Breaking News

Daily Archives: December 29, 2015

సరస్వతి శిశుమందిర్‌ విద్యార్థుల విజయభేరి

  కామారెడ్డి, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భైంసాలో జరిగిన సంభాగ్‌ స్థాయి ఖేల్‌ ఖూద్‌లో కామారెడ్డి సరస్వతి శిశుమందిర్‌ పాఠశాల విద్యార్తులు విజయభేరి మోగించారు. ఈనెల 25,26 తేదీల్లో జరిగిన ఖేల్‌ ఖూద్‌లో పాఠశాల విద్యార్తులు 7 ప్రథమ బహుమతులు, 4 ద్వితీయ బహుమతులు సాధించి ప్రాంత స్థాయికి ఎంపికయ్యారని ప్రధానాచార్యులు నల్లా నాగభూషణం తెలిపారు. విజయం సాధించిన విద్యార్తులకు పాఠశాల అధ్యక్షుడు డాక్టర్‌ శ్యాంసుందర్‌రావు అభినందించారు. విద్యార్థుల విజయం పట్లహర్షం వ్యక్తం చేశారు.

Read More »

విద్య కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం

  -ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్‌బాబు కామారెడ్డి, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్య ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయికరణకు వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐ పోరాటాలు చేస్తుందని జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్‌బాబు అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ 45వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం కామారెడ్డిలో నిర్వహించారు. కొత్త బస్టాండ్‌ ఎదుట జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1970 లో ఎస్‌ఎఫ్‌ఐ ఆవిర్భవించిందన్నారు. నాటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తుందన్నారు. తెరాస ప్రభుత్వం కెజి నుంచి ...

Read More »

రైతుల మేలు కోసమే రెవెన్యూ సదస్సులు

  ఎడపల్లి, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు, పట్టాదారులకు ప్రభుత్వం కల్పిస్తున్న రెవెన్యూ సదస్సులు లబ్దిపొందే అవకాశం కల్పించిందని ఆర్డీవోశ్యాంప్రసాద్‌లాల్‌ అన్నారు. మంగళవారం మండలంలోని జైతాపూర్‌ గ్రామంలో రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఆర్డీవో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో పట్టామార్పిడి చేసుకునేందుకు మూడు నెలల సమయం పట్టేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం గ్రామాల్లోనే రెవెన్యూ సదస్సులు నిర్వహించి అక్కడికక్కడే వారసత్వ మార్పిడి చేస్తూ పట్టాపాసుపుస్తకాలను పంపినీ చేయడం జరుగుతుందని ఈ అవకాశం ప్రతి ఒక్కరు ...

Read More »

అఖిలభారత 8వ మహాసభలను విజయవంతం చేయాలి

  ఎడపల్లి, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిలభారత 8వ మహాసభల పోస్టర్లను సిఐటియు నాయకులు మంగళవారంమండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఎస్సీవాడలోని అంగన్‌వాడి కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్‌బాబు మాట్లాడుతూ ఆలిండియాఫెడరేషన్‌ ఆఫ్‌ అంగన్‌వాడి వర్కర్స్‌ హెల్పర్స్‌ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో జనవరి 7 నుంచి 10వ తేదీ వరకు హైదరాబాద్‌లో అఖిలభారత 8వ మహాసభలు జరుగుతున్నట్టు చెప్పారు. జాతీయ మహాసభలకు దేశంలోని 26 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ...

Read More »

నేటి నుంచి తిమ్మాపూర్‌లో బ్రహ్మూెత్సవాలు

  మోర్తాడ్‌, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలోని లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు బ్రహ్మూెత్సవాలు, శుక్రవారం రథోత్సవం, అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు గ్రామ భక్తులు, విడిసి సభ్యులు మంగళవారం తెలిపారు. వేద పండితులతో వివిధకార్యక్రమాలు నిర్వహిస్తామని జనవరి 1న రథోత్సవం, అన్నదానం, శ్రీవారి బ్రహ్మూెత్సవాలు చక్రపాణి మాధవాచార్యులు ఆద్వర్యంలో నిర్వహిస్తున్నట్టు గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా స్తాయి వాలీబాల్‌, కబడ్డి పోటీలు 31వ తేదీ నుంచి ...

Read More »

రెవెన్యూ కార్యాలయంలో చురుకుగా సాగుతున్న కాస్రా, పహణీ నమోదు

  మోర్తాడ్‌, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు గత మూడురోజులుగా 1952-54 సంవత్సరాలకు సంబంధించిన రైతులకు చెందిన బూముల వివరాలను, రైతుల వివరాలను కాస్రా, పహణీ, నమోదులు చురుకుగా సాగుతున్నాయని తహసీల్దార్‌ వెంకట్రావు మంగళవారం తెలిపారు. 15 రోజుల్లో పహణీ కంప్యూటర్‌ నమోదు పూర్తిచేస్తామని ఆయన తెలిపారు.

Read More »

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామాచేసిన సర్పంచ్‌

  మోర్తాడ్‌, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రమైన మోర్తాడ్‌ గ్రామ సర్పంచ్‌ దడివె నవీన్‌ కాంగ్రెస్‌ పార్టీకి, సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసినట్టు తెలిపారు. గ్రామపంచాయతీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2013లో సర్పంచ్‌గా తనను గ్రామస్తులు పార్టీలకు అతీతంగా ఎన్నుకున్నారని, గ్రామ అభివృద్ది కోసం కాంగ్రెస్‌ పార్టీలో చేరాల్సి వచ్చిందని తెలిపారు. రాజీనామా పత్రాలను జిల్లా అధ్యక్షుడికి పంపినట్టు తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేశానని, స్వతంత్ర అభ్యర్థిగానే కొనసాగుతానని ఆయన చెప్పారు.

Read More »

ఉపాధి హామీ పనులను పరిశీలించిన జాతీయ ఛైర్మన్‌

  మోర్తాడ్‌, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఢిల్లీలో జరిగిన అవార్డు కమిటీ దృష్టికి జిల్లా కలెక్టర్‌ తీసుకెళ్లారు. జాతీయ అవార్డు కింద దేశంలోనే నిజామాబాద్‌ జిల్లా ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో మంగళవారం మండలంలోని ఒడ్యాట్‌ గ్రామంలో గల చెరువులో జరుగుతున్న ఉపాధి పనులను జాతీయ అవార్డు కమిటీ ఛైర్మన్‌ సతీష్‌ అగ్నిహోత్రి (ఢిల్లీ), జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా, ఎన్‌ఆర్‌డి శశిరేఖ, డ్వామా పిడి వెంకటేశ్వర్లు పరిశీలించారు. ...

Read More »

సోంపూర్‌లో రెవెన్యూ సదస్సు

  బోదన్‌, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి మండలంలోని సోంపూర్‌లో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తహసీల్దార్‌ రాజేశ్వర్‌ పట్టా మర్పిడిపై రైతులకు వివరించారు. 28 మంది పట్టామార్పిడి చేసి పాసుపుస్తకాలు అందజేశారు. వ్యవసాయ భూమి ఉండి గ్రామంలో చనిపోయిన రైతుల స్థానంలో వారి వారసులకు పట్టామార్పిడి చేసి ఇస్తున్నట్టు తహసీల్దార్‌ వివరించారు. గ్రామంలో రెవెన్యూ పరమైన సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కరిస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ త్రయంబక్‌ రావు, ఎంపిటిసి గంగాధర్‌, ...

Read More »

స్త్రీనిధి రుణాలు సద్వినియోగం చేసుకోవాలి

  కమ్మర్‌పల్లి, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు స్త్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సెర్ఫ్‌ డిపిఎం నూకల శ్రీనివాస్‌ తెలిపారు. ఐకెపి కార్యాలయంలో మంగళవారం జరిగిన మండల సమాఖ్య సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాడి గేదెల పెంపకానికి ప్రతి సభ్యురాలికి అర్హతను బట్టి లక్ష రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా నెలరోజుల వ్యవధిలో రూ. 2 కోట్ల రుణాలు అందివ్వడానికి అవకాశముందన్నారు. అర్హులను గుర్తించి ...

Read More »

ఎమ్మెల్యేకు సన్మానం

  ఆర్మూర్‌, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి నూతన కో ఆప్షన్‌గా ఎన్నికైన 6వ వార్డు తెరాస అభ్యర్థి భర్త మహ్మద్‌ అజిమ్‌ ఎమ్మెల్యేను కలిసి శాలువాతో సన్మానించారు. తనను కో ఆప్షన్‌ గా ఎన్నికయ్యేందుకు కృసి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వ్యవహారాల ఇన్‌చార్జి యామాద్రి భాస్కర్‌, తదితరులున్నారు.

Read More »

జన సూచన అభియాన్‌- పౌర సమాచార ఉత్సవం

  ఆర్మూర్‌, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టనంలోని జావిద్‌భాయ్‌ మినీ స్టేడియంలో మంగళవారం పౌరసమచార ఉత్సవానికి సంబంధించిన బ్రోచర్‌ను తహసీల్దార్‌ శ్రీధర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాల వల్ల గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమం పౌర సమాచార ఉత్సవమన్నారు. ఈ ఉత్సవం 2006 నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ ఉత్సవాలు మూడురోజుల పాటు కొనసాగుతాయని ఆయన తెలిపారు. కేంద్ర, ...

Read More »

నేత్రదానం చేసిన మృతుని కుటుంబీకులు

  బోధన్‌, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని గంజ్‌రోడ్డులో నివాసముంటున్న జి.సుబ్బారావు అనే వ్యక్తి మృతి చెందడంతో అతని నేత్రాలను కుటుంబ సభ్యులు లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులకు అందజేశారు. సుబ్బారావు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు లయన్స్‌ కంటి ఆసుపత్రికి సమాచారం ఇవ్వడంతో వారు నేత్రాలను సేకరించి ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి తరలించారు. నేత్రాల ద్వారా ఇద్దరు అంధులకు కంటిచూపు వస్తుందని లయన్స్‌ అధ్యక్షుడు మోహినుద్దీన్‌ తెలిపారు.

Read More »

అభివృద్దికి కృసి చేస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు

  ఆర్మూర్‌, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంతో పాటు మండలంలోని భక్తుల సౌకర్యార్థం ఆర్మూర్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం నవనాథ సిద్దులగుట్టపైడబుల్‌ రోడ్డు కోసం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నిధులు మంజూరుచేయించినందుకు అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు పెంట జలందర్‌ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయాన్నినిర్మిస్తున్నామని వివరించారు. ఈ ఆలయంతోపాటు నూతనంగా 9 మందిరాల నిర్మాణానికి ఎమ్మెల్యే కృసి చేస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సిద్దులగుట్టను పర్యాటక క్షేత్రంగా ఎమ్మెల్యే తీర్చిదిద్దుతారని ఆశాభావం వ్యక్తం ...

Read More »

42 వ రోజుకు చేరిన రిలే నిరాహారదీక్షలు

  బోధన్‌, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో దీక్షలు కొనసాగుతున్నాయి. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నడపాలని డిమాండ్‌ చేస్తూ దీక్షలు మంగళవారం నాటికి 42వ రోజుకు చేరుకున్నాయి. షుగర్‌ కర్మాగారాన్ని అక్రమంగా లే ఆఫ్‌ చేయడాన్ని రక్షణ కమిటీ కన్వీనర్‌ రాఘవులు వ్యతిరేకించారు. లే ఆఫ్‌ను వెంటనే ఎత్తివేయాలని లేనియెడల ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్‌డిఎస్‌ఎల్‌ మేనేజ్‌మెంట్‌ ఎవరికి సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి లే ఆఫ్‌ చేయడంతో ...

Read More »

మాటలకే పరిమితమైన హరితహారం

  పెర్కిట్‌, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిస్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా రాష్ట్రాన్ని పచ్చగా ఉంచాలని, రైతులందరికి సాగునీరు, ప్రజలందరికి తాగునీరు అందించాలనే బృహత్‌ సంకల్పంతో మొక్కల పెంపకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాని ఈ కార్యక్రమం మొగ్గలోనే అంతమవుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రజలు అంటున్నారు. ఆర్మూర్‌ మండలంలోని పెర్కిట్‌ బైపాస్‌ రోడ్డు నుంచి మామిడిపల్లి వరకు రోడ్డు ...

Read More »

లింగాయత్‌ సమాజ్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

  బోదన్‌, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ వీరశైవ లింగాయత్‌ సంఘం నూతన కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పి.రాజేశ్వర్‌ పటేల్‌, మాధవరావు పటేల్‌ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. ఉపాధ్యక్షులుగా గంగారాం, సుభాష్‌ పటేల్‌, జనరల్‌ సెక్రెటరీగా జె.యాదవరావు, కార్యనిర్వాహక కార్యదర్శిగా వసంత్‌రావు పటేల్‌, కార్యదర్శులుగా ప్రకాశ్‌ పటేల్‌, మనోహర్‌రావు, సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.

Read More »

ప్రాణహిత-చేవెళ్ల 22వ ప్యాకెజిని పున: ప్రారంభించాలి

  సదాశివనగర్‌, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ప్రాణహిత-చేవెళ్ల ద్వారా నిర్వహించే 22వ ప్యాకెజిని పున: ప్రారంభించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన పాదయాత్ర విజయవంతమైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు జానారెడ్డి మాట్లాడుతూ ఇక్కడి ప్రాంత రైతులకు సాగునీరు, తాగునీరు అందించాలనే ఉద్దేశంతో మండలంలోని భూంపల్లి గ్రామం నుంచి పద్మాజివాడి ఎక్స్‌రోడ్డు వరకు 6 కి.మీల మేర పాదయాత్ర చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుందని, ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు ...

Read More »

పాలకూర పొంగల్‌

కావలసిన పదార్థాలు: బియ్యం – ఒక కప్పు, పెసర పప్పు – పావు కప్పు, పాలకూర – ఒక కట్ట, నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను, కరివేపాకు – ఒక రెబ్బ, పచ్చిమిరపకాయలు – రెండు, జీలకర్ర – ఒక టీ స్పూను, అల్లం ముక్కలు – కొద్దిగా, మిరియాలు – ఒక టీ స్పూను, ఉప్పు – తగినంత, జీడి పప్పులు – పది. తయారుచేయు విధానం: ముందుగా పాలకూరని శుభ్రంగా కడిగి సన్నగా కోసుకోవాలి. బియ్యాన్ని, పెసరపప్పుని శుభ్రంగా కడిగి ...

Read More »

పుణే ఇన్ఫోసిస్ క్యాంపస్ లో రేప్

పుణే ఇన్ఫోసిస్ క్యాంపస్ లో రేప్ ఇన్సిడెంట్ బయటపడింది. క్యాంటీన్ లో క్యాషియర్ గా పని చేస్తున్న మహిళపై ఇద్దరు వ్యక్తులు నైట్ షిఫ్ట్ లో రేప్ చేసినట్టు ఆరోపణలు వినబడుతున్నాయి. ANI కథనం ప్రకారం ఈ నెల 27న ఈ ఘటన జరిగింది. నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇన్ఫోసిస్ లాంటి సాఫ్ట్ వేర్ కంపెనీలో రేప్ ఘటన కలకలం రేపుతోంది.

Read More »