Breaking News

Daily Archives: December 23, 2015

ప్రజా సమస్యల సాధనకై సిపిఎం ఉద్యమాలు

  – రాష్ట్ర కమిటీ నాయకులు పాలడుగు భాస్కర్‌ కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సాధనకై సిపిఎం ఉద్యమాలు చేస్తోందని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని రాష్ట్ర కమిటీ నాయకులు పాలడుగు భాస్కర్‌ అన్నారు. బుధవారం కామారెడ్డిలో జరిగిన డివిజన్‌కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విపలమవుతుందని ఆరోపించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల పార్టీగా ప్రజా ఉద్యమాలు చేపడుతున్నామన్నారు. ...

Read More »

భవిత పాఠశాలలో క్రిస్మస్‌ వేడుకలు

  కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని హౌజింగ్‌ బోర్డు కాలనీ భవిత పాఠశాలలో బుధవారం క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏసు జన్మించిన గొర్రెల పాక ఏర్పాటుచేసి క్రిస్మస్‌ పండగ ప్రాముఖ్యతను ప్రిన్సిపాల్‌ ప్రభు, వ్యక్తిత్వ వికాస నిపుణులు జాన్‌ హేమంత్‌కుమార్‌లు తెలిపారు. అనంతరం కేక్‌ కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

సిపిఐ 90వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలి

  కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఐ 90వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య పిలుపునిచ్చారు. కామారెడ్డి సిపిఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబరు 26 నాటికి సిపిఐ 90 సంవత్సరాలు పూర్తిచేసుకుంటుందన్నారు. దేశ బానిస సంకెళ్లు తెంచడానికి పార్టీ కార్యకర్తలు అనేక త్యాగాలకు సిద్దమయ్యారని, తెలంగాణ విముక్తి కోసం సాయుధ పోరాటం సాగించిందని గుర్తుచేశారు. నాటి నుంచి నేటి వరకు సిపిఐ త్యాగాల ...

Read More »

రాజీనామాలు ఉపసంహరించుకుంటున్నాం

  కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఐ పార్టీకి రాజీనామాలు చేసిన ప్రకటనను ఉపసంహరించుకుంటున్నామని సిపిఐ డివిజన్‌ కార్యదర్శి బాల్‌రాజు తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షణికావేశంలో పార్టీకి రాజీనామా చేశామని, ఆత్మ విమర్శ చేసుకొని రాజీనామాలు ఉపసంహరించుకుంటున్నామని తెలిపారు. తిరిగి పార్టీ ప్రజాసంఘాల్లో కొనసాగుతామని వివరించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి దశరథ్‌, ఏఐటియుసి నాయకుడు రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Read More »

అక్షర స్కూల్లో క్రిస్మస్‌ వేడుకలు

  కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని అక్షర టెక్నో స్కూల్లో బుధవారం విద్యార్థులు క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వివిధ రకాల వేషధారణలతో అందరిని అలరించారు. దేవ దూతలు, గొర్రెల కాపరి దుస్తులు ధరించి అలరించారు. క్రిస్మస్‌ వేడుక గురించి ఆట పాటలతో ప్రదర్శించారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

బైండ్ల కులస్తుల బహిరంగ సభ కరపత్రం ఆవిష్కరణ

  కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బైండ్ల కులస్తుల హక్కులకోసం జనవరి 11న కామారెడ్డిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన గోడప్రతులు, కరపత్రం గురువారం నాయకులు కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా బైండ్ల కులస్తుల జిల్లా ఛైర్మన్‌ పోతరాజు స్వామి మాట్లాడుతూ బైండ్ల కులంలోని 60 కులాల నుంచి రెండు కులాలను మాత్రమే ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని మిగతా వారిని విస్మరించడం తగదన్నారు. బైండ్ల కులాలతో పాటు ఉప కులాలను బైండ్ల కులస్తులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. వారికి ...

Read More »

కర్షక్‌ బిఇడి కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్‌డే

  కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని కర్షక్‌ బిఇడి కళాశాల విద్యార్థులు బుధవారం ఫ్రెషర్స్‌డే కార్యక్రమాన్ని ధూం.. ధాం…గా నిర్వహించారు. ఆటపాటలతో మునిగి తేలారు. పలు సినీ, జానపద గేయాలపై నృత్యాలు చేసి అలరించారు. సభకు కళాశాల సెక్రెటరీ విశ్వనాథం అధ్యక్షత వహించగా, ప్రముఖ సామాజిక వేత్త బిఎన్‌ఎస్‌వి భద్రయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేలా సచ్చీల పౌరులుగా తయారయ్యే విధంగా పాఠశాల స్థాయిలోనే ...

Read More »

అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు

  బిచ్కుంద, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంజీర నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని డిప్యూటి తహసీల్దార్‌ నారాయణ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన తహసీల్‌ కార్యాలయంలో మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కేసులు నమోదుచేస్తామని, చట్టరీత్యా శిక్షార్హులవుతారని హెచ్చరించారు. మండలంలోని మంజీర నది పరివాహకంలో బండా రెంజల్‌, గుండెనెమ్లి, వాజిద్‌నగర్‌, పుల్కల్‌, షెట్లూర్‌, ఖడ్‌గాం తదితర గ్రామాలు ఉండడం వల్ల ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎంతటివారైనా తప్పకుండా ...

Read More »

బాల్య వివాహాలను అడ్డుకున్న అధికారులు

  ఎడపల్లి, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఎంఎస్‌సి ఫారం, జైతాపూర్‌ గ్రామాల్లో బాల్య వివాహాలు జరుపుతున్నారన్న సమాచారం మేరకు తహసీల్దార్‌ గఫర్‌మియా, ఐసిడిఎస్‌ అధికారులు ఆయా గ్రామాలకు వెళ్ళి బాలికల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. జైతాపూర్‌ గ్రామంలో సుజాత అనే మైనర్‌ బాలికకు ఈనెల 30న వివాహం జరప తలపెట్టినట్టు తహసీల్దార్‌ తెలిపారు. వివాహం జరిపితే జరగబోయే పరిణామాలు, తలెత్తే సమస్యలపై బాలిక తండ్రి విఠల్‌కు, కుటుంబ సభ్యులకు వివరించారు. అలాగే ఎంఎస్‌సి ఫారం గ్రామంలో శ్రావణి ...

Read More »

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

  ఎడపల్లి, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఒడ్డపల్లి గ్రామంలో బుధవారం ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన పాతోడ్‌ శత్రు (27) వ్యవసాయ కూలీ పనిచేస్తు జీవనం సాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా శత్రుకు చెందిన నివాస గుడిసె మంగళవారం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. దీంతో మరింత ఆర్థిక పరిస్తితి దిగజారడంతో మనస్తాపానికి గురై ఇంటి వెన ఉన్న చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్‌ఐ ఎం.డి. ఆసీఫ్‌ తెలిపారు. మృతునికి భార్య, ...

Read More »

హర్షం వ్యక్తం చేసిన కౌన్సిలర్‌ రామరాజు

  బోధన్‌, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ మునిసిపల్‌ పరిధిలో 230 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్టు ప్రతిపాదనలు రావడంతో పట్టణ బిజేపి కౌన్సిలర్‌ రామరాజు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సాయంఅందిస్తున్నందుకు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

Read More »

ముగిసిన న్యాక్‌ పర్యటన

  డిచ్‌పల్లి, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో మూడురోజుల పాటు సాగిన నాక్‌ పీర్‌ టీం పర్యటన బుధవారం ముగిసింది. లా కళాశాలలో జరిగిన ఎక్సిట్‌ మీటింగ్‌లో వారు తెవివికి మదింపు చేసిన అంశాలతో కూడిన రిపోర్టును విసికి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాక్‌ పీర్‌ టీం కమిటీఛైర్‌ పర్సన్‌ ప్రొఫెసర్‌ భూమిత్రదేవ్‌ మాట్లాడుతూ గ్లోబల్‌ డిమాండ్లు, అవసరాలకు తగిన విధంగా విద్యార్థులను తయారుచేయాల్సిన బాధ్యత యూనివర్సిటీలపై ఉందన్నారు. విశ్వవిద్యాలయాలు విశ్వజనీనత చూపాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ...

Read More »

ఘనంగా పి.వి. నర్సింహారావు వర్ధంతి

  బోధన్‌, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ప్రధాని పి.వి.నర్సింహారావు 11వ వర్ధంతిని బోధన్‌ పట్టణంలో అక్కినేని యువజన సంఘం ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షులు గంగాప్రసాదప్ప మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీలో మచ్చలేని మహనీయుడన్నారు. దేశ సమైక్యత సమగ్రత కోసం అహర్నిశలు కృసి చేసిన మహాత్ముడన్నారు. అనంతరం పి.వి.నర్సింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ ఉమేశ్‌ షిండే, కైలాసప్ప, దేవాంగ రమేశ్‌, మఠం గంగాధర్‌, శివ పాటిల్‌, ప్రహ్లాద్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలు ...

Read More »

లే ఆఫ్‌ను ఎత్తివేయాలని చక్కర ఫ్యాక్టరీ కార్మికుల ధర్నా

  బోధన్‌, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ లే ఆఫ్‌ను ఎత్తివేయాలంటూ కార్మికులు వామపక్ష పార్టీల నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. గత మూడు నెలలుగా కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా సమస్యలు పరిష్కరించకుండా రాత్రికి రాత్రే అక్రమంగా ఫ్యాక్టరీ లే ఆఫ్‌ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే లే ఆఫ్‌ను ఎత్తివేసి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం బోధన్‌ మునిసిపాలిటీ విచారణ కొరకు వచ్చిన జేఏసి రాజారాంకు ...

Read More »

గుండెకల్లూరు గ్రామాన్ని సందర్శించిన ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్‌

  బిచ్కుంద, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గుండెకల్లూరు గ్రామాన్ని బుధవారం బోధన్‌ ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్చభారత్‌ కార్యక్రమాన్ని అమలుచేయాలని పేర్కొన్నారు. గుండెకల్లూరు గ్రామాన్ని జడ్పిటిసి సాయిరాం దత్తత తీసుకున్నారని గ్రామంలో పలు అభివృద్ది పనులను పరిశీలించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, మురికి కాలువలు, చెత్త చెదారం, వృద్దులు, వికలాంగుల పింఛన్లు, ఆహారభద్రత కార్డులు తదితర విషయాలపై ఆరా తీశారు. ఆయన వెంట అధికారులు సాయిబాబా, ...

Read More »

బోధన్‌ మునిసిపాలిటీలో విచారణ చేపట్టిన ఏజేసి

  బోదన్‌, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపాలిటీలో పేరుకుపోతున్న అవినీతి అక్రమాలపై జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్‌ రాజారాం బుధవారం విచారణ చేపట్టారు. సోమవారం ప్రజావాణిలో పలువురు పలు సమస్యలపై ఫిర్యాదు చేశారు. పట్టణ కౌన్సిలర్లు పలు సమస్యలపై సమాచార హక్కు చట్టం కింద ఫిర్యాదు చేయడంతో ఏజేసి బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మునిసిపల్‌ ఛైర్మన్‌, కమీషనర్‌, సిబ్బంది సమక్షంలో రికార్డులను పరిశీలించారు. ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ రామరాజు, ...

Read More »

చదువుల తల్లిని దర్శించుకున్న న్యాక్‌ బృందం

  డిచ్‌పల్లి, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో గత మూడు రోజులుగా పరిశీలనకు వచ్చిన నాక్‌ పీర్‌ టీం బుధవారం ఉదయం బాసర ఆలయానికి వెళ్ళి సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. నాక్‌ పీర్‌ టీం ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ భూమిత్రదేవ్‌, ఇతర సభ్యులు అందరూ ఉదయమే విసి పార్ధసారధి, రిజిస్ట్రార్‌ లింబాద్రితోకలిసి బాసర ఆలయానికి చేరుకున్నారు. అక్కడ సంప్రదాయబద్దంగా వారికి ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం తర్వాత వేదపండితులు ఆశీర్వదించి అమ్మవారి తీర్థ, ప్రసాదాలు అందించారు. ...

Read More »

అందరికీ అందుబాటులో వైద్యం

భారతదేశంలోలా కాకుండా సింగపూర్‌లో అమల్లో ఉన్న ఆరోగ్య వైద్య విధానం కింద, ఆ దేశంలోని ప్రతి వ్యక్తికీ, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, ఆసుపత్రి వైద్యం, దీర్ఘకాలిక ఆరోగ్య పరిరక్షణ, తదితర సంబంధిత కార్యక్రమాలు ఒక క్రమ పద్ధతి ప్రకారం చేపట్టి అమలు చేస్తారు. ప్రభుత్వ – ప్రైవేట్ రంగంలో అనేక ఔట్ పేషంట్ – ఇన్ పేషంట్ క్లినిక్‌లు, పాలీ క్లినిక్‌లు, ఆసుపత్రులు, సింగపూర్‌లోని పౌరులకు – విదేశీయులకు వారి – వారి అవసరాలకు అనుగుణంగా, నాణ్యమైన వైద్య సౌకర్యం కలిగిస్తాయి. సింపూర్‌లో నూటికి ...

Read More »

సిరులు కురిపిస్తున్న సింగరేణి

పరకాల, డిసెంబర్ 22: సాంకేతిక సొగసులతో వరంగల్ జిల్లాకే భూపాలపల్లి కోల్‌బెల్ట్ ఏరియా తలమానికంగా మారింది. ఏరియాలో బొగ్గు గనుల విస్తరణతో పాటు వ్యాపార రంగంగా దినదినం వృద్ధి చెందుతుంది. అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి కాంతిపుంజమై అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న సింగరేణి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి భూపాలపల్లిలో ముస్తాబు అవుతోంది. సింగరేణి వేడుకలను యాజమాన్యం ప్రత్యేక ఏర్పాటు చేసింది. 1979లో ప్రారంభమైన పనులు 1979 సంవత్సరంలో సింగరేణి యాజమాన్యం బొగ్గు నిక్షేపాల కోసం అనే్వషణ కొనసాగింది. ఈసందర్భంగా 664.99 మిలియన్ల ...

Read More »

విదేశీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు సీజ్..

దుబాయ్ నుంచి భారత్ కు అక్రమంగా రవాణాచేస్తున్న 91లక్షల రూపాయల విలువైన విదేశీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కేరళలోని కోచి పోర్ట్ లో ఓ కంటెయినర్ లో తీసుకువస్తున్న సిగరెట్లను గుర్తించి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతవారం 67లక్షల రూపాయల విలువ చేసే విదేశీ సిగరెట్లను సీజ్ చేసినట్లు కస్టమ్స్ కమిషనర్ కెఎన్ రాఘవన్ మీడియాకు తెలిపారు. కంటెయినర్ లో ఉన్న ఫర్నిచర్స్ లో సిగరెట్లను దాచి ఉంచినట్లు ...

Read More »