Breaking News

రైతుల మేలు కోసమే రెవెన్యూ సదస్సులు

 

ఎడపల్లి, డిసెంబరు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు, పట్టాదారులకు ప్రభుత్వం కల్పిస్తున్న రెవెన్యూ సదస్సులు లబ్దిపొందే అవకాశం కల్పించిందని ఆర్డీవోశ్యాంప్రసాద్‌లాల్‌ అన్నారు. మంగళవారం మండలంలోని జైతాపూర్‌ గ్రామంలో రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఆర్డీవో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో పట్టామార్పిడి చేసుకునేందుకు మూడు నెలల సమయం పట్టేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం గ్రామాల్లోనే రెవెన్యూ సదస్సులు నిర్వహించి అక్కడికక్కడే వారసత్వ మార్పిడి చేస్తూ పట్టాపాసుపుస్తకాలను పంపినీ చేయడం జరుగుతుందని ఈ అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ గఫర్‌మియా, ఎఆర్‌ఐ దివ్య, విఆర్వో రాంచందర్‌, ఉప సర్పంచ్‌ నరేందర్‌, తదితరులున్నారు.

Check Also

అటవీభూములపై పూర్తిస్థాయి సర్వే జరపాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రెవెన్యూ డివిజన్‌ల వారిగా ప్రభుత్వ భూములపై పూర్తిస్థాయి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *