Breaking News

Daily Archives: February 4, 2016

ఐలమ్మ స్ఫూర్తితో ఎదగాలి

  సదాశివనగర్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రజకులు ఐలమ్మ స్ఫూర్తితో ఎదగాలని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రజకులు అన్ని రంగాల్లో ఎదగాలని అన్నారు. ఉద్యమ పటిమ ఉన్నందుకే వీరనారి ఐలమ్మ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సిఎం కెసిఆర్‌ ఆద్వర్యంలో బంగారు తెలంగాణ నిర్మాణం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రజకులకు సంఘ భవనం, ...

Read More »

వంటగది ఉన్నా ఆరుబయటే మంట

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాలలో వంట గది ఉంది.. కానీ ఆరుబయటే వంట చేస్తున్నారు… వివరాలేందో చూద్దాం….మండలంలోని ఆరేపల్లి పంచాయతీ పరిధిలోని చిన్న ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండేందుకు వంట గది సక్కదనం ఉంది. కానీ ఇటీవల గాలి దుమారం పెట్టేవరకల్లా వంటగది మీదున్న రేకులు లేసి ఎగిరిపోయినయి. దీంతో ఏజెన్సీ నిర్వాహకులు ఆరుబయటే వంట చేస్తున్నరు. ఇంతదాకా మంచిగనే ఉంది కాని రాబోయే రోజులల్ల వానకాలం అస్తది కదా అప్పుడెట్ల ...

Read More »

కొనసాగుతున్న మరుగుదొడ్ల నిర్మాణాలు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కోమలంచ, మహ్మద్‌నగర్‌ గ్రామాల్లో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలనే లక్ష్యంతో మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రారంభించారు. మహ్మద్‌నగర్‌లో 70 శాతం మరుగుదొడ్లు పూర్తయ్యాయని సర్పంచ్‌ చెప్పారు. కాగా కోమలంచ గ్రామంలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయినట్టు గ్రామ సర్పంచ్‌ పేర్కొన్నారు. గున్కుల్‌ గ్రామంలో కూడా వందశాతం నిర్మించాలనే లక్ష్యంతో నిర్మాణాలు ప్రారంభించారు. గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలనే లక్ష్యంతో అందరు ముందుకు వస్తున్నారు.

Read More »

రహదారి పనులు ప్రారంభం

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో పాతబస్టాండ్‌ చౌరస్తా నుంచి పాత బస్టాండ్‌ వరకుగల రహదారి నిర్మాణానికి జిల్లా పరిషత్‌ నిధుల నుంచి 10 లక్షలు మంజూరయ్యాయి. దీంతో రహదారి పనులను గురువారం సర్పంచ్‌ రాజు ప్రారంభించారు. పనులు ప్రారంభం కావడంతో కాలనీవాసులతో పాటు మండల కేంద్రానికి చెందిన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంపిటిసి బిక్యానాయక్‌, తదితరులున్నారు.

Read More »

10 పరీక్షల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలి

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో 39 వేల మంది విద్యార్థులు 10వ తరగతి వార్షిక పరీక్షలకు హాజరు కానున్నారని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రానా తెలిపారు. వారిలో 23 వేల మంది ప్రభుత్వ విద్యాసంస్థలలో చదువుతున్నారని తెలిపారు. జిల్లాలో 204 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గురువారం రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రంజీవ్‌ ఆచార్య నిర్వహించిన వీడియో కాన్సరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థుల ...

Read More »

వైన్స్‌ దుకాణంలో చోరీ

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలోని సుద్దపల్లి గ్రామం వద్ద జిబి వైన్‌ దుకాణంలో దొంగలు పడి నాలుగు లక్షల విలువగల మద్యం సీసాలను దొంగిలించారు. గురువారం వైన్స్‌ సిబ్బంది వచ్చి చూసే సరికి షెటరు తాళాలు ధ్వంసం చేసి మద్యం సీసాలను ఎత్తుకెళ్లినట్టు తెలిసింది. వైన్స్‌ యజమాని గద్దె భూమన్న పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్తలానికి చేరుకొని పరిశీలించారు. వైన్స్‌లో నాలుగు లక్షల విలువ చేసే మద్యం సీసాలను ఎత్తుకెళ్లారని ...

Read More »

10లోగా పిఎంకెఎస్‌వై పథకానికి నీటి పారుదల ప్రణాళిక సిద్దం చేయండి

  – జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన కింద అమలు చేసే జిల్లా నీటిపారుదల ప్రణాళిక కార్యక్రమానికి వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లాకలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా నీటి పారుదల ప్రణాళిక కార్యక్రమానికి సంబంధించి గురువారం స్థానిక ప్రగతిభవన్‌లో సంబంధిత అధికారులతో ప్రతిపాదనలు సిద్దం చేయడానికి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాన మంత్రి కృషి సంచాయ ...

Read More »

బయోలాజికల్‌ ఈవాన్స్‌లో ఉద్యోగాలకు విద్యార్థుల ఎంపిక

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ బయోటెక్నాలజి విభాగంలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ప్రఖ్యాత బయోలాజికల్‌ ఈవాన్స్‌ సంస్థలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. విభాగాధిపతి డాక్టర్‌ ప్రవీణ్‌ వివరాల ప్రకారం జక్కుల గణేష్‌, భోగా ప్రేమ్‌కుమార్‌, జడిగె ఆనంద్‌ కుమార్‌లు ఉద్యోగాలకు ఎంపికైనట్టు పేర్కొన్నారు. వీరు రిసెర్చ్‌ అసోసియేట్స్‌గా హైదరాబాద్‌లోని బిఈ డివిజన్‌లో పనిచేస్తారన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలో తట్టుకొని ఉద్యోగాలు పొందిన విద్యార్థులను వైస్‌ ఛాన్స్‌లర్‌ పార్థసారధి, రిజిస్ట్రార్‌ లింబాద్రి, ఇతర అధ్యాపకులు అభినందించారు.

Read More »

తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీ

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ తహసీల్దారు సంతకాన్ని ఒకరు ఫోర్జరీ చేశారు. ఆధార్‌ కార్డులోని వయస్సు మార్పు చేసుకునేందుకు నిజామాబాద్‌ నగరానికి చెందిన జావిద్‌ అనే వ్యక్తి సంతకాన్ని ఫోర్జరీ చేసి అడ్డంగా దొరికాడు. నాలుగైదు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆధార్‌ కార్డులో వయస్సు తప్పుగా ఉందని రెండో ఠాణా పరిధిలో నివసించే జావిద్‌ అనే వ్యక్తి సంబంధిత ఫార్మాట్‌తో కూడిన దరఖాస్తు ఫారాన్ని పూరించాడు. ఆ తర్వాత తహసీల్దారు ధ్రువీకరించి సంతకం చేయాల్సిన చోట ఫోర్జరీ ...

Read More »

6న గ్రూప్‌-2 మోడల్‌ పరీక్ష

తెవివి క్యాంపస్‌, (డిచ్‌పల్లి, న్యూస్‌టుడే): తెలంగాణ విశ్వవిద్యాలయంలో పోటీ పరీక్షల శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 6 తేదీన గ్రూప్‌-2 మోడల్‌ పరీక్ష నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ డా. బాలశ్రీనివాస మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. మోడల్‌ పరీక్ష 6న మధ్యాహ్నం ఉంటుందని, పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు శుక్రవారం తమ పేర్లను నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9948087597 నంబరును సంప్రదించాలని బాలశ్రీనివాస మూర్తి సూచించారు.

Read More »

ఎస్సారెస్పీలో… మట్టి దొంగలు

ఎస్సారెస్పీలో పూడిక తొలగించడంలో భాగంగా సాగునీటి పారుదల శాఖ అధికారులు ఏదైనా సంస్థనో, గుత్తేదారునో ఎంపిక చేసి మట్టి తవ్వే బాధ్యతలు అప్పగించాలి. రైతులు తెచ్చుకునే ట్రాక్టరు, టిప్పర్లు, డంపర్లలోకి ఒండ్రుమట్టిని పోయాలి. ఇలా నింపినందుకు సాగునీటి పారుదల శాఖ అధికారులు క్యూబిక్‌ మీటరుకు రూ.40.10 చొప్పున వీరికి చెల్లింపులు చేయాలి. వాస్తవానికి జరుగుతోంది ఇది… ఎవరైనా సరే ఓ పొక్లెయిను, ఐదారు టిప్పర్లు ఉంటే చాలు శ్రీరాంసాగర్‌ జలాశయానికి ఎంచక్కా వెళ్లవచ్చు. అయితే మట్టి మాఫియాతో చేతులు కలపాల్సి ఉంటుంది. అనంతరం ఒండ్రు ...

Read More »

6న పాస్‌పోర్టు సేవా కేంద్రంలో మేళా

ఇందూరు, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 6న నిజామాబాద్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రంలో పాస్‌పోర్ట్‌ మేళాను నిర్వహిస్తున్నట్లు ఉప పాస్‌పోర్టు అధికారి మధన్‌కుమార్‌ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పాస్‌పోర్టు మేళాలకు 400 మంది అన్‌లైన్‌ అపాయింట్‌మెంట్లను ఇవ్వనున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారులు www.passportindia.gov.in  వెబ్‌ సైట్‌లో అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకోవాలని సూచించారు. ఆన్‌హుల్డ్‌, వాక్‌ఇన్‌, పీసీసీ, తత్కాల్‌ దరఖాస్తులను ఈ మేళాలో స్వీకరించబోమని స్పష్టం చేశారు.

Read More »

పర్యావరణ సాక్షిగా… పచ్చదనం నిండుగా…

హరితహారం పథకాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కను నాటేందుకు ముందుకు కదులుతున్నారు మద్నూర్‌ మండలం పెద్దఎక్లార గేట్‌ వద్ద గల బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు. పాఠశాల ఆవరణలో 3,500 మొక్కలు నాటి ఆదర్శంగా నిలుస్తున్నారు. పాఠశాల ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలంలో మొక్కలు నాటి వాటిని ఇద్దరిద్దరు విద్యార్థుల చొప్పున సంరక్షణ బాధ్యతలు తీసుకుని పెంచుతున్నారు. ఇదే స్ఫూర్తితో ప్రిన్సిపల్‌ ఉమాదేవి, ఉపాధ్యాయ బృందం విద్యార్థులతో మొక్కలు నాటించడమే కాకుండా పూర్తి సంరక్షణ బాధ్యతను వారికి అప్పగించారు. పాఠశాల ఆవరణలో ...

Read More »

‘ సింగీతం’… స్ఫూర్తిలో ప్రథమం…

ఆ పాఠశాల చాలా వెనుకబడిన గ్రామీణ ప్రాంతంలో ఉంది. ప్రధాన రహదారికి ఆరు కిలో మీటర్ల దూరంలో ఉండడం వల్ల బయట ప్రపంచానికి అంతగా సంబంధాలు ఉండవు. అయినప్పటికి తాము దేంట్లో కూడా తీసిపోము అంటూ జాతీయ, రాష్ట్ర స్థాయి సైన్స్‌ ప్రదర్శనలో పలు అవార్డులు సాధించే విధంగా జుక్కల్‌ నియోజకవర్గం నిజాంసాగర్‌ మండలంలోని సింగీతం పాఠశాలను తీర్చిదిద్దారు అక్కడి ప్రధానోపాధ్యాయుడు వెంకటేశం. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న విధానం, అక్కడి విద్యార్థులను తీర్చిదిద్దడంలో ముందుంటున్న ఆ సరస్వతీ విద్యాలయం గురించి పరిశీలిస్తే…. గత సంవత్సరంలో ...

Read More »

అందిన ‘రుణం’.. అతివలకు బలం..!

కరవు తాండవిస్తోది.. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ తీవ్ర వర్షాభావ పరిస్థితి ఏర్పడింది. కరవును జయించేందుకు, గ్రామాల్లో వలసలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలను ప్రారంభించింది. వ్యవసాయ రంగానికే కాకుండా పాడిని అభివృద్ధి చేసేందుకు నిర్ణయించింది. ఆ దిశగా జిల్లాల వారీగా పాడి పరిశ్రమకు శ్రీకారం చుట్టింది. పొట్టకూటి కోసం గ్రామాలు విడిచి పట్టణ ప్రాంతాలకు వలస బాట పడుతున్న తరుణంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దాంతో రైతులకు, మహిళలకు పాడి గేదెల రుణాలను ...

Read More »

పోటీ పరీక్షలకు శిక్షణను ప్రారంభించాలి

తెవివి క్యాంపస్‌, (డిచ్‌పల్లి, న్యూస్‌టుడే): తెలంగాణ విశ్వవిద్యాలయంలో టెట్‌, పోలీస్‌ కానిస్టేబుల్‌, గ్రూప్‌-2 పోటీ పరీక్షలకు శిక్షణను ప్రారంభించాలని ఏబీవీపీ నాయకులు బుధవారం రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రికి విన్నవించారు. పోటీ పరీక్షల కోసం అనేక మంది విద్యార్థులు వేల రూపాయల ఫీజు చెల్లించి హైదరాబాద్‌ వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, యూనివర్సిటీ ఆధ్వర్యంలోనే అన్ని పోటీ పరీక్షలకు కోచింగ్‌ ఇప్పిస్తే గ్రామీణ విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సభ్యుడు రమణ, వర్సిటీ ఇన్‌ఛార్జి రాజు రాథోడ్‌, నాయకులు చందు, మహేష్‌, ప్రవీణ్‌, ...

Read More »

విద్యా బోధనలో మెరుగైన ప్రమాణాలే కీలకం

తెవివి క్యాంపస్‌, (డిచ్‌పల్లి, న్యూస్‌టుడే): సిలబస్‌కు అనుగుణంగా విద్యా బోధనలో మెరుగైన ప్రమాణాలు పాటించి విద్యార్థుల్ని ఉత్తములుగా తీర్చిదిద్దాలని తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. విశ్వవిద్యాలయంలో బుధవారం బీఈడీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, సీనియర్‌ అధ్యాపకుల సమావేశం జరిగింది. సమావేశంలో రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ… బీఈడీ రెండేళ్ల సిలబస్‌కు అనుగుణంగా ప్రమాణాల పెంపుదలే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. బోధనలో ప్రమాణాలు పాటిస్తే, భావి ఉపాధ్యాయులు మెరుగైన శిక్షకులుగా ఉంటారని చెప్పారు. విద్యా బోధకుల శిక్షణ పకడ్బందీగా ఉండాలని, నాణ్యతతో ఎలాంటి రాజీ ఉండరాదని తెలిపారు. ...

Read More »

అన్వేషణ-2016లో కిట్స్‌ విద్యార్థుల ప్రతిభ

మానిక్‌బండార్‌(మాక్లూర్‌ గ్రామీణం), న్యూస్‌టుడే: మండల పరిధిలోని మానిక్‌బండార్‌ సమీపంలోని కాకతీయ మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన విద్యార్థినులు రాష్ట్రస్థాయిలో అగస్త్య ఫౌండేషన్‌, ఇంటర్నేషనల్‌ వారు నిర్వహించిన అన్వేషణ-2016 సైన్స్‌, ఇంజినీరింగ్‌ ఫెయిర్‌లో చక్కటి ప్రతిభ కనబర్చి పతకాలు, ప్రశంసలు పొందారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్‌ సతీష్‌బాబు, ప్రిన్సిపాల్‌ రామకోటేశ్వరరావులు కళాశాలకు చెందిన ఈఈఈ విద్యార్థినులు నవీన, స్నేహ, ప్రత్యూష, సృజన, మనీషలను పతకాలు, ప్రశంసా పత్రాలతో అభినందించారు.

Read More »

చెరువును సందర్శించిన ప్రపంచ బ్యాంకు కన్సల్టెంట్‌

కాచాపూర్‌ (భిక్కనూరు), న్యూస్‌టుడే: భిక్కనూరు మండలం కాచాపూర్‌ చెరువును బుధవారం ప్రపంచ బ్యాంకు కన్సల్టెంట్‌ ప్రొఫెసర్‌ రత్నాకర్‌ సందర్శించారు. గతంలో ఈ చెరవు మరమ్మతులకు ప్రపంచ బ్యాంకు రూ.75 లక్షలు మంజూరు చేసింది. విడుదల చేసిన నిధులతో చేపట్టిన పనులను పరిశీలించారు. కట్ట బలోపేతం చేయడమే కాకుండా కాలువలు, తూముల నిర్మించినట్లు అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం ద్వారా చేపట్టిన పనుల వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ మురళి, ఈఈ మధుకర్‌రెడ్డి, ...

Read More »

కళాశాల భవనం చాలా బాగుంది

బాన్సువాడ గ్రామీణం, న్యూస్‌టుడే: కళాశాల భవనం చాలా అద్భుతంగా ఉందని న్యాక్‌ బృందం ఛైర్మన్‌ సుదర్శన్‌ నందా పేర్కొన్నారు. బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడు రోజులపాటు కొనసాగిన న్యాక్‌ బృందం పర్యటన బుధవారంతో ముగిసింది. సోమ, మంగళవారాల్లో కళాశాలలోని ఆయా కోర్సుల విభాగాలు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, విద్యార్థుల వసతులు, కంప్యూటర్‌ ల్యాబ్‌, క్యాంటిన్‌, మైదానం తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడారు. చివరి రోజు బుధవారం కళాశాల హాలులో ఏర్పాటు చేసిన ఎక్సిట్‌ మీట్‌లో ఛైర్మన్‌ మాట్లాడారు. కళాశాలలో మౌలిక ...

Read More »