ఎడపల్లి, డిసెంబరు 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అఖిలభారత 8వ మహాసభల పోస్టర్లను సిఐటియు నాయకులు మంగళవారంమండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఎస్సీవాడలోని అంగన్వాడి కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్‌బాబు మాట్లాడుతూ ఆలిండియాఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో జనవరి 7 నుంచి 10వ తేదీ వరకు హైదరాబాద్‌లో అఖిలభారత 8వ మహాసభలు జరుగుతున్నట్టు చెప్పారు.
జాతీయ మహాసభలకు దేశంలోని 26 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతున్నట్టు ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్‌కు బడ్జెట్ కేటాయింపులో 50 శాతానికి పైగా కోత విధిస్తూ రెవెన్యూ ఖర్చులను రాష్ట్రాల మెడమీదికినెట్టేస్తుందని ఆరోపించారు. జీతాలు, టిఎ, డిఎలు పోషకాహార బడ్జెట్ వంటివి రాష్ట్రాలే చెల్లించాలనడం ప్రమాదానికి దారితీస్తుందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించే సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లాకార్యదర్శి ఏశాల గంగాధర్, వర్కర్స్ యూనియన్ నాయకురాలు విజయలక్ష్మి, తులసి, అనిత, సుజాత, గంగామణి, నాగమణి తదితరులున్నారు.

Latest posts by NizamabadNews OnlineDesk (see all)
- డయల్ 100కు 2271 ఫోన్ కాల్స్ - October 10, 2018
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - October 10, 2018
- బహుజనులు ఐక్యం కావాలి - October 10, 2018