Breaking News

జడిపిస్తున్నకుర్ర ” కారు ” డ్రైవింగ్ ప్రమాదకరంగా మారిన ఒమాన్ రోడ్లు

లైసెన్స్ లు  లేకుండా జోరుగా వాహనాలను రోడ్లపైనడుపుతున్న కుర్రకారును ప్రోత్సాహించేది వారి తల్లితండ్రులేఅంట ….ఇది తప్పు అని తెల్సినా వారిని అలా రోడ్లపైకి..పురిగొల్పడం తో పలువురు ప్రమాదాలకులోనవుతున్నారు. సుల్తాన్ కబోస్ విశ్వవిద్యాలయం జరిపినపరిశోధనలో పలు ఆసక్తికర సంగతులు వెలుగు లోనికివచ్చయి. ఉన్నత పాటశాలలకు చెందిన ముగ్గురువిద్యార్ధులలో ఒక్కరు లైసెన్సులు లేకుండా కారునుపలుమార్లు ఒమాన్ రోడ్లపై వేగంగా నడిపినట్లుఅంగీకరిస్తున్నారు.

అలాగే, 3,345 మాధ్యమిక పాటశాలల విద్యార్దులు పై సర్వేను సదరు విశ్వవిద్యాలయం నిర్వహించగా , వీరిలో 34శాతం మంది విద్యార్ధులు , తాము అత్యంత వేగంగా కార్లను రోడ్లపై నడపడం బాగా ఇష్టపడతామని  నిజాయతీగా ఒప్పుకున్నారు.    వీరిదూకుడుకు కళ్ళెం వేస్తూ , రాయల్ ఒమాన్ పోలీస్ ఉన్నతాధికారి    సందర్భంగా మాట్లాడుతూ, వీడియో గేమ్స్ ప్రభావితమై తరహా డ్రైవింగ్ రోడ్లపై చేస్తూ పలు ప్రమాదాలకు కారణమవుతున్నారన్నరు. ఎటువంటి అనుమతులు లేకుండా పిల్లలు, యువత కార్లను నడిపితే , అటువంటి వారు తమ జైలులో 24 గంటలు ఉండేలా శిక్షను విడిస్తామని, అంతే కాకుండా , వారికి చెందినవాహనాలను సీజ్ చేసి, 50 ఒమాన్ రియాళ్ళను జరిమానాను విఢించనున్నమని ఆయన  తెలిపారు

Check Also

‘బాత్రూంలో నీళ్లు తాగుతున్నా.. మీకు పుణ్యం ఉంటాది కాపాడండి సార్’

  నన్ను కాపాడి ఇండియాకు చేర్చండి సార్..: సౌదీలో తెలుగు మహిళ    దుబాయ్‌కి పంపుతామని చెప్పి ఏజెంట్ల చేతిలో ...

Comment on the article