Breaking News

Daily Archives: December 24, 2015

తెరాసలో చేరిన తిరుపతి

  నందిపేట, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి సీనియర్‌ నాయకుడు నందిపేట వాస్తవ్యుడు ఎస్‌.జి. తిరుపతి గురువారం హైదరాబాద్‌ వెళ్ళి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో తెరాసలో చేరారు. అతనితో పాటు అనుచరులు పెద్ద సంఖ్యలో తెరాసలో చేరారు. తిరుపతి సర్పంచ్‌ ఎన్నికల్లో ఎం.డి.షాకీర్‌పై పోటీచేసి అతి తక్కువ ఓట్లతో ఓటమి చెందారు. తిరుపతి చేరికతో తెరాస మండలంలో మరింత బలపడుతుందని కార్యకర్తలు భావిస్తున్నారు. ప్రజల దాహార్తిని తీర్చడానికి తన సొంత డబ్బుతో గతంలో మినీ ట్యాంకులు నిర్మించారు. ఈ ...

Read More »

ఘనంగా దత్తజయంతి వేడుకలు

  ఎడపల్లి, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఠానాకలాన్‌ గ్రామంలో గురువారం దత్తజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయ స్వామి చిత్రపటం గ్రామంలో పలు వీధుల గుండా పల్లకిలో ఊరేగించారు. దత్తాత్రేయ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్తజయంతి సందర్భంగా మండలంలోని పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ అబ్బయ్య, ఎంపిటిసి సభ్యుడు ఆకుల సురేశ్‌, ...

Read More »

ఆర్టీసి బస్టాండ్ల సౌకర్యాల కల్పనకు చర్యలు

  – ఆర్‌టిసి డిప్యూటి సిటిఎం ఎడపల్లి, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో పలు బస్టాండ్‌లు అసౌకర్యాలకు లోనై మూతపడ్డ సందర్భంగా వాటిని మెరుగుపరిచేందుకుగాను ప్రయాణికులకు పలు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్టు జిల్లా ఆర్‌టిసి డిప్యూటి సిటిఎం మురళీధర్‌గౌడ్‌ తెలిపారు. ఈసందర్భంగా ఆయన ఎడపల్లి, జాన్కంపేట్‌ బస్టాండ్లను గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బస్టాండ్లలో సరైన సౌకర్యాలు లేకపోవడంవల్ల ప్రయాణికుల ఇబ్బందులనుదృస్టిలో పెట్టుకొని మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. ప్రస్తుతం బస్టాండ్లలోకి ...

Read More »

నందిపేట సర్పంచ్‌పై ఎమ్మెల్యేకు ఫిర్యాదు

  నందిపేట, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ షాకీర్‌ హుస్సేన్‌ అవినీతి అక్రమాలపై ఫిర్యాదుల పరంపర ఆగడం లేదు. నందిపేట యువజన సంఘాల సమాఖ్య అధ్యక్షుడు సంతోష్‌ ఆద్వర్యంలో యువకులు హైదరాబాద్‌ వెళ్ళి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. సర్పంచ్‌ షాకీర్‌హుస్సేన్‌పై ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని, సర్పంచ్‌ పదవి నుంచి పార్టీ నుంచి బహిష్కరించాలని ఎమ్మెల్యేను కోరినట్టు సంతోష్‌తెలిపారు.

Read More »

ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబి

  నందిపేట, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాప్రవక్త మోహమ్మద్‌ (స.అ.సం) పుట్టిన రోజు సందర్బంగా గురువారం జిల్లా అంతటా ముస్లింలు మిలాద్‌ ఉన్‌ నబి పండగ ఘనంగా జరుపుకున్నారు. నందిపేట మండల కేంద్రంలో మిలాద్‌కమిటీ అధ్యక్షుడు సయ్యద్‌ మహమూద్‌ అద్యక్షతన ర్యాలీ నిర్వహించారు. మెయిన్‌ రోడ్‌ మీదుగా ర్యాలీ జరిపి ప్రజలకు మిఠాయిలు పంచుతూశుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రవక్త మార్గదర్శకత్వంలో ప్రారంభమైన ఇస్లామి ఉద్యమం ఇరవై మూడు సంవత్సరాలలో మూఢనమ్మకాలను నిర్మూలించి సుందర సమాజ ...

Read More »

జనవరి 9 నుంచి జిల్లా స్తాయి క్రికెట్‌ పోటీలు

  బీర్కూర్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కిష్టాపూర్‌ గ్రామంలో జనవరి 9వ తేదీ నుంచి కీర్తిశేషులు కామినేని సూరిబాబు స్మారకార్థం జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ప్రథమ బహుమతిగా 20 వేల నగదు, ట్రోఫి, ద్వితీయ స్తానంకు 10 వేల నగదు ట్రోఫి అందజేయబడుతుందని పేర్కొన్నారు. పోటీలో పాల్గొనదలచిన జట్లు జనవరి 8న నిర్వహించే డ్రాలోపు సంప్రదించాలన్నారు. ఎంపైర్‌దే తుది నిర్ణయమని తెలిపారు.   District Level Cricket Competition in Birkoor ...

Read More »

పెరియార్‌ రామస్వామి వర్ధంతి వేడుకలు

  మోర్తాడ్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రమైన మోర్తాడ్‌లో గురువారం పెరియార్‌ రామస్వామి 42వ వర్ధంతిని అంబేడ్కర్‌ సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. రామస్వామి చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా వారుమాట్లాడుతూ దేశంలో సమసమాజ స్థాపనకు, అందరికి విద్య కోసం, అంటరానితన నిర్మూలన కోసం ఎంతో కృసి చేశారని వారు కొనియాడారు. ప్రతి ఒక్కరు ఆయన ఆశయా సాదనకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంబేడ్కర్‌ సంఘ సభ్యులు మామిడిరాజేశ్వర్‌, మల్లూరి రాజారాం, రవి, సామ్రాట్‌ ...

Read More »

క్రిస్మస్‌కు ముస్తాబైన చర్చిలు

  రెంజల్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం క్రిస్మస్‌ పండగను పురస్కరించుకొని మండలంలోని క్రిస్టియన్లు గురువారం చర్చిలను అలంకారప్రాయంగా, సుందరంగా ముస్తాబు చేశారు. మండలంలోని నీలా క్యాంపు, బాగేపల్లి, దూపల్లి, తాడ్‌బిలోలి గ్రామాల్లోని చర్చిలకు రంగులువేసి విద్యుత్‌దీపాలతో అలంకరించారు.

Read More »

ఘనంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవం

  రెంజల్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో మాజీ ఎంపిపి రమణాగౌడ్‌ ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో మండలంలోని ఆయాగ్రామాల దీక్షా స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆరట్టు మహోత్సవం నిర్వహించారు. అనంతరం స్వాములకు భిక్షా, అన్నదానం చేశారు.

Read More »

ఘనంగా మహ్మద్‌ ప్రవక్త జన్మదినం

  రెంజల్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కందకుర్తి, రెంజల్‌, తాడ్‌బిలోలి, నీలా గ్రామాల్లో ముస్లింలు మహ్మద్‌ ప్రవక్త జన్మదినం సందర్భంగా ర్యాలీలు నిర్వహించారు. ఘనంగా ప్రవక్త జన్మదినం జరుపుకున్నారు. కందకుర్తిలో ముస్లింలు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి మండలంలోని పలు గ్రామాల ముస్లింలు పాల్గొన్నారు. అనంతరం రెంజల్‌ మండల కేంద్రంలో అన్ని గ్రామాల ముస్లింలు బైక్‌ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ తమ సిబ్బందితో బందోబస్తుఏర్పాటు చేశారు.

Read More »

ఇసుక టిప్పర్ల పట్టివేత

  రెంజల్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామం నుంచి ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక టిప్పర్లను గురువారం ఎస్‌ఐ రవికుమార్‌ తమ సిబ్బందితో పట్టుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదుచేసినట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు. అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే సహించేది లేదని, క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పలుమార్లు హెచ్చరికలు జారీచేసినా పట్టించుకోకుండా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని అన్నారు.

Read More »

ఎయిర్ ఏషియా.. క్రిస్మస్ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్‌..

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా.. క్రిస్మస్, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రయాణికుల కోసం ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎయిర్ ఏషియా సంస్థ ఒకవైపునకు గానూ గోవా, కొచ్చి, గువాహతి, ఇంపాల్ వంటి ప్రాంతాలకు రూ. 1,269 నుంచి టికెట్లు ఆఫర్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కౌలాలంపూర్-బ్యాంకాక్‌కు రూ. 2,999 నుంచి టికెట్‌ను ఆఫర్ చేస్తోంది. ఇప్పటి నుంచి జనవరి 3 వరకు బుకింగ్ చేసుకున్న వారు జనవరి 10 నుంచి జూన్ 30 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని పేర్కొంది.

Read More »

ఎన్‌డిఎస్‌ఎల్ పరిశ్రమల మూత

మెదక్, డిసెంబర్ 23: మెదక్ జిల్లాలోని మెదక్, నిజామాబాద్ జిల్లా బోధన్, కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలోని నిజాం దక్కన్ సుగర్స్ లిమిటెడ్ పరిశ్రమలను లే ఆఫ్ చేస్తున్నట్లు మెదక్ ఎన్‌డిఎస్‌ఎల్ పరిశ్రమ ప్రధాన గేటుకు బుధవారం నోటీసు అంటించారు. దీంతో కార్మికులు నివ్వెరబోయారు. దాంతో 51 శాతం ఎన్‌డిఎస్‌ఎల్ పరిశ్రమలో వాటా ఉన్న గోకరాజు గంగరాజు దిష్టిబొమ్మకు ఎన్‌డిఎస్‌ఎల్ పరిశ్రమ నుంచి మంబోజిపల్లి చౌరస్తా వరకు కార్మికులు శవయాత్ర నిర్వహించారు. మంబోజిపల్లి చౌరస్తాలో దిష్టిబొమ్మ మెడకు ఉరివేసి, చెప్పులతో కొట్టి, ఆ తరువాత దిష్టిబొమ్మను ...

Read More »

ప్యాంటికీ మరక అంటుకుని వుంటోంది

 ప్రశ్న : నేను ఇంటర్మీడియట్‌ చదువుకుంటున్నాను. ఇంటికి వచ్చిన తరువాత నా ప్యాంటికీ మరక అంటుకుని వుంటోంది. అది లేత పసుపు రంగులో వుంది. తరుచూ ఇలా జరగడం వల్ల నాకు చాలా ఆందోళనగా వుంది. నా ప్యాంటిలోని వాషింగ్‌ మిషన్‌లోవేసేటపుడు మమ్మీ చూసి ఏమంటుందోనని కంగారుగా వుంది. ఈ మరకలు అంటకుండా వుండాలంటే ఏం చేయాలి? (ఒక అమ్మాయి) జవాబు : టీనేజిలో ఇలా ప్యాంటీలకు మరక అంటుకోవడం ఒక సహజమైన పరిణామం. వయసులో వున్నప్పుడు కామ స్రావాలు ఊరుతాయి. సెక్స్‌ ఆలోచనలు ...

Read More »