Breaking News

Daily Archives: February 9, 2016

డిమాండ్‌ లేని టమాట…

  నందిపేట, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల రైతులు ప్రతి రబీ సీజన్‌లో ఎర్రజొన్న, సజ్జ పంటలు సాగుచేసేవారు. భూగర్భజలాలు ఇంకిపోవడంతో పంటకు వారానికి ఒకసారి నీరు అందించే టమాట పంటవైపు మొగ్గుచూపారు. గతంలో పెట్టె టమాట ధర రూ. 900 నుంచి వెయ్యి వరకు పలికేది. పెట్టెలో 20 నుంచి 30 కిలోల టమాటలు ఉంటాయి. ఈ విషయాన్ని దృస్టిలో ఉంచుకొని రైతులు టమాట పంట ఎక్కువ సాగుచేశారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో ధర భారీగా ...

Read More »

నులిపురుగుల నివారణకు మాత్రలు వేసుకోవాలి

  నందిపేట, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులు నులి పురుగుల నివారణ చేయాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ప్రధానోపాధ్యాయులు మహేందర్‌రెడ్డి, వైద్యులు రాజ్‌కుమార్‌, అమృత్‌రెడ్డి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ శుభ్రత, నోటి రక్షణ, దంత రక్షణ, ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించారు. 19 సంవత్సరాలలోపు వారందరు నులిపురుగుల నివారణకు మాత్రలు తప్పకుండా వేసుకోవాలని, ప్రభుత్వం ఉచితంగా పంపినీ చేస్తుందని తెలిపారు.

Read More »

పెండింగ్‌ బిల్లులు సత్వరమే విడుదల చేయాలి

  ఆర్మూర్‌, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని, వేతనాలు విధులకు అనుగుణంగా పెంచాలని, గుడ్డుకు అదనంగా బడ్జెట్‌ కేటాయించాలని కోరుతూ తెలంగాణ జిల్లాల మధ్యాహ్న భోజన ఏజెన్సీల సంఘం ఆర్మూర్‌ వారు మంగళవారం ఎంఇవో రాజాగంగారాంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో వేలాది మంది మధ్యాహ్న భోజన నిర్వాహకులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఒక పక్క బిల్లులు సకాలంలో అందక కార్మికులు అప్పులు చేసి పథకాన్ని నిర్వహిస్తూ అనేక ...

Read More »

కళాశాల భూముల రిజిస్ట్రేషన్‌కై పోరాటం ఉదృతం

  కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములను కళాశాల పేరిట రిజిస్ట్రేషన్‌ చేసేందుకు విద్యార్తులు ఉద్యమాన్ని ఉదృతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పిడిఎస్‌యు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయ అతిథి గృహంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డి డిగ్రీ కళాశాల భూముల పరిరక్షణ కోసం ఏడాది క్రితం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టామన్నారు. దాని ఫలితంగా ప్రభుత్వం భూములను తమ ఆధీనంలోకి తీసుకుందన్నారు. ముఖ్యమంత్రి కళాశాల ...

Read More »

కామారెడ్డి కోర్టులో స్వచ్ఛభారత్‌

  కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కోర్టు ఆవరణలో మంగళవారం స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. మైవిలేజ్‌ – మోడల్‌ విలేజ్‌ ఫౌండేషన్‌ ఆద్వర్యంలో కార్యక్రమం చేశారు. కామారెడ్డి సబ్‌ కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి జైరాజ్‌, జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ శీతల్‌లు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ వాలంటీర్లు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు, న్యాయవాదులు కోర్టు ఆవరణలోని చెత్త, చెదారం తొలగించి శుభ్రం చేశారు. పిచ్చిమొక్కలను తొలగించారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం తోపాటు పరిసరాలను కూడా ...

Read More »

బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమకు సంబంధించిన బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని కామారెడ్డి బల్దియా కార్మికులు మంగళవారం మునిసిపల్‌ ఇన్‌చార్జి కమీషనర్‌ పఠాభికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కార్మికులకు బకాయి ఉన్న రెండునెలల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. యూనిఫాం, సబ్బులు, నూనెలు, పనిముట్లను ఇవ్వాలని కోరారు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సాయిరాం, ...

Read More »

షబ్బీర్‌ను కలిసిన విద్యార్థి జేఏసినాయకులు

  కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలం విషయమై శాసనమండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీని మంగళవారం కామరెడ్డి విద్యార్థి జేఏసి నాయకులు హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరిట స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయకపోవడంతో కళాశాలకు న్యాక్‌ గుర్తింపు, యుజిసి నిధులు రావడం లేదన్నారు. గత 12 రోజులుగా ఈ విషయమై తాము ఉద్యమం చేస్తున్నా ఎలాంటి స్పందన లభించలేదని ఆవేదన ...

Read More »

‘చీప్‌’ లిక్కరు దొంగలు

 నిజామాబాద్‌ నేరవార్తలు : ఏటీఎం దొంగలు.. గొలుసు దొంగలు.. దోపిడీ దొంగల ముఠాలు మొన్నటి వరకు అలజడి సృష్టించాయి. కరవు పుణ్యమా అని తాజాగా మద్యం దొంగలు తెరపైకి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మద్యం దుకాణాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఒక ముఠా జిల్లాలోనూ చోరీకి పాల్పడింది. కేవలం చీప్‌ లిక్కరును మాత్రమే అపహరించుకెళ్తున్న ఈ ముఠా హైదరాబాద్‌కు చెందినదిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ముఠా రాష్ట్రంలో దాదాపు 15 చోట్ల చోరీలు చేసినట్లు అనుమానం. డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి గ్రామ ...

Read More »

టియు శిక్షణ కేంద్రంలో భారతరాజ్యాంగ వ్యవస్థపై చైతన్యదేవ్‌ ప్రసంగం

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పోటీ పరీక్షల శిక్షణా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ప్రసంగ కార్యక్రమంలో భారత రాజ్యాంగ వ్యవస్థపై ప్రముఖ ఉపన్యాసకులు చైతన్యదేవ్‌ మాట్లాడారు. మూడున్నర గంటల పాటు సాగిన ఈ ప్రసంగంలో అనేకఅంశాలు చక్కగా విశ్లేషించినట్టు కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ పరీక్షల్లో భారత రాజకీయ వ్యవస్థకు సంబంధించిన అంశాల్ని ఏవిధంగా అధ్యయనం చేయవలసి ఉంటుందన్నది వివరించారు. విధ్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ...

Read More »

మహిళా ప్రాంగణానికి పూర్వ వైభవం

  – జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఆర్మూర్‌, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దుర్గాబాయి మహిళ శిశు వికాస కేంద్రంలో మౌలిక వసతుల మరమ్మతులకు ప్రభుత్వం రూ.41.50 లక్షల నిదులు మంజూరు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా తెలిపారు. అవసరమైతే అదనపు నిధులు మంజూరు చేసి ఏకకాలంలో 500 మందికి శిక్షణ ఇచ్చే సదుపాయాలు కల్పించనున్నట్టు తెలిపారు. మంగళవారం పెర్కిట్‌లో నిర్వహించిన దుర్గాబాయి మహిళ శివు వికాస కేంద్రం సలహా కమిటీ సమావేశానికి జిల్లా కలెక్టర్‌ ...

Read More »

రూ.2 లక్షల విలువ గల గుట్కా స్వాధీనం

కామారెడ్డి, న్యూస్‌టుడే: కామారెడ్డిలో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కిరాణ దుకాణాలు, పాన్‌దుకాణాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పట్టణ సీఐ శ్రీనివాస్‌రావు నేతృత్వంలో ఎస్సైలు సంతోష్‌, శోభన్‌లు, సిబ్బంది మూడు విభాగాలుగా ఆయా ప్రాంతాల్లో తనిఖీలు జరిపారు. 20 వరకు దుకాణాల్లో నిల్వ ఉన్న గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సరకు విలువ రూ.2 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. అనంతరం స్టేషన్‌ ఆవరణలో గుట్కా ప్యాకెట్లను ఒకచోట వేసి దహనం చేశారు. స్వాధీనం చేసుకున్న దుకాణాల యజమానులకు పట్టుబడిన ...

Read More »

కొండూరు ఎత్తిపోతల పథకానికి మహర్ధశ

నందిపేట, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం 2 కోట్ల 76 లక్షలు కొండూరు ఎత్తిపోతల పథకానికి మంజూరు చేస్తూ జీవో జారీచేయడం జరిగింది. దీంతో పథకం పనులు ప్రారంభమవుతున్నాయి. సి.హెచ్‌.కొండూరు, ఉమ్మెడ గ్రామాలను కలిపి 3600 ఎకరాల భూమికి సాగునీరు అందించే ఉద్దేశంతో ఈ పథకం మంజూరు చేసినట్టు ఛైర్మన్‌ రాజు తెలిపారు. నిధులను పంపు, ప్యానెల్‌ బోర్డు, ఎన్‌టెక్స్‌ పైప్‌లైన్‌, ర్యాంపు, మరమ్మతులకు వెచ్చించనున్నట్టు,టెండరు ప్రక్రియ పూర్తయిందని, పనులు 20 రోజుల్లో ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ...

Read More »

మధ్యాహ్నభోజనం వికటించి విద్యార్థుల అస్వస్థత

బిచ్కుంద,: బిచ్కుంద ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం మధ్యాహ్నభోజనం వికటించి 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాంతులు చేసుకోవడంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి వీరిని తరలించారు. సోమవారం పాఠశాలలో 226 మందికి గాను 200 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చక్రవర్తి తెలిపారు. అందులో 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 9 మంది ...

Read More »

ఉచిత కంటివైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

  పిట్లం, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల ప్రజలు ఉచిత కంటివైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు లక్ష్మినారాయణ అన్నారు. మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ వైద్యులు డాక్టర్‌ మల్లేశ్‌ 31 మందికి కంటి వైద్య పరీక్షలు చేశారు. ఇందులో 11 మందికి మోతిబిందు ఉన్నట్టు గుర్తించారు. అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ క్లబ్‌ ఆద్వర్యంలో ప్రతి మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని, మండల ...

Read More »

మాఘ మాసం.. మంచి ముహుర్తం

నిజామాబాద్‌ సాంస్కృతికం: మాఘమాసం అరుదైన సందర్భం. రెండు జీవితాలు ఒక్కటైయ్యే వివాహ సంబరం. శుభకార్యాలకు మంచి ముహూర్తం. నెలరోజుల పాటు నిశ్చితార్థాలు, పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుట్టనున్నారు. మంగళవారం నుంచి మార్చినెల మొదటివారం వరకు జిల్లావ్యాప్తంగా సందడి నెలకొననుంది. ఈనెల 13న వసంత పంచమి, 14న రథసప్తమి, 22న మాఘపౌర్ణమి పర్వదినాలను ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు చేయనున్నారు. కల్యాణ మండపాలు, ఇళ్ల ప్రాంగణాలు కళకళలాడనున్నాయి. పురోహితులు, క్యాటరింగ్‌, బ్యాండ్‌మేళాలు, టెంట్‌హౌజ్‌ నిర్వాహకులు బిజీగా మారనున్నారు.

Read More »

తెలంగాణ చరిత్ర గొప్పది

నిజామాబాద్‌ విద్యావిభాగం: తెలంగాణకు 400 ఏళ్ల చరిత్ర ఉందని, ఎంతో గొప్పదని ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్‌ వెంకటేశ్వర్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ చరిత్రపై కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని పేర్కొన్నారు. నిజాం కట్టడాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు పురాతన కాలం నుంచి చెక్కు చెదరకుండా ఉన్నాయన్నారు. ప్రత్యేక రాష్ట్రం నుంచి ఎన్నో ఉద్యమాలు 60 ఏళ్లుగా కొనసాగాయని గుర్తుచేశారు. అనంతరం నిజామాబాద్‌ ...

Read More »

ప్రతీ అంగన్‌వాడీ భవనానికి రూ. 8 లక్షల నిధులు

ఇందూరు: జిల్లా ప్రతీ అంగన్‌వాడీ భవన నిర్మాణానికి రూ. 8 లక్షల చొప్పున నిధులను ప్రభుత్వం మంజూరు చేయనున్నట్లు జిల్లా పాలనాధికారిణి యోగితారాణా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సొంత భవనాలు లేని 1908 అంగన్‌వాడీ కేంద్రాల వివరాలను గ్రామ పంచాయతీ సర్పంచులకు అందజేయాలని ఐసీడీఎస్‌ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల ఆవరణలు, పాఠశాలలను ఆనుకొని ఉన్న స్థలాలను, లబ్ధిదారులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ స్థలాలు, దాతలు విరాళంగా ఇచ్చే(రెండు గుంటలు) స్థలాలను సేకరించి, గ్రామ పంచాయతీ తీర్మానంతో ఈ నెల 15లోపు మండల ...

Read More »

సత్యం హత్యకేసులో నిజాలు బయటపెట్టాలి

ఇందూరు, న్యూస్‌టుడే: జిల్లాలో హత్య రాజకీయాలకు తెరలేచినందున తలారి సత్యం, చేపూర్‌ రవిల మరణాలపై విచారణ చేపట్టి వాస్తవాన్ని బయట పెట్టాలని మాజీ ఎంపి మధుయాస్కీగౌడ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చౌక్‌లో న్యాయం కోసం మృతుడు సత్యం తండ్రి గంగాధర్‌(బక్కన్న) చేపట్టిన దీక్షకు ప్రజాసంఘాలతోపాటు రాజకీయ ప్రతిపక్షాల ఐకాస మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా మధుయాస్కీ మాట్లాడుతూ.. ప్రస్తుత ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో తప్పడు సమాచారం ఇచ్చారని, న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తలారి సత్యంతోపాటు రవి రోడ్డు ప్రమాదంలో చనిపోవడం ...

Read More »

చురుకుగా సాగుతున్న డబుల్‌ బెడ్‌రూం సర్వే

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న డబుల్‌ బెడ్‌ రూం పథకంలో భాగంగా మోర్తాడ్‌లో తహసీల్దార్‌ వెంకట్‌రావు, ఆర్‌ఐ మంజులవాణి ఆద్వర్యంలో సర్వే చురుకుగా కొనసాగుతుంది. మంగళవారం రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడి 8,9 వార్డుల్లో సర్వే కొనసాగించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్దిదారుని ఇంటికెళ్ళి అధికారులు పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. మోర్తాడ్‌లో డబుల్‌ బెడ్‌ రూం పథకం సర్వేను రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు.

Read More »

గ్రామజ్యోతితోనే సంక్షేమ, అభివృద్ది ఫలాలు

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామ జ్యోతి పథకం ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ది, సంక్షేమ ఫలాలు అందుతాయని మోర్తాడ్‌ సర్పంచ్‌ దడివె నవీన్‌ అన్నారు. మంగళవారం మోర్తాడ్‌ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్‌ అధ్యక్షతన గ్రామసభ జరిగింది. గ్రామసభలో జూనియర్‌ అసిస్టెంట్‌, ఇన్‌చార్జి కార్యదర్శి గ్రామాల్లోని సమస్యలను, అభివృద్ది పనులను, రుణ లబ్ది దరఖాస్తుదారుల వివరాలను, డబుల్‌ బెడ్‌రూం దరఖాస్తు దారుల వివరాలను చదివి వినిపించారు. ప్రతి ...

Read More »