Breaking News

భారతదేశ శాస్త్ర సాంకేతికాభివృద్ది ఎంతో విశిష్టమైనది

 

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పోటీ పరీక్షల శిక్షణా విభాగం ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ప్రసంగ కార్యక్రమంలో ప్రముఖ భౌతికశాస్త్ర విశ్లేషకులు అనంతరామకృష్ణ పాల్గొని మాట్లాడారు. భారతదేశ స్వాతంత్య్రానంతర కాలంలో శాస్త్ర సాంకేతికరంగాల్లో ఎంతో పురోభివృద్ది సాధించిందని ఇది విశిష్టమైన అభివృద్దికినమూనా లాంటిదని అన్నారు.

భౌతిక శాస్త్రంతో శాస్త్ర సాంకేతిక రంగానికి ఎంతో సంబంధం ఉందని ఆయన అన్నారు. రక్షణరంగం, అణుశక్తి, సమాచార సాంకేతిర రంగాల్లో సాధించిన అభివృద్దిని రామకృష్ణ వివరించారు. విధ్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తితో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

సిబ్బంది వివరాలు సేకరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు స్కూల్స్‌ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వివరాల‌ను మండల‌ ...

Comment on the article