Breaking News

రైల్వేస్టేషన్‌ను తనికీ చేసిన జిఎం

 

కామారెడ్డి, డిసెంబరు 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రైల్వేస్టేషన్‌ను బుదవారం రైల్వే జిఎం రవింద్ర గుప్త ఆకస్మికంగా తనికీచేశారు. ఈ సందర్బంగా స్టేషన్‌లోని పరిసరాలను, టికెట్‌ కౌంటర్లను, మేనేజర్‌గదిని, సిగ్నలింగ్‌ వ్యవస్థను పరిశీలించారు. స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సిగ్నలింగ్‌ వ్యవస్థకు అనుసంధానం చేసిన బ్యాటరీ పరికరాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, వైస్‌ ఛైర్మన్‌ మసూద్‌ అలీ వివిధ పార్టీల నాయకులు జిఎంను కలిసి పలు సమస్యలు ఆయన దృస్టికి తీసుకొచ్చారు. రైల్వే స్టేషన్‌నుంచి పట్టణాన్ని అనుసంధానం చేస్తు ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి లేకపోవడంతో రైలు పట్టాలు దాటేక్రమంలో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని వంతెన నిర్మించాలని కోరారు. స్టేషన్‌లో నీటిఎద్దడి తీవ్రంగా ఉందని, ప్రయానీకులు నీరులేక ఇబ్బందులు పడుతున్నారని జిఎంకు విన్నవించారు. జిఎంస్పందిస్తూ సమస్యల పరిస్కారానికి తనవంతు కృసి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట డిఆర్‌ఎం అరుణాసింగ్‌, రైల్వే అధికారులు ఉన్నారు.

Check Also

17న అవయవదాన మహాసంకల్పం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమ రథసారథి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *