న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఎకానమీ శ్రేణి ప్రయాణీకులకు మాంసాహారాన్ని అందించడం నిలిపివేయనుంది. 90 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకునే ప్రయాణీకులకు జనవరి 1 నుంచి విమానంలో మాంసాహార పదార్థాలను అందించబోవడం లేదని ప్రకటించింది. మరోవైపు ఎయిరిండియా తీసుకున్న నిర్ణయాన్ని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. కేవలం శాఖాహారాన్ని మాత్రమే అందిస్తామనడంలో ఏదో మతలబు ఉందని ట్విట్టర్లో ఒమర్ పేర్కొన్నారు.

Latest posts by NizamabadNews OnlineDesk (see all)
- డయల్ 100కు 2271 ఫోన్ కాల్స్ - October 10, 2018
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - October 10, 2018
- బహుజనులు ఐక్యం కావాలి - October 10, 2018