Breaking News
Copyright Jeffrey Friedl

పశుగ్రాసానికి భలే డిమాండ్‌

 

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పంటలు సరిగా లేకపోవడంతో పశు గ్రాసానికి డిమాండ్‌ పెరిగింది. పశువులకు పశుగ్రాసం లేక రైతన్నలు దిగాలు చెందుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి సోయా, కంది పొట్టును కొనుగోలు చేస్తూ పశువులకు మేతగా వాడుతున్నారు.

దీంతో పొరుగు రాష్ట్రాలు వివిధ ప్రాంతాల నుంచి పశుగ్రాసాన్ని తెప్పించుకుంటున్నారు. వరిగడ్డితోపాటు సోయా, కందిపొట్టును కొనుగోలు చేసుకుంటున్నారు. పశువులకు దీనిని మేతగా ఉపయోగిస్తున్నారు. లారీలు, ట్రాక్టర్లు, ట్రాలీ, ఆటోల ద్వారా దూర ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడ గడ్డి ఉంటే అక్కడ కొనుగోలు చేసి రాబోయే జూన్‌ వరకు సరిపోయేంతగా పశుగ్రాసాన్ని కొనుగోలు చేసుకుంటూ పశువులను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు. పశుగ్రాసం దొరకని పలువురు తక్కువ ధరలకు అమ్మకాలు చేపడుతున్నారు. పశుగ్రాసం కొరతతో మూగజీవాలు అంతరించిపోనున్నాయి. దీంతో పాటు పశువులకు నీటి సౌకర్యం లేక అల్లాడుతున్నాయి. వర్షాభావ పరిస్థితులే దీనికి కారణమని పలువురు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా జూన్‌ వరకు పశుగ్రాసం కొరత ఏ మేరకు సరిపోతుందో మరి ఎన్ని పశువుల అమ్మకాలు జరుగుతాయోనని పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article