Breaking News

Daily Archives: February 18, 2016

మోదుగ కనువిందుగ

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవిలో అన్ని చెట్లు ఆకులురాలి దిగాలుగా కనిపిస్తే ఎర్ర, ఎర్రని పూలతో మోదుగ చెట్లు ప్రకృతికి కొత్త అందాలను కనువిందు చేస్తున్నాయి. నిజాంసాగర్‌ మండలంలోని సుల్తాన్‌నగర్‌, హసన్‌పల్లి, మల్లూరు తదితర గ్రామాల్లో మోదుగ చెట్లు ఎర్రని పూలతో వసంతానికి స్వాగతం పలుకుతున్నట్టు కనిపిస్తున్నాయి.

Read More »

ఈ ప్రమాదాన్ని నివారించలేమా

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బిసి వసతి గృహం ఎదురుగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఎలాంటి రక్షణ లేదు. విద్యార్థులు ప్రతి నిత్యం ఇక్కడ సమీపంలోనే ఆడుకుంటున్నారు. ఏ క్షణంలో ఏమౌతుందో అంటూ స్థానికులు భయపడుతున్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో సుమారు పది వరకు ప్రమాదకర స్థితిలో ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. ఏళ్ళు గడుస్తున్నా ఈ బిసి వసతి గృహం వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌కు కంచె లేకుండాపోయింది. ఇప్పటికైనా వాటి చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేయాలని ...

Read More »

తాగునీరు లేక అల్లాడుతున్న ప్రజలు

  భీమ్‌గల్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పలు గ్రామాల్లో బోర్లు ఎత్తిపోయి తాగునీరు లేకప్రజలు అల్లాడుతున్నారు. గతంలో ఎన్నడూలేనివిధంగా భూగర్భ జలాలు అడుగంటడంతో ఆయా గ్రామాల్లో బోర్లు పూర్తిగా ఎత్తిపోయాయి. తాగునీరు దొరకక ప్రజలు నానా ఇబ్బందుల పాలవుతున్నారు. లింగాపూర్‌, పురాణిపేట్‌, చేంగల్‌, భీంగల్‌లలో తాగునీటి కొరత ఉండడం వలన నివాస ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. దూర ప్రాంతాలకెళ్ళి నీటిని తెచ్చుకోవడం జరుగుతుంది. పాలకులు పట్టింపులేనట్టు వ్యవహరించడంతో ప్రజలకు నీటి కస్టాలు తప్పడం లేదని పలువురు ...

Read More »

వాట్సప్‌ ద్వారా నీటి సమస్యలు తెలపాలి

  – జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యలను గుర్తించేందుకు జిల్లాలోని జడ్పిటిసిలు,ఎంపిపిలతో ఒక వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ప్రకటించారు. గురువారం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు అధ్యక్షతన జరిగిన జడ్పి సర్వసభ్య సమావేశానికి శాసనమండలి సభ్యులు వి.జి.గౌడ్‌, ఆకుల లలిత, బూపతిరెడ్డి, ఎమ్మెల్యేలు హన్మంత్‌షిండే, సంయుక్త కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి, జడ్పి సిఇవోమోహన్‌లాల్‌, జడ్పిటిసిలు, ఎంపిపిలు, వివిధ ...

Read More »

ఎడారి ఓడల సందడి

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడారిఓడ అనగానే అందరికి స్ఫురించేది ఒంటెలు. ఒంటెను చూడాలంటే రాజస్థాన్‌, దుబాయ్‌ తదితర ఎడారి ప్రాంతాల్లోనే అవి కనిపిస్తాయని మనం పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ నేడు ఒంటెల యజమానులు వాటితో జీవనభృతి పొందుతూ, జాగ్రత్తగా చూసుకుంటున్నారు. హైదరాబాద్‌, బోధన్‌, నిజామాబాద్‌ తదితర ప్రాంతాల్లో జీవనోపాది కోసం తీసుకువచ్చిన ఒంటెల యజమానులు హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమయ్యారు. తిరుగు ప్రయాణంలో నిజాంసాగర్‌ మండలంలోని బొగ్గు గుడిసెలో బసచేశారు. చిన్న పిల్లలను కూర్చుండబెట్టి వారికి కొంత దూరంగా ...

Read More »

చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిన్నారులను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న పౌష్టికాహార పతకాన్ని మెను ప్రకారం అందించాలని బట్టాపూర్‌, తడపాకల్‌ సర్పంచ్‌లు బుక్యా అంజుబాయి, లోలం లావణ్య, చిన్నారెడ్డి, కార్యదర్శి స్వప్నలు అన్నారు. గురువారం మండలంలోని బట్టాపూర్‌, తడపాకల్‌ గ్రామాల్లోగల అంగన్‌వాడి కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. కార్యకర్తలు చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారంతోపాటు మెను ప్రకారం పాలు, గుడ్లు అందించాలని లేకుంటే శాఖాపరమైన చర్యలు చేపడతారని వారు తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడి కార్యకర్తలు, ...

Read More »

నేడు బాల్కొండ నియోజకవర్గానికి అమాత్యుల రాక

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి, బాల్కొండ మండలాల్లో శుక్రవారం పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, జిల్లా పార్లమెంటు సబ్యురాలు కె.కవిత, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విచ్చేస్తున్నారని జిల్లా తెరాస ఉపాధ్యక్షుడు రాజాపూర్ణానందం, మోర్తాడ్‌ జడ్పిటిసి ఎనుగందుల అనిత, మండల తెరాస అధ్యక్షుడు ఎలియా తెలిపారు. బాల్కొండ మండలంలోని వేంపల్లి గ్రామంలో సంప్‌హౌజ్‌, బాల్కొండలో గోదాము, మోర్తాడ్‌లో గోదాము, కమ్మర్‌పల్లి మండలంలో ...

Read More »

18వ వార్డులో ఛైర్‌పర్సన్‌ పర్యటన

  కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 18వ వార్డులో గురువారం మునిసిపల్‌ఛైర్మన్‌ పిప్పిరి సుష్మ పర్యటించారు. వార్డు ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్ల నిర్మాణం, మురికి కాలువల నిర్మాణం చేపడతామని వార్డు వాసులకు చెప్పారు. నీటి ఎద్దడి సమస్య కాలనీ వాసులు ఆమె దృస్టికి తేగా, ఇందుకోసం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ ముదాం సిద్దవ్వ, శానిటరీ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జి కమీషనర్‌ పఠాభి, సిఐ గంగాధర్‌, సిపివోలు రాహుల్‌, ...

Read More »

ఆరోగ్య నిర్దారణ పరీక్షలు

  సదాశివనగర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో పాత్‌కేర్‌ ఫౌండేషన్‌ ఆద్వర్యంలో ఆరోగ్య నిర్దారణ పరీక్షలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మూత్రపిండాలు, రక్త పరీక్షలు, వ్యాధులకు చిక్సితలు నిర్వహించారు. ఈ పరీక్షల ద్వారా ఆరోగ్య స్థితి మెరుగుపరిచేవిధంగా చూసుకోవచ్చని, డిపిసి విజయరేఖ అన్నారు. కార్యక్రమంలో మహిళ కార్యకర్తలు సునంద, లక్ష్మి, సరోజ, కార్యకర్తలు సుధీర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఆర్యవైశ్య అధ్యక్ష బరిలో బాల్‌చంద్రం

  కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏప్రిల్‌లో జరగనున్న కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య ఎన్నికల్లో పోటీ చేసేందుకు రోటరీ పార్కు ఏరియా, విద్యానగర్‌ కాలనీ ఆర్యవైశ్య సంఘం నుంచి అయిత బాలచంద్రం బరిలో ఉన్నట్టు తెలిపారు. ఈయన పోటీలో నిలవాలని సంఘ సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. పట్టణంలోని ఆర్యవైశ్యులు తనను ఆదరించి అధ్యక్షుడుగా గెలిపించాలని బాలచంద్రం కోరారు. ఈ మేరకు సంఘ సభ్యులు తీర్మానించినట్టు తెలిపారు.

Read More »

సహ చట్టంపై అందరికి అవగాహన అవసరం

  కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సహ చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని కామారెడ్డి ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి ఎంఎ.సలీం అన్నారు. కామారెడ్డి మునిసిపాలిటీ కార్యాలయంలో గురువారం న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ సుష్మ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా న్యాయమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకత, జవాబుదారీతనం, అవినీతి రహిత సమాజ స్థాపన కోసం సహ చట్టం ఏర్పడిందని, దీన్ని గురించి అందరూ తెలుసుకున్నప్పుడే చట్టాన్ని వినియోగించుకొని లబ్దిపొందుతారన్నారు. దరఖాస్తు ...

Read More »

మాతాశిశు మరణాలను నివారిద్దాం

  పిట్లం, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాతా శిశు మరణాలను నివారిద్దామని సేవ్‌ ఎ మదర్‌ ఫౌండేషన్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ శశికాంత్‌ కామ్లేకర్‌ అన్నారు. మండలంలోని గౌరారంఖుర్దు గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. పౌష్టికాహార లోపంవల్ల మాతా శిశు మరణాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడి కేంద్రాల ద్వారా అందిస్తున్న పాలు, గుడ్లు, సంపూర్ణభోజనం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఫీల్డ్‌ అధికారి మెరుగు మయూరి మాట్లాడుతూ ప్రతినెల గర్భిణీలు, బాలింతలకు మాతా, శిశు మరణాలపైఅవగాహన ...

Read More »

కామారెడ్డి పోలీసు స్టేషన్‌లో స్వచ్ఛభారత్‌

  కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్‌లో గురువారం మైవిలేజ్‌-మాడల్‌ విలేజ్‌ ఆద్వర్యంలో స్వచ్చభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌రావు, కౌన్సిలర్‌ కుంభాల రవియాదవ్‌, ఎస్‌ఐలు శ్రీనివాస్‌రెడ్డి, సంతోస్‌కుమార్‌లు స్వచ్ఛభారత్‌లో పాల్గొని పోలీసు స్టేషన్‌ ఆవరణ శుభ్రం చేశారు. అందరు తమ ఇళ్ళతో పాటు చుట్టుపక్కల పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో శానిటరీ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

బిసి గర్జనకు ఏర్పాట్లు ముమ్మరం చేసిన నిర్వాహకులు

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈనెల 22న నిర్వహించనున్న బిసి విద్యార్థి యువగర్జనకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. గురువారం కామర్స్‌ కళాశాల భవనంలో విద్యార్థి జేఏసి నాయకుడు యెండల ప్రదీప్‌ఆధ్వర్యంలో అధ్యాపకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ బిసిల ఐక్యతకు, బిసిల అభివృద్దికి లక్ష్యంగా ఈ విద్యార్థి యువగర్జన నిర్వహిస్తున్నట్టు ప్రదీప్‌ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బిసి విద్యార్థులు, యువత ఈ సమావేశానికి పెద్ద ఎత్తున తరలిరావాలని బిసి అధ్యాపకులు ...

Read More »

తెవివికి రెండ్రోజుల సెలవులు

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాక్‌ బృందం వచ్చిన సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయం సిబ్బంది ఒక రెండవ శనివారం, ఆదివారం కూడా చేసిన పనిని దృస్టిలో ఉంచుకుని యూనివర్సిటీ క్యాంపస్‌లకు ఫిబ్రవరి 19,20వ తేదీలను సెలవులు ప్రకటించినట్టు రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన జన జాతర సమ్మక్క-సారలమ్మ జాతరను దృస్టిలో ఉంచుకుని అధ్యాపకులు, నాన్‌ టీచింగ్‌సిబ్బంది వినతులకు స్పందనగా ఈ రెండ్రోజుల సెలవులు ప్రకటించారు.

Read More »

సర్పంచ్‌పై చర్యకు ఎంపిటిసి డిమాండ్‌

  నందిపేట, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట గ్రామ పంచాయతీలో బుధవారం జరిగిన సంఘటన చాలా బాధకరమని ఎంపిటిసి-3 గాండ్ల నర్సుబాయి పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం గ్రామ పంచాయతీలో జరిగిన సంఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి సర్పంచ్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధి ప్రతిపౌరుడికి సమాధానంచెప్పాల్సి ఉంటుంది, కానీ నందిపేట సర్పంచ్‌ షాకీర్‌ అధికార గర్వంతో మహిళా వార్డు సభ్యులను మహిళలు అని కూడా చూడకుండా గ్రామ పంచాయతీ సాక్షిగా ...

Read More »

తల్వేదలో వాలీబాల్‌ పోటీలు

  నందిపేట, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం తల్వేద గ్రామంలో ఆకుల సంజీవ్‌ జ్ఞాపకార్థం యువయూత్‌ ఆధ్వర్యంలో మండల స్తాయి వాలీబాల్‌ పోటీలునిర్వహిస్తున్నట్టు తెలిపారు. మొదటి బహుమతిగా రూ. 1500, రెండో బహుమతి రూ. 1000 ప్రకటించారు. వంద రూపాయల ఎంట్రీఫీజు ఉంటుందని, ఆసక్తిగలవారు 99120 92966 నెంబర్లో సంప్రదించాలని అన్నారు.

Read More »

పల్స్‌పోలియో విజయవంతం చేయండి

  బీర్కూర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో ఈనెల 21వ తేదీన నిర్వహించనున్న రెండోవిడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రాథమిక ఆసుపత్రి వైద్యులు దిలీప్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆసుపత్రిలో అంగన్‌వాడిలు, ఆశ వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలతో గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి 5 సంవత్సరాలలోపు ప్రతి ఒక్కరికి పల్స్‌పోలియో చుక్కలు వేయించాలన్నారు. 22,23 తేదీల్లో సంబంధిత అదికారులు ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరిగి మిగిలిన చిన్నారులకు పోలియో చుక్కలు ...

Read More »

బీడీ కార్మికుల పొట్టకొట్టే జీవో ఉపసంహరించుకోవాలి

  నందిపేట, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ కట్టలపై 80 శాతం గొంతు క్యాన్సర్‌, ఆరోగ్య హెచ్చరికలబొమ్మలు ముద్రించాలనే జీవోను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ కాందార్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో గురువారం నందిపేట దేశాయ్‌ బీడీ ఫ్యాక్టరీ నుంచి తహసీల్‌ కార్యాలయం వరకు భారీర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ప్రధాన వీధుల గుండా కొనసాగి తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ కాందార్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బాల్‌రాజ్‌ మాట్లాడుతూ 2015లో పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును వెంటనే ...

Read More »

ప్రతి ఒక్కరికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం తప్పనిసరి

  బీర్కూర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో గల ప్రతి కుటుంబ సభ్యులు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని మండలాభివృద్ది అధికారి భరత్‌కుమార్‌ అన్నారు. మండలంలోని నెమ్లి గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం 12 వేల రూపాయలతో ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లు నిర్మాణాలను ఇస్తుందని, అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం గ్రామంలోగల అంగన్‌వాడి కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రంలో గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు సరైన ...

Read More »