Breaking News

Daily Archives: December 30, 2015

విద్యార్థులకు సరళంగా బోదన చేయాలి

  మోర్తాడ్‌, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల మేధస్సును తెలసుకొని వారికి అనుగుణంగా సరళంగా అర్థమయ్యేలా విద్యాబోధన చేయాలని ఎంఇవో బి.రాజేశ్వర్‌ అన్నారు. బుధవారం మండలంలోని ఏర్గట్ల గ్రామ ప్రాథమిక పాఠశాలలోకాంప్లెక్సు సమావేశాలు జరిగాయి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడారు. అన్ని సబ్జెక్టులలో విద్యార్థులకు సరియైన విధంగా బోధనచేస్తూ ఏ,బి,సి,డి లుగా గుర్తించి వెనకబడిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి బోధన చేయాలని సూచించారు. కార్యక్రమంలో కాంప్లెక్సు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు ...

Read More »

ఎన్‌ఎస్‌యుఐ ఆద్వర్యంలో రాస్తారోకో

  కామారెడ్డి, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో విద్యార్తులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బుదవారం ఎన్‌ఎస్‌యుఐ ఆద్వర్యంలో కామారెడ్డి కొత్తబస్టాండ్‌ ఎదుట జాతీయరహదారిపై రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్‌ వెంకట్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి యాగాల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తూ, స్కాలర్‌షిప్‌ల కోసం నిధులు విడుదల చేయకపోవడం గర్హణీయమన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలను అడ్డంపెట్టుకొని పాలనలోకి వచ్చి విద్యార్థుల శ్రేయస్సు కోసం పనిచేయకపోవడం సమంజసం ...

Read More »

ప్రజా సమస్యలపై ఇంటింటికి సిపిఎం

  కామారెడ్డి, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రజా సమస్యలపై ఇంటింటికి వెళ్లనున్నట్టు సిపిఎం గౌరవ సలహాదారుడు తిరుపతి తెలిపారు. బుధవారం పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను ప్రతి పేద కార్మికునికి వర్తించేలా చూడాలన్నారు. కళ్యాణలక్ష్మి, బంగారుతల్లి పథకాలను అందరికి వర్తింపచేయాలని డిమాండ్‌ చేశారు. ఇంటింటికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు ...

Read More »

కార్మికుని కుటుంబానికి ఆర్తిక సాయం

  కామారెడ్డి, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి బల్దియాలో కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తూ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన స్వామి కుటుంబానికి కాంట్రాక్టు కార్మికులు 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశం తీర్మానం ప్రకారం ప్రభుత్వం పక్షాన కార్మికుని కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించేలా కృసి చేయాలన్నారు. అవినీతి టెండరు విధానానికి స్వస్తి పలకాలని, ప్రస్తుతం నడుస్తున్న కాంట్రాక్టు విధానాన్నే కొనసాగించాలని డిమాండ్‌ ...

Read More »

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస గెలుపుపట్ల సంబరాలు

  కామారెడ్డి, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస పోటీచేసిన 6 చోట్ల 4 విజయాలు సాధించడం పట్ల పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదల కాగానే పార్టీశ్రేణులు రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. కేక్‌ కట్‌చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఇటీవల జరిగిన వరంగల్‌ ఉప ఎన్నికల్లో పార్టీని నమ్మి ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారని, ప్రస్తుతం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం నాలుగు స్థానాల్లో అఖండ మెజార్టీని అందించారని అన్నారు. ...

Read More »

సిసి డ్రైనేజీ పనులు ప్రారంభం

  కామారెడ్డి, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని 24వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న మురికి కాలువల పనులను బుధవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. 13వ ఆర్థిక సంఘం నిధులు 10 లక్షలతో పనులు చేపడుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ రేణుక, ఎఇ గంగాధర్‌, నాయకులు చంద్రశేఖర్‌, సాజిద్‌, మాజిద్‌, తదితరులున్నారు.

Read More »

రైల్వేస్టేషన్‌ను తనికీ చేసిన జిఎం

  కామారెడ్డి, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రైల్వేస్టేషన్‌ను బుదవారం రైల్వే జిఎం రవింద్ర గుప్త ఆకస్మికంగా తనికీచేశారు. ఈ సందర్బంగా స్టేషన్‌లోని పరిసరాలను, టికెట్‌ కౌంటర్లను, మేనేజర్‌గదిని, సిగ్నలింగ్‌ వ్యవస్థను పరిశీలించారు. స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సిగ్నలింగ్‌ వ్యవస్థకు అనుసంధానం చేసిన బ్యాటరీ పరికరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, వైస్‌ ఛైర్మన్‌ మసూద్‌ అలీ వివిధ పార్టీల నాయకులు జిఎంను కలిసి పలు సమస్యలు ఆయన దృస్టికి తీసుకొచ్చారు. రైల్వే ...

Read More »

విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలి

  మోర్తాడ్‌, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి విద్యార్థిని చదువుతోపాటు అన్ని రంగాల్లో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని మండల ప్రత్యేకాధికారి శంకరయ్య అన్నారు. బుధవారం మోర్తాడ్‌లోని కస్తూర్బా విద్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్తులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని, బోదన తీరుతెన్నులను, తరగతి గదులను, వంట గదిని పరిశీలించారు. విద్యార్థులను భోదన తీరుపై అడిగి తెలుసుకున్నారు. అంతేగాకుండా విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు సాధించేలా సూచనలు, సలహాలు అందించారు. తెరాస ప్రభుత్వం విద్యార్థుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ...

Read More »

మాజీ స్పీకర్‌కు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సవాల్‌

  నందిపేట, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నందిపేట మండలంలో వివిధ అభివృద్ది కార్యక్రమాలను పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడారు. మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి అనుచిత విమర్శలు చేశారని, వారి పాలనలో చేయలేని అభివృద్దిని 18 నెలల్లో చేశామని, కావాలంటే అభివృద్ధి ఎజెండాగా మండల కేంద్రంలోగాని, ఆంధ్రనగర్‌లోగాని ప్రజాదర్బార్‌ పెట్టి ప్రజలముందు తేల్చుకుందామని సవాల్‌ విసిరారు. సిఎం కెసిఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టోలోని 130 వాగ్దానాలు నెరవేర్చిందని అన్నారు. ...

Read More »

43 వరోజుకు చేరిన రిలే దీక్షలు

  బోదన్‌, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నడపాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం నాటికి దీక్షలు 43వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో పాల్గొన్నవారికి వరదయ్య పూలమాలవేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది హన్మంత్‌రావు మాట్లాడుతూ చక్కర కర్మాగారాన్ని వెంటనే స్వాధీనం చేసుకొని కార్మికులు, కర్షకులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. గత మూడునెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించకుండా మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షలో న్యూడెమోక్రసి ...

Read More »

లక్ష్మినర్సింహ ఆలయంలో దుకాణాల వేలం

  ఎడపల్లి, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని జాన్కంపేట శ్రీలక్ష్మినర్సింహస్వామి ఆలయంలో బుధవారం పూజావస్తు సామగ్రిలకు వేలం వేశారు. జనవరి 2వ తేదీన శనివారం అష్టమి, 9వ తేదిన శనివారం అమావాస్య రానున్న సందర్భంగా భక్తులు ఆలయానికి విశేషంగా తరలివస్తారు. ఆయా తేదీల్లో ఆలయాల్లో వ్యాపారులు పూజాసామగ్రి, కొబ్బరికాయ, లడ్డు, పులిహోర, పార్కింగ్‌ విక్రయించుకునేందుకు గాను వేలం వేసినట్టు దేవాదాయశాఖ ఇన్స్‌పెక్టర్‌ కమల, ఇవో రవిందర్‌ తెలిపారు. ఇందులో కొబ్బరికాయలకు 30 వేలు, లడ్డు, పులిహోరకు 36 వేలు, ...

Read More »

వాస్తవాలు మాట్లాడండి

  బోధన్‌, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ నాయకులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, వారు మాట్లాడినవన్ని అవాస్తవాలని బుధవారం మునిసిపల్‌ ఛైర్మన్‌ ఆనంపల్లి ఎల్లయ్య అన్నారు. ఈ మేరకు ఆయన కమీషనర్‌ దేవేందర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎవరి దగ్గర డబ్బు తీసుకొని సిబ్బందిని నియమించడం జరిగిందన్న ఆరోపణ అవాస్తవమని స్పష్టం చేశారు. ఇతరత్రా పండగల నిమిత్తం ప్రజానీకానికి ఇబ్బందులు కలగకూడదని రోజువారి కూలీలను నియమించి పనులు నిర్వహించడం జరిగిందన్నారు. వీరికి రోజుకు రూ. 250 చొప్పున కూలీ ...

Read More »

ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి

  ఎడపల్లి, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా వేడుకలుజరుపుకునేవారు ప్రశాంతంగా జరుపుకోవాలని బోధన్‌ డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం ఆయన ఎడపల్లి పోలీసు స్టేషన్‌ను సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. యువకులు మద్యం సేవించి రోడ్లపై హంగామాలు సృష్టించవద్దని, ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తొలగించి ధ్వని కాలుష్యం చేయవద్దని పేర్కొన్నారు. డిజె శబ్దాలు కూడా అర్ధరాత్రి వరకు ఉంచరాదని, ఎవరికి ఇబ్బంది కలగకుండా వేడుకలు జరుపుకోవాలని పేర్కొన్నారు. అటువంటి వారిని గుర్తించి కఠినంగా శిక్షించడం ...

Read More »

సిద్దులగుట్టను సందర్శించిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

  ఆర్మూర్‌, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి బుధవారం సిద్దులగుట్టను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గుట్టపై గల రామాలయం, శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

న్యూ ఇయర్‌వేడుకలు జాగ్రత్తగా జరుపుకోవాలి

  ఆర్మూర్‌, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ యువత న్యూ ఇయర్‌ వేడుకలను జాగ్రత్తగా జరుపుకోవాలని సిఐ సీతారాం బుదవారం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికే డిసెంబరు 31న రాత్రి సమయంలో న్యూఇయర్‌ వేడుకలకు సంబంధించి మద్యం సేవించి వాహనాలు నడపడం, గుంపులు గుంపులు తిరిగినా, ఎలాంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ వివరించారు. మోటార్‌ సైకిల్‌పై రాత్రిళ్లు త్రిపుల్‌ రైడింగ్‌, ర్యాలీలు నిషేదించినట్టు ఆయన చెప్పారు. ...

Read More »

నాలుగు టీఆర్ఎస్ – రెండు కాంగ్రెస్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొత్తం 12 స్థానాలకు 10 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. ఇప్పటికే 6 స్థానాలు ఏకగ్రీవం కాగా.. ఈ నెల 27న జరిగిన పోలింగ్  రిజల్ట్స్ రిలీజయ్యాయి. ఫలితాల్లో ఖమ్మం, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. నల్లగొండ, మహబూబ్ నగర్ లో ఓ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది.   ఖమ్మంలో.. TRS WINNER BALASANI ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది. 38 ఓట్లతో టీఆర్ఎస్ ...

Read More »

కార్పొరేటర్ అభ్యర్థి ఖర్చు రూ.2 లక్షలే

హైదరాబాద్&nbsp: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీచేసే అభ్యర్థులకు ఎన్నికల వ్యయ పరిమితి రూ.2 లక్షలు కాగా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు నామినేషన్ డిపాజిట్‌గా రూ.2,500, ఓసీ,బీసీలకు రూ.5,000లుగా నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం టూరిజం ప్లాజాలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 31వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలన్న కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వార్డుల పునర్విభజన, ఎన్నికల ...

Read More »

పాటతోనూ ‘బాహుబలి’ రికార్డు మోత…

బాహుబలి సినిమాలో అవంతిక పాత్రను పోషించి “పచ్చబొట్టేసిన పిల్లగాడ…” అంటూ కుర్రాళ్ల గుండె లయ తప్పేలా చేసింది తమన్నా. అందుకే ఇప్పటికీ ఈ పాటకు సోషల్ మీడియాలో లైకుల మీద లైకులు వచ్చి పడుతున్నాయి. తాజాగా ఈ పాటకు అక్షరాల కోటి యాభై లక్షల క్లిక్కులు పడ్డాయని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్, తమన్నా మధ్య సాగిపోయే ఈ రొమాంటిక్ సాంగ్‌ను బాహుబలి యూనిట్ అధికారిక యూ ట్యూబ్ చానెల్‌లో లాంచ్ చేసిన తర్వాత యువతరం క్లిక్కులతో హోరెత్తించేశారు. తమన్నా బ్యాక్ లెస్‌లో అదుర్స్ ...

Read More »

ప్రవాసులకు శుభవార్త! గల్ఫ్ దేశాలలో లేబర్ బ్యాన్ తొలగింపు

పొట్ట చేత బట్టుకొని ఎంతో మంది గల్ఫ్ దేశాలకు సంపాదన కోసం వెళుతుంటారు. అక్కడ ఎన్నో కష్టాలకోర్చి ఉద్యోగం చేసుకుంటూ, జీవనాన్ని గడుపుతుంటారు. కాని వీరికి అక్కడ పడే కష్టాలలో అతి ముఖ్యమైనది లేబర్ బ్యాన్. యూఏఈలోని అబుదాబి, అజ్మాన్, షార్జా, దుబాయ్, ఫుజారహ్, రసల్‌ఖైమా, ఉమర్‌అల్ క్వైన్, ఖతర్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగం చేయాలనుకుంటే తప్పనిసరిగా రెండు సంవత్సరాలు ఎక్కడికీ వెళ్ళకుండా, అదే కంపెనీలో/అదే యజమాని వద్ద, ఉద్యోగికి నచ్చిన, నచ్చకున్నా పని చేయాలి. ఉద్యోగి అక్కడ 2 సంవత్సరాలు ఉద్యోగం చేయకుండా, ...

Read More »

సౌదీ దౌత్య దౌష్ట్యం..

సౌదీ అరేబియాలో ఒక యజమాని ముగ్గురు భారతీయులను కర్కశంగా కొట్టడం ఇటీవల దృశ్య మాధ్యమాలలో ఆవిష్కృతమైన భయానక దృశ్యం! ఇలా కొట్టి బాధించడానికి కారణం కేవలం కరడుకట్టిన క్రౌర్యం! కేరళ ప్రాంతానికి చెందిన ఈ ముగ్గురు భారతీయులు విద్యుత్ సాంకేతిక శిక్షణ పొందినవారు. ఈ ఎలక్ట్రీషియన్లను ఇటుకల బట్టీలో మట్టిమోసే పని చేయమని యజమాని ఆదేశించాడట! వారు నిరాకరించడంతో నిర్బంధించి పెద్ద చెక్కతో వారిని ఆ యజమాని కొట్టాడు. ఇలా కొట్టడం అనేక రోజులపాటు కొనసాగడం యజమాని పైశాచిక స్వభావానికి నిదర్శనం! ఇలా సౌదీ ...

Read More »