Breaking News

ఇసుక టిప్పర్ల పట్టివేత

 

రెంజల్‌, డిసెంబరు 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామం నుంచి ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న
మూడు ఇసుక టిప్పర్లను గురువారం ఎస్‌ఐ రవికుమార్‌ తమ సిబ్బందితో పట్టుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

కేసు నమోదుచేసినట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు. అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే సహించేది లేదని, క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పలుమార్లు హెచ్చరికలు జారీచేసినా పట్టించుకోకుండా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని అన్నారు.

Check Also

మా డబ్బులు మాకివ్వండి

రెంజల్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత రెండు నెలల నుండి పింఛన్‌ డబ్బులు ఇవ్వడం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *