నందిపేట, డిసెంబరు 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాప్రవక్త మోహమ్మద్ (స.అ.సం) పుట్టిన రోజు సందర్బంగా గురువారం జిల్లా అంతటా ముస్లింలు మిలాద్ ఉన్ నబి పండగ ఘనంగా జరుపుకున్నారు.
నందిపేట మండల కేంద్రంలో మిలాద్కమిటీ అధ్యక్షుడు సయ్యద్ మహమూద్ అద్యక్షతన ర్యాలీ నిర్వహించారు. మెయిన్ రోడ్ మీదుగా ర్యాలీ జరిపి ప్రజలకు మిఠాయిలు పంచుతూశుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రవక్త మార్గదర్శకత్వంలో ప్రారంభమైన ఇస్లామి ఉద్యమం ఇరవై మూడు సంవత్సరాలలో మూఢనమ్మకాలను నిర్మూలించి సుందర సమాజ నిర్మాణం జరిగిందన్నారు. జాతి, వర్గ, కుల వైషమ్యాలు వీడి సోదరత్వ సాంఘిక జీవన వ్యవస్థను నెలకొల్పాలని పిలుపునిచ్చారన్నారు.

Latest posts by NizamabadNews OnlineDesk (see all)
- డయల్ 100కు 2271 ఫోన్ కాల్స్ - October 10, 2018
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - October 10, 2018
- బహుజనులు ఐక్యం కావాలి - October 10, 2018