Breaking News

Daily Archives: February 7, 2016

జనచైతన్యం చేస్తున్న ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌-3 ఆధ్వర్యంలో మండలంలోని మగ్గిడి గ్రామంలో శీతాకాల శిబిరాన్ని ఆదివారం 6వ రోజు నిర్వహించారు. వాలంటీర్లు గ్రామ ప్రధాన కూడళ్లలో గ్రామస్తులందరి కోసమై ఒకసాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. పరిసరాల శుభ్రత, మొక్కలు నాటడం, ఇంకుడు గుంతలు, నీటి సద్వినియోగం, మరుగుదొడ్ల నిర్మానం, కల్తీకల్లుకు దూరంగా ఉండడం, రహదారులను శుభ్రం చేసుకోవడం, రాష్ట్ర, జాతీయ సంపద గుర్తించి కాపాడుకోవడం, తదితర అంశాల గురించి పాటల ద్వారా, ...

Read More »

పెద్దగోసాయితాత విగ్రహ ప్రతిష్టాపన

ఆర్మూర్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని 5వ వార్డు రాజారాం నగర్‌ కాలనీలో బుడగ జంగం సంఘం ఆద్వర్యంలో ఆదివారం పెద్దగోసాయితాత విగ్రహ ప్రతిష్టాపన మునిసిపల్‌ ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ బబ్లు ప్రారంబించారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్‌ వన్నెల్‌దాస్‌ లత, శ్రీనివాస్‌, 7వ వార్డు కౌన్సిలర్‌ రమాకాంత్‌, బుడగ జంగాలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

లక్కీ డ్రా ద్వారా బహుమతుల ప్రదానం

ఆర్మూర్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని సవేరా (భారత్‌ గ్యాస్‌) ఆర్మూర్‌ ఏజెన్సీ ఆద్వర్యంలో వినియోగదారులకు బంపర్‌ బహుమతులు ప్రోత్సాహకంగా ఇవ్వాలని ఉద్దేశంతో 15.08.2015 నుంచి 26.01.2016 వరకు నూతనంగా గ్యాస్‌ కనెక్షన్‌ పొందిన, అదనంగా రెండు సిలిండరు పొందినవారికి కూపన్లు ఇవ్వడం జరిగిందని ఏజెన్సీ ఎండి సుమన్‌ అన్నారు. అయితే ఆదివారం గ్యాస్‌ కంపెనీ ఆవరణలో వినియోగదారుల సమక్షంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మునిసిపల్‌ ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ బబ్లు, కో ఆప్షన్‌ సభ్యుడు ...

Read More »

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

నందిపేట, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గతనెల 29వ తేదీ జీవితంపై విరక్తి చెంది మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆసుపత్రిలో మృతి చెందాడు. ఎస్‌ఐ జాన్‌రెడ్డి కథనం ప్రకారం....నందిపేట మండలం జోజిపేట గ్రామానికి చెందిన దేవన్న చిన్నమికేల్‌ (58) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గతనెల 29వ తేదీన జీవితంపై విరక్తి చెంది మనస్తాపంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్తానికులు, కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ...

Read More »

ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల శ్రమదానం

బాన్సువాడ, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ఎస్‌ఎస్‌ఎల్‌ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు శీతాకాల శిబిరంలో పాల్గొంటున్నారు. ఈ మేరకు మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో ఆదివారం వీధుల్లో శ్రమదానం చేసి రోడ్లను శుబ్రంచేశారు. వారంరోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ఇందులో భాగంగా రెండోరోజు ఆదివారం శ్రమదానం చేసినట్టు విద్యార్థులు పేర్కొన్నారు. సర్పంచ్‌ లక్ష్మి విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో శంకర్‌, సాయిలు, అనిత, లక్ష్మి, సౌందర్య తదితరులు పాల్గొన్నారు.

Read More »

విద్యార్థి జేఏసికి పలు సంఘాల మద్దతు

కామారెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరిట స్తలం రిజిస్ట్రేషన్‌ కోసం విద్యార్థి జేఏసి ఆధ్వర్యంలో చేపడుతున్న ఉద్యమానికి పలు సంఘాలు తమ మద్దతు తెలిపాయి. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు గౌరీ శంకర్‌ ఉద్యమానికి తమ మద్దతు ప్రకటించారు. ఆయనతోపాటు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పరిధిలోని గంజ్‌, కిరాణ, వర్తక సంఘం, తదితర 25 పైగా సంఘాలు ఉద్యమంలో తమ మద్దతు తెలిపాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాపాడుకోవడానికి స్థలాన్ని కళాశాల పేరిట ...

Read More »

చెరువుకట్ట వెడల్పు పనులు ప్రారంభం

కామారెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం లింగాపూర్‌ గ్రామ చెరువుకట్ట వెడల్పు పనులను ఆదివారం గ్రామ సర్పంచ్‌ నీరడి బాల్‌రాజు ప్రారంభించారు. చెరువుపై మొరం వేసి కట్ట విస్తరణ పనులు చేపట్టారు. జేసిబితో మొరం పోసి విస్తరణ పనులు చేపడుతున్నట్టు గ్రామ సర్పంచ్‌ తెలిపారు. పనులను త్వరితగతిన పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కార్యక్రమంలో తెరాస నాయకులు ఆంజనేయులు, ఉప సర్పంచ్‌ బండారి నర్సారెడ్డి, రాంరెడ్డి, బాల్‌రాజు, లింగం, బాగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Read More »

దుబాయ్ గల్లీ

-గల్ఫ్ వెళ్లిన వారి కుటుంబాల నెలవు -1958 నుంచి మొదలైన వలస -ఉన్నత స్థానాల్లో పలువురు -ఎల్లారెడ్డిలో ప్రత్యేకంగా ఓ బస్తీ ఎల్లారెడ్డి/నమస్తే తెలంగాణ;దుబాయ్ గల్లీ .. గల్ఫ్‌కు వలస వెళ్లిన వారి కుటుంబాల నెలవు.. ఆ బస్తీ వాసుల్లో ఇంటికొకరు గల్ఫ్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇసుక తిన్నెలతో ఆ గల్లీకి తరతరాల అనుబంధం ఉన్నది. ఈ గల్లీకి చెందిన వారు ఉపాధి కోసం వలస పోయారు.. కొందరు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడగా మరికొందరు కూలీలుగా, ప్లంబర్లుగా, ఎలక్ట్రీషియన్లుగా ఎడారి దేశాల్లో విధులు నిర్వర్తి ...

Read More »

జీరో పేరుతో టోకరా..

ఆర్మూర్ టౌన్ : నా కూతురు నసీమాబేగం, తహసీన్ ఆధార్‌కార్డు, ఫొటోల జిరాక్స్‌లు జీరో అకౌంట్ కోసం తీసుకున్నారు. ఇప్పుడు బ్యాంక్‌కు వెళ్లి చూస్తే సమీర్ మహిళా సంఘం పేరిట రూ.5 లక్షలు తీసుకున్నట్లు ఉంది. అందులోంచి రూపాయి కూడా తీసుకోలేదు అని ఆర్మూర్ పట్టణంలోని కమలానెహ్రూకాలనీకి చెందిన షహజదీ శనివా రం మున్సిపల్, మెప్మా అధికారుల ఎదుట తమ గో డు ను వెల్లబోసుకుంది. మెప్మా రిసోర్స్‌పర్సన్లుగా ఉన్న త ల్లీకూతుళ్లు ఫహిమా, సమ్రీన్‌లు రూ.1.60 కోట్ల రు ణం తీసుకున్న వ్యవహారం ...

Read More »

కొండపై కొలువైన అన్నపూర్ణేశ్వరీ

సిరికొండ :మండలంలోని పెద్ద వాల్గోట్ సమీపంలో ఎత్తైన గుట్టపై వెలిసిన అన్నపూర్ణేశ్వరీ అమ్మవారు భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్నా రు. ఈనెల 7 నుంచి రెండు రోజుల పాటు గుట్టపై న జాతర, ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అన్నపూర్ణ మాత కొలువైన ఆ గుట్టకు బోడగుట్ట అని పేరు. 200 ఏళ్ల క్రితం ఓ మహర్షి తపస్సు చేసి గుట్టపైన అమ్మవారి ఆలయా న్ని నిర్మించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలిసింది. ఆ గుడికి ...

Read More »

బ్యాంకు అధికారులమని చెప్పి ఆన్‌లైన్ మోసం

భీమ్‌గల్ : హలో.. మేం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం.. ఒక్క సారి మీ ఏటీఎం పిన్ నంబర్ చెపుతా రా.. మీ బ్యాంకు ఖాతా వివరాలు సరి చేయాల్సి ఉంది. లేకుంటే మీ ఖాతా బ్లాక్ అవుతుంది.. అని ఫోన్ చేసి ఏటీఎం పిన్ నంబర్ చెప్పిన క్షణాల్లోనే రూ.30 వేలు కాజేసిన సంఘటన శనివారం భీమ్‌గల్‌లో వెలుగు చూ సింది. తన ఖాతా నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఫోన్ కు మెసేజ్ రావడంతో తేరుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అంతలోపే ఖాతాలో ఉన్న ...

Read More »

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల పరిరక్షణకు మద్దతు

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల పరిరక్షణకు మద్దతు కోరుతూ శనివారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆయా పార్టీల నాయకులు, ప్రతినిధులను కలిశారు. విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ఉస్మాన్‌, పట్టణాధ్యక్షుడు నజీరుద్దీన్‌ విశ్రాంత ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు భద్రయ్యను కలిశారు. ఏళ్ల నాటి ఘన చరిత్ర కలిగిన కళాశాల ఆస్తులపై కొందరు వ్యక్తులు కన్నేశారన్నారు. 259 ఎకరాలను వెంటనే ప్రభుత్వం పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలన్నారు. తద్వారా యూజీసీ నిధుల ...

Read More »

ప్రవక్త జీవితం స్ఫూర్తిదాయకం

నిజామాబాద్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: మంచి నడవడికతో మనగడ సాగించిన ప్రవక్త జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని పలువురు మతపెద్దలు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ఖిల్లా ఈద్గాలో తబ్లిక్‌ ఇస్తెమా ఆధ్యాత్మిక సదస్సు నిర్వహించారు. పలువురు మతపెద్దలు ప్రవచనాలు చేశారు. ఇస్లాం వ్యవస్థాపకుడు ప్రవక్త ఆదర్శ జీవితాన్ని ఆచరించాలన్నారు. తన నియమాలను పాటించి సహచరులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావొద్దని అల్లాను కోరుకున్నారన్నారు. దేవుని కృపకు పాత్రులు కావాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లిం సోదరులతో సదస్సు ప్రాంగణమంతా సందడిగా మారింది.

Read More »

గువహటీ హాకీ టోర్నీకి యెండల సౌందర్య

నిజామాబాద్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: గువహటీలో ఈ నెల 7 నుంచి 14 వరకు జరగనున్న అంతర్జాతీయ స్థాయి హాకీ టోర్నీకి ఇందూరు హాకీ క్రీడాకారిణి యెండల సౌందర్య భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. ఈ టోర్నీలో ఇండియా, శ్రీలంక, నేపాల్‌ జట్లు తలపడుతున్నాయి. లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో పోటీలు జరగనున్నాయి. టోర్నీలో పోటీపడేందుకు యెండల సౌందర్య ఇప్పటికే గువహటీ చేరుకుంది.

Read More »

జీహెచ్‌ఎంసీ ఫలితాలు దేశ రాజకీయాల్లో సంచలనం

తెవివి క్యాంపస్‌, (డిచ్‌పల్లి, న్యూస్‌టుడే): హైదరాబాద్‌ గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ సాధించిన విజయం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయని జిల్లా టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు చింత మహేష్‌ అన్నారు. తెవివిలో శనివారం విలేకరుల సమావేశంలో చింత మహేష్‌ మాట్లాడుతూ… జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో టీఆర్‌ఎస్‌ పార్టీకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్వీ వర్సిటీ అధ్యక్షుడు మహేష్‌, జాగృతి అధ్యక్షులు సాయికుమార్‌, నాయకులు రవి, మోహన్‌, లింబాద్రి, వెంకటేశ్‌ తదితరులు ఉన్నారు.

Read More »

మహిళా కోర్టు ప్రారంభించిన హైకోర్టు జడ్జి

నిజామాబాద్‌ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహిళా కోర్టును శనివారం హైకోర్టు జడ్జి, జిల్లా పోర్టుపోలియో న్యాయమూర్తి సత్యనారాయణ మూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతీ జిల్లాలో మహిళల కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఐపీసీ 376, 354 సెక్షన్లకు సంబంధించిన కేసులను ప్రస్తుతం విచారణ చేపట్టి తర్వాత పరిధిని పెంచనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 155 కేసులు మహిళలకు సంబంధించినవి ...

Read More »

29లోగా పంట రుణాలు నవీకరించుకోవాలి

ఇందూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం ప్రకటించిన శూన్య వడ్డీ పొందడానికి రైతులు పంట రుణాలు నవీకరించుకోవాలని (రెన్యూవల్‌) చేసుకోవాలని నిజామాబాద్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు అంతరెడ్డి రాజారెడ్డి, కార్యదర్శి సంతోష్‌ తెలిపారు. శనివారం సొసైటీలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. నిజామాబాద్‌ సొసైటీ ద్వారా పంట రుణాలు పొందిన సభ్యులు ఈ నెల 29లోగా నవీకరించుకోవాలని సూచించారు. ప్రస్తుతం కరవు పరిస్థితిలో ఖరీఫ్‌, రబీ పంటలు లేక అల్లాడుతున్న రైతులకు ఇది ఉపయోగపడుతుందన్నారు. కరవు నేపథ్యంలో ప్రజలకు సొసైటీల ద్వారా ...

Read More »

కమీషన్లకు ప్రైవేటులో ప్రసవాలు

డిచ్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే : ‘నవీపేట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ కార్యకర్తలు సమ్మెలో ఉన్నప్పుడు డిసెంబరు నెలలో 31 ప్రసవాలు జరిగాయి. సమ్మె విరమించిన అనంతరం జనవరిలో 13 మాత్రమే అయ్యాయి. ఇక్కడ ప్రసవాలు పెరగాల్సింది పోయి తగ్గింది. ఎందుకని పరిశీలిస్తే…గర్భిణులను వైద్య సిబ్బంది ప్రైవేటు ఆస్పత్రులకు పంపించి కమీషన్లు తీసుకున్నట్లు స్పష్టమయ్యింది. జిల్లా వ్యాప్తంగా నిఘా పెట్టినాం. ఇలా చేసేవారు ఎక్కడ దొరికినా జైలుకు పంపిస్తానని..’ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితారాణా హెచ్చరించారు. గర్భిణులకు ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగే విధంగా ...

Read More »

కానిస్టేబుళ్ల కార్ఖానా..!

గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన యువతీ, యువకులకు పోలీస్‌ ఉద్యోగాలను సాధించాలనే తపన ఉన్నా.. అందుకు కావాల్సిన శిక్షణ తీసుకునే స్థోమత లేనివారికి ఉచితంగా పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు ఓ పోలీస్‌ ఉన్నతాధికారి. ఆయనే బీర్కూర్‌ మండలంలోని రైతునగర్‌ గ్రామానికి చెందిన పాలేటి సత్యనారాయణ. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ నగర ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. తన మిత్రుల సహకారంతో ‘జన్మభూమి’ స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఉచిత శిక్షణకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లో నగర అసిస్టెంట్‌ కమిషనర్‌ ...

Read More »

బయోమెట్రిక్‌ యంత్రం…మరమ్మతుల్లో జాప్యం…

హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడం..ఆపై వాటి వూసెత్తక పోవడం పరిపాటిగా మారింది. అధికారులు, సిబ్బంది పనితీరులో మార్పు తీసుకురావడానికి…ప్రభుత్వ పథకాల అమలులో అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా బయోమెట్రిక్‌ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చినా.. వాటి బాగోగులు చూసే యంత్రాంగం లేకుండా పోవడంతో రూ.లక్షల విలువైన యంత్రాలు మూలనపడుతున్నాయి. వసతిగృహాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో తరచుగా సమస్యలు వస్తున్నాయి. పింఛను, ఉపాధి హామీ పథకం కూలీలకు చెల్లింపులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కేవలం మరమ్మతులు చేస్తే అమల్లోకి వచ్చే యంత్రాలకు నిర్లక్ష్యం జబ్బు పట్టుకుంది. యంత్రాలు కొనడానికి చూపించిన ఉత్సాహం..వాటిని ...

Read More »