Breaking News

Daily Archives: February 17, 2016

నందిపేట సర్పంచ్‌ రౌడీయిజం

  నందిపేట, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని మేజర్‌ గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ షాకీర్‌ ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో నందిపేట గ్రామ పంచాయతీ పరువును మంటగలిపిన సర్పంచ్‌ తాజాగా బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో వార్డు మెంబర్లపై రౌడీయిజం చలాయించాడు. వివరాల్లోకి వెళితే… ఇదివరకు పనిచేసిన కార్యదర్శి శంకరయ్యను సర్పంచ్‌తో కలిసి దుర్వినియోగానికి పాల్పడ్డారని సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. అతని స్థానంలో కొత్తగా వచ్చిన కార్యదర్శి రామకృష్ణారెడ్డి బుధవారం పాలకవర్గంతో పరిచయ ...

Read More »

బస్సుల కోసం తిప్పలు

  నందిపేట, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేడారంలోని సమ్మక్క, సారలమ్మ జాతరల కొరకు నిజామాబాద్‌ రీజియన్‌ బస్సులను అక్కడికి మళ్ళించడంతో నందిపేటకు వచ్చిపోయే బస్సుల సంఖ్య తగ్గిపోవడంతో మండల ప్రజలు పరేషాన్‌ అవుతున్నారు. బస్సు సర్వీసులు తగ్గడంతో ఆ ప్రభావం ప్రయాణీకులపై పడింది. నిత్యం వ్యాపార, ఉద్యోగ రీత్యా మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లే వారికి బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలియని ప్రయాణీకులు గంటల తరబడి ప్రయాణప్రాంగణంలో నిరీక్షిస్తున్నారు.

Read More »

కోచింగ్‌ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న శ్రీవికాస్‌ కోచింగ్‌ సెంటర్‌పై చర్యలు తీసుకోవాలని బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోచింగ్‌ సెంటర్‌లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా విద్యార్థుల నుంచి వేలాది ఫీజులు వసూలు చేస్తూ నడిపిస్తున్నారన్నారు. కనీసం విశాలమైన గదులు లేకుండా, ఒకేగదిలో వందమంది విద్యార్తులను కుక్కి సెంటర్లు నడిపిస్తున్నారని, వీటిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ...

Read More »

తెరాసలోకి పలువురు కార్యకర్తలు….

  కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన 50 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు బుధవారం ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ సమక్షంలో తెరాసలో చేరారు. పట్టణ యువజన కాంగ్రెస్‌ నాయకుడు చింతలరాజు 50 మంది కార్యకర్తలతో కలిసి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలకు ఆకర్సితులై ఆయా పార్టీల నాయకులు తెరాసలో చేరుతున్నారన్నారు. కార్యకర్తలు ప్రజల కష్టాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో తెరాస పట్టణ అద్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, ...

Read More »

సబ్సిడీపై ట్రాక్టర్‌ అందజేత

  కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో బుధవారం సబ్సిడీపై ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ లబ్దిదారుడు ఇంద్రసేనారెడ్డికి అందజేశారు. ప్రభుత్వం నుంచి లబ్దిదారులైన రైతులను గుర్తించి వారికి ట్రాక్టర్లు అందజేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. తద్వారా మరింత దిగుబడి సాధించి లబ్దిపొందాలని సూచించారు. కార్యక్రమంలో ఐడిసిఎంఎస్‌ ఛైర్మన్‌ ముజిబుద్దీన్‌, తెరాస పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు పిప్పిరి ఆంజనేయులు, బాలకిషన్‌గౌడ్‌, కృష్ణమూర్తి, నర్సారెడ్డి, మహేశ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ స్వగృహంలో కెసిఆర్‌ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్‌కట్‌చేసి కార్యకర్తలకు తినిపించారు. కెసిఆర్‌ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఐడిసిఎంఎస్‌ ఛైర్మన్‌ ముజిబుద్దీన్‌, తెరాస పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు రాజేశ్వర్‌, తిరుమల్‌రెడ్డి, ప్రబాకర్‌రెడ్డి, రమేశ్‌ గుప్త, ...

Read More »

మోబైల్‌ సెంటర్లపై పోలీసుల దాడులు

  – మూడు దుకాణాలు సీజ్‌ కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని మోబైల్‌ సెంటర్లపై బుధవారం సిఐ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్దంగా సినిమా పాటల సిడిలను కాపీచేసి వాటిని వినియోగదారులకు మోబైల్‌ మెమోరి కార్డుల్లో వేసి అమ్ముతున్నారని, కాపీరైట్‌ చట్టానికి విరుద్దం కావడంతో వారిని పట్టుకున్నామన్నారు. మూడు దుకాణాలను సీజ్‌చేసి యజమానులను రిమాండ్‌కు తరలించినట్టు సిఐ పేర్కొన్నారు. మూడు కంప్యూటర్‌ సిస్టమ్‌లను సీజ్‌చేశామన్నారు.

Read More »

తాగునీటి సమస్య పరిష్కారానికి కృషిచేస్తా

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌లో తాగునీటి ఎద్దడి నెలకొందని, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి దృస్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి కృసి చేస్తానని మోర్తాడ్‌ సర్పంచ్‌ దడివె నవీన్‌ అన్నారు. బుధవారం మోర్తాడ్‌లోని తక్కూరివాడలో బోరుమోటారును ప్రారంభించారు. వాడలోని ప్రధాన వీదులగుండా పైప్‌లైన్‌ నిర్మాణ పనులు సర్పంచ్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం నిధులతో 2 లక్షలనిధులతో బోరుమోటారు ఏర్పాటు చేయడం జరిగిందని, 3 లక్షల నిధులతో పైప్‌లైన్‌ నిర్మాణ పనులు ...

Read More »

ఘనంగా సిఎం కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ జన్మదినోత్సవ వేడకలను మండల తెరాస నాయకులు బుధవారంఘనంగా జరుపుకున్నారు. మోర్తాడ్‌లోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినిల మధ్య మోర్తాడ్‌ జడ్పిటిసి ఎనుగందుల, మండల తెరాస అధ్యక్షుడు ఏలియా భారీకేక్‌కట్‌ చేశారు. మోర్తాడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం దేవాలయాల్లో సిఎం కెసిఆర్‌ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల సర్పంచ్‌లు,ఎంపిటిసిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

గ్రామాల్లో అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తిచేయాలి

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ కింద గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తిచేయాలని మోర్తాడ్‌ ఎంపిడివో శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం మోర్తాడ్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో మండల ఇజిఎస్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ కింద అధిక కూలీలను నియమించి డంపింగ్‌యార్డు, శ్మశాన వాటిక నిర్మాణ పనులను, మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతి కూలికి పనికల్పించాలని, హరితహారం పథకంలో భాగంగా ప్రతిరోజు 50 కుటుంబాలను ...

Read More »

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

  నందిపేట, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం తెలంగాణ సిఎం కెసిఆర్‌ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని మండలంలోని 16 ఉన్నత పాఠశాలల్లో బంగారు తెలంగాణ – కెసిఆర్‌ నాయకత్వం అనే అంశంపై వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ప్రతి పాఠశాల నుంచి గెలుపొందిన విద్యార్తులకు ఐలాపూర్‌ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ బంగారు తెలంగాణ కెసిఆర్‌తోనే సాధ్యమవుతుందని, కెసిఆర్‌ నాయకత్వంలోనే తెలంగాణ సాధించామని అన్నారు. కార్యక్రమంలో ఎంపిపి అంకంపల్లి యమున, జడ్పిటిసి ...

Read More »

గొర్రెలకు చికిత్స

  నందిపేట, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని లక్కంపల్లి గ్రామంలో గుళికలు చల్లిన జొన్న చొప్ప, నీటిని తాగడం వల్ల అస్వస్థతకు గురైన సుమారు 150 గొర్రెలకు గత మూడురోజులుగా చికిత్స అందిస్తున్నట్టు పశువైద్యాధికారి డాక్టర్‌ ప్రభాకర్‌ తెలిపారు. బుధవారం సుమారు 120 గొర్రెలు కోలుకొని మేతకువెళ్లినట్టు ఆయన అన్నారు. మిగతా వాటికి చికిత్స అందిస్తున్నామని వైద్యుడు పేర్కొన్నారు. గుళికలు చల్లిన పంటల్లో మేపవద్దని, పంట పొలాల్లో నీటిని తాగించవద్దని, జొన్నపంట కోసిన తర్వాత జొన్న లాపంలో ...

Read More »

మార్చి 15 నుంచి డిగ్రీ పరీక్షలు

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ వార్షిక, బ్యాక్‌లాగ్‌ పరీక్షలు మార్చి 15 నుంచి మొదలవుతాయని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ పాతనాగరాజు తెలిపారు. ఈ పరీక్షల్లో భాగంగా బిఎ, బికాం, బిఎస్సీ, బిఎస్‌డబ్ల్యు, బిబిఎ, పిడిసి,బిఎ లాంగ్వేజెస్‌ కోర్సుల్లో పరీక్షలు నిర్వహిస్తారన్నారు. పూర్తి టైంటేబుల్‌ను సంబంధిత ప్రిన్సిపాల్స్‌కు పంపించామని కంట్రోలర్‌ తెలిపారు. ఈసారి పరీక్ష కేంద్రాలకు ఆన్‌లైన్‌లో ప్రశ్నాపత్రం పంపిస్తారు. మొత్తం 34 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈపరీక్షలు మార్చి ...

Read More »

సిఎంకు పట్టుశాలువా అందజేసిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

  ఆర్మూర్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ జన్మదిన వేడుకలు అంబరాన్నంటేలా జరిగాయి. ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో సిఎం కెసిఆర్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆయనకు ముఖ్యమంత్రి దంపతులున్న పట్టుశాలువాను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే మండలంలోని పెర్కిట్‌ స్తూర్బా పాఠశాలలో సిఎం జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్‌ కట్‌చేశారు. తెరాస ...

Read More »

ఘనంగా సిఎం జన్మదిన వేడుకలు

  రెంజల్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకొని మండల తెరాస నాయకులు కేక్‌ కట్‌చేసి పంచిపెట్టారు. శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ కేసిఆర్‌ ఇలాంటి జన్మదినాలు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయురారోగ్యాలతో ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బిఎస్‌ఎన్‌ఎల్‌ డైరెక్టర్‌ పాశం సాయిలు, తెరాస మండల అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి రాఘవేందర్‌, నాయకులు దత్తుపటేల్‌, ...

Read More »

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే షకీల్‌

  రెంజల్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీలా విండో ఛైర్మన్‌ హైమద్‌ బేగ్‌ గత 15 రోజుల క్రితం మృతి చెందగా ఆయన కుటుంబాన్ని బుధవారం బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ పరామర్శించారు. కుటుంబసభ్యులతో ఆయన మాట్లాడుతూ కుటుంబానికి అన్ని విధాలుగా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట మునిసిపల్‌ ఛైర్మన్‌ ఆనంపల్లి ఎల్లయ్య, బిఎస్‌ఎన్‌ఎల్‌ డైరెక్టర్‌ పాశం సాయిలు, తెరాస మండల అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి రాఘవేందర్‌, నాయకులు దత్తుపటేల్‌, మౌలానా, రఫీక్‌, ధనుంజయ్‌, ...

Read More »

తెవివిలో ఘనంగా సిఎం కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ జన్మదిన వేడులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర జేఏసినాయకులు యెండల ప్రదీప్‌ ఆధ్వర్యంలో పరిపాలనా భవనంలో భారీ కేక్‌ కట్‌ చేసి ఘనంగా సంబరాలు జరిపారు. వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి కేక్‌ కట్‌చేసి జన్మదిన వేడుకలు ప్రారంభించారు. ఈసందర్భంగా రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ జన్మదిన వేడుకలు కూడా నిర్వహించుకోవడం ఆనంద దాయకమన్నారు. యెండల ప్రదీప్‌ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ...

Read More »

విద్యార్థుల స్వయం పరిపాలన దినోత్సవం

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మహ్మద్‌నగర్‌ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు స్వయంపరిపాలన దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి కింది తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమంగా బోధించిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాద్యాయులు అమర్‌సింగ్‌, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులందరు చక్కగా చదివి వందశాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.

Read More »

నివాస ప్రాంతాల్లో శుభ్రత పాటించాలి

  పిట్లం, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నివాస ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు శుభ్రంగా ఉంచుకున్నట్టయితే ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని డాక్టర్‌ పద్మావతి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో స్వచ్చభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆవరణలోని చెత్త, చెదారం శుభ్రం చేస్తూ, పిచ్చిమొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా వైద్యురాలు మాట్లాడుతూ ఒకవ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే తాను శుభ్రంగా ఉంటూ పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ...

Read More »

ఘనంగా సిఎం జన్మదిన వేడుకలు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి సిఎం జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెరాస నాయకులు కేట్‌ కట్‌చేసి స్థానికులకు పంచిపెట్టారు. అదేవిధంగా స్థానిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్‌లు పంచిపెట్టారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రాజు, కో ఆప్షన్‌ మెంబర్‌ హైమద్‌, నాయకులు వినయ్‌కుమార్‌, సందీప్‌కుమార్‌, గంగారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »