Breaking News

Daily Archives: February 5, 2016

నందిపేట పంచాయతీలో ప్రయివేటు సిబ్బంది తొలగింపు

  నందిపేట, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని మేజర్‌ గ్రామపంచాయతీ సర్పంచ్‌ షాకీర్‌ హుస్సేన్‌ తన ఇస్టానుసారంగా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా నియమించుకున్న ప్రయివేటు సిబ్బందిపై వేటు పడింది. వివరాల్లోకి వెళితే నందిపేట సర్పంచ్‌ షాకీర్‌ పాలకవర్గం అనుమతి లేకుండా, తీర్మానం లేకుండా తన ఇష్టానుసారంగా ఐదుగురు ప్రయివేటు సిబ్బందిని నియమించుకున్నారు. ప్రభుత్వ భూముల్లో, అసైన్‌ భూముల్లో నిబంధనలకు విరుద్దంగా ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ అవినీతి తతంగాన్ని పసిగట్టిన వార్డు మెంబరు, ...

Read More »

నిందితుల రిమాండ్‌

  నందిపేట, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఉమ్మెడ గ్రామ పంచాయతీ పరిధిలోని మాయాపూర్‌ గ్రామానికి చెందిన ఓరుగంటి లావణ్య (22) సోమవారం నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా కేసు దర్యాప్తు జరుపుతున్న పోలీసులు శుక్రవారం భర్త శంకర్‌గౌడ్‌, అత్త లక్ష్మి, మామ రవిగౌడ్‌లను అదుపులోకి తీసుకున్నారు. సెక్షన్‌ 304/బి వరకట్నం కొరకు మానసికంగా, శారీరకంగా వేదించినందుకు కేసు నమోదు చేసినట్టు డిఎస్పీ రాంరెడ్డి, ఎస్‌ఐ జాన్‌రెడ్డి తెలిపారు.

Read More »

దాడిని ఖండించిన కాంగ్రెస్‌ నాయకులు

  నందిపేట, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌, శాసనమండలి విపక్ష నేత మహ్మద్‌ అలీ షబ్బీర్‌పై ఎంఐఎం ఎంపి అసదుద్దీన్‌, అతని అనుచరులు దాడి చేయడం సమంజసం కాదని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నర్సాగౌడ్‌ అన్నారు. ప్రజాప్రతినిధి అయిన ఎంపి అసదుద్దీన్‌ వీధి రౌడీలాగా ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి హానికరమని, అటువంటి వారిని నాన్‌బెయిలెబుల్‌ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

Read More »

కొనసాగుతున్న క్రికెట్‌ టోర్నమెంట్‌

  నందిపేట, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేటలో కింగ్స్‌ యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్తాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ గురువారం ఎస్‌ఐ జాన్‌రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం సుభాష్‌ యూత్‌ నందిపేటతో గంగాసముందర్‌ గ్రామ యూత్‌ సభ్యులు తలపడి విజయం సాధించారు. గంగరమంద మోహన్‌ 3 వికెట్లు, 41 రన్‌లు చేసి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచారని నిర్వాహకులు అన్నారు.

Read More »

తెరాస సంబరాలు

  నందిపేట, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించిన సందర్భంగా నందిపేట మండల కేంద్రంలో మండల పార్టీ ఆద్వర్యంలో టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా పార్టీ మండల అధ్యక్షుడు భూమేశ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది పనులతో ప్రజలు ఆదరించారని అన్నారు. కేసీఆర్‌, కెటిఆర్‌ నాయకత్వాన్ని బలపర్చారని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ తెరాసతోనే సాధ్యమని ప్రజలు విశ్వసించారని, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గ నాయకులు ఎన్నికల ...

Read More »

ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూకబ్జా అడ్డుకోవాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 250 ఎకరాల్లో కొంత భూమి తమదంటూ కొందరు అక్రమార్కులు తప్పుడు పత్రాలతో కబ్జాకు యత్నిస్తున్నారని, దీన్ని అడ్డుకోవాలని శుక్రవారం కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌కు విద్యార్థి జేఏసి నాయకులు వినతి పత్రం సమర్పించారు. కళాశాలకు చెందిన భూమిని కొందరు భూ బకాసురులు నకిలీ దృవపత్రాలతో కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. అది కళాశాల స్థలమని అందరికి తెలుసునన్నారు. దీన్ని అడ్డుకోవాలని కోరారు. డిఎస్పీ స్పందిస్తూ భూకబ్జాను అడ్డుకుంటామని, ...

Read More »

తెరాస ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శుక్రవారం కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గంప గోవర్దన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ శివారులోని వృధ్ధాశ్రమంలో చీరెలు పంపినీ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, కొబ్బరి బోండాలు పంపినీ చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ, కౌన్సిలర్లు భూంరెడ్డి, మోహన్‌, అంజద్‌, సిద్దమ్మ, తాళ్ళ గణేష్‌, పిట్ల వేణు, నాయకులు ఎల్లయ్య, రాజేశ్వర్‌, రమేశ్‌గుప్త, అంజరెడ్డి, ...

Read More »

కూలీలందరికి పని కల్పించాలి

  సదాశివనగర్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కూలీలందరికి పని కల్పించాలని డ్వామా పిడి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయం వద్ద సామాజిక తనికీ ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిడి మాట్లాడుతూ 150 రోజులు నిండిన ఉపాధి కూలీలందరికి హరితహారంలో పని కల్పించాలని అన్నారు. వలసలు తగ్గించడానికి ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. రైతులు తమ పంట పొలాల్లోకి నల్లమట్టిని తరలించి అదిక దిగుబడులు సాధించాలన్నారు. ఉదయం నుంచి ...

Read More »

వైభవంగా జ్ఞానసరస్వతి దేవి మహామండల పూజ

  బాన్సువాడ, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడలోని శ్రీజ్ఞానసరస్వతి దేవి 27వ సామూహిక మహామండల పూజ మహోత్సవాన్ని శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి చేర్యాల నుంచి మంగళగిరి నర్సింహమూర్తి స్వామిజి అతిథిగా విచ్చేసి ఆశీస్సులు, ప్రసంగించారు. బాన్సువాడలో వెలసిన సరస్వతి అమ్మవారి దేవస్థానం ఒక మహా పుణ్యక్షేత్రమని పేర్కొన్నారు. భక్తుల కొంగుబంగారంగా ఈ ఆలయం విరాజిల్లుతుందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా భక్తులతో సామూహిక కుంకుమార్చన, తదితర ప్రత్యేక పూజలు ఏర్పాటు చేశారు. స్వామిజికి ఘనంగా స్వాగతం పలికారు. ...

Read More »

నెహ్రూయువకేంద్ర కొత్త వాలంటీర్లకు శిక్షణ

  బాన్సువాడ, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కొత్తగా ఎంపికైన 8 మంది వాలంటీర్లకు నెహ్రూయువ కేంద్రం ఆద్వర్యంలో శిక్షణ నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా శుక్రవారం బృందం సభ్యులు బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని యువజన సంఘాల సభ్యులతో మాట్లాడారు. వివిధ పరిస్థితుల గురించి అవగాహన కల్పించారు. ఇంతకు పూర్వం చురకుగా పనిచేసిన యువజన సంఘాలు ఎందుకు పనిచేయడం లేదో అడిగి తెలుసుకున్నారు. సంఘాల అధ్యక్షులను కలిసి యువజన సంఘం పురోగతికి దోహదం చేయాలని సూచించారు. యువజన ...

Read More »

అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ల పట్టివేత

  రెంజల్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కందకుర్తి నుంచి నిజామాబాద్‌వైపు అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక టిప్పర్లను రెంజల్‌ శివారు ప్రాంతంలో శుక్రవారం పట్టుకున్నట్టు ఎస్‌ఐ రవి కుమార్‌ తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా పిడి యాక్టు అమల్లో ఉన్న, ఇసుకాసురులు యథేచ్చగా కందకుర్తి, నీలా నుంచి అర్ధరాత్రి సమయంలో ఇసుక రవానాకు పాల్పడుతున్నారన్నారు. రాత్రిళ్ళు బందోబస్తు ఏర్పాటు చేసి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకొని పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు ...

Read More »

13వ రోజు పరీక్షకు 242 మంది విద్యార్తులు హాజరు

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ నిర్వహిస్తున్న పిజి రెగ్యులర్‌ సెమిస్టర్‌ పరీక్షలు 13వ రోజున మొత్తం 262 మంది విద్యార్థులకు గాను 242 మంది హాజరయ్యారని అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డిప్యూటి డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.మమత తెలిపారు.

Read More »

ఉన్నత విద్య అభ్యసించే వికలాంగులకు మోటారు వాహనాలు

  నిజామాబాద్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిగ్రీ ఆపై చదువులు చదివే శారీరక వికలాంగులకు మూడు చక్రాల మోటరు వాహనాలు మంజూరు చేయనున్నట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితారాణా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో డిగ్రీ, పిజి కోర్సులతో పాటు సమానమైన వృత్తి విద్యా కోర్సులు చదువుతూ పూర్తిగా నడవలేని చేతులు బలంగా ఉన్న శారీరక వికలాంగ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనలు అనుసరించి వాహనాలు మంజూరు చేస్తామన్నారు. ఇందుకు 18 సంవత్సరాల నుంచి 35 ...

Read More »

మానవతా దృక్పథం అవసరం

  – టియు రిజిస్ట్రార్‌ లింబాద్రి డిచ్‌పల్లి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దైవభక్తితో పాటు మానవతా దృక్పథం చాలా అవసరమని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అన్నారు. బాలికల వసతి గృహంలో గత సంవత్సరం గణేష్‌ ఉత్సవాల నిర్వహణ కోసం సేకరించిన చందాల్లో మిగిలిన 17 వేల రూపాయలను వారు నలుగురు వికలాంగ విద్యార్థులకు ఆర్థిక సహాయం రూపంలో అందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ దాతృత్వం అనేది గొప్ప విషయమని, ఉత్సవాలకోసం ...

Read More »

మధ్యాహ్న భోజన నాణ్యతపై దృస్టి సారించండి

  నిజామాబాద్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం నాణ్యతపట్ల అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, ప్రధానోపాధ్యాయులను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రానా ఆదేశించారు. ఇటీవల మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలపై కలెక్టర్‌ తీవ్రంగా స్పందించారు. మధ్యాహ్న భోజన పథకం కింద ఉపయోగిస్తున్న బియ్యం, నూనె, వంటపాత్రలు, పప్పు, ఇతర సామగ్రి నాణ్యతను స్వయం సహాయక సంఘాల గ్రామైక్య సమాఖ్యలతో ...

Read More »

తెవివి విద్యార్థులకు గ్రూప్‌-2 మోడల్‌ పరీక్ష

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పోటీ పరీక్షల శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 6న మధ్యాహ్నం 2 గంటలకు గ్రూప్‌-2 మాడల్‌ పరీక్ష నిర్వహిస్తున్నట్టు కాంపిటీటివ్‌ ఎగ్జామినేషన్స్‌ కోచింగ్‌ సెంటరు డైరెక్టర్‌ డాక్టర్‌ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. శుక్రవారం సాయంత్రం వరకు తమ పేర్లు రిజిష్టర్‌ చేసుకున్న విద్యార్థులుఈ పరీక్షలు రాయవచ్చని ఆయన స్పష్టం చేశారు.

Read More »

గ్రేటర్‌లో చరిత్ర తిరగరాశాం: కేటీఆర్‌

హైదరాబాద్‌: తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించామని ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ గొప్ప గెలుపుతో తెరాస కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ అపూర్వ విజయం అందించిన ప్రజలకు శిరస్సు వంచి వినమ్రంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ప్రతిహామీని చిత్తశుద్ధితో అమలుచేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టంచేశారు. ఈ గెలుపుతో తెరాస అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించిందన్నారు. ...

Read More »