Breaking News

Daily Archives: December 28, 2015

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

  నందిపేట, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం డొంకేశ్వర్‌ గ్రామానికి చెందిన హన్మ పెద్ద గంగారాం (45) ఆదివారం నుంచి కనిపించకుండా పోయాడు. కాగా సోమవారం ఉదయం గోదావరి శిఖం భూమిలో వేపచెట్టుకు ఉరివేసుకొని శవమై కనిపించినట్టు పోలీసులు తెలిపారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ జాన్‌రెడ్డి తెలిపారు. కాగా భార్య వారం రోజుల క్రితం కుటుంబ గొడవల కారణంగా పుట్టింటికి వెళ్లింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు.

Read More »

జాతీయ స్తాయికి తిమ్మాపూర్‌ విద్యార్థి

  మోర్తాడ్‌, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న యు.భార్గవ్‌ జాతీయ స్థాయి టోర్నికి ఎంపికయ్యాడని ప్రధానోపాధ్యాయుడు శంకర్‌, పిఇడి నగేశ్‌లు సోమవారం తెలిపారు. ఇటీవల ఆదిలాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి ఖోఖో క్రీడల్లో భార్గవ్‌ అత్యుత్తమ క్రీడా ప్రదర్శన నిర్వహించాడని, దీంతో జాతీయ స్థాయికి ఎంపికయ్యాడని వారు తెలిపారు. బోపాల్‌లో జనవరి 20 నుంచి 23వ తేదీ వరకు జరిగే రాష్ట్ర స్తాయి టోర్నిలో భార్గవ్‌ వెళుతున్నాడని ...

Read More »

జనవరిలో సహకారబ్యాంకును ప్రారంభిస్తాం

  మోర్తాడ్‌, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రమైన మోర్తాడ్‌లో నూతన భవన నిర్మాణంలో సహకార బ్యాంకును జనవరిలో ప్రారంభిస్తామని డిసిసిబి జిల్లా అధ్యక్షుడు గంగాధర్‌రావు పట్వారి అన్నారు. సోమవారం మోర్తాడ్‌ అంగడిబజార్‌లో 22 లక్షలతో నిర్మిస్తున్న సహకార బ్యాంకు భవన నిర్మాణ పనులను గంగాధర్‌రావు పట్వారి, సిఇవో, డైరెక్టర్‌ సోమ చిన్నగంగారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకున్నాయని, మరో 15 రోజుల్లో అన్ని పనులు పూర్తవుతాయని సొంత భవనంలో ...

Read More »

ధూం…. ధాం….

  ఆర్మూర్‌, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ఆర్మూర్‌ మునిసిపాలిటీకి చెందిన కో ఆప్షన్‌ ఎన్నికల్లో తెరాసకు చెందిన ముగ్గురు అభ్యర్తులు ఘన విజయం సాధించారు. దీంతో గెలుపొందిన అభ్యర్థులు తెరాస కార్యకర్తలతో కలిసి మునిసిపల్‌ కార్యాలయం నుంచి డిజె శబ్దాలతో ఆటలు ఆడుతూ కేరింతలు కొడుతూ టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరిపారు. అనంతరం ఎన్నికైన అభ్యర్థులు మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌, ఎంపి కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. సామాన్య కార్యకర్తలను గుర్తించి వారిని ఎమ్మెల్యే ప్రోత్సహించి ...

Read More »

సజావుగా కో ఆప్షన్‌ ఎన్నిక

  ఆర్మూర్‌, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని మునిసిపల్‌ కార్యాలయంలో సోమవారం కో ఆప్షన్‌ ఎన్నికలు సజావుగా జరిగాయి. అందులో భాగంగా తెరాసకు చెందిన ముగ్గురు అభ్యర్థులు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. ముందుగా ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ బబ్లు అద్యక్షతన సమావేశం నిర్వహించారు. ఇందులో కో ఆప్షన్‌ ఎన్నికకు సంబంధించి ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పోల మధుకర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం రెండు కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలు ఓటింగ్‌ ప్రకారం జరిగాయి. అందులో ...

Read More »

ప్రజావాణికి 19 ఫిర్యాదులు

  ఆర్మూర్‌, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం ఆర్మూర్‌ తహసీల్‌ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంది. ఈ వారం కూడా ప్రజావాణి జరిగింది. ఇందులో తహసీల్దార్‌ శ్రీధర్‌ మొత్తం 19 ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు. వీటిలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు సంబందించి 15, ఆహారభద్రత కార్డులకోసం 2 ఫిర్యాదులు, ఆన్‌లైన్‌లో పేరు మార్పిడి విషయమై 2 ఫిర్యాదులు వచ్చినట్టు ఆయన తెలిపారు.

Read More »

పూడ్చివేసిన కాలువలను పునర్నిర్మించాలి

  మోర్తాడ్‌, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలోగల విజయలక్ష్మి చెరువు (ఊరచెరువు), రాంసాగర్‌ చెరువు నీటితో నింపేందుకు వరద కాలువ ద్వారా,కాకతీయ కాలువ ద్వారా, గట్టుపొడిచిన వాగు, చౌట్‌పల్లి ఎత్తిపోతల పథకం ద్వారా నీరు వచ్చేలా ఏర్పాటు చేసిన కాలువలను పాలెం గ్రామానికి చెందిన కొందరు రైతులు కబ్జాలకు గురిచేసి కాలువలను పూడ్చివేశారని, తిరిగి కబ్జాదారులను తొలగించి కాలువల పునర్నిర్మాణం చేయాలని తిమ్మాపూర్‌ గ్రామ రైతులు, సహకార సంఘ సభ్యులు సోమవారం తహసీల్‌ కార్యాలయం ముందు ...

Read More »

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

  మోర్తాడ్‌, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రమైన మోర్తాడ్‌ గ్రామంలోగల సురేశ్‌నగర్‌ కాలనీలో పర్వీన్‌ బేగం (42) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు ఆర్మూర్‌ డిఎస్పీ ఆకుల రాంరెడ్డి సోమవారం విలేకరులతో తెలిపారు. పోలీసుల, స్తానికుల కథనం ప్రకారం… మృతురాలికి భర్త అబ్దుల్లా హమీద్‌, కుమారుడు ఇస్మాయిల్‌, కూతురు అమీనా బేగం ఉన్నారని, జీవనోపాధికై భర్త గల్ప్‌కు వెళ్లాడని, మృతురాలి కుమారుడు ఇస్మాయిల్‌ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, కూతురు బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని తెలిపారు. మృతురాలి ...

Read More »

బుద్ధిజం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు

గౌతమ బుద్ధుడు లేదా సిద్ధార్థుడు ప్రపంచంలో గొప్ప ఆధ్యాత్మిక వేత్త. నేపాల్ కి చెందిన గౌతమ బుద్దుడు ప్రారంభించిన బుద్ధిజం.. ప్రపంచంలోని పలు ప్రాంతాలకు పాకింది.. అలాగే అనేకమందికి స్పూర్తినిచ్చింది. గౌతమ బుద్ధుడు ఆత్మ జ్ఞానాన్ని ప్రబోధించాడు. ఇప్పటికీ.. బుద్ధిడి హితబోధ మనకు ఉపయోగపడుతూనే ఉంది. అలాగే మనుషులు ఉన్నంతవరకు బుద్ధిజానికి విలువ ఉంటుంది. బుద్ధిడి జీవితంలో ప్రతి అంశం స్పూర్తిదాయకం, జ్ఞానం ప్రబోధించేదే. ఇక్కడ బుద్ధుడి నుంచి నేర్చుకోవాల్సి మరిన్ని విషయాలు, ఆసక్తికర అంశాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం… ఉపశమనం కలిగించే ప్రేమ: ప్రేమ ...

Read More »

సూపర్బ్: ‘నాన్నకు ప్రేమతో’ ట్రైలర్

28 Dec) హైదరాబాద్‌: ఎన్టీఆర్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌ జంటగా తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం పాటల విడుదల వేడుక హైదరాబాద్‌ నిన్న ఆదివారం రాత్రి జరిగింది. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ చిత్రం పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. ఈ ఆడియో వేడుకకు చిత్ర యూనిట్‌, సినీ ప్రముఖులు, ఎన్టీఆర్‌ అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ ట్రైలర్ చాలా బాగుందని అంటున్నారు ...

Read More »

పరిష్కారానికి నోచని సమస్యలు

తెలంగాణ ఉద్యమకాలంలో కూడా కెసిఆర్ తెలంగాణ భవన్‌లో ఓ యాగాన్ని నిర్వహించారు. ఇది ఉద్యమకారులకుండే లక్షణం కాదని నాడు విమర్శలు వచ్చాయి. బహుశ ఆయన యాగఫలమే తెలంగాణ సాకారం అనుకుంటే, దాదాపుగా 1300 మందికి పైగా యువకులు ఎందుకు ప్రాణత్యాగం చేసారో కెసిఆర్ చెప్పలేకపోయారు. పోతే, నాటి యాగఫలంతో తెలంగాణ ప్రజలకన్నా, కుటుంబపరంగా ఎక్కువ లబ్దినే పొందారు. దళితుడే ముఖ్యమంత్రి అని, తానో కావలి కుక్క అని నినదించిన కెసిఆర్ స్వయాన ముఖ్యమంత్రి అయి కుటుంబ సభ్యులకు పెద్దపీటనే వేసుకున్నారు. ఇక ఉద్యమకాలంలో ప్రస్తావించిన ...

Read More »

విమానంలో మాంసాహారంపై ఎయిరిండియా ఆంక్షలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఎకానమీ శ్రేణి ప్రయాణీకులకు మాంసాహారాన్ని అందించడం నిలిపివేయనుంది. 90 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకునే ప్రయాణీకులకు జనవరి 1 నుంచి విమానంలో మాంసాహార పదార్థాలను అందించబోవడం లేదని ప్రకటించింది. మరోవైపు ఎయిరిండియా తీసుకున్న నిర్ణయాన్ని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. కేవలం శాఖాహారాన్ని మాత్రమే అందిస్తామనడంలో ఏదో మతలబు ఉందని ట్విట్టర్‌లో ఒమర్ పేర్కొన్నారు.

Read More »

మేము చిరు ధాన్యాలం – కాదు సిరిధాన్యాలము

మా పేర్లు రాగి, జొన్న, కొర్ర, గంటి, సామలు, అరికెలు, వొదలు. మేముంటే మీఇంట వంటల ఘుమ ఘుమలు. మేమే మీ ఆరోగ్యానికి సోపానాలు. మేము మీరు తినే మీ పళ్ళెంలో లేకపోతే మీరు అనారోగ్యం పాలవుతారు. అది మధుమేహం నకు కానీ రక్తపోటుకు కాని రక్త హీనతకు ఇలా నానా రకాల జబ్బులకు దారితీస్తుంది. ఆ జబ్బులకు డబ్బులు ఖర్చు అవుతాయి. దానికి మానవాళి అప్పులు చేసి అప్పులు పాలవుతారు. కావున మమ్మలిని మీ మడిలో నుండి మదిలొ నుండి దూరం చేసి ...

Read More »