Breaking News

Daily Archives: February 12, 2016

సరస్వతి శిశుమందిర్‌లో అక్షరాభ్యాసం

  కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని శ్రీసరస్వతి శిశుమందిర్‌ పాఠశాలలో శుక్రవారం చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. మాఘమాసం వసంత పంచమి పర్వదినం పురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించినట్టు పాఠశాల యాజమాన్యం తెలిపారు. ఉజ్జయిని మునిస్వామిజితోపాటు దయానంద స్వామిజిలు కార్యక్రమానికి హాజరై చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా యాగం నిర్వహించారు. శంకర్‌గుప్త 90 మంది చిన్నారులకు పలకలు విరాళంగా ఇచ్చారు. కార్యక్రమంలో సుమన, పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు.

Read More »

వికలాంగుల నిర్దారణ శిబిరం

  కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో శుక్రవారం జిల్లా వికలాంగుల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిర్దారణ శిబిరం నిర్వహించారు. ఈనెల 27న కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో సదరం శిబిరం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వికలాంగుల నిర్దారణ శిబిరాన్ని నిర్వహించారు. వికలాంగులకు కృత్రిమ అవయవాలు అందజేయడానికి వారు రైలు, బస్సు పాసులు పొందేందుకు దరఖాస్తులు స్వీకరించారు. పట్టణంలోని సైలానిబాబా కాలనీ, రంగాచారి కాలనీ, బతుకమ్మ కుంట, వడ్డెర కాలనీ, కుమ్మరి బస్తీ, తదితర ...

Read More »

అక్షర పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాసం

  కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని అక్షర టెక్నో పాఠశాలలో శుక్రవారం వసంత పంచమి పర్వదినంపురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమంనిర్వహించారు. చాలా మంది చిన్నారుల తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో పాఠశాల ఛైర్మన్‌ అశోక్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ హేమలత, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Read More »

టీఆర్‌ఎస్‌ఎన్‌ఎ డైరీ ఆవిష్కరణ

  కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలో శుక్రవారం టీఆర్‌ఎస్‌ఎన్‌ఎ ఆద్వర్యంలో రూపొందించిన నూతన డైరీని ఆవిష్కరించారు. టీఆర్‌ఎస్‌ఎన్‌ఎ అధ్యక్షుడు ఆనంద్‌రావు మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు రాజశేఖర్‌రెడ్డి, కృష్ణమూర్తి, రాందాస్‌, ఫహీమ్‌, రాజశేఖర్‌, గోవర్ధన్‌, ప్రసాద్‌, వివిధ పాఠశాలల యాజమాన్యాలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

జిల్లా కేంద్రంలో నిరాహారదీక్షకు మద్దతు తెలపాలి

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తలారి సత్యం, చేపూరు రవిల హత్యలకు నిరసనగా వారి తల్లిదండ్రులు జిల్లా కేంద్రంలో చేపట్టిన నిరాహార దీక్షకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి అంబేడ్కర్‌ సంఘం సబ్యులు, దళిత సంఘాల సభ్యులు, గోసంగి సభ్యులు ఈనెల 14న తరలివచ్చి మద్దతు తెలిపి, జయప్రదం చేయాలని మోర్తాడ్‌ అంబేడ్కర్‌ జేఏసి నాయకులు మామిడి రాజేశ్వర్‌, మల్లూరి రాజారాం, బాబురావులు శుక్రవారం కోరారు. దళితులను ఆర్మూర్‌ ఎమ్మెల్యే హత్య చేయించారని, ఆయనపై అట్రాసిటీ కేసు ...

Read More »

రికార్డులను పరిశీలించిన ఎఎంఓ

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌లోని మదర్సా ఉర్దూ మీడియం పాఠశాలను ఎఎంఓ సాయిలు, మోర్తాడ్‌ ఎంఇవో రాజేశ్వర్‌లు శుక్రవారం సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు సరళీకృత బోదన చేయాలని, ఉత్తమ ఫలితాలు సాదించేలా తీర్చిదిద్దాలన్నారు. పాఠశాలలోని రికార్డులను సక్రమంగా రూపొందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రధానోపాద్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.

Read More »

వైభవంగా వసంత పంచమి వేడుకలు

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో వసంత పంచమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. శుక్రవారం కావడంతో అన్ని గ్రామాల ప్రజలు ఆలయాలకు వెళ్ళి దైవదర్శనం చేసుకున్నారు. తాళ్లరాంపూర్‌ గ్రామంలోని పద్మశాలి సంఘ భవనంలో కులపెద్దలు భక్తమార్కండేయ జయంతి ఉత్సవాలు జరిపారు. అదేగ్రామానికి చెందిన జడ్పిటిసి ఎనుగందుల అనిత, పూర్ణానందం కులసంఘ సభ్యులతో మార్కండేయునికి ప్రత్యేకపూజలు చేశారు. ఒడ్యాట్‌ గ్రామ శివారులోని శుక్రవారందేవి ఆలయం వద్ద చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని ...

Read More »

ఇన్‌చార్జి కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

  నిజామాబాద్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి శుక్రవారం పలు కార్యాలయాల్లో ఆకస్మికంగా పర్యటించి ఉద్యోగుల హాజరును పరిశీలించారు. స్తానిక సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌, పౌర సరఫరాల కార్పొరేసన్‌ జిల్లా మేనేజర్‌, పౌరసరఫరాల శాఖ కార్యాలయాల్లో ఆకస్మిక తనికీ చేశారు. ముందుగా భూమి కొలతల సహాయ సంచాలకుల కార్యాలయానికి వెళ్ళి బయోమెట్రిక్‌ విధానం ఎక్కడ ఉందని అడిగారు. పర్యవేక్షకుడు సమాధానం ఇస్తు అన్ని పదవులకు హోదాలు బయోమెట్రిక్‌ అనుసంధానం చేయనందున ఇంకా ప్రారంభం ...

Read More »

నూతన వధూవరులను ఆశీర్వదించిన తెరాస రాష్ట్ర నాయకులు

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్‌, బాల్కొండ మండలాల్లో శుక్రవారం జరిగిన వివాహ వేడుకలకు తెరాస రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్‌కుమార్‌రెడ్డి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. బాల్కొండమండలం ముప్కాల్‌ గ్రామంలో, మండల కేంద్రమైన మోర్తాడ్‌లో పద్మశాలి కళ్యాణమండపంలో, ఆర్‌ఎంఫంక్షన్‌ హాల్‌లో జరిగిన తెరాస కార్యకర్తల వివాహ వేడుకలకు ఆయన అతిథిగా విచ్చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ దడివె నవీన్‌, ఏర్గట్ల లింబాద్రి, ఎలాల ప్రకాశ్‌, యువజన సంఘాల సభ్యులు తదితరులున్నారు.

Read More »

పరీక్షల ప్రారంభం వరకు కళాశాల పిల్లలకు లంచ్‌

  – ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి నిజామాబాద్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కళాశాలల విద్యార్తులు మరింత సమయం కళాశాలల్లో ఉండడం వల్ల పరీక్షకు బాగా సిద్దం కావడానికి మధ్యాహ్న భోజనం అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం జేసి చాంబరులో కళాశాలల ప్రధానాచార్యులు, విద్యాశాఖ అధికారులు, సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థులు మరింత ఎక్కువ సమయాన్ని కళాశాలల్లో ఉండటానికి కేటాయించడం ద్వారా వారికి ప్రత్యేక శిక్షణ ...

Read More »

ఘనంగా వసంత పంచమి వేడుకలు

  బాన్సువాడ, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని బాన్సువాడలోని విద్యజ్ఞానసరస్వతి ఆలయంలో శుక్రవారం అమ్మవారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో రెండో అతిపెద్ద సరస్వతి ఆలయంగా వెలుగొందుతున్న బాన్సువాడలోని విద్యజ్ఞానసరస్వతి ఆలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి ఏటా ఇక్కడ సరస్వతి దీక్షను పలువురు భక్తులు స్వీకరిస్తారు. ఇక్కడి నుంచి వసంత పంచమి రెండోరోజుల ముందనుంచే కాలినడకన బాసరకు దీక్షాస్వాములు యాత్ర కొనసాగిస్తారు. ఇక్కడ ఆలయంలో సైతం పెద్ద ...

Read More »

అభివృద్ది పనులకు ఎమ్మెల్యే భూమిపూజ

  నందిపేట, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణానికి శుక్రవారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి భూమిపూజ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 60 సంవత్సరాలో ఆయా ప్రభుత్వాలు చేయలేని పనిని తమ ప్రభుత్వం 18 నెలల్లో చేసి చూపించిందని, అందుకే టిడిపి సీనియర్‌ నాయకులు ఆ పార్టీని వీడి తెరాసలో చేరుతున్నారని, ప్రతిపక్ష నాయకులు బుద్ది తెచ్చుకొని ప్రజలు మెచ్చుతున్న తెరాసలో చేరాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి జిహెచ్‌ఎంసి ...

Read More »

మీసేవా కేంద్రాన్ని ప్రారంభించి పోచారం తనయుడు

  బీర్కూర్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌ గ్రామంలో అయ్యప్ప కమ్యూనికేషన్‌ మీసేవా కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు సురేందర్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. మీసేవా లను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎదుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ప్రస్తుతం మీసేవాలోకి అన్ని వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని, వాటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మీసేవాకు వచ్చే లబ్దిదారులకు సరైన సమయంలో దృవీకరణ పత్రాలు జారీచేసి ప్రజలతో సహకారంగా ఉండాలని పేర్కొన్నారు. ...

Read More »

ఆసుపత్రి తనికీ చేసిన ఎంపిటిసి అహ్మద్‌ఖాన్‌

  నందిపేట, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలను ఎంపిటిసి-2 అహ్మద్‌ఖాన్‌ శుక్రవారం ఆకస్మికంగా తనికీ చేశారు. ఈసందర్భంగా ఆసుపత్రి రికార్డులను పరిశీలించి రోగులకు మంచి వైద్యసేవలు అందించాలని డాక్టర్‌ రాజ్‌కుమార్‌కు సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ ఆసుపత్రిలో తాను, తమ సిబ్బంది ఎల్లప్పుడు రోగులకు అందుబాటులో ఉంటున్నామని, టిబి రోగుల కొరకు క్యాట్‌-1, 2 సౌకర్యం ఉందని అన్నారు. గత సంవత్సరం 42 టిబి రోగులకు నయం చేయడం జరిగిందని ...

Read More »

మూడో కన్ను నిఘాలో నందిపేట

  నందిపేట, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని పాత పెట్రోల్‌ బంక్‌ నుంచి జామే మసీద్‌ వరకు ఉన్న మెయిన్‌ రోడ్డు వెంబడి సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్‌ఐ జాన్‌రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్‌పి చంద్రశేఖర్‌రెడ్డి సూచనల మేరకు వ్యాపారస్తుల సహకారంతో బస్టాండ్‌, అంబేడ్కర్‌చౌరస్తా, తదితర ముఖ్య కూడళ్ళలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు నిరోధించి దొంగలు, అల్లరిమూకలను త్వరగా గుర్తించవచ్చన్నారు. తద్వారా శాంతిభద్రతల పరిరక్షణ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.

Read More »

ఆదర్శం… హసన్‌పల్లి యూత్‌

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆశగా ఎదురుచూడడం కంటే అందరం కలిసి సమష్టిగా ఏకమైతే ఎంతోకొంత అనుకున్నది సాధించుకోవచ్చు. అనే ఆలోచన నిజం చేస్తున్నారు మండలంలోని హసన్‌పల్లి గ్రామానికి చెందిన ఆదర్శయూత్‌ సభ్యులు. గ్రామంలో ఇంటర్‌, డిగ్రీ చదువులతో పాటు ఉన్నత చదువులు చదువుకుంటున్న సుమారు 20 మందియువకులు ఏకమై ఆదర్శ యూత్‌గా ఏర్పడ్డారు. గ్రామం బాగుకోసం యూత్‌సభ్యులు స్వచ్చందసేవతో సమా సేవకోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తు ముందుకు సాగుతున్నారు. గ్రామంలో ...

Read More »