Breaking News

Daily Archives: February 15, 2016

దత్తత గ్రామాల్లో అభివృద్ది పనులు వేగవంతం చేయాలి

  నిజామాబాద్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సన్సద్‌ ఆదర్శ గ్రామీణ యోజన ఆదర్శ గ్రామాల్లో పెండింగులో ఉన్న అన్ని పనులు వెంటనే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి అనంతరం ప్రగతిభవన్‌లో అధికారులతో మాట్లాడారు. పార్లమెంటు సభ్యులు దత్తత తీసుకున్న కౌలాస్‌, కందకుర్తి గ్రామాల్లో ఇప్పటికే ఆదేశించిన ప్రకారం అన్ని పనులు త్వరలోనే పూర్తిచేయాలన్నారు. ఈ గ్రామాల్లో బాలకార్మికులు, బడిబయటి పిల్లలు లేని గ్రామాలుగా చర్యలు తీసుకున్నామని, స్వయం ఉపాధి క్రింద ...

Read More »

ఘనంగా సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి

  కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో సోమవారం సేవాలాల్‌ మహరాజ్‌ 277వ జయంతిని బంజారా సేవా సమితి ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భోగ్‌భండార్‌ కార్యక్రమం జరిపారు. దీనికి వివిధ ప్రాంతాల నుంచి నాయకులు, విద్యార్థులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలిండియా బంజారా సేవా సమితి డివిజన్‌ అధ్యక్షుడు గణేష్‌ నాయక్‌, విద్యుత్‌ శాఖ డిఇ శేషారావు నాయక్‌లు మాట్లాడారు. సేవాలాల్‌ మహరాజ్‌ జాతి కోసం చేసిన సేవామార్గంలో బంజారాలు ...

Read More »

ఘనంగా షబ్బీర్‌ జన్మదిన వేడుకలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో సోమవారం శాసన మండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌చేసి షబ్బీర్‌కు జన్మదిన వేడుకలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, వృద్దాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో హరిజన వాడలోని బాలసదనంలో 33 మంది చిన్నారులకు బట్టలు పంపినీ చేశారు. 59వ జన్మదినం పురస్కరించుకొని 59 మంది రక్తదానం చేశారు. ...

Read More »

సిసి కెమెరాతో నిఘా

  నందిపేట, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేరాలు అదుపునకు నందిపేట పోలీసులు దృష్టి సారించారు. సిసి కెమెరాలతో నలువైపులా కన్నేసి ఉంచారు. నందిపేటలోని ప్రధాన ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచుతున్నారు. మండల కేంద్రంలోని అన్ని ముఖ్య కూడళ్లల్లో కెమెరాలు ఏర్పాటు చేసి వీటన్నింటిని పోలీసు కంట్రోల్‌ రూంకు అనుసంధానం చేయనున్నారు. దీంతో ఎక్కడ ఏం జరుగుతుందో పోలీసులకు క్షణాల్లో తెలిసిపోతుంది. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గుర్తించడంతోపాటు నేరాలను, ప్రమాదాలను పసి ...

Read More »

నీటి కోసం బల్దియా ముట్టడి

  కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 8వ వార్డు ప్రజలు సోమవారం నీటి కోసం బల్దియా ముట్టడించారు. 8వ వార్డులోని రాజీవ్‌నగర్‌, న్యూ ఇందిరా నగర్‌ కాలనీ వాసులు నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఎద్దడి తీర్చాలని మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మను ఆమె చాంబరులో కలిసి తెలిపారు. నీటి కష్టాల గురించి ఆమెను వివరించారు. వార్డులో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని బోర్లలో నీరు ఎండుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి వసతి కల్పించాలని కోరారు. ...

Read More »

రిలేదీక్షలకు తరలిరావాలి

  నందిపేట, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తలారి సత్యం, చేపూరు రవిల హత్యలకు నిరసనగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ అధ్యక్షుడు బట్టి విక్రమార్క హాజరుకానున్నారని నందిపేట మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు బండి నర్సాగౌడ్‌ తెలిపారు. కావున కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రానికి తరలిరావాలని అన్నారు.

Read More »

అందరి సహకారంతో అభివృద్ది పనులు పూర్తిచేయాలి

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ది పనులను అన్ని శాఖల అధికారులు అందరి సహకారంతో సకాలంలో పూర్తిచేయాలని మోర్తాడ్‌ మండల ప్రత్యేకాధికారి శంకరయ్య అన్నారు. సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలో మండల వివిధ శాకల అధికారులతో ఎంపిపి కల్లెడ చిన్నయ్య అధ్యక్షతన పలు అభివృద్ది పనులపై సమీక్షించారు. గ్రామాల్లో ప్రతి కుటుంబానికి 150 రోజుల ఉపాధి పనులు కల్పించాలని అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో అంగన్‌వాడికేంద్రాలకు స్థలాలను ఎంపిక చేసి జిల్లా ...

Read More »

ప్రజావాణికి 4 ఫిర్యాదులు

  నందిపేట, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట తహసీల్‌ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి 4 ఫిర్యాదులు వచ్చినట్టు తహసీల్దార్‌ బావయ్య తెలిపారు. ఫిర్యాదులు రేషన్‌ కార్డుల కోసం వచ్చినట్టు తెలిపారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులకు ప్రజావాణి ద్వారా వెంటనే పరిష్కారం లభిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్‌ సూచించారు.

Read More »

బీడీ కట్టలపై పుర్రెగుర్తు తొలగించాలి

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ, రాష్ట్ర వ్యాప్తంగా బీడీ పరిశ్రమపై ఆధారపడి రెండుకోట్ల మంది జీవిస్తున్నారని, బీడీకట్టలపై పుర్రె గుర్తును 80 శాతం ముద్రిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం అవివేకమని తెలంగాణ బీడీ వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శి సత్తెక్క, న్యూడెమోక్రసి కార్యదర్శి సారా సురేశ్‌, కిషన్‌ అన్నారు. సోమవారం మండలంలోని ఆయా గ్రామాల్లో గల బీడీ కార్మికులు యూనియన్‌ ఆద్వర్యంలో పాలెం క్రాస్‌రోడ్డు నుంచి 1500 మంది భారీ ర్యాలీగా తహసీల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ...

Read More »

మధ్యాహ్న భోజనాలు నిలిపివేసిన నిర్వాహకులు

  నందిపేట, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మధ్యాహ్న భోజన నిర్వాహకులు తమ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని కోరుతూ సోమవారం నుంచి పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నిలిపివేసి తమ నిరసనలు తెలిపారు. నిత్యవసర సరుకుల ధరలకు అనుగుణంగా స్లాబ్‌రేటు పెంచాలని, గుడ్లను ప్రభుత్వమే సరఫరా చేసి మౌలిక వసతులు కల్పించి, ప్రతినెల బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు విదులకు హాజరయ్యేది లేదని తెలిపారు. సిఐటియు ఆధ్వర్యంలో మండల ...

Read More »

డయల్‌ యువర్‌ ఎస్పీకి 19 ఫిర్యాదులు

  నిజామాబాద్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ ఎస్పీకి నేడు 19 ఫిర్యాదులు వచ్చినట్టు జిల్లా పోలీసు శాఖాధికారి వెల్లడించారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆద్వర్యంలో డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమం ఎస్‌పి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌, కామారెడ్డి, ఆర్మూర్‌, బోధన్‌ సబ్‌ డివిజన్‌ పరిధి నుంచి వివిధ రకాల సమస్యలపై మొత్తం 19 ఫిర్యాదులు వచ్చినట్టు ...

Read More »

డేంజర్‌ గుర్తు తొలగించాలని బీడీ కార్మికుల ధర్నా

15.02.1   నందిపేట, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో టెలిపోన్‌ బీడీ కంపెనీ ప్రాంగణంలో జరిగిన బహిరంగసభలో యూనియన్‌ రాష్ట్ర అద్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడారు. బీడీ కార్మికుల పరిస్తితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారిందని, ఇప్పటికే చేతినిండా కార్మికులు పనిదొరకక కార్మికులు ఆకలితో అల్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వం జీవోనెంబరు 727 తెచ్చి బీడీ కట్టలపై డేంజర్‌ గుర్తును 85 శాతం ముద్రించడం ...

Read More »

గాయత్రి మంత్ర స్మరణ సమయంలో నియమాలేంటి ?

1.గాయత్రి మంత్రం ప్రయోజనాలు గాయత్రి మంత్రం చాలా పవర్ ఫుల్ మంత్రంగా భావిస్తారు. వేదాలలో రాసిన ఈ మంత్ర స్మరణ ద్వారా శారీరక, మానసిక ప్రభావం ఉంటుందని చెబుతారు. 2.అద్భుతమైన శక్తి : ఈ గాయత్రి మంత్రంలో అద్భుతమైన శక్తి ఉంది. దేవుడిని పూజించేటప్పుడు ఈ మంత్రం జపిస్తారు. దేవుడి ఆశీస్సులు, సామాజిక ఆనందం, సంపద కోసం ఈ మంత్రం జపిస్తారు. 3.ఏ సమయంలో: ఈ మంత్రం జపించడానికి రోజూ మూడు సందర్భాలు ముఖ్యంగా చెబుతారు. సంధ్యాసమయం, సూర్యోదయానికి ముందు, సూర్యుడు అస్తమించే వరకు ...

Read More »

రాష్ట్ర ఖోఖో సంఘం ఉపాధ్యక్షుడిగా విద్యాసాగర్‌రెడ్డి

నిజామాబాద్‌ క్రీడావిభాగం: తెలంగాణ రాష్ట్ర ఖోఖో సంఘం ఉపాధ్యక్షుడిగా టి.విద్యాసాగర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని ఎఐటీయూసీ భవనంలో రాష్ట్ర ఖోఖో సంఘం ఎన్నికల సమావేశం జరిగింది. పూర్తి కార్యవర్గాన్ని 2016-2020 సంవత్సరాలకుగాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శిగా సేవలను అందిస్తున్న విద్యాసాగర్‌రెడ్డి వ్యాయామ అధ్యాపకునిగా భీమ్‌గల్‌ జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. అంతేగాక జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం(పేటా) ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. జిల్లాలో ఖోఖో, కబడ్డీ క్రీడల ప్రగతికి తనవంతుగా విశిష్ట సేవలను అందిస్తున్నారు. ...

Read More »

నెహ్రూనగర్‌లో యువకుడి దారుణ హత్య

నెహ్రునగర్‌ (ఎడపల్లి): ఎడపల్లి మండలం నెహ్రూనగర్‌ గ్రామ శివారులో నున్న పశు వధశాలలో అర్ధరాత్రి గుర్తు తెలియని యువకున్ని (26) దారుణంగా హత్య చేశారు. యువకుని ఆనవాళ్లు గుర్తించకుండా మృతదేహం కొంత భాగాన్ని కాల్చివేశారు. గ్రామం చివరలో నున్న పశువధశాలలో ఆగంతకులు యువడిని తీసుకొచ్చి ముఖంపై పెద్ద బండరాయితో కొట్టి చంపేశారు. దీనితో యువకుని తల ఛిద్రమైంది. ఒంటిపై కాలిన గాయాలున్నాయి. నిందితులు హత్యకు గురైన యువకుని వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా చేశారు. మృతుని ఒంటిపై ఉన్న నలుపు రంగు ప్యాంటు తొలగించి ...

Read More »

సిలిండర్‌ పేలి ఇల్లు దగ్ధం

వల్లభాపూర్‌(కోటగిరి): వల్లభాపూర్‌ గ్రామానికి చెందిన మేకల రాజు ఇల్లు గ్యాస్‌సిలిండర్‌ పేలి దగ్ధమైంది. శనివారం రాత్రి ఇంట్లో వంటచేస్తుండగా ప్రమాధ వశాత్తు వంటగ్యాస్‌ లీకయ్యిందని దాంతో మంటలు చెలరేగాయన్నారు. భయభ్రాంతులకు గురైన కుటుంబీకులు ప్రాణభీతితో ఇంట్లో నుంచి బయటకు పరుగుతీసి ప్రాణాలను కాపాడుకోగలిగారు. సిలిండర్‌ పేలి ఇల్లు దగ్ధమైందన్నారు. ఇంట్లో ఉన్న వస్తుసామాగ్రితోబాటు ద్విచక్రవాహం సహా సుమారు రూ. 1.70 లక్షల ఆస్థినష్టం జరిగిందన్నారు. గ్యాస్‌సిలిండర్‌ పేలి ఇల్లు దగ్ధమై నిరాశ్రయులైన రాజు కుటుంబానికి స్ధానిక సర్పంచి, గ్రామస్థులు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఎత్తోండ ...

Read More »

మేడారం జాతరకు 30 బస్సులు

నిజామాబాద్‌ అర్బన్‌: నిజామాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి ఆదివారం 30 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ప్రారంభించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం 30 బస్సులు మేడారం జాతరకు బయలుదేరి వెళ్లాయి. ఆదివారం నిజామాబాద్‌ నుంచి బయలుదేరిన ఈ బస్సులు వారంరోజులు అక్కడే ఉండి మేడారానికి 100 నుంచి 80 కిమీ దూరంలో నిజామాబాద్‌ జిల్లాకు ప్రత్యేకంగా కేటాయించిన పాయింట్ల నుంచి ప్రయాణికులను మేడారానికి తీసుకెళ్లేలా ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి సోమవారం సైతం మరిన్ని బస్సులను పంపించేలా ఏర్పాట్లు చేశారు. ఇది ఇలా ...

Read More »

సైక్లింగ్‌ క్రీడకు చలపతిరావు విశిష్ట సేవలు

నిజామాబాద్‌ క్రీడావిభాగం: జిల్లాలో సైక్లింగ్‌ క్రీడకు పునాదులు వేసి రాష్ట్ర, జాతీయస్థాయిలో పేరు ప్రతిష్టలు పెంచేందుకు బి.చలపతిరావు విశిష్ట సేవలు అందించారని మాజీ ఎంపీ, సీనియర్‌ న్యాయవాది ఎం.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం నగరంలోని కంఠేశ్వర్‌ ప్రాంతంలోని బైపాస్‌రోడ్‌లోని హౌసింగ్‌బోర్డు వద్ద జిల్లా సైక్లింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన చలపతిరావు స్మారక జిల్లాస్థాయి సైక్లింగ్‌ పోటీల బహుమతుల ప్రధానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సైక్లింగ్‌ క్రీడ ప్రగతికి మూడు దశాబ్దాలకు పైగా ఎనలేని కృషి చేశారని చెప్పారు. జిల్లా నుంచి ఎంతో మంది ...

Read More »

ఈ నెల 18 నుంచి ఇంటర్‌ పరిక్షలు

నాందేడ్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర మాధ్యమిక, ఉన్నత విద్యామండళి లాతూర్‌ తరపున ఈ నెల 18 నుంచి ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలు, మార్చి 1 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నవి. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలో 29,884 మంది విద్యార్థులు 67 కేంద్రాలో పరీక్షలు రాయనున్నారు. మార్చి 1 నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. వీటిని 45,492 మంది విద్యార్థులు 145 కేంద్రాల్లో రాయనున్నారు. పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక పోలీస్‌ బలగాలను నియమించినట్లు ఎస్పీ పరమజీత్‌ సింగ్‌ దహియా తెలిపారు. కలెక్టర్‌ ...

Read More »

ప్రాణానికి ముప్పున్నా పోలీసులు స్పందించలేదు

నిజామాబాద్‌ సిటీ: ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ద్వారా తన ప్రాణాలకు ముప్పు ఉందని తలారి సత్యం చెప్పినా పోలీసులు ఎందుకు స్పందించలేదని తెలంగాణ తెదేపా శాసనసభాపక్ష నేత రేవంత్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్‌కు చెందిన తలారి సత్యం, రవిల మృతిపై న్యాయ విచారణ చేపట్టి న్యాయం చేయాలని నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట జరుగుతున్న దీక్షా శిబిరానికి వచ్చిన ఆయన మద్దతు తెలిపారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు అరికెల నర్సారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి పోలీసులు నూటికి నూరు శాతం ...

Read More »