిసెంబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ ఎస్పీకి నేడు 12 ఫిర్యాదులు వచ్చినట్టు జిల్లా పోలీసు శాఖాధికారి వెల్లడించారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆద్వర్యంలో డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమం ఎస్‌పి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌, కామారెడ్డి, ఆర్మూర్‌, బోధన్‌ సబ్‌ డివిజన్‌ పరిధి నుంచి వివిధ రకాల సమస్యలపై మొత్తం 12 ఫిర్యాదులు వచ్చినట్టు ...

Read More »

నిర్భయ కేసులో.. కుర్ర నేరస్థుడి విడుదల

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: తీవ్రస్థాయి నిరసనలు, వ్యతిరేక నినాదాల మధ్య నిర్భయ కేసులో బాల నేరస్థుడు ఆదివారం విడుదలయ్యాడు. విడుదల చేసిన వెంటనే ఆ నేరస్థుడ్ని ఓ ఎన్‌జిఓ సంస్థకు అప్పగించి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. ఈ నేరస్థుడి విడుదలను నిరోధించేందుకు శనివారం అర్థరాత్రి వరకూ జరిగిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఉత్తర ప్రదేశ్‌లోని తన సొంత గ్రామానికి వెళ్లడం కంటే ఎన్‌జిఓ సంస్థ వద్దకే వెళతానని రెండు రోజుల క్రితం బాల నేరస్థుడు స్పష్టం చేశాడని, అందుకే భద్రతాపరమైన అవసరాల దృష్ట్యా అతడ్ని ...

Read More »

జడిపిస్తున్నకుర్ర ” కారు ” డ్రైవింగ్ ప్రమాదకరంగా మారిన ఒమాన్ రోడ్లు

లైసెన్స్ లు  లేకుండా జోరుగా వాహనాలను రోడ్లపైనడుపుతున్న కుర్రకారును ప్రోత్సాహించేది వారి తల్లితండ్రులేఅంట ….ఇది తప్పు అని తెల్సినా వారిని అలా రోడ్లపైకి..పురిగొల్పడం తో పలువురు ప్రమాదాలకులోనవుతున్నారు. సుల్తాన్ కబోస్ విశ్వవిద్యాలయం జరిపినపరిశోధనలో పలు ఆసక్తికర సంగతులు వెలుగు లోనికివచ్చయి. ఉన్నత పాటశాలలకు చెందిన ముగ్గురువిద్యార్ధులలో ఒక్కరు లైసెన్సులు లేకుండా కారునుపలుమార్లు ఒమాన్ రోడ్లపై వేగంగా నడిపినట్లుఅంగీకరిస్తున్నారు. అలాగే, 3,345 మాధ్యమిక పాటశాలల విద్యార్దులు పై సర్వేను సదరు విశ్వవిద్యాలయం నిర్వహించగా , వీరిలో 34శాతం మంది విద్యార్ధులు , తాము అత్యంత వేగంగా ...

Read More »

కొత్త కస్టమర్లకు మొబైల్ కాల్ ధరల్లో 80 శాతం తగ్గింపు: బిఎస్‌ఎన్‌ఎల్

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: టెలికాం రంగంలో ప్రైవేట్ సంస్థలతో పోటీని తట్టుకోలేక వెనుకబడిన ప్రభుత్వరంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్.. వినియోగదారులను పెంచుకోవడంపై ఇప్పుడు దృష్టి సారించింది. ఇందులోభాగంగానే కొత్తగా బిఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ నెట్‌వర్క్‌ను ఎంచుకునే వినియోగదారులకి తొలి రెండు నెలలపాటు కాల్ చార్జీలను 80 శాతం వరకు తగ్గించింది. ఈ మేరకు బిఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ ఆదివారం పిటిఐకి తెలిపారు. కాల్ చార్జీల పరంగా నిమిషం, సెకను ప్లాన్లు రెండింటికీ తగ్గించిన ధరలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. సెకన్ ప్లాన్‌కైతే 36 ...

Read More »

రైతుల ఆత్మహత్యలకు గల కారణాలు-నివారణ మార్గాలు

ఒక రైతుకు వరి శిక్ష! మరో రైతు నెత్తిన పత్తి కత్తి! ఇంకో రైతుకు నిలువెల్లా కూర గాయాలు! మరో రైతుకు భారంలా వేరుశనగ! ఘోరంగా ఉల్లి! చేదుగా చెరుకు! ఏ రైతును చూసినా కష్టమే! సాగు నష్టమే! పొలాలనన్నీ హలాల దున్నే రైతులు తమ బలాన్ని మాత్రమే కాదు ప్రాణాలనూ పొలానికే అర్పిస్తున్నారు. హైదరాబాద్, నవంబర్ 22 : ఇది ఒక్క ఏడాది కథ కాదు! ఎన్నో ఏళ్లుగా సాగుతున్న వ్యథ! ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతులకు భరోసా ఇవ్వడంలేదు. ...

Read More »