Breaking News

Daily Archives: February 11, 2016

ఎండిన ఊరచెరువు

  నిజంసాగర్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని అచ్చంపేట ఊరచెరువు నిజాంసాగర్‌ కింద ఉండడంతో ఇప్పటి వరకు ఎండిపోలేదు. ఈయేడు తీవ్ర వర్సాభావం కారణంగా సాగర్‌లోకి చుక్కనీరు కూడా రాకపోవడంతో చెరువు ఎండిపోయింది. చెరువులో పిల్లలు క్రికెట్‌ ఆడే ఆటస్థలంగా మారింది. ఈ పరిస్తితి ఎప్పుడూ చూడలేదని గ్రామానికి చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read More »

లక్కంపల్లి సెజ్‌ సందడి

  నందిపేట, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని నందిపేట మండలం లక్కంపల్లి గ్రామ శివారులో స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్స్‌ ద్వారా స్తానిక వనరుల వినియోగం, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రైతుల నుంచి తీసుకున్న భూముల్లో పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పచ్చజెండా ఊపి 374 ఎకరాల్లో మెగా ఫుడ్‌ పార్కు ఏర్పాటుకు కేంద్ర ఆహారమంత్రిత్వశాఖ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ప్రవాస భారతీయుల నేతృత్వంలో రూ 108 కోట్లతో 100 ఎకరాలలో మెగా ...

Read More »

తెలంగాణ తెలుగుకు ప్రామాణికత కల్పించాలి

  – విసి పార్థసారధి డిచ్‌పల్లి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ తెలుగుకు ప్రామాణికత కల్పించడానికి కృషి చేయాలని తెలంగాన యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ సి.పార్థసారధి అన్నారు. గురువారం తెలంగాణ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిశోధన అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ తెలుగు రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొని విసి ప్రసంగించారు. తెలంగాణ తెలుగు మూలాల్ని వెదుక్కోవాలని, పరిణామక్రమంలో భాషా అభివృద్దిని పరిశోధించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మన భాష,యాస, మాండలికాలను చిన్నచూపు చూసి వెక్కిరించే కాలం ...

Read More »

శుక్రవారం చిన్నారులకు అక్షరాభ్యాసం

  కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసంత పంచమి పుణ్యతిథిని పురస్కరించుకొని పట్టణంలోని సరస్వతి శిశుమందిర్‌ పాఠశాలలో శుక్రవారం అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించనున్నట్టు పాఠశాల యాజమాన్యం తెలిపారు. భగత్‌సింగ్‌నగర్‌ పాఠశాలలో వేద పండితులు మునుస్వామి ఆధ్వర్యంలో దయానందస్వామి అక్షరాభ్యాసం చేయిస్తారన్నారు. ఉదయం 10 గంటలకు తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకొని వచ్చి అక్షరాభ్యాసం చేయించుకోవాలని కోరారు.

Read More »

కామారెడ్డిలో సిటీ బస్సులు ఏర్పాటుచేయాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో సిటీ బస్సు ఏర్పాటు చేయాలని గురువారం ఆర్టీసి డిఎంకు నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ జనాభాను దృస్టిలో ఉంచుకొని జిల్లా కేంద్రంగా ఏర్పాటు కాబోతున్నందున పట్టణంలో 4 సిటీ బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. గుమాస్తా కాలనీ, రాజీవ్‌నగర్‌, ఇస్లాంపుర, పెద్దమ్మగల్లి, హరిజనవాడ, విద్యానగర్‌, దేవునిపల్లి, పాతబస్టాండ్‌ల మీదుగా సిటీ బస్సులు నడపాలని కోరారు. వ్యాపార పరంగా కామారెడ్డి విస్తరిస్తున్న ...

Read More »

నీటి ఎద్దడి నివారణకు చర్యలు

  – కామారెడ్డి ఆర్డీవోనగేశ్‌ కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపడుతున్నట్టు కామారెడ్డి ఆర్డీవోనగేశ్‌ తెలిపారు. గురువారం కామారెడ్డి డిప్యూటి డిఇవో కార్యాలయంలో డివిజన్‌లోని ప్రజాప్రతినిధులు, అధికారులతో నీటి ఎద్దడిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ నీటి ఎద్దడి నివారణకు అధికారులు ప్రణాళికలు రూపొందించి తమకు అందజేయాలన్నారు. నెలరోజుల్లోపు నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో అధికారులను నియమించి ప్రజాప్రతినిదులతో కలిసి నీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక ...

Read More »

ఏసిబి వలలో అవినీతి చేప

  కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపాలిటీలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మల్లికార్జున్‌రెడ్డి గురువారం లంచంతీసుకుంటూ ఏసిబికి చిక్కారు. ప్రగతిపనుల బిల్లులకు సంబంధించిన ఓ కాంట్ట్రారు వద్ద నుంచి లంచం అడగ్గా విసిగిపోయిన సదరు కాంట్రాక్టరు మల్లికార్జున్‌రెడ్డిని ఏసిబికి పట్టించారు. బల్దియాలో కాంట్రాక్టరుగా ఉన్న మహేశ్‌గుప్త తనబిల్లులు చెల్లించాలని మల్లికార్జున్‌రెడ్డిని అడిగాడు. బిల్లుల చెల్లింపునకు తనవాటా తనకు కావాలని అడగడంతో మహేశ్‌గుప్త ఏసిబిని ఆశ్రయించాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం మల్లికార్జున్‌రెడ్డికి 5 వేలు ఇస్తుండగా ఏసిబి డిఎస్పీ ...

Read More »

ఫిబ్రవరి 25న బయోటెక్నాలజీ జాతీయ సెమినార్‌

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ బయోటెక్నాలజి విభాగం ఆధ్వర్యంలో ఈనెల 25న ఒమిక్‌ టెక్నాలజీస్‌ ఫర్‌ బెటర్‌ ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ అన్న అంశంపై జాతీయ సెమినార్‌నిర్వహిస్తున్నట్టు విభాగాధిపతి డాక్టర్‌ ప్రవీణ్‌ మామిడాల తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను వైస్‌ఛాన్స్‌లర్‌ సి.పార్థసారది, రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి, బయోటెక్నాలజీ అధ్యాపకులు, హెడ్‌తో కలిసి ఆవిష్కరించారు. సదస్సు యుజిసి స్పాన్సర్‌ చేస్తుందని డాక్టర్‌ ప్రవీన్‌ పేర్కొన్నారు. సదస్సులో భాగంగా మంచి ఆహారం, పోషక విలువలు, ఇతర అంశాలపై ...

Read More »

పోలీసు అభ్యర్తులకు ఉచిత శిక్షణ

  నందిపేట, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జమ్మాతె ఇస్లామి హింద్‌ నిజామాబాద్‌ పట్టణశాఖ ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగుల కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్షలకు సిద్దం చేయడానికి ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు నిజామాబాద్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ హలీమ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు నిజామాబాద్‌ పట్టణంలోని బోధన్‌ బస్టాండ్‌ వెనకల శంభునిగుడి వద్దగల మజీద్‌ వద్ద జమ్మాత్‌ కార్యాలయంలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి తమ పేర్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని ఆయన కోరారు.

Read More »

సామగ్రి తరలింపు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టును 1931లో నిర్మించారు. ప్రాజెక్టునిర్మించిన సమయంలో నిజాంసాగర్‌ మండల కేంద్రంలో గోదాములు, భవనాలు నిర్మించారు. ప్రస్తుతం ఆ స్తలంలో తహసీల్దార్‌, మండల పరిషత్‌ కార్యాలయాలు నిర్మించారు. వాటి ఆవరణలో అప్పట్లో నిర్మించిన భవనం కూడా ఉంది. ఆ భవనం శిథిలావస్థకు చేరుకొని కూలిపోయింది. దీంతో ఆ భవనంలో నైజాం కాలంలో వినియోగించిన సామగ్రిని తరలిస్తున్నారు. నీటిపారుదల శాఖ కార్యాలయం అచ్చంపేటకు వృధాగా ఉన్న సామగ్రిని తరలిస్తున్నారు.

Read More »

మార్చి 30,31 తేదీల్లో రైతుఆత్మహత్యలపై సదస్సు

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత రెండు దశాబ్దాలుగా దేశంలో రైతుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగాయని, వ్యవసాయరంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగినప్పటికి, చిన్న, సన్నకారు రైతుల జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదని, దేశంలో అత్యధిక ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉండడం దురదృష్టకరమని సెమినార్‌ కన్వీనర్‌ డాక్టర్‌ ఏ.పున్నయ్య అన్నారు. ఈ మేరకు మార్చి 30,31 తేదీల్లో యూనివర్సిటీల్లో రైతుఆత్మహత్యలపై సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గురువారం వర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ జాతీయ సదస్సు ...

Read More »

అంగన్‌వాడి కేంద్రాల కోసం ప్రతిపాదనలు తయారుచేయాలి

  సదాశివనగర్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌వాడి కేంద్రాల కోసం ప్రతిపాదనలు తయారుచేయాలని ఎంపిడివో చంద్రకాంత్‌రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిటిసిలు, సర్పంచ్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలకు 36 అంగన్‌వాడి భవనాలు మంజూరయ్యాయని, దానికి గ్రామాల వారిగా తీర్మానాలు చేయాలన్నారు. ప్రతిపాదనలు ఈనెల 18వ తేదీవరకు ఎంపిడివో కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి బంజ విజయ, శివకుమార్‌, జడ్పిటిసి రాజేశ్వర్‌రావు, సిబ్బంది సూర్యజీరావు, ...

Read More »

జవాన్ హనుమంతప్ప కన్నుమూత

/> ఢిల్లీ: సియాచిన్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మృత్యువుతో పోరాడి జవాన్ లాన్స్‌నాయక్ హనుమంతప్ప (33) తుది శ్వాస విడిచారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గురువారం 12 గంటల ప్రాంతంలో హనుమంతప్ప కనుమూశారు.హిమాలయ కొండచరియల పైనుంచి కిలోమీటర్ ఎత్తు.. 800 మీటర్ల వెడల్పు ఉన్న మంచు పలక వచ్చి.. సియాచిన్ లోని భారత సైనిక శిబిరంపై పడటంతో 9 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా ...

Read More »

స్పెక్ట్రమ్ కేటాయంపుల్లో విప్లవాత్మక మార్పులు

టెలికాం ఆపరేటర్ల మధ్య స్పెక్ట్రమ్ షేరింగ్, ట్రేడింగ్ నిర్వహించుకోవచ్చునని రెండు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో టెలికమ్యూనికేషన్ల రంగంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికినట్లయింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం టెలికాం ఆపరేటర్లలో ఎంతో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాగా వచ్చే జూన్ నెలలో టెలికమ్యూనికేషన్ల శాఖ (డాట్) పెద్ద ఎత్తున స్పెక్ట్రమ్‌ను వేలం వేయడానికి సిద్ధమవుతోంది. మరో అడుగు ముందుకేసి 3జి, 4జి సేవలకోసం అదనంగా ఉపయోగించుకునే స్పెక్ట్రమ్‌ను గుర్తించాలంటూ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటియు)ను కోరింది ...

Read More »

చైనాను అధిగమిస్తాం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఉత్పాదక, వ్యవసాయ రంగాల్లో మెరుగైన పరిస్థితుల మధ్య ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) భారత జిడిపి వృద్ధిరేటు ఐదేళ్ల గరిష్ఠాన్ని తాకుతూ 7.6 శాతంగా నమోదు కావచ్చని సోమవారం కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఒ) అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2014-15)లో దేశ జిడిపి వృద్ధిరేటు 7.2 శాతంగా నమోదైందన్న సిఎస్‌ఒ.. 2010-11 ఆర్థిక సంవత్సరంలో 8.9 శాతం వృద్ధిరేటు నమోదైందని, ఆ తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే అధికంగా నమోదు కానుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ ...

Read More »