Breaking News

మాటలకే పరిమితమైన హరితహారం

 

పెర్కిట్‌, డిసెంబరు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిస్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా రాష్ట్రాన్ని పచ్చగా ఉంచాలని, రైతులందరికి సాగునీరు, ప్రజలందరికి తాగునీరు అందించాలనే బృహత్‌ సంకల్పంతో మొక్కల పెంపకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

కాని ఈ కార్యక్రమం మొగ్గలోనే అంతమవుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రజలు అంటున్నారు. ఆర్మూర్‌ మండలంలోని పెర్కిట్‌ బైపాస్‌ రోడ్డు నుంచి మామిడిపల్లి వరకు రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన డివైడర్‌లో హరితహారంలో భాగంగా మంచి మొక్కలు నాటారు. కానీ అవి పెరగకుండానే వాలిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల మొక్కల సంరక్షణ బాధ్యత సరిగా చేపట్టలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మొక్క నాటడమే కాదు వాటికి రోజు నీరందిస్తే బాగుండేదని, ఇందుకోసం సిబ్బందిని లేదా కూలీలను నియమించి మొక్కలు పెంచిఉంటే బాగుండేదని అంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి హరితహారం సక్సెస్‌ కావాలంటే మొక్కలు పెంచే బాద్యత పకడ్బందీగా చేపట్టాలని ప్రజలు భావిస్తున్నారు.

Check Also

పరీక్ష కేంద్రం తనిఖీ

భీమ్‌గల్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని డిగ్రీ కళాశాలల్లో ...

Comment on the article