Breaking News

Daily Archives: February 14, 2016

నేడు తెదేపా ప్రతిపక్ష నేత రేవంత్‌రెడ్డి రాక

నిజామాబాద్‌ సిటీ: తెలంగాణ తెదేపా శాసనసభా పక్షనేత రేవంత్‌రెడ్డి ఆదివారం జిల్లాకు వస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అరికెల నర్సారెడ్డి తెలిపారు. ఆర్మూర్‌కు చెందిన తలారి సత్యం, రవి మృతిపై విచారణ చేయించి న్యాయం చేయాలని కలెక్టరేట్‌ ఎదుట చేపడుతున్న దీక్షలో రేవంత్‌రెడ్డి పాల్గొని వారి కుటుంబాలకు సంఘీభావం తెలుపుతారన్నారు. ఉదయం 11 గంటలకు ఆయన వచ్చి దీక్షలో కూర్చుంటారని తెలిపారు.

Read More »

మన కూరగాయలు… మనమే పండించాలి

మన రాష్ట్రానికి అవసరమైన కూరగాయలు మనమే పండించుకోవాలి. ఇతర రాష్ట్రాల దిగుమతులకు చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉంది. మనకు పుష్కలమైన భూమి, నీరు ఉన్నాయి. అయినా లక్షలు విలువ చేసే కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నాం. ఇక నుంచి మన గ్రామం, మన జిల్లా, మన రాష్ట్రంలోనే మనకు అవసరమైన కూరగాయలు పండించాలి. ఈ విషయంపై ఉద్యానశాఖ అధికారులు రంగం సిద్ధం చేయాలి. -సీఎం కేసీఆర్‌ గురువారం రాజధానిలో అన్నమాట. ముఖ్యమంత్రి సూచనల మేరకు జిల్లా ఉద్యానశాఖ అధికారులు గ్రామాలు, మండలాల వారీగా కూరగాయలు, పండ్లు, ...

Read More »

నేడు ‘మిస్టర్‌ నిజామాబాద్‌’ బాడీ బిల్డింగ్‌ పోటీలు

నిజామాబాద్‌ క్రీడావిభాగం: జిల్లా బాడీ బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో డీఎస్‌ఏ మినీ స్టేడియంలో ఆదివారం సాయంత్రం ‘మిస్టర్‌ నిజామాబాద్‌’ బాడీ బిల్డింగ్‌ పోటీలు జరగనున్నాయి. జిల్లా స్థాయి పోటీలతో పాటు 56వ ‘మిస్టర్‌ ఇండియా’ సీనియర్‌ నేషనల్‌ బాడీబిల్డింగ్‌ ఛాంపియన్‌షిప్‌-2016 పోటీలకు ప్రాతినిధ్యం వహించే తెలంగాణ జట్టు ఎంపికలు సైతం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య తెలిపారు. మిస్టర్‌ ఇండియా పోటీలు ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో మార్చి 25 నుంచి 27 వరకు జరగనున్నాయన్నారు. 55, 60, 65, 70, 75, 80, 85, ...

Read More »