Breaking News

Daily Archives: December 22, 2015

అధికారుల పనితీరుపై పాలకవర్గం ఆగ్రహం

  – మునిసిపల్‌ సమావేశంలో అధికారుల నిలదీత కామారెడ్డి, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధికారులు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ పాలన భ్రస్టు పట్టిస్తున్నారని, కోట్లాది రూపాయల ప్రజాధనం అధికారుల తీరువల్ల దుర్వినియోగం అవుతుందని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కామారెడ్డి బల్దియా సమావేశం ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో పలువురు కౌన్సిలర్లు అధికారుల తీరును ఎండగట్టారు. అధికారుల పనితీరువల్ల తమకు చెడ్డపేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిలర్లు రేణుక, ఆనంద్‌లు మాట్లాడుతూ ప్రతినెల ...

Read More »

పారిశుద్య కార్మికులకు ప్లేట్ల పంపిణీ

  కామారెడ్డి, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని మునిసిపల్‌ కార్మికులు వంద మందికి మంగళవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్లేట్లు పంపిణీ చేశారు. వాసవి సేవా సమితి అధ్యక్షుడు శంకర్‌గుప్త ఆయన తండ్రి సంగయ్య జ్ఞాపకార్థం వాటిని అందజేయగా ఛైర్‌పర్సన్‌ కార్మికులకు ఇచ్చారు. అనంతరం 250 మందికి అన్నదానం చేశారు.

Read More »

ఘనంగా రామానుజన్‌ జయంతి

  కామారెడ్డి, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టనంలోని వాసవి పబ్లిక్‌ పాఠశాలలో మంగళవారం గణిత మేధావి, శాస్త్రవేత్త రామానుజన్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజ్ఞాన్‌మేళ మ్యాథ్స్‌ మేళ నిర్వహించారు. విద్యార్థిని, విద్యార్థులు 200 అంశాల్లో ప్రాజెక్టులు తయారుచేసి ప్రదర్శించారు. చూపరులను ఇవి విశేషంగా ఆకట్టుకున్నాయి. పాఠశాల అధ్యాకులు, తల్లిదండ్రులు, ఆహుతులు ప్రాజెక్టులను తిలకించి విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ హన్మంత్‌రావు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఆకట్టుకున్న విద్యార్థుల సైన్స్‌ ప్రదర్శనలు

  కామారెడ్డి, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీనివాస రామానుజన్‌ జయంతిని పురస్కరించుకొని వాణి విద్యాలయం విద్యార్థులు మంగలవారం ప్రదర్శించిన సైన్స్‌ ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. సామాన్య, గణిత శాస్త్రా లనుంచి పలు పరికరాలు తయారుచేసి ప్రదర్శించారు. పనికిరాని వస్తువులతో సామాన్య మానవునికి అవసరమయ్యే పరికరాలు తయారుచేసి ఆశ్చర్యానికి గురిచేశారు.

Read More »

ప్రాణహిత-చేవెళ్ల పూర్తిచేయకుంటే ఉద్యమం

  – బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌ కామారెడ్డి, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప్యాకెజి 22ను కెసిఆర్‌ తన స్వార్థం కోసం ఆపారని, ప్రాజెక్టును వెంటనే పూర్తిచేయకపోతే ఉద్యమం తప్పదని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇఎస్‌ఆర్‌ గార్డెన్‌లో మంగళవారం నిర్వహించిన బిజెపి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఎన్నో ఉద్యమాల ద్వారా సాధించామన్నారు. ప్యాకెజి ...

Read More »

జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయండి

  నందిపేట, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఉర్దూ మీడియం ఏర్పాటు చేయాలని నందిపేట ఎంపిటిసి అహ్మద్‌ఖాన్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని అదేవిధంగా నందిపేట గ్రామ పంచాయతీలో శాశ్వత కార్యదర్శిని నియమించాలని కోరారు. కార్యదర్శి లేకపోవడంతో ప్రజలకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అందువల్ల వెంటనే కార్యదర్శిని నియమించాలని కోరారు.

Read More »

చెరువులోపడి వృద్దుని మృతి

  ఆర్మూర్‌, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం ఖుదావన్‌పూర్‌ గ్రామానికి చెందిన గోజూరు రాములు (72) అనే వ్యక్తి మంగళవారం చెరువులో పడి మృతి చెందాడు. ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ కథనం ప్రకారం… గోజూరు రాములు అలియాస్‌ శంబన్న రాములు మామిడిపల్లిగ్రామంలో జీవిస్తుండేవాడు. ఇతడు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రాములు ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌ గ్రామ చెరువులోపడి మృతి చెందినట్టు ఎస్‌ఐ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం సుంకరి రాజనర్సు ఆర్మూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినందున ...

Read More »

మండల సర్వసభ్యసమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

  నందిపేట, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల ప్రజాపరిషత్‌లో మండల ఎంపిపి అంకంపల్లి యమున అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్యసమావేశంలో విశిష్టత అతిథిగా విచ్చేసి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. అన్ని గ్రామాల్లో వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సర్పంచ్‌, ఎంపిటిసిలను కోరారు. ఇప్పటివరకు నూత్‌పల్లి గ్రామంలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించారని ప్రశంసించారు. అదేవిధంగా ఐలాపూర్‌, ఆంధ్రానగర్‌లో కూడా వందశాతానికి చేరుకుంటున్నారని అన్నారు. మండల కేంద్రంలో మాత్రం మరుగుదొడ్ల నిర్మానంలో ...

Read More »

విద్యార్థులు శ్రద్దతో చదవాలి

  ఆర్మూర్‌, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులందరు శ్రద్దతో చదివినట్లయితే పరీక్షల్లో ఉత్తమ పలితాలు పొందవచ్చని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌లోగల ఎంఆర్‌ గార్డెన్స్‌లో ప్రయివేటు పాఠశాలల యాజమాన్యం నిర్వహించిన 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు ఏకాగ్రతతోచదివితే ఉత్తీర్ణత పొందవచ్చని, దీనిద్వారా కన్న తల్లిదండ్రులకు, పాఠశాలలకు, ఊరికి మంచి పేరు తీసుకురావచ్చని ఆయన చెప్పారు. అనంతరం విద్యార్థులతో మమేకమై ఎమ్మెల్యే సెల్ఫీ తీసుకున్నారు. ...

Read More »

కస్తూర్బా పాఠశాల తనిఖీ

  కమ్మర్‌పల్లి, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కమ్మర్‌పల్లి కస్తూర్బా పాఠశాలను తహసీల్దార్‌ అర్చన మంగళవారం తనికీ చేశారు. ప్రత్యేక అధికారి దీపతో మాట్లాడి హాజరు రికార్డులను పరిశీలించారు. వంట గదిలోకి వెళ్ళి మెను చూశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి పదార్థాల నాణ్యతను తెలుసుకున్నారు. 10వ తరగతి విద్యార్థుల ప్రగతిని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

Read More »

బ్యాంకు మేనేజర్లతో ఆర్మూర్‌ ఎస్‌హెచ్‌వో సమావేశం

  ఆర్మూర్‌, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంతోపాటు మండలంలోని అన్ని బ్యాంకుల మేనేజర్లతో ఆర్మూర్‌ ఎస్‌హెచ్‌వో సీతారాం మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటిఎంలలో సెక్యురిటీ గార్డులను నియమించాలని మేనేజర్లకు సూచించారు. బ్యాంకుల్లో సిసి కెమెరాలు, అలారం లనుఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. దీనివల్ల కొంతవరకు చోరులను కనిపెట్టవచ్చని ఆయన సూచించారు. సమావేశంలో ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.

Read More »

కుల బహిష్కరణపై విచారణ

  కమ్మర్‌పల్లి, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని చౌట్‌పల్లిలో కుమ్మరి కులస్తులను స్తానిక గ్రామాభివృద్ది కమిటీ సాంఘిక బహిష్కరణ విధించారన్న ఆరోపణలపై మంగళవారం అసిస్టెంట్‌ సోషల్‌వెల్పేర్‌ అధికారి శ్రీనివాస్‌రెడ్డి గ్రామంలో విచారణ నిర్వహించారు. ఇరువర్గాలతో చర్చించారు. ఇరువర్గాలు తమ వాదనలు తెలిపారు. సాంఘిక బహిష్కరణ చట్టరీత్యానేరమని, సామరస్యంగా, చట్టబద్దంగా సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. ఎటువంటి ఆంక్షలు విధించలేదని, ఉండబోవని రాతపూర్వకంగా రాయించుకున్నారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం జిల్లా నాయకులు ఆరేపల్లి సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

రెండో రోజు విజయవంతంగా తెవివిలో నాక్‌ బృందం పర్యటన

  డిచ్‌పల్లి, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ మొత్తం మూడు క్యాంపస్‌లలో మంగళవారం నాక్‌ బృందం పర్యటన సజావుగా సాగింది. ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ భూమిత్రదేవ్‌ ఆధ్వర్యంలోని ఒక బృందం రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రితోపాటు ప్రధాన క్యాంపస్‌లోని సెంట్రల్‌ లైబ్రరిని మొదట సందర్శించింది. తరువాత బాలుర, బాలికల వసతి గృహాలను సందర్శించారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ యూనివర్సిటీలో ఇంత పెద్ద సెంట్రల్‌లైబ్రరీ ఉండడం పట్ల ఛైర్మన్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాలుర, బాలికల వసతి గృహాల నిర్వహణ విశేషాలను ...

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో స్వచ్ఛభారత్‌

  ఎడపల్లి, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో మంగళవారం ఆచన్‌పల్లి, ఎడపల్లి లయన్స్‌ క్లబ్‌ సంయుక్తంగా స్వచ్ఛభారత్‌ కార్యక్రమం చేపట్టారు. పాఠశాల ఆవరణలో చెత్త, చెదారం, ముళ్లపొదలు, గడ్డి తొలగించి శుభ్రం చేశారు. ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని లయన్స్‌ ఆద్వర్యంలో చేపట్టి విద్యార్థులకు కావాల్సిన పరిసరాలను శుభ్రం చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మండల లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు రాజలింగం, జోనల్‌ ఛైర్మన్‌ సూర్యనారాయణ, ముత్యం, శ్యాంరావు దేశ్‌ముఖ్‌, ఆచన్‌పల్లి లయన్స్‌ సభ్యులు ...

Read More »

వివాహిత ఆత్మహత్య

  రెంజల్‌, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం సాటాపూర్‌ గ్రామానికి చెందిన గురాల నిర్మల (26) అనే వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ రవికుమార్‌ కథనం ప్రకారం నిర్మలకు ఎనిమిదేళ్ళ క్రితం వివాహం జరిగింది. కానీ ఇంకా పిల్లలు లేకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నామన్నారు. సోమవారం అర్ధరాత్రి ఇంట్లోఅందరు నిద్రిస్తున్న సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందన్నారు. ఇదిలా ఉండగా తమ అల్లుడే తమ కూతురును హత్యచేశాడని మృతురాలి తల్లి సాయవ్వ ...

Read More »

54 పట్టా పాసుపుస్తకాల పంపిణీ

  ఎడపల్లి, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పోచారం, అంబం (వై) గ్రామాల్లో మంగళవారం రెవెన్యూ సదస్సులు జరిగాయి. సదస్సులో మొత్తం 54 పట్టా పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పోచారం గ్రామంలో నిర్వహించిన సదస్సులో 30 పట్టాపాసుపుస్తకాలు పంపినీ చేయగా, అంబం (వై)గ్రామంలో 24 వారసత్వ పట్టా పాసుపుస్తకాల పంపిణీ జరిగిందని తహసీల్దార్‌ గఫర్‌మియా తెలిపారు. రైతులకు, పట్టా దారులకు ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి వారికి అనుకూలంగా స్థానికంగానే పట్టా మార్పిడిలు, ...

Read More »

రాష్ట్రంలో రూ. 350 కోట్లతో రైతు శిక్షణ కేంద్రాలు

  బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాల్లో మంత్రి పోచారం పర్యటన నిజామాబాద్‌, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో పెద్ద ఇళ్లలో ఉంటున్న బీడీ కార్మికులు, పేద ఆరెకటిక కుటుంబాలకు 200 రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేయనున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం బాన్సువాడలో రూ. 7 లక్షలతో నిర్మించిన ఆరెకటిక కమ్యూనిటీ భవనాన్ని, రూ. 60 లక్షలతో నిర్మించిన రైతు శిక్షణ కేంద్రాన్నిమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ ప్రతి ...

Read More »

కలప ట్రాక్టర్ల పట్టివేత

  కమ్మర్‌పల్లి, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కమ్మర్‌పల్లి అటవీ రేంజ్‌లోని మోర్తాడ్‌ మండలం దొన్కల్‌ గ్రామ శివారులో కలపను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్ట్రైకింగ్‌ ఫోర్సు సిబ్బంది పట్టుకున్నట్టు రేంజ్‌ అధికారి విష్ణువర్ధన్‌ తెలిపారు. ట్రాక్టర్‌ ట్రాలీలో నల్లమగ్గి, శనంగి కలపను మోర్తాడ్‌ వైపునుంచి దొన్కల్‌ వైపు తరలిస్తుండగా పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న సిబ్బంది పట్టుకున్నట్టు చెప్పారు. కలప విలువ సుమారు 40 వేలు ఉంటుందని, కలపను స్వాధీనంచేసుకొని ట్రాక్టర్‌ సీజ్‌ చేసినట్టు చెప్పారు. సెక్షన్‌ అదికారి శ్రీనివాస్‌ ...

Read More »

ఎమిరేట్స్ వాసి వాహన విన్యాసాలు-తప్పిన ముప్పు

తన ఇష్టానుసారంగా విదేశీ ప్రాంతంలో రోడ్లపై విచిత్ర విన్యాసాలు చేస్తున్న ఎమిరేట్స్  వాసికి  స్వదేశంలో  చుక్క ఎదురైంది.  తానూ అమాయకుడినని..ఏ పాపం తెలియదని తొలుత, ఆ వ్యక్తీ  బుకాయించినప్పటికి, గతంలో సదరు వ్యక్తీ  తాను విదేశీ  రోడ్లపై వాహనంతో చేసిన విన్యాసాలకు  సంబంధించిన సొంత వీడియో సజీవ సాక్ష్యమైంది. వింత శబ్దాలతో …చిత్ర విచిత్ర  విన్యాసాలతో వాహనాన్ని డ్రైవింగ్ చేస్తూ ఎదుటవారి వాహనాన్ని దాదాపు ఢీ కొట్టే విధంగా నడుపుతున్న ఓ  వీడియోను  సామాజిక వెబ్ సైట్లలో పోస్టు సైతం చేశాడు. ఆ భయానక ...

Read More »

దేశ చరిత్రను తిరిగి రాయాలి

ఔను! వీరికి కోట వెంకటాచలం పేరు తెలియదు. కల్హణుని రాజతరంగిణి తెలియదు. బెంగాల్‌లోని కాలాపానీ తెలియదు. కాశింరజ్వీ దురంతాలు తెలియవు. గత నవంబర్ 9న కర్ణాటకలో ఒక సంఘటన జరిగింది. కిట్టప్ప ఒక సామాజిక కార్యకర్త. వయస్సు అరవై సంవత్సరాలు. కర్ణాటకలోని మడికెరె అనే ప్రాంతంలో ఉంటాడు. దేశ చరిత్రను వక్రీకరించకండి-అంటూ ఒక ఊరేగింపులో పాల్గొన్నాడు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కిట్టప్పపై పోలీసులు దాడి చేశారు. లాఠీలతో బాదారు. ఎందరో గాయపడ్డారు. ప్రాణభయంతో అంతా పరుగులు తీశారు. అక్కడ పదిహేను అడుగుల ...

Read More »