Breaking News

Daily Archives: February 2, 2016

స్టెప్‌ సీఈవోగా ఉపేందర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

పెద్దబజార్‌(నిజామాబాద్‌), న్యూస్‌టుడే: జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారిగా (స్టెప్‌ సీఈవోగా) ఉపేందర్‌రెడ్డి సోమవారం బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకు జిల్లా శాఖలోని మేనేజర్‌గా ఉన్న ముత్తెన్న ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. ప్రస్తుతం రాష్ట్ర శాఖలో ఉప సంచాలకులుగా విధులు నిర్వహిస్తున్న ఉపేందర్‌రెడ్డిని జిల్లా అధికారిగా నియమించింది. గతంలో ఖమ్మం జిల్లా సీఈవోగా ఐదేళ్లు, ఆర్వీఎం ఇన్‌ఛార్జీ పీవోగా ఏడాదిపాటు విధులు నిర్వహించారు. రాష్ట్ర శాఖలో ఉప సంచాలకులుగా ఉన్నప్పుడు నూతన యుజవన విధానాన్ని నూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆయన ‘న్యూస్‌టుడే’తో ...

Read More »

విషాహారం తిన్న ఆవులు… అస్వస్థత

గడ్కోల్‌ (సిరికొండ, న్యూస్‌టుడే): మండలంలోని గడ్కోల్‌ గ్రామ పరిధిలో ఉన్న జొన్న పంటను తిని 350 ఆవులు అస్వస్థతకు గురయ్యాయి. ఒక ఆవు మృతి చెందింది.ముషీర్‌నగర్‌ గ్రామానికి చెందిన కేతావత్‌ చందర్‌, అజ్మీరా హిత్న గిరిజన కుటుంబాలకు చెందిన ఆవులు ఆదివారం సాయంత్రం గడ్కోల్‌ గ్రామ పరిధిలో ఉన్న జొన్నను మేయటంతో అస్వస్థతకు గురయ్యాయి. ఐదు రోజుల కిందట జొన్న పంటకు వాడిన రసాయనిక ఎరువులు వదలకపోవటంతో ఈ ఘటన జరిగింది. సంఘటన స్థలానికి జిల్లా సంచార వైద్యులు ప్రమోద్‌ ఆధ్వర్యంలో వచ్చి ఆవులకు ...

Read More »

భిక్కనూరు టోల్‌ప్లాజా ప్రారంభం

భిక్కనూరు, న్యూస్‌టుడే: భిక్కనూరు టోల్‌ప్లాజా సోమవారం ప్రారంభమైంది. గత నెల 6న ప్రారంభమైన టోల్‌ప్లాజా నిర్మాణం కేవలం 24 రోజుల్లో పూర్తిచేశారు. ప్రతీ 60 కి.మీ.లకు ఒక టోల్‌ప్లాజా ఉండాలనే నిబంధనతో నూతనంగా భిక్కనూరు శివారులో దీనిని ఏర్పాటు చేశారు. వాహన చోదకుల నుంచి అధికారికంగా టోల్‌ వసూల్‌ చేస్తున్నారు. మెదక్‌ జిల్లా తుఫ్రాన్‌ ప్లాజా వద్ద వాహనాల రాకపోకల ధరలు తగ్గించి ఇక్కడ నుంచి వసూల్‌ చేస్తున్నారు. అయినా వాహనచోదకులపై అదనపు భారం పడుతుంది. ఇంతకు ముందు హైదరాబాద్‌ వెళ్లివచ్చే కారు/జీబు/వ్యాన్‌/ లైట్‌మోటర్‌ ...

Read More »

తెవివిలో ఇంధన తయారీకి శ్రీకారం

తెవివి క్యాంపస్‌, (డిచ్‌పల్లి, న్యూస్‌టుడే): వ్యర్థాల సమర్థ నిర్వహణ, జీవ ఇంధన తయారీని తెలంగాణ విశ్వవిద్యాలయం పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. సోమవారం విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి, సంప్రదాయేతర ఇంధన వనరుల జిల్లా ఛైర్మన్‌ సోమేశ్వరరావు, డిచ్‌పల్లి ఎంపీడీవో సురేందర్‌తో కలిసి బాల, బాలికల వసతిగృహాలు, కళాశాల భవనాలను సందర్శించారు. వ్యర్థాల నిర్వహణతో జీవ ఇంధన తయారీని పైలెట్‌ ప్రాజెక్టుగా వర్సిటీలో పునరుద్ధరణ ఇంధన వనరుల అభివృద్ధి కార్పొరేషన్‌, డిచ్‌పల్లి మండల ప్రజా పరిషత్‌, తెవివి సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు రిజిస్ట్రార్‌ తెలిపారు. ఒక ...

Read More »

వంటాగ్యాస్‌ ధర భారీగా తగ్గింపు

ఇందూరు, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం రాయితీ పై అందించే ఎల్‌పీజీ వంట గ్యాస్‌ ధరను భారీగా తగ్గించిందని జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం ఛైర్మన్‌ ఎం.రాజేశ్వర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం గ్యాస్‌బండ ధర రూ.753 ఉండగా రూ.88 తగ్గింపుతో రూ.665లకు అందించనున్నారని పేర్కొన్నారు. ఈ తగ్గింపు ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నాయని తెలిపారు. జిల్లాలోని 43 గ్యాస్‌ ఏజెన్సీలు ఆయా వినియోగదారుల ఇంటి వద్దకు గ్యాస్‌ బండను సరఫర చేస్తే రూ.665 చెల్లించాలని, వినియోగదారుడే ఏజెన్సీ వద్దకు వెళ్లి ...

Read More »

డయల్‌ యువర్‌ ఎస్పీలో 15 ఫిర్యాదులు

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా 15 ఫిర్యాదులు అందాయి. సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల మద్యలో ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఫోన్‌లో బాధితులనుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల ఫిర్యాదులు సత్వరమే పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Read More »

తాగునీరు.. సాగు నీటికి

నిజామాబాద్‌ నగరంలో డిసెంబరులోనే నీటి ఎద్దడి తలెత్తింది. మరో ఏడు నెలలు నీటి ఎద్దడితో నెట్టుకురావడం కత్తిమీద సామే. నీటి ఇబ్బందులపై ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు నిజాంసాగర్‌ నీటిని అతికష్టం మీద అలీసాగర్‌ రిజర్వాయర్‌కు చేర్చారు. అలీసాగర్‌ నీరు కాలువల ద్వారా వెనక్కి వచ్చింది. దీంతో ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామస్థులు కొందరు నిజాంసాగర్‌ ప్రధాన కాలువపై ఉన్న షెట్టర్‌ను ఎత్తారు. నీరంతా గ్రామ చెరువులోకి చేరింది. చెరువు గట్టుపై ఉన్న షెట్టర్‌ను కొందరు రైతులు ఎత్తడంతో ...

Read More »

మాజీ సైనికులపై మమకారం

న్యూస్‌టుడే, పెద్దబజార్‌(నిజామాబాద్‌) : దేశం కోసం నిత్యం పహారాకాస్తూ.. మంచుకొండల్లో.. దట్టమైన అడవుల్లో.. మహాసముద్రంలో ఇలా దేశం చుట్టూ రక్షణగా నిలుస్తూ శత్రువులను ఎదుర్కొని తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భారత సైనికులుగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందినవారికి అండగా నిలుస్తోంది జిల్లా సైనిక సంక్షేమశాఖ. మాజీ సైనికులు, మాజీ సైనిక వితంతువులకు, వారి పిల్లలకు, కుటుంబాలకు పలు సంక్షేమ పథకాలు అందిస్తోంది. ఈ ఏడాది మాజీ సైనికుల కోసం ఇప్పటి వరకు రూ.12 లక్షల వరకు విరాళాలు సేకరించి రాష్ట్రంలోనే తొలిస్థానంలో ...

Read More »

బ‘షేర్‌’బాద్‌

కమ్మర్‌పల్లి, న్యూస్‌టుడే: గల్ఫ్‌ మోజు ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది .అదే బాటలో ప్రయనిస్తున్న ఈ గ్రామస్థులు మాత్రం ప్రగతి పథంలో దూసుకెళుతున్నారు.. గల్ఫ్‌ అంటేనే పుట్టెడు కష్టాలు, కన్నీళ్లని వలస జీవులంతా రోదిస్తుంటే… ఈ గ్రామస్థులు తమ అభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు. గడిచిన నలభై ఐదేళ్ల కాలంలో తాత నుంచి మనువడి వరకు ఇంటికొకరు గల్ఫ్‌లో ఉంటూ ఆర్థికంగా పురోగమిస్తున్నారు కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్‌ గ్రామస్థులు. గల్ఫ్‌బాటలో విలసిల్లిన బ‘షేర్‌’బాద్‌పై న్యూస్‌టుడే కథనం. జిల్లాలో గల్ఫ్‌కు జీవనోపాధి కోసం వలస వెళ్లి అభివృద్ధి ...

Read More »

పనికి తగిన వేతనాన్ని చెల్లించాలి

బీర్కూర్‌: పనికి తగిన వేతనాన్ని చెల్లించాలని నాణ్యత ప్రమాణాల బోధన్‌ డివిజనల్‌ అధికారి కృపాకర్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని బరంగేడిగి గ్రామంలో ఉపాధి పనుల్లో భాగంగా చేస్తున్న కాలువల పనులను ఆయన పరిశీలించారు. పనికి తగిన వేతనం అందుతుందా? లేదా? అని కూలీలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఏపీవో ఆక్మల్‌, ఈసీ ముంతాజ్‌ఉన్నారు.

Read More »

కలిసిరాని కాలం… అన్నదాతకు ఉరిపాశం!

కరవు కరాళ నృత్యం మరో అన్నదాత ఉసురుతీసింది. సాగునీరు లేక వ్యవసాయం సాగక ఆ రైతు దిగాలు పడ్డాడు. ఈసారైనా నీళ్లుపడితే బతుకు బండిని ముందుకు నడిపించొచ్చని అనుకున్నాడు.. అప్పు చేసి వరుసగా మూడు సార్లు బోర్లు వేశారు.. ఒక్క చుక్క కూడా నీరు రాలేదు.. ఆ ఆవేదనలో ఉండగానే అప్పులు ఇచ్చిన వారి ఒత్తిళ్లు మొదలయ్యాయి.. ఇక బతుకు బండిని లాగలేనని మదనపడిన ఆ బడుగు రైతు ఉరి పాశం బిగించుకుని బలవన్మరణం చెందాడు. పర్మళ్ల (లింగంపేట), న్యూస్‌టుడే: మండలంలోని పర్మళ్ల గ్రామానికి ...

Read More »

తెలంగాణ చరిత్రపై నేడు జిల్లా స్థాయి సదస్సు

నిజామాబాద్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: హరిదా రచయితల సంఘం, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మంగళవారం కేర్‌ డిగ్రీ కళాశాలలో ‘తెలంగాణ చరిత్ర’పై జిల్లాస్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు దేవేందర్‌, అధికార ప్రతినిధి సుధాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. చారిత్రక పరిశోధకులు హరగోపాల్‌, వేముగంటి మురళీకృష్ణ, జిల్లా కన్వీనర్‌ లక్ష్మీనారాయణ భరద్వాజ్‌ హాజరవుతారన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు, కవులు, చరిత్ర పరిశోధకులు హాజరుకావాలని సూచించారు.

Read More »

రెవెన్యూ శాఖకు దిక్సూచి ‘శేత్వార్‌’!

న్యూస్‌టుడే, బోధన్‌ : కామారెడ్డి మండలంలోని ఒక సర్వే నంబరు అసలు విస్తీర్ణం 8 ఎకరాలు మాత్రమే. దాని పక్కనే ఎలాంటి సర్వే నంబరు లేకుండా మరో నాలుగు ఎకరాలు ఉంది. ఈ నిజం తెలిసిన ఓ వ్యక్తి 8 ఎకరాల పట్టా భూమిని కొనుగోలు చేసి మరో వ్యక్తికి విక్రయించాడు. పక్కనే ఉన్న నాలుగు ఎకరాలను అదే సర్వే నంబరుతో తన పేర పట్టా చేసుకున్నాడు. దీంతో దశాబ్దాల పాటు రికార్డులో ఉన్న భూమి విస్తీర్ణం అమాంతం పెరిగింది. * బోధన్‌ మండలం ...

Read More »

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

బీర్కూర్‌: మండలకేంద్రం బీర్కూర్‌ పంచాయతీ పరిధిలోని ప్రకాశ్‌రావు క్యాంపులో సీసీ రోడ్డు నిర్మాణపనులను ఎంపీటీసీ సభ్యుడు సుధాకర్‌రావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధాకర్‌రావు మాట్లాడుతూ.. సీఆర్‌ఆర్‌ నిధుల ద్వారా మంజూరైన రూ. 30లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు సాహెబ్‌రావు, నారం శ్రీనివాస్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

స్త్రీశక్తి లేకుండా ఎవరూ పనిచేయలేరు

లింగాపూర్‌(దేవునిపల్లి),న్యూస్‌టుడే: స్త్రీశక్తి లేకుండా సమాజంలో పురుషశక్తి పనిచేయదని ఏబీవీపీ సేవిక ప్రాంత సంచాలిక విజయభారతి అన్నారు. సోమవారం కామారెడ్డి మండలం లింగాపూర్‌ ఎస్‌పీఆర్‌ పాఠశాలలో నిర్వహించిన విద్యార్థినుల జిల్లా కార్యశాల కార్యక్రమానికి ముఖ్యవక్త పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాలు మారుతున్నా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందడం లేదన్నారు. అన్ని రంగాల్లో మహిళలు పోటీపడుతున్నారని తెలిపారు. ఎన్ని చట్టాలు అమలు చేసిన మహిళలపై జరుగుతున్న దాడులు ప్రభుత్వాలు కట్టడిచేయడం లేదన్నారు. దేశంలో అందాల పోటీల సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతీ ...

Read More »

జాతీయ స్థాయి నెట్‌బాల్‌ టోర్నీకి ఎంపిక

డిచ్‌పల్లి, న్యూస్‌టుడే: ఈ నెల 5 నుంచి 7 వరకు హరియాణాలోని సోనిపేట్‌లో జరిగే జాతీయ స్థాయి నెట్‌బాల్‌ టోర్నీకి డిచ్‌పల్లి మండలం ధర్మారం(బీ) సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థిని లేయ(9వ తరగతి) ఎంపికైనట్లు పీడీ ఉదయశీల తెలిపారు. జాతీయ స్థాయి నెట్‌బాల్‌ పోటీలకు ఎంపికైన లేయను సోమవారం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ మదన్‌మోహన్‌, సిబ్బంది శశికాంత్‌ తదితరులు అభినందించారు.

Read More »

నీళ్లున్నోళ్ల పంట ‘పండింది’

న్యూస్‌టుడే, ఆర్మూర్‌ : భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకుంటూ ఎర్రజొన్న విత్తనాలను సాగు చేసిన రైతన్న పంట పండనుంది. సాగునీటి కొరతతో ఎర్రజొన్న విత్తనాల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోగా, నీటి వసతి ఉండి పంట వేసిన అన్నదాతల ఇంట సిరులు పండనున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఎర్రజొన్న విత్తనాలకు ఈసారి విపరీతమైన డిమాండ్‌ వచ్చింది. సీజను ఆరంభంలో రూ.మూడువేల పైచిలుకు ధర ఉంటే, ప్రస్తుతం క్వింటాలుకు రికార్డు ధర రూ.4,930 పలుకుతోంది. మున్ముందు డిమాండ్‌ ఇంకా పెరిగి ధర రూ.అయిదు ...

Read More »

మార్చిలో పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష

తెవివి క్యాంపస్‌, (డిచ్‌పల్లి, న్యూస్‌టుడే): తెలంగాణ విశ్వవిద్యాలయం ఈ అకడమిక్‌ సంవత్సరానికి నిర్వహించే పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష మార్చి రెండో వారంలో ఉంటుందని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. వర్సిటీ పరిపాలన భవనంలోని తన ఛాంబర్‌లో సోమవారం రిజిస్ట్రార్‌ లింబాద్రి డీన్లతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రస్తుతం ఉన్న పరిశోధక విద్యార్థుల రీసెర్చ్‌ ప్రోగ్రెస్‌ సమీక్షించాలని నిర్ణయించారు. పీహెచ్‌డీ విధి, విధానాలు పకడ్బందీగా తయారు చేసుకోవాలని, ఎలాంటి అలసత్వానికి తావు లేకుండా పరిశోధనను ప్రోత్సహించాలని రిజిస్ట్రార్‌ తెలిపారు. పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష వీలైతే ఆన్‌లైన్‌లో ...

Read More »

బుక్‌ కీపర్లకు శిక్షణ

బీర్కూర్‌: మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవనంలో మంగళవారం స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పుస్తక నిర్వహణపై బుక్‌ కీపర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీబీవో ఆడిట్‌ అధికారి మురళి హాజరై వివిధ అంశాలపై గ్రామ సమన్వయకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన గ్రామసమన్వయకర్తలు పాల్గొన్నారు.

Read More »

చర్చకు దారేది… సమస్య సమాధానమేది!

పంచాయతీరాజ్‌ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం విధిగా నిర్వహించాలి. అజెండాలోని అంశాలను చర్చించి తీర్మానాలు చేసి సమస్యల పరిష్కరానికి మార్గం సుగమం చేయాలి. గత జడ్పీ సర్వసభ్య సమావేశం అక్టోబరు 3న జరిగింది. సౌలభ్యత కల్పించినా…. ఈ ఏడాది జనవరి మొదటి వారంలో జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం నిర్వహించాల్సి ఉంది. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మొత్తం జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం పేరుతో రాజధానిలో మకాం వేయడంతో జనవరి 30కి సమావేశం ...

Read More »