Breaking News

Daily Archives: February 1, 2016

4న గిరిరాజ్‌ కళాశాలలో జాబ్‌మేళా

నిజామాబాద్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 4న ఐసీఐసీఐ బ్యాంకు ఆధ్వర్యంలో సేల్స్‌ ఆఫీసర్స్‌ పోస్టుల కోసం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రన్సిపల్‌ డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. డిగ్రీ పూర్తయిన వారు, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులని, వయస్సు 19 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలని సూచించారు. అభ్యర్థులు 4వ తేదీ ఉదయం 10 గంటలకు ధ్రువపత్రాలతో కళాశాలలో హాజరుకావాలని పేర్కొన్నారు.

Read More »

మార్చి రెండవ వారంలో పిహెచ్‌డి ప్రవేశ పరీక్ష

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ప్రస్తుత అకడమిక్‌ సంవత్సరానికి నిర్వహించే పిహెచ్‌డి ప్రవేశ పరీక్ష మార్చి నెల రెండవ వారంలో ఉంటుందని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అన్నారు. సోమవారం డీన్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుతమున్న పరిశోధక విద్యార్థుల రీసెర్చ్‌ ప్రోగ్రెస్‌ సమీక్షించాలని నిర్ణయించారు. పిహెచ్‌డి విధివిధానాలు పకడ్బందీగా తయారు చేసుకోవాలని, ఎలాంటి అలసత్వానికి తావు లేకుండా రిసెర్చును ప్రోత్సహించాలని నిర్ణయించారు. ప్రవేశపరీక్ష వీలైతే ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు నిర్ణయించారు. సాధ్యాసాధ్యాలను సమీక్షిస్తారు. డీన్లు ప్రొఫెసర్‌ ...

Read More »

తెలంగాణ యూనివర్సిటీల టీచర్స్‌ ఫెడరేషన్‌ సెక్రటరీగా డాక్టర్‌ ప్రవీణ్‌

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ స్టేట్‌ ఫెడరేషణ్‌ ఆఫ్‌ యూనివర్సిటీస్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర సెక్రటరీగా డాక్టర్‌ ప్రవీణ్‌ మామిడాల, ఈసి మెంబరుగా డాక్టర్‌ పెద్దోళ్ళ శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ప్రస్తుతం టూటా అధ్యక్షునిగా ఉన్న డాక్టర్‌ ప్రవీణ్‌, జనరల్‌ సెక్రెటరీగా ఉన్న డాక్టర్‌ శ్రీనివాసులు రాష్ట్ర స్థాయి బాద్యతల్లో 2016-18 వరకు కొనసాగుతారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యుజిసి రూపొందించిన నియమ, నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని, వాటిని అమలు చేయాలని డాక్టర్‌ ప్రవీణ్‌ కోరారు. ...

Read More »

కడుపులో కాలనాగు విషం..!

మనిషి జీవించడానికి తీసుకునే ఆహారంలో నాణ్యమైనది ఏదో..నాసిరకం ఏదో తెలుసుకునే అవకాశం లేకుండాపోతోంది.. సురక్షితమైన ఆహారమే ఆరోగ్యానికి ఆధారమని ఆహార భద్రత, ప్రమాణాల చట్టం చెబుతున్నా..ఎక్కడా ఆహార పదార్థాల నిల్వ, అమ్మకాల్లో కనిపించడం లేదు. కల్తీ, నాసిరకం పధార్థాల దండా జోరుగా సాగుతోంది.. పండ్లు మొదలు బిర్యానీ దాకా..చాక్లెట్‌ నుంచి లడ్డూ, బొందీ దాకా తినే ఆహారం కల్తీమయమై పోతోంది. ఏటా రూ.100 కోట్ల వ్యాపారం జరుగుతోంది. అయినా కల్తీని నివారించి నాణ్యమైన సురక్షితమైన ఆహారాన్ని ప్రజలకు అందేలా చూడాల్సిన ఆహార భద్రత, ప్రమాణాల ...

Read More »

ఉపాధి పనులతో గ్రామాభివృద్ది చేయాలి

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ అభివృద్ది కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, పనులు ఏంటని గ్రామసభలో చర్చించారు. ఈ మేరకు నిజాంసాగర్‌ గ్రామసభ సోమవరం నిర్వహించారు. సర్పంచ్‌ రాజు అధ్యక్షతన జరిగిన సభలో గ్రామ అభివృద్ది కోసం ఉపాధి హామీ పనుల ద్వారా ఏఏ పనులు చేపట్టాలి, ఎక్కడెక్కడ పనుల అవసరముంది తదితర విషయాలు చర్చించారు. ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్ది, ఉత్తమ గ్రామంగా చేయాలని సంకల్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌, ...

Read More »

ఆటోను ఢీకొన్న కారు

భవానిపేట, పాల్వంచ (మాచారెడ్డి), న్యూస్‌టుడే: మాచారెడ్డి మండలంలోని భవానిపేట-పాల్వంచ గ్రామాల మధ్య 11వ రాష్ట్ర రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, మరో 11 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతోనే హైదరాబాద్‌కు తరలించారు. మాచారెడ్డి ఎస్సై నరేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మాచారెడ్డి మండలం ఫరీద్‌పేటకు చెందిన పెరుమాండ్ల నర్సయ్య బంధువొకరు నిజామాబాద్‌లో మృతి చెందగా.. అదే గ్రామానికి చెందిన మేరుగు రవి ఆటోలో బయలుదేరారు. అందులో ఫరీద్‌పేట నుంచి పెరుమాండ్ల నర్సయ్య, పోచవ్వ, ...

Read More »

ఉత్తమ ఎంఇవోకు సన్మానం

  కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉత్తమ సేవలకు గాను కలెక్టర్‌ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఎంఇవో రవిందర్‌ను సోమవారం కామారెడ్డిలో సన్మానించారు. ఈ సందర్భంగా గౌరవ అతిథిగా హాజరైన ఉపవిద్యాశాఖాధికారి బలరాం మాట్లాడుతూ బడిబయట పిల్లలను వందశాతం బడుల్లో చేర్పించినందుకుగాను రవిందర్‌కు అవార్డు వచ్చిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్దికి ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆనంద్‌రావు, రాజశేఖర్‌రెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Read More »

దామాషా పద్దతిన బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలి

  – బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌ కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దామాషా పద్దతిన బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. సోమవారం కామారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బిసిలను ఓటర్లుగా వాడుకుంటున్నారే తప్ప వారికి రిజర్వేషన్లు మాత్రం కల్పించడం లేదని అన్నారు. బిసిలకు చట్టసభలో దామాషా ప్రకారంగా రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఇందుకోసం నాయకులందరు పార్టీలకు అతీతంగా పోరాడాలని అన్నారు. అఖిలపక్షాన్ని ...

Read More »

గుర్తు తెలియని యాచకురాలి మృతి

  కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో సోమవారం గుర్తుతెలియని యాచకురాలు మృతి చెందింది. సుమారు 50 సంవత్సరాలున్న యాచకురాలు అనారోగ్యంతో మృతి చెందినట్టు పట్టణ పోలీసులు తెలిపారు. మృతురాలిని ఎవరైనా గుర్తిస్తే పట్టణ పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు.

Read More »

ట్రాక్టర్‌ బోల్తా పడి ఒకరి మృతి

ముత్యంపేట (దోమకొండ), న్యూస్‌టుడే: దోమకొండ మండలం ముత్యంపేటలో ఆదివారం ట్రాక్టర్‌ బోల్తా పడి ఒకరు మృతి చెందారు. తాటిపల్లి రాజు అనే రైతు ట్రాక్టర్‌లో తన వ్యవసాయ భూమికి ఎరువు (యూరియా)ను తీసుకెళ్లిన సమయంలో ఒడ్లు దాటుతుండగా, ఒడ్డుపై కూర్చున్న మరో రైతు మేర్గు శివరాజు (45)పై ఎరువు లోడుతో ఉన్న ట్రాక్టర్‌ ట్రాలీ పడింది. బలంగా గాయాలైన శివరాజును కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందాడు. ఈ మేరకు శివరాజు పెద్ద కుమారుడు ...

Read More »

మండల కార్యాలయంలో సమీక్ష సమావేశం

  నందిపేట, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో సోమవారం ఎంపిడివో నాగవర్ధన్‌ అధ్యక్షతన వారాంతపు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. వారితో ఎంపిడివో మాట్లాడుతూ అన్నిగ్రామాల్లో వందశాతం పన్నులు వసూలు చేయాలని, మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు, ఉపాధి హామీలపై ప్రత్యేక శ్రద్ద కనబర్చాలని కార్యదర్శులకు సూచించారు.

Read More »

నవోదయ విద్యార్థులకు వైద్య పరీక్షలు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతినెల నవోదయ విద్యార్థులకు నిర్వహించే వైద్య పరీక్షల్లో భాగంగానే సోమవారం కూడా వైద్యపరీక్షలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్‌ స్పందన విద్యార్థులను పరిశీలించి అవసరమున్న వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఆహారనియమాలు, వ్యాయామం తప్పకుండా పాటించాలని చెప్పారు. రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పలు సూచనలు చేశారు. విద్యార్థులతో ప్రిన్సిపాల్‌ శోభన్‌బాబు, సిబ్బంది ఉన్నారు.

Read More »

చోరీ నిందితుని అరెస్టు

బాన్సువాడ పట్టణం, న్యూస్‌టుడే: పది తులాల బంగారాన్ని అపహరించిన నిందితున్ని అరెస్టు చేసి రిమాండుకు పంపుతున్నట్లు బోధన్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ పట్టణంలోని శ్రీరామకాలనీకి చెందిన నీరడి సంగీత గత జూన్‌ 4న మండలంలోని హన్మాజీపేట్‌లోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ పెళ్లిలో తన హ్యాండ్‌ బ్యాగులో ఉన్న పది తులాల బంగారంతోపాటు సెల్‌ఫోన్‌ను గుర్తు తెలియని వ్యక్తి అపహరించారు. అదే రోజూ ఆమె బాన్సువాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదివారం మండలంలోని కొయ్యగుట్ట ప్రాంతంలో వాహనాల ...

Read More »

కాశీ పాదయాత్ర మంచి సంకల్పం

బాన్సువాడ, న్యూస్‌టుడే: కాశీకి పాదయాత్రగా వెళ్లడం మంచి సంకల్పం అని, శివనామస్మరణతోనే యాత్ర కొనసాగించాలని తొగుట పీఠాధిపతి చిన్నస్వామి మధుసూదానంద సరస్వతి అన్నారు. ఆదివారం బాన్సువాడ అయ్యప్ప ఆలయం నుంచి కాశీకి పాదయాత్రను ప్రారంభించి మాట్లాడారు. 43 రోజులపాటు జరిగే పాదయాత్ర మనిషిని ఎంతో ఉన్నతికి తీసుకెళ్తుందని అన్నారు. నామస్మరణ ఎంతో ముఖ్యమని పాదయాత్రలో ఎక్కువగా దీనికి అవకాశం ఉంటుందన్నారు. పాదయాత్ర గురుస్వామి వినయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. అందరి ఆశీర్వాదంతోనే ఈ యాత్ర కొనసాగుతుందని, మూడు రాష్ట్రాలు దాటుకుని కాశీకి వెళ్లాల్సి వస్తుందని అన్నారు. శంకర్‌గురుస్వామి, ...

Read More »

స్పందన లేని ప్రజావాణి

  నందిపేట, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమానికి ప్రజా స్పందన రోజు రోజుకు తగ్గిపోతోంది. ప్రజా సమస్యలను ప్రజావాణి ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని మండల స్తాయి అధికారులు ప్రజావాణిరోజు అందుబాటులో ఉంటారని, తహసీల్‌ కార్యాలయం చెబుతున్నప్పటికి ప్రజలు అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. గత కొన్ని వారాలుగా ప్రజావాణిలో నాలుగైదు కంటే ఎక్కువ దరఖాస్తులు రావడం లేదు. వచ్చిన కొద్దిపాటి దరఖాస్తులు కూడా ప్రభుత్వ పథకాల గురించి, ప్రతిపక్ష పార్టీల నాయకులు ...

Read More »

కుల రాజకీయాలు చేయడం సిగ్గుచేటు

నిజామాబాద్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: రోహిత్‌ ఆత్మహత్యపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కుల రాజకీయాలు చేయటం సిగ్గుచేటని ఏబీవీపీ జిల్లా కో కన్వీనర్‌ రాకేశ్‌ విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రలోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో రాహుల్‌గాంధీ తీరును నిరసిస్తూ వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నాయకుడు రాజయ్య కోడలు, పిల్లలు ఆత్మహత్య చేసుకున్నప్పుడు దళితులు గుర్తురాలేదా అని ప్రశ్నించారు. రోహిత్‌ ఆత్మహత్యపై విచారణ చేపట్టి నిజానిజాలు ప్రజలకు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. ఓటుబ్యాంకు కోసం కుల రాజకీయాలు చేస్తూ విద్యార్థుల మధ్య ...

Read More »

నందిపేటలో క్రికెట్‌ టోర్నమెంట్‌

  నందిపేట, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో కింగ్స్‌ యూత్‌ ఆధ్వర్యంలో క్రికెట్‌ టోర్ని నిర్వహిస్తున్నట్టు యూత్‌ సభ్యులు తెలిపారు. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి స్థానిక మార్కండేయ ఆలయం మందిరం ముందు ప్రాంగణంలో మ్యాచులు జరుగుతాయన్నారు. విన్నర్‌కు నగదు బహుమతి రూ. 10 వేలు, రన్నర్‌కు రూ. 6 వేల నగదుబహుమానం ఉన్నట్టు వారు చెప్పారు. పాల్గొనే వారికి ప్రవేశ రుసుము 1000 రూపాయలు నిర్ణయించినట్టు తెలిపారు. ఆసక్తిగల యువజన సంఘాల క్రీడాకారులు 94416666690 నెంబరులో సంప్రదించాలన్నారు.

Read More »

హిందువులు చైతన్యం కావాలి

బాన్సువాడ, న్యూస్‌టుడే: బాన్సువాడ శ్రీసరస్వతి శిశుమందిర్‌లో ఆదివారం సాయంత్రం ఆర్‌.ఎస్‌.ఎస్‌. శాఖ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన విభాగ్‌ (ఇందూర్‌, కామారెడ్డి, నిర్మల్‌) బౌద్ధిక్‌ ప్రముఖ్‌ యెండల శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. హిందువులు ప్రతి ఒక్కరూ చైతన్యం కావాలని, దేశాన్ని కాపాడుకోవడానికి నడుం బిగించాలని అన్నారు. డైనోసర్‌ పెద్ద జీవి అయినప్పటికి తనను తిని వేస్తున్న విషయం కూడా గమనించదని హిందువుల పరిస్థితి అలా కాకూడదని, ఇప్పుడు చెప్పుకొనే మతాలు పుట్టకముందే హిందూమతం ఉందని అన్నారు. సత్యయుగంలో ధర్మం రాజ్యమేలేదని, త్రేతాయుగంలో ...

Read More »

వ్యర్థాల నిర్వహణకు, ఇందన తయారీకి తెవివికి పైలట్‌ ప్రాజెక్టు

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యర్థాల సమర్థ నిర్వహణకు, జీవ ఇందన తయారీకి తెవివి క్యాంపస్‌లో పైలట్‌ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ప్రాజెక్టును తెలంగాణ నూతన, పునరుద్దరణ ఇందన వనరుల అభివృద్ది కార్పొరేషన్‌ ఆద్వర్యంలోడిచ్‌పల్లి మండల ప్రజాపరిషత్‌, తెయు సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. ఈ వ్యర్థాల సమర్థ నిర్వహణ ప్రాజెక్టు ద్వారా హాస్టల్స్‌లో కనీసం రెండు నుంచి మూడు గంటల ఇంధన ఆదాచేయడం, విద్యుత్తు బిల్లులు తగ్గించడం, కాలుష్యాన్ని నివారించడం సాద్యమవుతుందని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. సోమవారం ...

Read More »

ప్రైవేటు చక్కెర పరిశ్రమలు ఎలా నడుస్తున్నాయి?

బోధన్‌, న్యూస్‌టుడే: ప్రైవేటు రంగంలో చక్కెర కర్మాగారాలు మంచి లాభాలతో అద్భుతంగా నడుస్తున్న సంగతి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గమనించాలని ప్రజాఫ్రంట్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ సూచించారు. ఆసియా ఖండంలో ప్రసిద్ధి చెందిన నిజాంషుగర్స్‌కు ఎందుకు తాళం వేయాల్సి వచ్చిందో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం బోధన్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. నష్టాల పేరుతో పరిశ్రమలను మూసివేస్తున్న పాలకులు, నిర్వహణ వైఫల్యాలను పరిగణలోకి తీసుకోవడంలేదని నిందించారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాలను వేరు చేసే విధానాలు మంచిది కాదన్నారు. వ్యవసాయ ఆధార ...

Read More »