Breaking News

Daily Archives: February 6, 2016

ఉద్యమానికి మద్దతు తెలపాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూమిని కళాశాల పేరిట రిజిస్ట్రేషన్‌ కోసం తాము చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా నిలవాలని విద్యార్థి జేఏసి నాయకులు శనివారం రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ గౌరవ అద్యక్షుడు భద్రయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కళాశాల పేరిట బూమిని రిజిస్ట్రేషన్‌ చేసి యుజిసి నిదులు అందేలా చూడాలని తాము ఉద్యమం చేస్తున్నామన్నారు. మూడు, 4 జిల్లాల విద్యార్థులకు ఉపకరించేలా కామారెడ్డిలో 259 ఎకరాల్లో ప్రభుత్వ కళాశాల ...

Read More »

బిసి సబ్‌ప్లాన్‌ సాధనకు బిసిలు ఏకం కావాలి

- ప్రొఫెసర్‌ మురళీ మనోహర్‌ కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిసి సబ్‌ప్లాన్‌ చట్ట సాధనకు బిసిలందరు సంఘటితమై పోరాడాలని బిసి సబ్‌ ప్లాన్‌ సాదన కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ మురళీ మనోహర్‌, రాష్ట్ర కార్యదర్శి గోపాల్‌ అన్నారు. రాష్ట్ర బస్సు జాత శనివారం కామారెడ్డికి చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 54 శాతమున్న బిసి కులాలకు బడ్జెట్‌లో కుల ప్రాతిపదికన వాటా కల్పించాలనే చట్టం సాదనే ధ్యేయంగా తాము పోరాడుతున్నామన్నారు. రాష్ట్ర ...

Read More »

మునిసిపల్‌ కార్మికుల క్రమబద్దీకరణ కోసం పోరాటం

- సిఐటియు జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపాలిటిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు ఉద్యోగాల క్రమబద్దీకరణ కోసం పోరాటాలకు సిద్దం కావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు పిలుపునిచ్చారు. శనివారం మునిసిపల్‌ కాంట్రాక్టు కార్మికులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బల్దియా కాంట్రాక్టు కార్మికుల రెండు నెలల పెండింగ్‌ వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ కార్డులను ఇచ్చేందుకు కమీషనర్‌ చర్యలు తీసుకోవాలన్నారు. కనీస వేతనాలు, ఇతర డిమాండ్ల ...

Read More »

స్పెషల్‌ ఫాస్ట్‌ట్రాక్‌ సెషన్స్‌ కోర్టు ప్రారంభించిన హైకోర్టున్యాయమూర్తి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి మహిళల వేధింపుల కేసులను నివారించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెషన్స్‌ కోర్టును శనివారం ప్రారంభించారు. స్థానిక జిల్లా కోర్టులోని మొదటి అంతస్తులో మహిళల వేధింపుల కేసుల విచారణకు ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ సెషన్స్‌ కోర్టు ప్రారంభించారు. జిల్లా కోర్టులో పనిచేస్తున్న మేజిస్ట్రేట్లు, జడ్జిలు, న్యాయవాదులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కోర్టుకేసుల విచారణ పరిశీలించారు. అనంతరం బార్‌ అసోసియేషణ్‌ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ...

Read More »

బడ్జెట్‌లో బిసిలకు సగం కేటాయింపులు జరపాలి

- ప్రొఫెసర్‌ మురళి మనోహర్‌ డిచ్‌పల్లి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ జనాభాలో, రాష్ట్ర జనాభాలో సగం శాతమున్న వెనకబడిన వర్గాలకుబడ్జెట్‌లో 50 శాతం కేటాయింపులు జరపాలని బిసి సబ్‌ప్లాన్‌ సాధన కమిటీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ మురళీమనోహర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం బిసి సబ్‌ప్లాన్‌ సాదన బస్సు యాత్ర తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌కు చేరుకుంది. ఈ సందర్బంగా పరిపాలనా భవనం ముందు జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర బడ్జెట్‌ కేటాయింపుల్లో 50 శాతం ...

Read More »

ఆదివారం గ్రూప్‌-1 అవగాహన సదస్సు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ గ్రూప్స్‌ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు, అభ్యర్థులకు గ్రూప్స్‌ అవగాహన తరగతులు నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర గ్రూప్‌-1 ఆఫీసర్స్‌ అసోసియేషణ్‌ అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌ తెలిపారు. శనివారం ఆయన జిల్లా ఆడిట్‌ అధికారి, యూనివర్సిటీ ప్రజా సంబంధాల అధికారి రాజారాంతో కలిసి లైబ్రరి సెమినార్‌ హాల్‌లో విద్యార్థులతో మాట్లాడారు. ఆదివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నిజామాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో గ్రూప్‌-1 ...

Read More »

దోమలే… దోమలు….

నందిపేట, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ దేశాలను సైతం భయభ్రాంతులకు గురిచేస్తున్న జికా వైరస్‌ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో దోమల వ్యాప్తిని నివారిస్తు వ్యాధుల బారినుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం పంపిణీ చేసిన నమూనా ఫాగింగ్‌ యంత్రాలు మండలంలో కనిపించకుండా పోయాయి. అదికారుల నిర్లక్ష్యం, పాలకుల అవగాహన లేమి కారణంగా ఫాగింగ్‌ యంత్రాలు వినియోగంలోకి రావడం లేదు. దీంతోపాటు గ్రామాల్లో అపరిశుభ్రత నెలకొని దోమల బెడద పెరిగి రోగాల బారిన పడుతున్నారు. జికా ...

Read More »

సమాజసేవతోనే గుర్తింపు

పిట్లం, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సామాజిక సేవతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని ఎంపిపి రజనీకాంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు వారం రోజుల నుంచి తండాల్లో శీతాకాల శిబిరం నిర్వహించారు. ముగింపు కార్యక్రమం సందర్భంగా శనివారం ఎంపిపి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్తి దశ నుంచి సమాజ సేవాదృక్పథం అలవాడలనే ఉద్దేశంతో ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు వివిధ అంశాలపై గత వారంరోజులుగా తండా వాసులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారన్నారు. ...

Read More »

మోడల్‌ గ్రూప్స్‌ పరీక్షకు విశేష స్పందన

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పోటీ పరీక్షల శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన గ్రూప్‌-2 మోడల్‌ పరీక్షకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించిందని శిక్షణ కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి తెలిపారు. లైబ్రరీ సెమినార్‌హాల్‌తో పాటు రీడింగ్‌ రూంలో విద్యార్థులు పరీక్షలు రాశారన్నారు. ఇటువంటి మోడల్‌ పరీక్షలు అనేక అంశాల పట్ల అవగాహన, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని విద్యార్థులు చెప్పారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ శ్రీనివాసమూర్తి విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు ...

Read More »

నందిపేట మండలంలో కుక్కల బెడద

నందిపేట, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సిర్పూర్‌, అన్నారం, మారంపల్లి గ్రామాల్లో కుక్కల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారం రోజుల క్రితం మారంపల్లి గ్రామంలో కుక్కలు మేకల మందపై దాడి చేయడంతో 12 మేకలు మృతి చెందాయి. నాలుగు రోజుల క్రితం సిర్పూర్‌ గ్రామంలో 8 దూడలపై దాడిచేయడంతో నాలుగు దూడలు మృతి చెందాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజలు రోడ్డుపై నడవడానికి జంకుతున్నారు. మండల అధికారులు, గ్రామ కార్యదర్శులు స్పందించి ...

Read More »

పాఠశాలకు బెంచీల అందజేత

పిట్లం, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బోయివాడలోగల ప్రభుత్వ పాఠశాలకు లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలోబెంచీలు అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు లక్ష్మినారాయణ మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయుడు తమ పాఠశాలకు బెంచీలు అవసరముందని సూచించడంతో 50 బెంచీలు విరాళంగా అందించడం జరిగిందన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజు, బాలు, శేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

గాల్లో రెండు విమానాలు ఢీ

రోడ్డుపై వాహనాలు అదుపుతప్పి ఢీకొనడం, ప్రమాదాలు జరగడం కామన్. కానీ ఆకాశంలో విమానాలు ఢీకొన్న సంఘటనలు అరుదు. అమెరికా తీరంలో ఆకాశంలో రెండు చిన్నపాటి విమానాలు ఢీకొని సముద్రంలోకి పడిపోయాయి. లాస్ ఏంజిల్స్ హార్బర్ కు రెండు మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్టు అమెరికా కోస్ట్ గార్డ్స్,అధికారులు చెప్పారు. ఈ రెండు విమానాల్లో ఎంతమంది ప్రయాణిస్తున్నారు..చనిపోయినవారి వివరాలు తెలియరాలేదు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో లైఫ్ గార్డు బోట్ల సాయంతో డైవర్లు గాలింపు చర్యలు చేపట్టారు. విమానం రెక్క భాగాలను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ...

Read More »