Breaking News

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామాచేసిన సర్పంచ్‌

 

మోర్తాడ్‌, డిసెంబరు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రమైన మోర్తాడ్‌ గ్రామ సర్పంచ్‌ దడివె నవీన్‌ కాంగ్రెస్‌ పార్టీకి, సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసినట్టు తెలిపారు. గ్రామపంచాయతీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2013లో సర్పంచ్‌గా తనను గ్రామస్తులు పార్టీలకు అతీతంగా ఎన్నుకున్నారని, గ్రామ అభివృద్ది కోసం కాంగ్రెస్‌ పార్టీలో చేరాల్సి వచ్చిందని తెలిపారు. రాజీనామా పత్రాలను జిల్లా అధ్యక్షుడికి పంపినట్టు తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేశానని, స్వతంత్ర అభ్యర్థిగానే కొనసాగుతానని ఆయన చెప్పారు.

Check Also

అటవీభూములపై పూర్తిస్థాయి సర్వే జరపాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రెవెన్యూ డివిజన్‌ల వారిగా ప్రభుత్వ భూములపై పూర్తిస్థాయి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *