– ఆర్టిసి డిప్యూటి సిటిఎం
ఎడపల్లి, డిసెంబరు 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో పలు బస్టాండ్లు అసౌకర్యాలకు లోనై మూతపడ్డ సందర్భంగా వాటిని మెరుగుపరిచేందుకుగాను ప్రయాణికులకు పలు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్టు జిల్లా ఆర్టిసి డిప్యూటి సిటిఎం మురళీధర్‌గౌడ్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన ఎడపల్లి, జాన్కంపేట్ బస్టాండ్లను గురువారం పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ బస్టాండ్లలో సరైన సౌకర్యాలు లేకపోవడంవల్ల ప్రయాణికుల ఇబ్బందులనుదృస్టిలో పెట్టుకొని మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. ప్రస్తుతం బస్టాండ్లలోకి బస్సులు వెళ్లకపోవడం వల్ల రోడ్లపైనే నిలుస్తుండడం, దీంతో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నందున వాటిని దృష్టిలో పెట్టుకొని బస్సులు బస్టాండ్లలోకే వెల్లే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. బస్టాండ్లలో వ్యాపార సముదాయాల కోసం నిర్మించిన గదుల్లో అద్దెకు ఎవరు రావడం లేదని దీంతో మడిగెలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయని ఆయన తెలిపారు. లక్షల రూపాయలువెచ్చించి ప్రభుత్వం బస్టాండ్లు నిర్మించడం జరిగిందని, అయితే పలు కారణాల వల్ల అవి మూతపడడం జరిగిందని ఆయన తెలిపారు. వీటిని పునర్దుదరిస్తున్నట్టు తెలిపారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగనీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని బోధన్ డిపో మేనేజర్‌ను ఆదేశించారు. డ్రైవర్లు బస్టాండ్‌లోకి బస్సు తీసుకెళ్లకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట బోధన్ డిపో మేనేజర్ భవభూతి, అసిస్టెంట్ ఇంజనీరింగ్ అధికారి తదితరులున్నారు.

Latest posts by NizamabadNews OnlineDesk (see all)
- డయల్ 100కు 2271 ఫోన్ కాల్స్ - October 10, 2018
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - October 10, 2018
- బహుజనులు ఐక్యం కావాలి - October 10, 2018