Breaking News

Daily Archives: February 19, 2016

ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కమీషన్‌కు ఫిర్యాదు

  ఆర్మూర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇద్దరు దళిత నాయకుల మృతి పట్ల తమకెన్నో అనుమానాలు ఉన్నాయని ఎంఆర్‌పిఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం ఆయన తెదేపా నాయకుడు రాజారాం యాదవ్‌, ఇతర నాయకులతో కలిసి ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కమీషన్‌లకు ఫిర్యాదు చేశారు. వారి మృతి పట్ల అనేక అనుమానాలు ఉన్నాయని, సిబిసిఐడి ద్వారా విచారణ జరిపించి, నిజానిజాలు వెలికితీసి న్యాయం జరిగేలా చూడాలని ఆయన అన్నారు.

Read More »

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

  ఆర్మూర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతి వేడుకలు పట్టణ బిజెపి, బిజెవైఎం, భజరంగ్‌దళ్‌, శివసేన, ఆరెస్సెస్‌ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని జంబి హనుమాన్‌ ఆలయ ప్రాంగణం నుంచి గోల్‌బంగ్లా వద్ద శివాజీ మహరాజ్‌ చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం డిజె శబ్దాలతో చిన్నబజార్‌, పెద్దబజార్‌, అంబేడ్కర్‌ చౌరస్తా మీదుగా మామిడిపల్లి, పెర్కిట్‌ గ్రామాల్లో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ శివాజీ ...

Read More »

తోటలో టమాట

  నందిపేట, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టమాట పంటకు గిట్టుబాటు ధర రాక, పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. టమాట తెంపడానికి అయ్యే కూలీ డబ్బులు కూడా రాకపోవడంతో చేతికొచ్చిన పంట పొలాల్లోనే వదిలేస్తున్నారు. కిలో టమాట ధర రూ. 1 నుంచి 2 లకు పడిపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రవాణా చార్జీలు కూడా మిగలకపోవడంతో అక్కడే వదిలివేస్తున్నారు. టమాట పంటకు ఎకరానికి సుమారు 30 వేలు గిట్టుబాటు అవుతుంది. కానీ వేసిన ...

Read More »

ఘనంగా శివాజీ జన్మదిన వేడుకలు

  నందిపేట, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మరాఠ్వాడాలో మొగల్‌ సామ్రాజ్యాన్ని అంతమొందించిన మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ అని పలుగ్గుట్ట మంగిరాములు మహరాజ్‌ అన్నారు. ఈ మేరకు శుక్రవారం పాతూరులోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి శివాజీ జయంతి జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంగిరాములు మహరాజ్‌ మాట్లాడారు. హిందువుల సంస్కృతి, సంప్రదాయాలకు, పవిత్ర గోమాతకు హానికలుగుతున్న సందర్భంలో ఛత్రపతి శివాజీ దుష్టశక్తుల్ని ఓడించి హిందూ సామ్రాజ్యాన్ని స్తాపించారన్నారు. కార్యక్రమంలో రాంచందర్‌, భరత్‌, యువజన సంఘ సభ్యులు ...

Read More »

కన్నీటి సాగర్‌

  నిజాంసాగర్‌ రూరల్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని తొలి భారీ జలాశయం నిజాంసాగర్‌ ప్రాజెక్టు వెలవెలబోతోంది. తొమ్మిది దశాబ్దాల ప్రాజెక్టు చరిత్రలో ప్రస్తుత నీటి మట్టం డెడ్‌ స్టోరేజీకి చేరింది. 1931 లో నిర్మించిన ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు. (18 టిఎంసిలు). కాగా డెడ్‌ స్టోరేజీ 1367 అడుగులు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటి నిలువలు 0.06 ఎంసిఎఫ్‌టిలే. ఇందూరు ప్రజల దాహార్తి తీర్చేందుకు నీటిని తరలిస్తుండడంతో నీటి మట్టం అడుగంటింది. ...

Read More »

అడ్డగోలుగా రోడ్లపై స్పీడ్‌ బ్రేకర్లు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధాన జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై గతంలో అడ్డగోలుగా నిబంధనలకు విరుద్దంగా వేసిన స్పీడుబ్రేకర్ల ద్వారా ప్రమాదాల నివారణ కంటే నష్టాలు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తించిన హైకోర్టు స్పీడ్‌ బ్రేకర్లను కట్టడిచేసింది. దీంతో గత కొన్నేళ్ళ క్రితం ముఖ్యంగా జాతీయ రహదారులపై స్పీడ్‌బ్రేకర్లను తొలగించారు. పూర్తిస్తాయిలో జాతీయరహదారులపై స్పీడ్‌బ్రేకర్లు తొలగించారు కానీ రాష్ట్ర రహదారులపై విరుద్దంగా,అడ్డగోలుగా స్పీడ్‌బ్రేకర్లు దర్శనమిస్తున్నాయి. స్పీడుబ్రేకర్ల పుణ్యమా అంటూ ముఖ్యంగా బైకులు, కార్లు, జీపులు, ప్రయివేటు వాహనాల్లో ...

Read More »

వికలాంగుల నివాసాల వద్దే నిర్దారణ పరీక్షలు

  పిట్లం, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన శారీరక, మానసిక వికలాంగులైన వారి నివాసాల వద్దే ఐకెపి ఆధ్వర్యంలో వైద్యులు చేరుకొని సదరం సర్టిఫికెట్ల కోసం నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. మండలంలోని కిష్టాపూర్‌, రాంపూర్‌, అన్నారం గ్రామాలకు చెందిన వికలాంగులు ప్రతివారం జిల్లా కేంద్రంలో నిర్వహించే సదరం క్యాంపునకు వెళ్లలేని పరిస్థితి ఉండడంతో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు వికలాంగులకు వారి ఇంటివద్దే నిర్దారణ పరీక్షలు నిర్వహించినట్టు ఐకెపి ఎపిఎం శిరీష తెలిపారు. వైద్య ...

Read More »

అక్రమంగా మొరం తొలగింపు

  సదాశివనగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ధర్మారావు పేట గ్రామ శివారునుంచి అక్రమంగా మొరం తరలిస్తున్న టిప్పర్లను ఎంపిపి బంజ విజయ, శివకుమార్‌ గురువారం రాత్రి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల కేంద్ర శివారులోని 44వ జాతీయ రహదారి వద్ద నూతనంగా నిర్మిస్తున్న పెట్రోల్‌ బంక్‌లకు అక్రమంగా మొరం తరలిస్తున్నారని దాన్ని అడ్డుకున్నట్టు తెలిపారు. వెంటనే రెవెన్యూ అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మూడు మొరం టిప్పర్లను సీజ్‌ చేశారు. తహసీల్దార్‌ రమేశ్‌, ...

Read More »

కల్దుర్కిలో స్వచ్ఛభారత్‌

  బోధన్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కల్దుర్కి గ్రామంలో వీరభద్ర ఆలయ ప్రాంగణంలో శుక్రవారం జననీ సొసైటీ ఆద్వర్యంలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. వీరభద్ర జాతరను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలోని పిచ్చిమొక్కలను, ముళ్లపొదలను తొలగించి శుభ్రం చేశారు. ఆలయ ప్రాంగణంలో ఇసుక దిబ్బలను చదునుచేశారు. మొక్కల చుట్టు చెత్త చెదారం శుభ్రం చేశారు. కార్యక్రమంలో యూత్‌ అద్యక్షుడు పవన్‌, కార్యదర్శి సత్యనారాయణ, సభ్యులు అశోక్‌, బాలు, రాజేశ్‌, రాంగొండ, చంద్రయ్య, మాధవ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

విద్యార్థులకు కంటి పరీక్షలు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిన్నారి చూపు కార్యక్రమంలో భాగంగా సర్వశిక్షా అభియాన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం మండల విద్యావనరుల కేంద్రంలో విద్యార్తుళకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించినట్టు ఎంఇవో బలరాం రాథోడ్‌ తెలిపారు. 73 మంది విద్యార్థులకు కంటిలోపాలు ఉన్నందున అద్దాలు అందజేసినట్టు తెలిపారు. విద్యార్థులకు డాక్టర్‌ స్పందన వైద్య పరీక్షలు నిర్వహించారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రాజు, మండల కో ఆప్షన్‌ మెంబర్‌ హైమద్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »