Breaking News

సూపర్బ్: ‘నాన్నకు ప్రేమతో’ ట్రైలర్

28 Dec) హైదరాబాద్‌: ఎన్టీఆర్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌ జంటగా తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం పాటల విడుదల వేడుక హైదరాబాద్‌ నిన్న ఆదివారం రాత్రి జరిగింది. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ చిత్రం పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. ఈ ఆడియో వేడుకకు చిత్ర యూనిట్‌, సినీ ప్రముఖులు, ఎన్టీఆర్‌ అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ ట్రైలర్ చాలా బాగుందని అంటున్నారు చూసినవారంతా. ఎన్టీఆర్ మరోసారి తన స్కిల్స్ తో మైమరించాడనే చెప్పాలి. అలాగే అతని స్టైలిష్ హెయిర్ స్టైల్, గడ్డం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. అలాగే ఈ చిత్రంలో విలన్ గా నెగిటివ్ రోల్ లో కనిపించిన జగపతిబాబు కూడా చాలా కూల్ గా కనిపించటం గమనించవచ్చు. నిర్మాత మాట్లాడుతూ ”ఎన్టీఆర్‌ సినీ ప్రయాణానికీ, మా సంస్థకి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన చిత్రమిది. ” అన్నారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ : విజరు చక్రవర్తి, ఆర్ట్‌ : రవీందర్‌, ఫైట్స్‌ : పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌ : నవీన్‌ నూలి, పాటలు : చంద్రబోస్‌, డాన్స్‌ : రాజు సుందర కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : సుకుమార్‌.

Check Also

‘కాలుతోందా మీకు..’ విజయ్ దేవరకొండ కామెంట్స్

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్‌లో ఇప్పుడో సెన్సేషనల్. అర్జున్‌రెడ్డి సినిమాపై విమర్శలు చేసిన వీహెచ్‌ను ‘తాతా చిల్’.. అన్నా.. సెన్సార్ టీంను ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *