Breaking News

స్త్రీనిధి రుణాలు సద్వినియోగం చేసుకోవాలి

 

కమ్మర్‌పల్లి, డిసెంబరు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు స్త్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సెర్ఫ్‌ డిపిఎం నూకల శ్రీనివాస్‌ తెలిపారు. ఐకెపి కార్యాలయంలో మంగళవారం జరిగిన మండల సమాఖ్య సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

పాడి గేదెల పెంపకానికి ప్రతి సభ్యురాలికి అర్హతను బట్టి లక్ష రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా నెలరోజుల వ్యవధిలో రూ. 2 కోట్ల రుణాలు అందివ్వడానికి అవకాశముందన్నారు. అర్హులను గుర్తించి రుణాలు అందివ్వాలని సూచించారు. సంపూర్ణ పారిశుద్య కార్యక్రమంలో మహిళలందరు భాగస్వాములు కావాలని ఏపిఎం కుంట గంగారెడ్డి సూచించారు. ప్రతి సంఘానికి వడ్డిలేని రుణాలు అందాలంటే వాయిదా ప్రకారం రుణాలు చెల్లించాల్సిన అవసరముందన్నారు. సమావేశంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, సిసిలు రవికుమార్‌, వర్ణం శ్రీనివాస్‌, భాగ్యలక్ష్మి, అలేఖ్య, జగదీశ్‌ తదితరులున్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article