Breaking News

Daily Archives: February 3, 2016

రౌసుల్‌ వర ధార్మిక కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

  నందిపేట, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని ఇబ్రహీం మజీద్‌ వద్ద గురువారం సాయంత్రం మిలాద్‌ కమిటీ ఆధ్వర్యంలో జరిగే రౌసుల్‌ వర ధార్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మిలాద్‌ కమిటీ అధ్యక్షుడు సయ్యద్‌ మహమూద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ముంబయి, బరేల్వి నుంచి జాతీయ మౌలానాలు ప్రసంగించడానికి వస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని ముస్లిం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని అన్నారు.

Read More »

ధ్యానంతో ఉన్నత లక్ష్యాలు సాధ్యం

  కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధ్యానంతో ప్రశాంతత పొంది ఉన్నత లక్ష్యాలు సాధించవచ్చని పిరమిడ్‌ స్పిరిట్యువల్‌ సొసైటీ మూమెంట్‌ సీనియర్‌ ప్రోగ్రామ్‌ మాస్టర్‌ రామకిషన్‌ అన్నారు. పట్టణంలోని వాగ్దేవి విద్యాలయంలో బుధవారం విద్యార్థులకు ధ్యానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధ్యానం వల్ల విద్యార్థులకు మానసిక ప్రశాంతతతో పాటు తీవ్ర ఒత్తిడి, పరీక్షల భయం, ఆందోలన లాంటివి దరిచేరకుండా చేసుకోవచ్చన్నారు. విద్యార్థులు నిత్యం ధ్యానం చేసి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని అభిలషించారు. కార్యక్రమంలో ...

Read More »

విద్యార్థి జేఏసి ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా

03.02.9   కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరిట కళాశాల స్థలాన్ని వెంటనే రిజిస్ట్రేషన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి జేఏసి ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డిలో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరిట స్థలం రిజిస్ట్రేషన్‌ లేకపోవడంతో న్యాక్‌ కమిటీ ...

Read More »

ప్రతిభ పరీక్షలు విద్యార్థుల సామర్థ్యాన్ని వెలికితీస్తాయి

కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతిభ పరీక్షలు విద్యార్థుల సామర్థ్యాన్ని వెలికితీస్తాయని టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్రకార్యనిర్వాహణ కార్యదర్శి బాలు అన్నారు. టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆద్వర్యంలో బుధవారం పట్టణంలోని ఆర్యభట్ట కళాశాలలో డివిజన్‌లోని 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభ పరీక్షలు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన బాలు మాట్లాడుతూ ప్రతిభ పరీక్షల వల్ల విద్యార్థుల్లో నెలకొన్న భయం తొలగిపోయి చక్కటి పోటీ వాతావరణాన్ని పొందుతారన్నారు. టిఎన్‌ఎస్‌ఎఫ్‌ విద్యార్థుల సమస్యల పట్ల ఆందోళన కార్యక్రమాలే కాకుండా నిర్మాణాత్మక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల శ్రేయస్సుకు ...

Read More »

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఎంఐఎం దిస్టిబొమ్మ దగ్ధం

కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శాసన మండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీపై ఎంఐఎం పార్టీ నాయకులు దాడిచేసి గాయపరచడాన్నినిరసిస్తూ బుధవారం కాంగ్రెస్‌ నాయకులు కామారెడ్డిలో ఆందోళన చేపట్టారు. నిజాంసాగర్‌ చౌరస్తాలో జాతీయ రహదారిపై ఎంఐఎంపార్టీ దిస్టిబొమ్మ దగ్దం చేశారు. అసదుద్దీన్‌ ఓవైసి, అక్బరుద్దీన్‌ ఓవైసి ఆ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీవోకార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. దాడికి పాల్పడ్డ వారిని అసదుద్దీన్‌, అక్బరుద్దీన్‌లను వెంటనే అరెస్టు ...

Read More »

తల్లిదండ్రుల సహకారంతో ఉత్తమ ఫలితాలు

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గడిచిన ఆరుసంవత్సరాల నుంచి మహ్మద్‌ నగర్‌ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులే జిల్లాకు వన్నె తెస్తున్నారు. దాన్ని తిరగరాయాలని మహ్మద్‌ నగర్‌ గ్రామ కమిటీ అద్యక్షుడు, తెరాస నాయకుడు వాజిద్‌ పిలుపునిచ్చారు. ప్రధానోపాధ్యాయుడు అమర్‌సింగ్‌ అధ్యక్షతన ఉన్నత పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నాయకులు విజయ్‌, నర్సింలు, ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు.

Read More »

చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద వహించాలి

- ఎంఇవో బలరాం రాథోడ్‌ నిజాంసాగర్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో 10వ తరగతిలో ఉత్తమ పలితాలు సాధించాలని మండల విద్యాశాఖాధికారి బలరాం రాథోడ్‌ ఉపాధ్యాయులకు సూచించారు. మండలంలోని విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం మండలంలోని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నిర్వహించిన సమావేశంలో ఎంఇవోమాట్లాడారు. 10వ తరగతిలో వెనకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక చొరవ చూపుతూ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. రానున్న విద్యాసంవత్సరం కోసం పాఠశాలలో మౌలిక వసతులు, పాఠ్య పుస్తకాలు, దుస్తులు, అందజేసేందుకు, విద్యార్తుల ...

Read More »

వంద శాతం మరుగుదొడ్లతో రికార్డు సాధించిన బజార్‌కొత్తూరు గ్రామం

నందిపేట, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బజార్‌ కొత్తూరు గ్రామంలో మరుగుదొడ్లు నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. స్థానిక సర్పంచ్‌ కళావతి, సాయాగౌడ్‌ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ప్రజలను చైతన్యం చేసి ఇంటికొక మరుగుదొడ్డి నిర్మానం చేసుకునేలా చూశారు. పూరిగుడిసెల్లో నివసించే వారు సైతం మరుగుదొడ్లు నిర్మించుకోవడం ఈ గ్రామంలో విశేషం. సర్పంచ్‌ కళావతి మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆకాంక్ష మేరకు నియోజకవర్గాన్ని వందశాతం మరుగుదొడ్లు పూర్తిచేయడం జరుగుతుందని అన్నారు. తమ గ్రామంలో మంజూరైన 88 మరుగుదొడ్లు పూర్తిచేసి ...

Read More »

ఐలాపూర్‌ జూనియర్‌ కళాశాలలో వార్షికోత్సవం

నందిపేట, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఐలాపూర్‌ జూనియర్‌ కళాశాలలో బుధవారం 34వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా ఆర్‌ఐవో ఇంద్రకరణ్‌ విచ్చేసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదివి కళాశాలక పేరు తీసుకురావాలని కోరారు. విద్యార్థుల సంఖ్యను పెంచి ప్రయివేటు కళాశాలలకు ధీటుగా బోదన చేయాలని అధ్యాపకులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపిపి అంకంపల్లి యమున, సర్పంచ్‌ మీసాల సుదర్శన్‌, ఎంపిటిసి సుజాత, సొసైటీ ఛైర్మన్‌ లక్ష్మినారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్‌ల పంపిణీ

నందిపేట, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంపిటిసి గాండ్ల నర్సుబాయి ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్‌లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపిటిసి మాట్లాడుతూ విద్యార్థి దశలో 10వ తరగతి తొలి మెట్టు కాబట్టి బాగా చదివి సమాజానికి ఉపయోగపడేలా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణతో ఉపాధ్యాయులతో గౌరవంకలిగి ఉండాలని, లక్ష్యాన్ని నిర్ణయించుకొని పట్టుదలతో చదివి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తేవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మహేందర్‌రెడ్డి, ...

Read More »

రూ. 9753 కోట్ల అంచనాలతో జిల్లా నీటి ప్రణాళిక

- జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ప్రతి ఎకర భూమికి స్థిరమైన నీటి వసతి కల్పించేందుకు రజూూ. 9753 కోట్ల అంచనాలతో జిల్లా నీటి ప్రణాళిక ముసాయిదా రూపొందించినట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రానా తెలిపారు. బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మండలాలు, నియోజకవర్గాల వారిగా నీటి ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులతో ...

Read More »

ట్యాక్సు వసూలు మిషన్‌ ప్రారంభం

కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి బల్దియా ఆద్వర్యంలో బిల్‌ కలెక్టర్లకు పన్నుల వసూలు కోసం ఇచ్చిన ఎలక్ట్రానిక్‌ మిషన్లను బుధవారం ప్రారంభించారు. పట్టణంలోని 10వ వార్డు గాంధీ గంజ్‌లో కౌన్సిలర్లు కైలాష్‌ లక్ష్మణ్‌రావు, నిమ్మ దామోదర్‌రెడ్డిలు మిషన్లను ప్రారంభించారు. పట్టణంలో ఆస్తి పన్నులను ఎలక్ట్రానిక్‌ మిషన్ల ద్వారా వసూలు చేయనున్నట్టు తెలిపారు. తద్వారా ఎటువంటి అవినీతికి ఆస్కారం ఉండదని అన్నారు. కార్యక్రమంలో ఆర్‌టి నరేందర్‌, బిల్‌ కలెక్టర్లు రాజు, డేవిడ్‌, శ్రీనివాస్‌, సాయిలు, తదితరులు ఉన్నారు

Read More »

కాళేశ్వర పథకంపై పునరాలోచించాలి

నిజాంసాగర్‌, న్యూస్‌టుడే: కాళేశ్వరం నీటిని నిజాంసాగర్‌కు మళ్లిస్తానంటూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఒక్కసారి పునరాలోచించాలని భారీ నీటి పారుదల శాఖ మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నిజాంసాగర్‌ ప్రాజెక్టును సందర్శించిన ఆయన ముందుగా ప్రాజెక్టు, వరద గేట్లతో పాటు అతిథి గృహాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి కాళేశ్వరం నీటిని నిజాంసాగర్‌కు మళ్లించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని అధికారులతో, ఇంజనీర్లతో మరోమారు చర్చించాలని అన్నారు. నీటి కోసం కోట్ల ప్రజలు ఆధారపడి ఉన్నారని రెండు సంవత్సరాలలో కాళేశ్వరం నీటిని మళ్లిస్తామంటూ ప్రకటించారని 240 మీటర్ల ...

Read More »

ఆర్టీసీ ప్రయాణికులపై రూ.5 భారం

భిక్కనూరు, న్యూస్‌టుడే: భిక్కనూరు వద్ద టోల్‌ ప్లాజా ఏర్పాటు కావడంతో ఆర్టీసీ ప్రయాణికులపై రూ.5 అదనపు భారం పడినట్లయింది. మంగళవారం నుంచి ప్రయాణికులపై ఆర్టీసీవారు టోల్‌ పేరిట రూ.5 వసూలు చేస్తున్నారు. ఇంతకుముందు కామారెడ్డి నుంచి భిక్కనూరు వెళ్లడానికి ఆర్డీనరీ బస్సుల్లో రూ.12 ఛార్జి వసూలు చేసేవారు. ప్రస్తుతం రూ.17కు పెంచారు. టోల్‌ ప్లాజా మీదుగా బస్సుల రాకపోకలకు రూ.320 వసూలు చేస్తుండటంతో ఆర్టీసీవారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి భిక్కనూరు లేక మెదక్‌ జిల్లాకు వెళ్లి రావడానికి ప్రయాణికులపై రూ.10 అదనపు భారం ...

Read More »

తెలంగాణాలోనే ప్రాచీన మానవ జీవనం

నిజామాబాద్‌ సాంస్కృతికం,న్యూస్‌టుడే: దేశంలోనే అతిప్రాచీన మానవ జీవనానికి దక్కన్‌ పీఠభూమికి చెందిన తెలంగాణ ప్రాంతమే అనుకూలంగా ఉండేదని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు హరగోపాల్‌ పేర్కొన్నారు. హరిదా రచయితల సంఘం, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాకేంద్రంలోని కేర్‌ డిగ్రీ కళాశాలలో తెలంగాణ చరిత్రపై జిల్లాస్థాయి సదస్సు నిర్వహించారు. ముఖ్యవక్తగా ఆయన పాల్గొని మాట్లాడారు. మానవ మూలాలు తెలుసుకోవాలంటే చరిత్రను గుర్తించడం తప్పనిసరి అన్నారు. చరిత్ర కేవలం వినబడేదని కాదని, కనపడేదన్నారు. పురాణాల్లో కథలు చరిత్రను చెపుతాయన్నారు. లక్షల ఏళ్ల క్రితమే నది పరివాహాక ప్రాంతాల్లోనే ...

Read More »

ఎక్సైజ్‌ డీసీ అరుణ్‌రావు బదిలీ

నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ఎక్సైజ్‌ డీసీ అరుణ్‌రావును ఏపీకి కేటాయిస్తూ ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. గత రెండేళ్లుగా డీసీగా పనిచేస్తున్న అరుణ్‌రావు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో ఉద్యోగ విభజనలో ఏపీకి కేటాయించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతానికి చెందిన డీసీ స్థాయి అధికారులు ఏపీలో పనిచేస్తున్న వారిని ఇప్పటికే ఇక్కడికి పంపించారు. ఏపీకి వెళ్లిన అధికారుల స్థానంలో ఇప్పటికే తెలంగాణకు చేరుకున్న డీసీ స్థాయి అధికారులకు పోస్టింగ్‌ ఇచ్చేందుకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల కారణంగా పోస్టింగ్‌ విషయంలో ...

Read More »

గ్రామజ్యోతిలో రెండేళ్ల ప్రణాళిక

రెంజల్‌, న్యూస్‌టుడే: గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను పటిష్ట పరచాలని కోరుతూ గ్రామస్థులు తీర్మానించారు. రెంజల్‌ మండలకేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం రెండోవిడత గ్రామజ్యోతి గ్రామసభను సర్పంచి చందూర్‌సవిత అధ్యక్షతన నిర్వహించారు. గత అగస్టు మాసంలో నిర్వహించిన గ్రామజ్యోతి గ్రామసభలో ఐదేళ్ళ ప్రణాళిక రూపొందించగా ప్రభుత్వం రెండేళ్ళ ప్రణాళిక రూపొందించాలని ఆదేశిస్తూ తాజాగా గ్రామసభలు నిర్వహిస్తుంది. డ్రైనేజీ వ్యవస్థను పటిష్టపరుస్తూనే సిసిరోడ్ల నిర్మాణాలు చేపట్టాలని ప్రజలు కోరారు. తాగునీటి వ్యవస్థకు ముందస్తు ప్రాధాన్యత ఇవ్వాలని కోరగా ఎక్కడెక్కడ తాగునీటి సమస్య ఉందో గుర్తించి ప్రణాళిక రూపొందించారు. ...

Read More »

దేశభక్తులకు, దేశద్రోహులకు మధ్య పోరాటం

భిక్కనూరు, న్యూస్‌టుడే: హెచ్‌సీయూలో 15 రోజులుగా చోటుచేసుకున్న ఘటనలు దేశభక్తులకు, దేశద్రోహులకు మధ్య జరుగుతున్న పోరాటమని ఏబీవీపీ విభాగ్‌ సంఘటన కార్యదర్శి మొగులప్ప అన్నారు. మంగళవారం భిక్కనూరులోని తెవివి దక్షిణ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనిని చాలా మంది దళితులకు, దళితేతరులకు మధ్య జరుగుతున్న సంఘర్షణగా భావిస్తున్నారన్నారు. హెచ్‌సీయూలో పరిశోధన విద్యార్థి రోహిత్‌ ఉగ్రవాది యాకుబ్‌ మెమన్‌ ఉరికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడంతోపాటు ఒక్క మెమన్‌ను ఉరి తీస్తే ఇంటికొక్క మెమన్‌ పుట్టుకొస్తాడని ప్లకార్డులు ప్రదర్శించాడన్నారు. ఈ ప్రదర్శనను ...

Read More »

‘షబ్బీర్‌పై దాడి అప్రజాస్వామికం’

నిజామాబాద్‌ సిటీ, న్యూస్‌టుడే: శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీపై ఎంఐఎం నాయకులు దాడిచేయడం అప్రజాస్వామికమని పలువురు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పేర్కొన్నారు. దాడిని ఖండించారు. షబ్బీర్‌తో పాటు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిపై దాడి చేసిన ఎంఐఎం నాయకులను అరెస్టు చేయాలని డీసీసీ అధ్యక్షుతు తాహెర్‌ బిన్‌ హందాన్‌, మాజీ డీసీసీ అధ్యక్షుడు గడుగు గంగాధర్‌, పార్టీ నగర అధ్యక్షుడు కేశ వేణు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఈ సంఘటనపై ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ...

Read More »

సెమిస్టర్‌ పరీక్షలో గందరగోళం

తెవివి క్యాంపస్‌, (డిచ్‌పల్లి, న్యూస్‌టుడే): తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్‌ మూడో సెమిస్టర్‌ పరీక్షల్లో గందరగోళం చోటు చేసుకుంది. మంగళవారం అప్లయిడ్‌ ఎకనామిక్స్‌ మూడో సెమిస్టర్‌ పరీక్ష పేపరులో పాత సిలబస్‌ ప్రశ్నలతో కూడిన పేపరును అధికారులు ఇచ్చారు. దీంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ప్రశ్నలు అర్థంకాక తీవ్ర గందరగోళానికి గురయ్యారు. చాలాసేపటికి విద్యార్థులు పరీక్ష పేపరు విషయం అధికారుల దృష్టికి తెచ్చారు. పాత సిలబస్‌ ప్రకారం పరీక్ష పేపరు ఇవ్వడంతో విద్యార్థులు సంబంధిత విభాగం అధికారుల్ని ప్రశ్నించారు. విద్యార్థులు ప్రశ్నించడంతో తేరుకున్న అధికారులు సంబంధిత ...

Read More »