Breaking News

సైక్లింగ్‌ క్రీడకు చలపతిరావు విశిష్ట సేవలు

నిజామాబాద్‌ క్రీడావిభాగం: జిల్లాలో సైక్లింగ్‌ క్రీడకు పునాదులు వేసి రాష్ట్ర, జాతీయస్థాయిలో పేరు ప్రతిష్టలు పెంచేందుకు బి.చలపతిరావు విశిష్ట సేవలు అందించారని మాజీ ఎంపీ, సీనియర్‌ న్యాయవాది ఎం.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం నగరంలోని కంఠేశ్వర్‌ ప్రాంతంలోని బైపాస్‌రోడ్‌లోని హౌసింగ్‌బోర్డు వద్ద జిల్లా సైక్లింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన చలపతిరావు స్మారక జిల్లాస్థాయి సైక్లింగ్‌ పోటీల బహుమతుల ప్రధానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సైక్లింగ్‌ క్రీడ ప్రగతికి మూడు దశాబ్దాలకు పైగా ఎనలేని కృషి చేశారని చెప్పారు. జిల్లా నుంచి ఎంతో మంది క్రీడాకారులను తీర్చిదిద్దిన ఘనత చలపతికే దక్కిందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గడీల శ్రీరాములు, నిర్వహణ కార్యదర్శి సాయిలు, ఉపాధ్యక్షుడు డెవిడ్‌, నర్సింగ్‌రావు, జిల్లా సైక్లింగ్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు టి.సూర్యప్రకాష్‌, రాజ్‌కుమార్‌ సుబేదార్‌, కార్యదర్శి బి.విజయ్‌కాంత్‌ రావు, కోశాధికారి సురేందర్‌, సభ్యులు టి.నరేష్‌, నర్సింగ్‌, రాకేష్‌కుమార్‌, ఎ.నరేష్‌, సప్తగిరి, శ్రీధర్‌రావు, క్రాంతికిరణ్‌, దివాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు బి.చలపతిరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అటు తరువాత సైక్లింగ్‌ పోటీల విజేతలకు పతకాలు, ప్రశంసపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సైక్లింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శిగా బాధ్యతలను చేపట్టిన చలపతిరావు కుమారుడు బి.విజయ్‌కాంత్‌రావును ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సన్మానించారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో సైక్లింగ్‌ పోటీలను ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గడీల శ్రీరాములు, మూడోఠాణా ఎస్సైలు జేండా వూపి ప్రారంభించారు. టోర్ని విజేతల వివరాలను సైక్లింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి బి.విజయ్‌కాంత్‌రావు వెల్లడించారు. వివరాలిలావున్నాయి.

సైక్లింగ్‌ పోటీల విజేతలు వీరే
అండర్‌-14 బాలురు
1. ఠాకూర్‌ విష్ణువర్దన్‌ (బ్లూమింగ్‌బడ్స్‌ స్కూల్‌)
2. టి.భూమేష్‌ (ఎస్‌.ఎఫ్‌.ఎస్‌)
3. ఎస్‌.సచిన్‌ (ఎస్‌.ఎఫ్‌.ఎస్‌)

అండర్‌-14 బాలికలు
1. నవనీత (బ్లూమింగ్‌ బడ్స్‌)
2. సాత్విక (కాకతీయ స్కూల్‌)
3. ఎ.దాన్య (బ్లూమింగ్‌ బడ్స్‌)

అండర్‌-18 బాలురు
1. ఓమ్‌ విజయ్‌ (బ్లూమింగ్‌బడ్స్‌)
2. హర్షకుమార్‌ (బ్లూమింగ్‌ బడ్స్‌
3. ఎస్‌. ఆకర్ష్‌(తృతీయ)

పురుషుల విభాగం
1. ఎం.డి. అఫ్సర్‌ (పోలీస్‌ కానిస్టేబుల్‌)
2. గిరి (ఆర్టీసీ ఉద్యోగి)
3. ఎ.నరేష్‌కుమార్‌ (తెలంగాణ యూనివర్సీటీ)

పురుషుల ప్రత్యేక విభాగం
1. జగదీష్‌ (ఎస్‌ఐ మూడోటౌన్‌)
2. గడీలశ్రీరాములు (అధ్యక్షులు ఒలింపిక్‌ అసోసియేషన్‌)
3. యతిన్‌ కృష్ణ (నిజామాబాద్‌)

Check Also

ఇళ్ళు దెబ్బతిన్న వారికి తక్షణ సహాయం అందించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా దెబ్బతిన్న ...

Comment on the article