Breaking News

పాలకూర పొంగల్‌

కావలసిన పదార్థాలు: బియ్యం – ఒక కప్పు, పెసర పప్పు – పావు కప్పు, పాలకూర – ఒక కట్ట, నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను, కరివేపాకు – ఒక రెబ్బ, పచ్చిమిరపకాయలు – రెండు, జీలకర్ర – ఒక టీ స్పూను, అల్లం ముక్కలు – కొద్దిగా, మిరియాలు – ఒక టీ స్పూను, ఉప్పు – తగినంత, జీడి పప్పులు – పది.

తయారుచేయు విధానం: ముందుగా పాలకూరని శుభ్రంగా కడిగి సన్నగా కోసుకోవాలి. బియ్యాన్ని, పెసరపప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. పాలకూర, ఉప్పు, సరిపడా నీళ్లు పోసి మూడు విజిల్స్‌ వచ్చేవరకూ ఉడికించి దించేయాలి. ఇప్పుడు పొయ్యిమీద గిన్నె పెట్టి నెయ్యి పోసి జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, మిరియాలు, జీడి పప్పు వేసి వేగించి అన్నంలో కలపాలి. ఈ పొంగలిలో సాంబారు వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.

Check Also

స్మోకీ చికెన్‌

కావల్సినవి: ఆలివ్‌నూనె – రెండు టేబుల్‌స్పూన్లు,   చికెన్‌ ముక్కలు – నాలుగు, ఉల్లిపాయ – ఒకటి, వెల్లుల్లి రెబ్బలు ...

Comment on the article