Breaking News

Daily Archives: February 10, 2016

జిల్లా సేత్వార్‌ వివరాల నమోదుపై రాష్ట్ర అధికారుల ప్రశంస

  నిజామాబాద్‌, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో సేత్వార్‌ వివరాల నమోదు బాగుందని రాష్ట్ర సిసిఎల్‌ఎ రేమండ్‌ పీటర్‌ ప్రశంసించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా పలు అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ సెన్సస్‌, భూసేకరణ, అసైన్డ్‌ భూముల వివరాలు, రెవెన్యూ భవనాల పరిస్తితి, వాహనాలు, మీసేవ కార్యక్రమాలు, తదితర విషయాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్‌ జిల్లాలో సేత్వార్‌ వివరాల నమోదు 99 శాతం నిర్వహించడం అభినందనీయమని, అదేవిధంగా ...

Read More »

పశుగ్రాసానికి భలే డిమాండ్‌

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పంటలు సరిగా లేకపోవడంతో పశు గ్రాసానికి డిమాండ్‌ పెరిగింది. పశువులకు పశుగ్రాసం లేక రైతన్నలు దిగాలు చెందుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి సోయా, కంది పొట్టును కొనుగోలు చేస్తూ పశువులకు మేతగా వాడుతున్నారు. దీంతో పొరుగు రాష్ట్రాలు వివిధ ప్రాంతాల నుంచి పశుగ్రాసాన్ని తెప్పించుకుంటున్నారు. వరిగడ్డితోపాటు సోయా, కందిపొట్టును కొనుగోలు చేసుకుంటున్నారు. పశువులకు దీనిని మేతగా ఉపయోగిస్తున్నారు. లారీలు, ట్రాక్టర్లు, ట్రాలీ, ఆటోల ద్వారా దూర ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడ గడ్డి ...

Read More »

భారతదేశ శాస్త్ర సాంకేతికాభివృద్ది ఎంతో విశిష్టమైనది

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పోటీ పరీక్షల శిక్షణా విభాగం ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ప్రసంగ కార్యక్రమంలో ప్రముఖ భౌతికశాస్త్ర విశ్లేషకులు అనంతరామకృష్ణ పాల్గొని మాట్లాడారు. భారతదేశ స్వాతంత్య్రానంతర కాలంలో శాస్త్ర సాంకేతికరంగాల్లో ఎంతో పురోభివృద్ది సాధించిందని ఇది విశిష్టమైన అభివృద్దికినమూనా లాంటిదని అన్నారు. భౌతిక శాస్త్రంతో శాస్త్ర సాంకేతిక రంగానికి ఎంతో సంబంధం ఉందని ఆయన అన్నారు. రక్షణరంగం, అణుశక్తి, సమాచార సాంకేతిర రంగాల్లో సాధించిన అభివృద్దిని రామకృష్ణ వివరించారు. విధ్యార్థుల సందేహాలను ...

Read More »

పుస్తకాల వితరణ

  రెంజల్‌, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామం జడ్పిహెచ్‌ఎస్‌ ఉర్దూ మీడియం విద్యార్థులకు ఎంఐఎం ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు నోటు పుస్తకాలను బోధన్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ షామి బుధవారం పంపినీ చేశారు.   ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లిం పిల్లలు మధ్యతరగతి, పేద కుటుంబాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గత 15 సంవత్సరాల నుంచి నోటుపుస్తకాలు పంపినీ చేయడం, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బోదన్‌ మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ అబీబ్‌ఖాన్‌, ఎంఐఎం ...

Read More »

పిల్లలు ఆరోగ్యంగా తీర్చిదిద్దేందుకే నులిపురుగుల మాత్రలు

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉండేందుకే నులిపురుగు నిర్మూలన మాత్రలు తప్పకుండా వేయించాలని జడ్పిటిసి ఎనుగందుల అనిత, ఎంపిపి కల్లడ చిన్నయ్య, మండల సర్పంచ్‌లు దడివె నవీన్‌, ఈర్ల లక్ష్మి, కిషన్‌, లింబన్న, ఎంపిటిసిలు అన్నారు. బుధవారం నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో, అంగన్‌వాడి కేంద్రాల్లో విద్యార్తులకు ఉచితంగా మాత్రలు పంపినీ చేశారు. కార్యక్రమం ఈనెల 15వ తేదీ వరకు అన్ని గ్రామ ...

Read More »

నూతన పద్ధతుల్లో వ్యవసాయసాగు లాభదాయకం

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు నూతన పద్దతులలో వ్యవసాయం సాగు చేస్తే లాభదాయకమని జెడిఎ మాధవి అన్నారు. బుధవారం మండలంలోని ధర్మోరా గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్‌ రాజేందర్‌ అధ్యక్షతన సేంద్రీయ సేద్యంపై రైతు మహిళలకు శిక్షణ, అవగాహన సదస్సు నిర్వహించారు.   సదస్సులో జెడిఎ ప్రొజెక్టర్‌ ద్వారా నూతన పద్దతుల సాగు పంటలపై ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు. అంతేగాకుండా జేడిఎ మాట్లాడుతూ వర్షాభావ పరిస్తితులు దృష్టిలో పెట్టుకొని ఆరుతడి పంటలు, పప్పుదినుసులు సాగుచేసుకోవాలన్నారు. ...

Read More »

రికార్డులు సక్రమంగా రూపొందించాలి

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టే అభివృద్ది పనులపై పలు కార్యక్రమాలపై జమ ఖర్చుల రికార్డులను సక్రమంగా రూపొందించాలని అసిస్టెంట్‌ ఆడిట్‌ అధికారి విజయలక్ష్మి, కవిత అన్నారు. బుధవారం మండలంలోని రామన్నపేట్‌, సుంకెట్‌ గ్రామ పంచాయతీల్లో ఆకస్మికంగా సందర్శించి ఆడిట్‌ వివరాలు పరిశీలించారు. జిపి అనుమతులు లేకుండా ఇళ్ళ నిర్మాణాలను, లేఅవుట్‌ ప్లాట్లు విక్రయాలు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జిపి అనుమతి పొంది పదిశాతం భూములను జిపికి ...

Read More »

డబుల్‌ బెడ్‌ రూం అర్హుల జాబితా సిద్దం చేయాలి

  నిజామాబాద్‌, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డబుల్‌ బెడ్‌రూం దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులజాబితా సిద్దం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా తెలిపారు. బుధవారం ప్రగతిభవన్‌లో తహసీల్దార్లు, హౌజింగ్‌ కార్పొరేషన్‌ అధికారులతో రెండుపడక గదుల విధి విధానాలపై పలు సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే వచ్చిన 84 వేల దరఖాస్తులలో కొంత మంది అనర్హులు ఉంటారని, ఈ దరఖాస్తులన్నింటిని కంప్యూటర్‌లలో నమోదుచేసి ప్రభుత్వం జారీచేసిన నిబంధనలకనుగుణంగా అర్హుల జాబితా సిద్దం చేయాలన్నారు. ఎస్సీలు, ...

Read More »

శారీరక, మానసిక ఎదుగుదలకు నులిపురుగు నివారణ మాత్రలు

  నిజామాబాద్‌, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శారీరకంగా, మానసికంగా ఎదగడానికి నులి పురుగుల నుంచి రక్షించుకోవడానికి డీ వార్మింగ్‌ మాత్రలుతప్పకుండా ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక పోలీసు లైన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. విద్యార్తులకు డీ వార్మింగ్‌ మాత్రలు వేసి తప్పకుండా ప్రతి ఒక్కరు వీటిని తీసుకోవాలని తెలిపారు. తద్వారా పోషకాహారం లోపం, రక్తహీనత నుంచి బయటపడతారని, ...

Read More »

నందిపేట ఏఎస్‌ఐగా నూగూరి నరేందర్‌

  నందిపేట, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట పోలీసుస్టేషన్‌ ఏఎస్‌ఐగా నూగూరి నరేందర్‌ బుధవారం బాద్యతలు స్వీకరించారు. ఏఎస్‌ఐ మసూద్‌ ఖాన్‌ గత రెండు నెలల క్రితం నందిపేట నుండి నిజామాబాద్‌ 3వ పోలీసుస్టేషన్‌కు బదిలీపై వెళ్లారు. అప్పటినుంచి ఖాళీగా ఉన్న పోస్టు బుదవారం భర్తీఅయింది. 1989లో కానిస్టేబుల్‌గా పోలీసు డిపార్టుమెంటులో భర్తీ అయి అంచలంచలుగా ఎదిగిన నూగూరి నరేందర్‌ ఏఎస్‌ఐగా ప్రమోషన్‌ పొందారు. ఇంటెలిజెన్సులో పనిచేసిన అనుభవం ఉంది. 2010లో హెడ్‌కానిస్టేబుల్‌గా ప్రమోషన్‌తో స్పెషల్‌ బ్రాంచ్‌లో సేవలందించారు. ...

Read More »

ఘనంగా పోచారం జన్మదిన వేడుకలు

  బాన్సువాడ, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జన్మదిన వేడుకలను బాన్సువాడ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపినీ చేశారు. కోటగిరిలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు భాస్కర్‌రెడ్డి కేక్‌కట్‌చేసి జన్మదిన వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా అంగన్‌వాడి కేంద్రాలకు పప్పు దినుసులు నిలువ చేసుకోవడంకోసం డబ్బాలు పంపినీ చేశారు. ఆయా ప్రాంతాల్లో నాయకులు, కార్యకర్తలు వేడుకలు నిర్వహించి వివిధ ...

Read More »

చేతిపంపో.. మోటారు పంపో… ఏదో ఒకటి వేయండి సారూ..

  నందిపేట, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కన, రాజు హోటల్‌ ముందుగల చేతిబోరు పంపును గత నాలుగు నెలల క్రితం గ్రామ పంచాయతీ సిబ్బంది తొలగించారు. చేతిపంపు స్థానంలో మోటారు పంపు బిగిస్తామని చెప్పి తొలగించినా ఇంతవరకు బిగించలేదని, ఎన్నిసార్లు గ్రామ పంచాయతీలో సర్పంచ్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. నీళ్లతో తీవ్ర ఇబ్బందులు ఉన్నందున కనీసం చేతిపంపుతో నైనా వాడుకునేవారమని, ఉన్న కాస్త బోరును కూడా తీసేసి ...

Read More »

జడ్పిఛైర్మన్‌ హామీతోసమ్మె వాయిదా

  నందిపేట, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా జనరల్‌ ఆసుపత్రి, కళాశాలలో పనిచేస్తున్న కార్మికులు బుధవారం 3వ రోజు సమ్మె నిర్వహించారు. అనంతరం జడ్పిఛైర్మన్‌ దఫేదార్‌ రాజు సమక్షంలో కాంట్రాక్టర్‌, ఏఐటియుసి నాయకులు వై.ఓమయ్య, సుధాకర్‌లతో చర్చలు జరిపారు. ఈ సందర్బంగా జడ్పి ఛైర్మన్‌ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సమ్మె విరవింపజేయాలని కోరారు. పదిరోజుల్లో హెచ్‌డిఎస్‌ సమావేశం జరగనుందని దీనికి జిల్లా మంత్రి, ఎంపి, కలెక్టర్‌ హాజరవుతారని అంతవరకు ప్రభుత్వ నిదులు రాకపోతే ...

Read More »

వేదిక నిర్మాణానికి భూమిపూజ

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలంలోని యానంపల్లి జడ్పిహెచ్‌ఎస్‌లో వివిధ రకాల సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వేదిక నిర్మిస్తున్నట్టు ప్రధానోపాధ్యాయులు నరేశ్‌ తెలిపారు. యంగ్‌ స్టార్‌ యూత్‌ సహకారంతో రూ. 20 వేలతో నిర్మాణం చేపట్టనున్నట్టు చెప్పారు. ఈమేరకు బుధవారం సర్పచ్‌ శ్రీనివాస్‌గౌడ్‌, విడిసి సభ్యులు, యూత్‌ అధ్యక్షుడు లక్ష్మినర్సయ్య, లక్ష్మణ్‌గౌడ్‌, సంతోష్‌, భానుచందర్‌, మహేశ్‌ భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్‌ మాట్లాడుతూ పాఠశాలకు సేవచేయాలనే ఉద్దేశంతో యూత్‌ సభ్యులు ముందుకు రావడం ఎంతో ...

Read More »

మీ సాయం మాకు అవసరం

చిత్రం... కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో నేపాల్ ఆర్థిక శాఖ మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడెల్ కరచాలనం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: నేపాల్‌లో విద్యుత్, హెల్త్‌కేర్, రహదారుల రంగాల్లో భారత్ పెట్టుబడులు మరింతగా పెరిగే వీలుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆ దేశ ఆర్థిక శాఖ మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడెల్‌కు స్పష్టం చేశారు. సోమవారం ఇక్కడ జైట్లీని పౌడెల్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా నేపాల్‌లో ఏర్పాటుచేయాలనుకుంటున్న ఓ ప్రత్యేక వౌలికాభివృద్ధి బ్యాంకుకు సాయం చేయాలని కోరారు. ఈ క్రమంలోనే జైట్లీ పైవిధంగా అన్నారు. భారీ భూకంపానికి సర్వం కోల్పోయిన నేపాల్.. పునర్నిర్మాణ పనుల గురించి ఈ సందర్భంగా ...

Read More »

శ్రీరామ పాదుకలను ప్రతి ఇంటికీ చేరవేస్తాం

  వినాయక్‌నగర్: శ్రీరామ పాదుకలను ప్రతి ఇంటికీ చేరవేస్తామని దేవనాథ జీయర్ స్వామి అన్నారు. సోమవారం నగరంలోని వికాస తరంగిణి సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వికాస తరంగిణి చినజీయర్ సంస్థ, నిజామాబాద్ జిల్లాలో 1995 సంవత్సరంలో స్థాపించారని తెలిపారు. వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, ఆరోగ్య , పశువైద్య శిబిరాలు నిర్వహిస్తోందన్నారు. చినజీయర్ స్వామి వారి ఆదేశానుసారం గత సంవత్సరం జిల్లాలోని 36 మండలాల్లో 826 గ్రామాల్లో శ్రీరామ పాదుకల పట్టాభిషేకం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. శ్రీరామ పాదుకలను ...

Read More »

కేసీఆర్ క్రికెట్ టోర్నీకి ఏర్పాట్లు షూరు

  నిజామాబాద్ స్పోర్ట్స్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టినరోజును పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి టీ-20 క్రికెట్ టోర్నీకి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. టీఆర్‌ఎస్ మైనార్టీసెల్ నగర అధ్యక్షుడు ఇమ్రాన్ షెహజాద్ నేతృత్వంలో కంఠేశ్వర్‌లోని పాలిటెక్నిక్ మైదానంలో టోర్నీ నిర్వహిస్తున్నారు. ఈనెల 10 నుంచి 17 వరకు పోటీలు నిర్వహించనున్నారు. క్రికెట్ పిచ్‌ను కొంత మార్పు చేసి పిచ్ స్థలాన్ని ఏ ర్పాటు చేస్తున్నారు. మైదానంలో వాకర్స్ ఆధ్వర్యంలో నాటిన మొక్కలను తీసివేయకుండా కొంతదూరంలోనే బౌండరీకి ఏర్పాటు చేశారు. మైదానంలోని ఎత్తువంపులున్న ప్రదేశాలను ట్రా ...

Read More »

గుంతలో పడి విద్యార్థి మృతి

  నిజామాబాద్ రూరల్ : మొరం అక్రమంగా తవ్వకాలు జరిపిన గుంతలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన ఓ విద్యార్థి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని జిల్లా జైలు పక్కన సారంగపూర్ గ్రామానికి చెందిన పలువురు కాంట్రాక్టర్లు అక్రమంగా సుమారు 20ఫీట్ల లోతు వరకు మొరం తవ్వకాలు జరిపారు. పక్కనే జిల్లా జైలు నుంచి వినియోగించిన వృథానీరు ఆ గుంతలోకి వచ్చి చేరింది. దీంతో నీరు ఉందని భావించిన ఇంటర్ విద్యార్థి సాయి గౌడ్(17)మంగళవారం కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు ...

Read More »

ఎంపీ కవితను కలిసిన టీఆర్‌ఎస్ నాయకులు

  నిజామాబాద్ రూరల్ : గ్రేటర్ ఎన్నికల్లో 118 డివిజన్ ఫత్తేనగర్ నుంచి పోటీ చేసి గెలుపొందిన టీఆర్‌ఎస్ కార్పొరేట్ పండాల సతీశ్‌గౌడ్, జిల్లా కమ్మ సంఘం అధ్యక్షుడు కలగర శ్రీనివాస్‌రావు మంగళవారం హైదరాబాద్‌లో ఎంపీ కవితను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీని కలిసిన వారిలో రాములు, నగేశ్, సురేందర్ ఉన్నారు.

Read More »

రైతు సంక్షేమమే ఊపిరిగా..

  -అభివృద్ధిలో తనదైన శైలి -నేడు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి 68వ జన్మదినం బాన్సువాడ,  : తెలంగాణ ఉద్య మం మొదలు రాష్ట్ర పునర్నిర్మాణంలో కీలక పాత్ర ఆయన సొంతం.. ఊరి పేరునే ఇంటి పేరుగా మార్చుకుని రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి క్యాబినెట్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ రైతుల సంక్షేమమే ఊపిరిగా ముందుకు సాగుతున్నారు. వ్యవసాయరంగంలో అధునాతన పద్ధతులను గ్రామీణ ప్రాంత రైతులకు అందుబాటులోకి తెచ్చి అత్యధిక దిగుబడులు ...

Read More »