Breaking News

రైతు సంక్షేమమే ఊపిరిగా..

 

-అభివృద్ధిలో తనదైన శైలి
-నేడు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి 68వ జన్మదినం

బాన్సువాడ,  : తెలంగాణ ఉద్య మం మొదలు రాష్ట్ర పునర్నిర్మాణంలో కీలక పాత్ర ఆయన సొంతం.. ఊరి పేరునే ఇంటి పేరుగా మార్చుకుని రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి క్యాబినెట్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ రైతుల సంక్షేమమే ఊపిరిగా ముందుకు సాగుతున్నారు. వ్యవసాయరంగంలో అధునాతన పద్ధతులను గ్రామీణ ప్రాంత రైతులకు అందుబాటులోకి తెచ్చి అత్యధిక దిగుబడులు సాధించడంలో ప్రోత్సహిస్తున్నారు.

యంత్ర లక్ష్మిద్వారా 50 శాతం సబ్సిడీ…
వ్యవసాయరంగంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా రైతులు అధునాతన పద్ధతిలో వ్యవసాయం చేయడానికి ట్రాక్టర్లను 50 శాతం సబ్సిడీతో అందించడానికి మంత్రిగా అవసరమైన చర్యలు చేపట్టారు. రూ.10లక్షలకు పైగా విలువ చేసే ట్రాక్టర్లు నేడు రైతులకు సబ్సిడీతో రూ. 5లక్షలకే అందిస్తూ సన్న,చిన్నకారు రైతులను వ్యవసాయంలో స్థిర పరిచే ప్రయత్నం చేశారు. కల్టివేటర్స్, నూర్పిడి యంత్రాలు 50 శాతం సబ్సిడీపై అందించడానికి కృషి చేశారు.

కరువు కోరల్లో చిక్కుకున్న రైతన్నలకు రుణమాఫీ పథకాన్ని వర్తింప చేశారు. బ్యాంకుల నుంచి ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించారు. దానికి తోడు రైతులకు బీమా వర్తింప చేయడంతో కరువు కాలం లో రైతులను కష్టాల నుంచి గట్టెక్కించారు. నీటి అవసరం ఎక్కువగా ఉండే వరి పంటలను సాగు చేసి రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించి, ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించడానికి ఆయన చేసిన కృషి ఫలించింది.

నేడు పోచారం పుట్టిన రోజు వేడుకలకు ఏర్పాట్లు
బాన్సువాడ మండలంలోని పోచారం గ్రామంలో 1951వ సంవత్సరంలో పరిగె పాపమ్మ, రాజిరెడ్డి దంపతులకు పోచారం శ్రీనివాస్‌రెడ్డి జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. నేడు పోచారం 68వ జన్మదినం సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article