Breaking News

ఉపాధి హామీ పనులను పరిశీలించిన జాతీయ ఛైర్మన్‌

 

మోర్తాడ్‌, డిసెంబరు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఢిల్లీలో జరిగిన అవార్డు కమిటీ దృష్టికి జిల్లా కలెక్టర్‌ తీసుకెళ్లారు. జాతీయ అవార్డు కింద దేశంలోనే నిజామాబాద్‌ జిల్లా ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో మంగళవారం మండలంలోని ఒడ్యాట్‌ గ్రామంలో గల చెరువులో జరుగుతున్న ఉపాధి పనులను జాతీయ అవార్డు కమిటీ ఛైర్మన్‌ సతీష్‌ అగ్నిహోత్రి (ఢిల్లీ), జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా, ఎన్‌ఆర్‌డి శశిరేఖ, డ్వామా పిడి వెంకటేశ్వర్లు పరిశీలించారు.

అంతేగాకుండా ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను, పనుల వల్ల ప్రయోజనాలను, చెరువులోకి వచ్చేనీరు తీరును పరిశీలించి మండల అధికారులతో, ఉపాధి హామీ కూలీలను అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది, ఈసారి జరిగిన పనులను జాతీయ ఛైర్మన్‌, జిల్లా కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. చెరువులోని మట్టిని రైతులకు ఉచితంగా కూలీలతో అందించాలని, వర్షపు నీరు చెరువులోకి తూము వరకు వచ్చేలా తూము నుంచి పూడిక తీత పనులు చేపట్టాలని దీంతో చెరువు నీటితో కళకళలాడుతుందని వారన్నారు. మహిళ కూలీలకు వేతనం గిట్టుబాటు అవుతుందా, లేదా, పనుల్లో ఇబ్బందులేమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. చెరువు ఈసారి ఎండిపోయిందని, తూము వరకు వర్షపు నీరు వస్తుందని స్థానిక సర్పంచ్‌ పోశన్న, గ్రామస్తులు అదికారులకు వివరించారు. ఉపాధి పనుల కింద నిజామాబాద్‌ జిల్లా జాతీయ అవార్డుకు ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. ఉపాధి హామీకి సంబంధించిన పనుల మ్యాప్‌ను కూడా పరిశీలించారు. కార్యక్రమంలో ముంబయి రిసోర్సు పర్సన్లు, ఐఐటి, పవన్‌, స్నేహ, తహసీల్దార్‌ వెంకట్రావు, ప్రోగ్రాం అధికారి నర్సయ్య, ఎంఆర్‌ఐ వినోద్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నిషియన్లు, ఇసి నవీన్‌, ఉపాధి హామీ కూలీలు తదితరులున్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *