Breaking News

Daily Archives: February 16, 2016

స్పీడ్‌బ్రేకర్లు వాహన దారులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి

నందిపేట్ మండల కేంద్రంలోని గోసంగి వాడలో నెల రోజుల క్రితం నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన స్పీడ్‌బ్రేకర్లు వాహన దారులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి . ఈ స్పీడ్‌బ్రేకర్‌లను ఏర్పాటులో ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్పీడ్‌బ్రేకర్ల ఏర్పాటు చేసిన నాటి నుంచి చాలా మంది వాహనదారులు ప్రమాదానికి గురయ్యారని , దీంతో గోసంగి వాడలో వేసిన స్పీడ్‌బ్రేకర్‌ను తొలగించాలని ప్రజలు కొరుతున్నరు. . రాత్రి సమయంలో వాహనదారులకు దూరం నుంచి ఏర్పడే విధంగా స్పీడ్‌బ్రేకర్‌ల వద్ద రేడియం లైటింగ్ మార్క్‌లు, పగటి ...

Read More »

మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత కమిటీలు

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళా ఉద్యోగుల రక్షణకు అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఆదేశించారు. కనీసం పదిమంది మహిళలు పనిచేసేచోట అంతర్గత కమిటీలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. లైంగిక వేధింపుల నుంచి మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం రూపొందించిన చట్టం పట్ల అవగాహన కల్పించేందుకు రూపొందించిన కరపత్రాన్ని మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌ ...

Read More »

పూర్తయిన సిసి రోడ్డు పనులు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ప్రధాన కూడలి నుంచి పాత బస్టాండ్‌ వరకు గలరోడ్డును సిసి గా మార్చారు. నైజాం కాలంలో ఇక్కడి మండల ప్రజల సౌకర్యార్థం అప్పట్లో ఈ రోడ్డు సౌకర్యం కల్పించారు. అప్పటినుంచి ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు. దీంతో రోడ్డు గుంతలమయంగా మారి రాకపోకలకు స్తానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్తానికుల విజ్ఞప్తి మేరకు సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజాప్రతినిధులు జిల్లా ఉన్నతాధికారులను కోరారు. జిల్లాపరిషత్‌ నిధులు రూ. 10 ...

Read More »

పాఠశాల విద్యార్థులకు వితరణ

  కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఓరియంటల్‌ పాఠశాల విద్యార్థులకు మంగళవారం వాసవి క్లబ్‌, వాసవి వనిత క్లబ్‌, యూత్‌ క్లబ్‌ల ఆద్వర్యంలో విద్యార్థులకు కావలసిన సామగ్రి వితరణ చేశారు. విశ్వనాథుల సిద్దిరాములు జ్ఞాపకార్థం వాసవి క్లబ్‌ అధ్యక్షుడు విశ్వనాథుల మహేశ్‌గుప్త పాఠశాలలోని 40 మంది పేదవిద్యార్థులకు ప్యాడ్‌లు, పెన్నులు పంపినీ చేశారు. కవిత అనే విద్యార్థినికి సంవత్సరం ఫీజు రూ. 1300 చెల్లించారు. కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిదులు అనిత, ప్రవీణ్‌, ఆంజనేయులు, సునీత, రిటైర్డ్‌ ...

Read More »

ఫీడర్‌ ఛానల్‌ పనులు పూర్తిచేయాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గోదావరి జలాల పథకానికి సంబంధించి ఫీడర్‌ ఛానల్‌ పనులు జరుగుతున్న నేపథ్యంలో తాగునీటి సరఫరా నిలచిపోయిందని, వాటిని యుద్ద ప్రాతిపదికన పూర్తిచేయాలని కామరెడ్డి బల్దియా పాలక వర్గం మంగళవారం జిల్లా కలెక్టర్‌కు నివేదించారు. ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, పాలకవర్గ ప్రతినిధులు, శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌ అలీతో కలిసి కలెక్టర్‌ దృస్టికి నీటి ఎద్దడి సమస్య తీసుకొచ్చారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో గోదావరి జలాల ద్వారా నీటి సరపరా జరుగుతుందన్నారు. ఫీడర్‌ ...

Read More »

వార్డుల్లో పర్యటించిన మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌

  కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 19వ వార్డులో మంగళవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న సమస్యలను వార్డు ప్రజలను అడిగి తెలుసుకున్నారు.’ మురికి కాలువల నిర్వహణ సరిగా లేదని, మురికి కాలువల నిర్మాణాలు చేపట్టాలని ప్రజలు ఛైర్‌పర్సన్‌ దృష్టికి తెచ్చారు. దశల వారిగా మురికి కాలువల నిర్మాణాలు చేపడతామని వార్డు వాసులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ శశిరేఖ, దయానంద్‌, కాంగ్రెస్‌ నాయకుడు కృపాల్‌, ఎ.ఇ. ...

Read More »

తెవివిలో టేకుచెట్ల పెంపకం

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ మెయిన్‌ క్యాంపస్‌లో వర్షాకాలం ఆగష్టు 2015లో తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా సెంట్రల్‌ లైబ్రరికి ఎదురుగా ఉన్న ఖాళీ స్తలంలో హార్టికల్చర్‌ డిపార్టుమెంటు వారు పండ్ల మొక్కలు నాటించారు. దానికి డ్రిప్‌ పద్దతిలో నీరు అందించే పనులు చేస్తున్నారు. మొక్కల మధ్య ఖాళీ స్థలం ఎక్కువగా ఉండడం మరియు డ్రిప్‌ నీరు వృధా పోవడం వల్ల ఎస్టేట్‌ ఆఫీసర్‌ జి. అశోక్‌ వర్దన్‌రెడ్డి మొక్కల మద్య టేకు మొక్కలు ...

Read More »

మార్చి 1 నుంచి బిఇడి రెగ్యులర్‌ పరీక్షలు

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిఇడి మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌ పర్షీలు ఇదివరకు ప్రకటించిన విధంగా మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ పాత నాగరాజు తెలిపారు. ఏయే పరీక్షా కేంద్రాల్లో అభ్యర్తులు పరీక్షలు రాయాల్సి ఉంటుందనేది తర్వాత తెలియజేస్తామని ఆయన వివరించారు. మార్చి 1,3,5,9,11,14 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని డాక్టర్‌ నాగరాజు తెలిపారు.

Read More »

పంచాయతీ కార్యాలయంలో ఆడిట్‌

  బీర్కూర్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం ఆడిట్‌ కార్యక్రమం కొనసాగింది. 2014-15 సంవత్సరానికి గాను ఆదాయ, వ్యయాలపై ఆడిట్‌ జరుపుతున్నట్టు, గ్రామంలో అభివృద్ది పనుల దృస్ట్యా జరిగిన పనులపై నివేదికలు పరిశీలిస్తున్నట్టు ఆడిట్‌ అధికారి మహ్మద్‌ జహంగీర్‌ షరీప్‌ అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు రమేశ్‌, లక్ష్మికాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సబబు కాదు

  నందిపేట, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తలారి సత్యం, చేపూరు రవిల రోడ్డు ప్రమాదాన్ని హత్యయత్నంగా వక్రీకరించడం సబబు కాదని, శవ రాజకీయాలు మానుకోవాలని నందిపేట దళిత నాయకులు అన్నారు. మంగళవారం ఐలాపూర్‌ గ్రామంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద దళిత నాయకులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలుగుదేశం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పల్లె నిద్ర ద్వారా దళిత వాడల్లో నిద్రపోతూ, దళితులతో మమేకమైన నాయకుడని, అభివృద్దిని ...

Read More »

గ్రామంలో మంచినీటి సమస్యలు పరిష్కరిస్తాం

  బీర్కూర్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్య పరిష్కరిస్తామని గ్రామ సర్పంచ్‌ నర్సయ్య అన్నారు. మంగళవారం గ్రామ పంచాయతీ భవనంలో వార్డు మెంబర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా గ్రామంలో తాగునీటి సమస్య నెలకొందని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమస్యను అధిగమిస్తామని ఆయన అన్నారు. గ్రామంలో రోడ్లకు ఇరువైపులా పంటపొలాల్లో వేసిన బోరు గుంతలను గుర్త

Read More »

కెసిఆర్‌ జన్మదినం సందర్బంగా వ్యాసరచనపోటీలు

  నందిపేట, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో బంగారు తెలంగాణ-కెసిఆర్‌ నాయకత్వం అనే అంశంపై వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నట్టు మండల నాయకులు అంకంపల్లి రవి తెలిపారు. విజేతలకు ఐలాపూర్‌ పాఠశాలలో మధ్యాహ్నం 3 గంటలకు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని అన్నారు.

Read More »

చెన్నైని మరువగలనా..

సూపర్‌కింగ్స్‌తో నాది గట్టి బంధం బుమ్రా భలే కలిసొచ్చాడు: ధోని దిల్లీ ఐపీఎల్‌లో తాను ఎనిమిదేళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టుతో ఉన్న జ్ఞాపకాల్ని.. చెన్నై అభిమానులతో బంధాన్ని అంత సులువుగా మరిచిపోలేనని అన్నాడు మహేంద్రసింగ్‌ ధోని. సూపర్‌కింగ్స్‌పై రెండేళ్ల నిషేధం పడిన నేపథ్యంలో వచ్చే రెండు సీజన్లలో కొత్త ఫ్రాంఛైజీ పుణెకు ఆడబోతుండటం చాలా కొత్తగా అనిపిస్తోందని ధోని అన్నాడు. రాబోయే ఐపీఎల్‌ సీజన్‌పై.. ప్రస్తుతం భారత జట్టు ఫామ్‌, టీ20 ప్రపంచకప్‌ అవకాశాలపై ధోని అభిప్రాయాలు అతడి మాటల్లోనే..చెన్నై ...

Read More »

బ్యాంకింగ్ రంగంలో మరిన్ని సంస్కరణలు

ముంబయి, ఫిబ్రవరి 16: బ్యాంకింగ్ రంగంలో మరిన్ని సంస్కరణలను ప్రభుత్వం తేనుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ‘రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ రంగ సంస్కరణలను దశలవారీగా ప్రకటిస్తాం.’ అని ఆదివారం ఇక్కడ మేక్ ఇన్ ఇండియా వీక్‌లో భాగంగా జరిగిన సిఎన్‌ఎన్ ఆసియా బిజినెస్ ఫోరమ్ 2016లో మాట్లాడుతూ అన్నారు. బ్యాంకింగ్ రంగంలోని 27 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలను ఇప్పుడే ఉపసంహరించుకోబోమన్న అరుణ్ జైట్లీ ప్రభుత్వ వాటాను 51 శాతానికి తగ్గించుకుంటామని గతంలోనే నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేశారు. ...

Read More »

ఉలవచారు చికెన్ బిర్యాని

కావలసిన పదార్థాలు : బాస్మతీ రైస్‌, చికెన్- ఒక కేజీ చొప్పున, ఉలవచారు – అరకిలో, నిమ్మకాయలు – రెండు, ఉల్లిపాయలు (తరిగి), పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు,పచ్చిమిర్చి (చీలికలు)-150 గ్రాములు చొప్పున, పుదీనా తరుగు- నాలుగు టేబుల్‌స్పూన్లు, బిర్యానీ ఆకులు- నాలుగు, నెయ్యి – వందగ్రాములు, బిర్యాని మసాలా దినుసులు, పసుపు – 50గ్రాములు, ఉప్పు, కారం తగినంత. తయారీ విధానం : గిన్నెలో కొద్దిగా నెయ్యిని వేసి మసాలా దినుసులను వేగించాలి. ఆ తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకులు వేసి ...

Read More »

మందుల ఫ్యాక్టరీ మాకొద్దు

భిక్కనూరు : మండలంలోని అంతంపల్లి గ్రా మ శివారులో సర్వే నంబర్ 168లో ఉన్న ఐదు ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన ఆక్టెన్ కెమికల్ ఫ్యాక్టరీని నిర్మించవద్దని గ్రామస్తులు సో మవారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట అరగంట పాటు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పర్యావరణ అనుమతుల కోసం ఈనె ల 10న గ్రామశివారులో అడిషినల్ జేసీ ఆ ధ్వర్యంలో జరిగిన సమావేశంలో గ్రామస్తులు ఈ మందుల ఫ్యాక్టరీ మాకోద్దని సభను రద్దు చేశామన్నారు. అయినా గ్రామస్తులందరిని కాదని గ్రామ సర్పంచి, ...

Read More »

వర్సిటీల్లో కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడుదాం

ఆర్మూర్ టౌన్: యూనివర్సిటీల్లో కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధం కావాలని హెచ్‌సీయూ జేఏసీ నేత బషీర్ పిలుపునిచ్చారు. హెచ్‌సీయూ జేఏసీ చేపట్టిన బస్సుయాత్ర సోమవారం ఆర్మూర్‌కు చేరుకుంది. బస్సుయాత్రకు పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ(టీ) దళిత సంఘాల ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. హెచ్‌సీయూ జేఏసీ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు. హెచ్‌సీయూ జేఏసీ నేత బషీర్ మాట్లాడుతూ.. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ మృతికి కారకులైన కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతిఇరానీ, వీసీ అప్పారావులను బర్తరఫ్ చేసి ...

Read More »

ఏప్రిల్ నుంచి పట్టపగలే 9 గంటల కరెంటు అందిస్తాం..

ఏప్రిల్ నుంచి పట్టపగలే 9 గంటల త్రీఫేజ్ కరెంటు అందిస్తామని, రెండేళ్లలో వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు. వాటర్‌గ్రిడ్ పథకానికి సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి అయిందన్నారు. 196 గ్రామాల్లో పైపులైన్‌కు సర్వే పూర్తి చేశామని తెలిపారు. ప్రతి పేదవాడికి డబుల్‌బెడ్ రూం ఇల్లును ప్రభుత్వం నిర్మించి ఇస్తుందని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక ఆర్డీవో, తహసీల్దార్ స్థాయిలో జరుగుతుందన్నారు. జిల్లాలో 2 లక్షల 78 వేల మందికి పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జేడీఏ ...

Read More »

టీఆర్‌ఎస్ గురించి మాట్లాడే హక్కు రేవంత్‌రెడ్డికి లేదు

డిచ్‌పల్లి : టీడీపీ నాయకుడు రేవంత్‌రెడ్డికి టీఆర్‌ఎస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కులేదని టీఆర్‌ఎస్‌ఆర్వీ జిల్లా అధ్యక్షుడు చింత మహేశ్ అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ యూనివర్సిటీలో విలేకరులతో మాట్లాడారు. ఆదివారం జిల్లా కేంద్రానికి వచ్చిన రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో నక్సలైట్ల పాలన ఉంటే బాగుండు అని మాట్లాడడం తగదన్నారు. గతంలో కేసీఆర్ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ ఎజెండా నక్సలైట్ల ఎజెండా అని ప్రచారం చేశారని, అప్పట్లో రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలైట్లు పుడతారని ఎద్దేవా చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో ...

Read More »

గల్ఫ్‌లో నాగాపూర్ వాసి మృతి

బాల్కొండ: మండలంలోని నాగాపూర్ గ్రామానికి చెందిన ముత్తన్న(42) రెండు రోజుల క్రితం ఖతార్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఏడాది క్రితమే ముత్తన్న ఖతార్ వెళ్లాడని స్థానికులు తెలిపారు. ముత్తన్నకు భార్య, కొడుకు, కూతూరు ఉన్నారన్నారు. ప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని, శవాన్ని తెప్పించాలని కోరారు.

Read More »