Breaking News

Daily Archives: February 8, 2016

19న విజిలెన్సు మానిటరింగ్‌ కమిటీ సమావేశం

  నిజామాబాద్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 19వ తేదీన ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్‌, ప్రగతిభవన్‌లో నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత అధ్యక్షతన విజిలెన్సు, మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది, గ్రామీణ తాగునీటి సరఫరా, గిరిజన సంక్షేమం, జాతీయ గ్రామీణ ఉపాది హామీ, భూభారతి, విద్యుత్‌ తదితర రంగాల్లో చేపట్టిన పనులను ఈ సమావేశంలో సమీక్షించనున్నట్టు తెలిపారు.

Read More »

ఇంగ్లీషులో మెళకువలపై తెవివిలో ప్రసంగం

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పోటీ పరీక్షల శిక్షణ కేంద్రం ఆద్వర్యంలో సోమవారం మధ్యాహ్నం ఇంగ్లీషులో మెళకువలు అనే అంశంపై ప్రసంగ కార్యక్రమం నిర్వహించారు యూనివర్సిటీ లైబ్రరీలో నిర్వహించిన కార్యక్రమంలో విశ్రాంత ఆంగ్ల ఉపన్యాసకులు భుజంగం ప్రసంగించారు. ఇంగ్లీషులో నైపుణ్యం సాధించేందుకు అవసరమైన మెళకువల్ని గురించి ఆయన వివరించారు. టిఎస్‌పిఎస్‌సి గ్రూప్‌-2 పోటీ పరీక్షలో ఇంగ్లీషు ప్రాధాన్యత గురించి భుజంగం విద్యార్థులకు వివరించారు. మంగళవారం నిర్వహించే కార్యక్రమంలో పోటీ పరీక్షల రంగంలో ప్రముఖ ఉపన్యాసకుడు ...

Read More »

1908 అంగన్‌వాడి కేంద్రాలకు స్వంత భవనాలు

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తూ, గ్రామాల్లో మౌలిక వసతులను అభివృద్ది పరచాలనే సంకల్పంతో 1908 అంగన్‌వాడి కేంద్రాలకు స్వంత భవనాలు నిర్మించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. జిల్లాలో మొత్తం 2708 అంగన్‌వాడి కేంద్రాలుంటే, 800 కేంద్రాలు స్వంత భవనాల్లో నడుస్తున్నాయన్నారు. స్వంత భవనాలు లేని 1908 అంగన్‌వాడి కేంద్రాలకు స్వంత భవనాలు నిర్మించేందుకు స్థలాల సేకరణకై ...

Read More »

డయల్‌ యువర్‌ ఎస్పీకి 23 ఫిర్యాదులు

  నిజామాబాద్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ ఎస్పీకి నేడు 23 ఫిర్యాదులు వచ్చినట్టు జిల్లా పోలీసు శాఖాధికారి వెల్లడించారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆద్వర్యంలో డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమం ఎస్‌పి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌, కామారెడ్డి, ఆర్మూర్‌, బోధన్‌ సబ్‌ డివిజన్‌ పరిధి నుంచి వివిధ రకాల సమస్యలపై మొత్తం 23 ఫిర్యాదులు వచ్చినట్టు ...

Read More »

మధ్యాహ్నభోజనం సక్రమంగా నిర్వహించాలి

  బోధన్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాలలో మధ్యాహ్న భోజనం పట్ల నిర్లక్ష్యం వహించడంపై విద్యార్థులు అనేక సమస్యలకు గురవుతున్నారని బిజెవైఎం అధ్యక్షుడు కమలాకర్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం డిప్యూటి డిఇవో కార్యాలయంలోని సిబ్బందికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ బోధన్‌ డివిజన్‌లోని అనేక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో లోపాల వల్ల చిన్నారులు అనారోగ్యాల పాలవుతున్నారని, సంబంధిత అధికారులు బోజన ఏజెన్సీ నిర్వాహకులకు తగిన అవగాహన కల్పించాలని అన్నారు. మధ్యాహ్న భోజనం పట్ల నిర్లక్ష్యం ...

Read More »

ప్రతినెల 8న అక్షరదానం – మహాదానం

  కమ్మర్‌పల్లి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం సాక్షరభారతి ఆధ్వర్యంలో విద్యార్థులతో అక్షరదానం-మహాదానం కార్యక్రమంపై ర్యాలీలు నిర్వహించారు. మండలంలోని నాగాపూర్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మండల కో ఆర్డినేటర్‌ ఎం.డి.సాజిద్‌ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండలంలోని 12 గ్రామాల్లో సర్పంచ్‌లు, విద్యాకమిటీలు, గ్రామ జ్యోతి కమిటీల ఆధ్వర్యంలో అక్షరదానం-మహాదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈనెల 15వ తేదీ నుంచి వయోజన విద్యా కేంద్రాలు ప్రారంభించాలన్న కలెక్టర్‌ ఆదేశాల మేరకు గ్రామాల్లో ...

Read More »

ప్రజావాణి సద్వినియోగం చేసుకోని ప్రజలు

  రెంజల్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రజల సమస్యలు నేరుగా పరిష్కరించేందుకు ప్రతి సోమవారం తహసీల్‌ కార్యాలయంలో మండలంలోని అన్ని శాఖల అధికారుల సమక్షంలో ప్రజావాణి నిర్వహిస్తారు. ఇందులో ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా అధికారుల ద్వారా పరిష్కరించుకోవచ్చని, అయినా కూడా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. ప్రతి సోమవారం లాగే తహసీల్దార్‌ వెంకటయ్య ఆద్వర్యంలో నిర్వహించిన ప్రజావానికి పలు శాకల అధికారులు హాజరైనా కూడా ఒక్క పిర్యాదు కూడా రాకపోవడంతో అధికారులు నివ్వెరపోతున్నారు. ఇకనైనా ...

Read More »

మంగళవారం నుంచి జగదాంబదేవి జాతర

  కమ్మర్‌పల్లి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బషీరాబాద్‌ గ్రామంలో జగదాంబదేవి జాతర ఉత్సవాలు మంగళవారం నుంచి 13వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణపంతులు తెలిపారు. గ్రామకమిటీ, ప్రవాస భారతీయులు, పోలీసు విద్యాసాగర్‌, దాతల సహకారంతో 9వతేదీ దేవిదీక్షతో జాతర ఉత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు. 10వ తేదీన పల్లకిసేవ, 11న అభిషేకం, పూర్ణాహుతి, 12వ తేదీన జాతర ఉంటాయని పేర్కొన్నారు. సామూహిక కుంకుమార్చన, రథోత్సవం, అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని, అదేవిధంగా 13వ తేదీన వసంతోత్సవం, ...

Read More »

సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమం కొనసాగిస్తాం

  రెంజల్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు సోమవారం రెంజల్‌ మండల కేంద్రంలోని పాఠశాల ముందు బోధన సిబ్బంది ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని, 10వ పిఆర్‌సిని వెంటనే అమలుపరిచి సర్వీసు రూల్సును వెంటనే విడుదల చేయాలని, అలాగే తెలంగాణ ఇంక్రిమెంటు 010 అకౌంట్‌ ద్వారా వేతనాలు చెల్లించి, ఆరోగ్య కార్డులు అమలు పరచాలని ఉపాధ్యాయులు ధర్నా కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ...

Read More »

నులి పురుగులను నిర్మూలిద్దాం

  సదాశివనగర్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నులిపురుగుల నివారణ కోసం చిన్నారులందరికి, 19 సంవత్సరాలలోపు పిల్లలందరికి ఉచితంగా మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందని డాక్టర్‌ దివ్య అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం ఫిబ్రవరి 10వ తేదీన నిర్వహించడం జరుగుతుందన్నారు. నులిపురుగులు కలిగి ఉన్న పిల్లలు అనేక హానికరమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారన్నారు. రక్తహీనత, పోషకాహార లోపం ఆకలి లేకపోవుట, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు, మలంలో రక్తం తదితర అనారోగ్య ...

Read More »

డయల్‌ యువర్‌ ఎస్పీకి 23 ఫిర్యాదులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ ఎస్పీకి నేడు 23 ఫిర్యాదులు వచ్చినట్టు జిల్లా పోలీసు శాఖాధికారి వెల్లడించారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆద్వర్యంలో డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమం ఎస్‌పి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌, కామారెడ్డి, ఆర్మూర్‌, బోధన్‌ సబ్‌ డివిజన్‌ పరిధి నుంచి వివిధ రకాల సమస్యలపై మొత్తం 23 ఫిర్యాదులు వచ్చినట్టు చెప్పారు. ...

Read More »

ప్రజావాణికి 6 ఫిర్యాదులు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం తహసీల్‌ కార్యాలయంలో నిర్వహించే మండల స్తాయి ప్రజావాణి ఈ వారం కూడా కొనసాగింది. ఇందులో తహసీల్దార్‌ శ్రీధర్‌ ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 6 ఫిర్యాదులు వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. అందులో ఆహారభద్రత కార్డుల కోసం 2 ఫిర్యాదులు, ఆన్‌లైన్‌ పహాణీకి సంబంధించి 2 పిర్యాదులు, ఒకటి మీ సేవా ద్వారా పింఛన్‌కోసం, సీతమ్మ అనే వృద్దురాలు తన నలుగురు కుమారులు తన బాధ్యతను తీసుకోకపోవడంతో ఆమెను వృద్దాశ్రమంలో చేర్చినట్టు పేర్కొన్నారు.

Read More »

కేసుల నమోదే… చర్యలు లేవు!

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ సిటీ : గత సంవత్సరం నుంచి రైస్‌ మిల్లర్ల వద్ద ఉన్న కస్టం మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌)ను అధికారులకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న వారిపై చర్యలకు వెనుకడుగు వేస్తున్నారు. క్రిమినల్‌ కేసులు నమోదు, రెవెన్యూ రికవరి యాక్టు అమలు చేస్తామని చెబుతున్న అధికార యంత్రాగం కఠిన చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. అధికారుల ఉదాసీనతతో మిల్లర్లు బియ్యం ఇవ్వడంలో మరింత జాప్యం చేస్తున్నారు. గత ఖరీఫ్‌ సీజన్‌లో ఎనిమిది మంది మిల్లర్ల నుంచి 3,035 మెట్రిక్‌ టన్నుల బియ్యం రావాల్సి ఉండగా ఇప్పటికీ ...

Read More »

నీటి సమస్య తీరేదెన్నడో..?

నవీపేట గ్రామీణం, న్యూస్‌టుడే: నవీపేట మండలంలోని లింగమయ్యగుట్ట కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. కాలనీ ఏర్పాటు చేసి ఏళ్లు గడిచిన నీటి కోసం 50కి పైగా కుటుంబాలవారు నిత్యం అవస్థలు పడాల్సి వస్తోంది. నీటిట్యాంకు నిర్మాణం చేపట్టాలని పలుమార్లు ఆందోళనలు చేపట్టిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇటీవల బోరుబావి వేసిన కొన్ని కుటుంబాలకు మాత్రమే నీరు సరిపోతోంది. ప్రధాన నీటి పైపుకు 12 కుటుంబాల వారు పైపులు ఏర్పాటు చేసుకుని నీటిని వినియోగించుకుంటున్నారు. నీటి సమస్యకు పరిష్కరం చూపాలని కాలనీవాసులు కోరారు.

Read More »

శ్రీచక్రేశ్‌వర ఆలయ వార్షికోత్సవానికి శాస్త్రీయ శోభ

బోధన్‌ పట్టణం, న్యూస్‌టుడే : బోధన్‌ పట్టణంలోని చారిత్రక శ్రీచక్రేశ్వర శివ మందిరం 57వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు అలరించాయి. ఆలయ ప్రాంగణంలో ఆదివారం రాత్రి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకు అవకాశం కల్పించారు. బోధన్‌ సహా జిల్లా కేంద్రం నుంచి భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు చేయడానికి విద్యార్థులు తరలివచ్చారు. ఆలయంలో ఏర్పాటు చేసిన వేదికపై చిన్నారులు ఇచ్చిన నృత్య ప్రదర్శనలతో ఆలయానికి శాస్త్రీయ శోభ సంతరించుకుంది. అతిథులు, వీక్షకులను చిన్నారుల శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నాలుగు రోజులుగా వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ...

Read More »

బోధన్‌కు చేరిన సైకిల్‌యాత్ర

బోధన్‌ పట్టణం, న్యూస్‌టుడే: అన్ని మతాల సారం ఒక్కటేనని… పరస్పరం గౌరవించుకోవాలని సైకిల్‌ యాత్రికుడు గౌరీశంకర్‌ పిలుపునిచ్చారు. గోదావరి ఒడున్న ఉన్న ప్రాంతాల మీదుగా ఆయన చేపట్టిన సైకిల్‌యాత్ర ఆదివారం బోధన్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో కలిసి మాట్లాడుతూ తన యాత్ర ముఖ్య ఉద్దేశాన్ని తెలిపారు. కుల, మత, జాతి భేదాలు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. గోదావరి జన్మస్థానమైన నాసిక్‌ నుంచి నది ఉత్తర ఒడ్డున తీరం మొత్తం పర్యటించి, నది సముద్రంలో కలిసే దక్షిణ ...

Read More »

హక్కుల సాధనకు పనిచేయాలి

బోధన్‌ పట్టణం, న్యూస్‌టుడే: రాజ్యాంగ బద్ధంగా సంక్రమించాల్సిన హక్కుల సాధన కోసం కార్యకర్తలు పనిచేయాలని టీఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు డప్పుల చంద్రయ్య పిలుపునిచ్చారు. బోధన్‌ 24వ వార్డులో నూతనంగా ఏర్పాటైన కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎమ్మార్పీఎస్‌ను వార్డుల్లో బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు విద్యాసాగర్‌, పట్టణ అధ్యక్షుడు మారయ్య, ప్రధాన కార్యదర్శి పెద్దింటి సురేష్‌, కోశాధికారి ఈరపురం చిన్నపోశెట్టి, నూతన కమిటీ అధ్యక్షుడు నాగారం సాయిలు, ప్రధాన కార్యదర్శి లింగం, ఉపాధ్యక్షుడు గైని ...

Read More »

అద్దె బస్సులను రద్దు చేయాలి

ఇందూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి కొత్త బస్సుల కొనుగోలుకు, ఇతర అవసరాలకు రూ.500 కోట్ల బడ్జెట్‌ కేటాయించి అద్దె బస్సులను రద్దు చేయాలని టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌, వర్కర్స్‌ ఫెడరేషన్‌(ఎస్‌డబ్ల్యూఎఫ్‌) డిమాండ్‌ చేసింది. ఆదివారం ఈ మేరకు సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శంకర్‌, సంజీవ్‌ మాట్లాడారు. విచ్చలవిడిగా అద్దె బస్సులను పెంచి ప్రైవేటీకరణకు కుట్రపన్నారని ఆరోపించారు. డ్రైవర్లకు డ్యూటీలు దొరకక ఇబ్బందులు పడుతున్నారని, అడ్డాల మీదా కూలీ బతుకులు అవుతున్నాయన్నారు. తక్షణమే అద్దె బస్సులను రద్దు ...

Read More »

సీపీఎస్‌ విధానం ఎత్తేసి పాత పింఛన్‌ విధానం అమలు చేయాలి

నిజామాబాద్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగులకు కొత్తగా అమలు చేస్తున్న కాంట్రిబ్యూటరీ పింఛన్‌ స్కీమ్‌ను ఎత్తేసి పాత పింఛన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని సీపీఎస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని కేర్‌ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఎస్‌ విధానంతో ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ తర్వాత పింఛన్‌ పొందలేరన్నారు. అలాగే వారి ఖాతాలో జమైన మొత్తం నుంచి వారి పిల్లల చదువులకు తదితర అవసరాలకు రుణాలు తీసుకునే అవకాశం లేక ...

Read More »

పసుపు రైతుకు పానీ తిప్పలు

కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ : పసుపు పంటకు నీటి గండం పట్టుకుంది. చేతికొచ్చిన పంటను కాపాడుకొనేందుకు రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. మరోవైపు బోరు బావులు ఎత్తిపోవడంతో దిగుబడి గణనీయంగా తగ్గింది. కమ్మర్‌పల్లి మండలంలో సుమారు 1600 హెకార్టల్లో పసు పు పంట వేశారు. ఎకరానికి సుమారు 25 వేల రూపాయల వ రకు ఖర్చు పెట్టి సాగు చేస్తున్న రైతన్నకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ఏడాది నిరాశజనకంగా వర్షపాతం నమోదు కావడం తో పంట తవ్వేందుకు కూడా సరిపడా నీళ్లు లేని ...

Read More »