Breaking News

Daily Archives: February 20, 2016

పల్స్‌పోలియో ర్యాలీ

నందిపేట, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు ముత్తన్న, ఉపాధ్యాయులు, విద్యార్తులు పాల్గొన్నారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ రాజ్‌కుమార్‌, ఆసుపత్రి సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ 21వ తేదీ ఆదివారం రోజున 5 సంవత్సరాలలోపు చిన్నారులందరికి పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలని సూచించారు.

Read More »

ఓడిఎఫ్‌పై 23,24 తేదీల్లో సదస్సులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని గ్రామాలను బహిరంగ మల విసర్జన రహితంగా తీర్చిదిద్దే ప్రక్రియలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసేందుకు ఈనెల 23న నిజామాబాద్‌ రూరల్‌, 24న బాల్కొండ నియోజకవర్గ స్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల ఎంపిపి, జడ్పిటిసి, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, స్వయం సహాయక సంఘాల గ్రామ సమాఖ్య అధ్యక్షులు, ఎంపిడివోలు, ఎపిఎంలు, ఇజిఎస్‌ ఎపివోలు సదస్సుకు హాజరు కావాలని ...

Read More »

ఫ్రీడమ్‌251డాట్‌కామ్‌కు తగ్గిన క్రేజీ

నందిపేట, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఢిల్లీ కేంద్రంగా ప్రారంభమైన రింగింగ్‌బెల్‌ సంస్థ ప్రకటించిన ప్రీడమ్‌251 ఫోన్‌పై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. రింగింగ్‌బెల్‌ అనే సంస్థ రూ. 250 కే స్మార్ట్‌ ఫోన్‌ అని ప్రకటించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రజలు ఆన్‌లైన్లో బుక్‌ చేయడానికి ఎగబాకారు. సెకనుకు 60 లక్షల వరకు హిట్‌ అయినాయంటే మామూలు విషయం కాదు. గత రెండ్రోజుల నుంచి మండలంలోని అన్ని ఇంటర్నెట్‌కేంద్రాల వద్ద స్మార్ట్‌ ఫోన్ల ద్వారా ...

Read More »

హసన్‌పల్లి రోడ్డు సొగసు చూడతరమా

  నిజాంసాగర్‌ రూరల్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని హసన్‌పల్లి రోడ్డు కంకరతేలి రాకపోకలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్డు వెంబడి నడవడానికి నరకయాతన అనుభవిస్తున్నారు ప్రయాణీకులు. ఈ రోడ్డు రహదారి వెంబడి ఎన్నో బస్సులు, ఇతర వాహనాలు తిరుగుతుంటాయి. రోడ్డుకు ఇరుపక్కల మొక్కలు పెరగడంతో బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. తరువాత కామారెడ్డి డిఎం, బాన్సువాడ డిఎంలు రహదారిని పరిశీలించారు. విద్యార్థులు కాలినడకన ప్రయాణం చేస్తుండడంతో కామరెడ్డి డిపో బస్సు సర్వీసులు ప్రారంభించారు. నిజాంసాగర్‌ జలవిద్యుత్తు సబ్‌స్టేషన్‌ ...

Read More »

సూపరింటెండెంట్‌కు సన్మానం

  సదాశివనగర్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న బాలకృష్ణను మండల పరిషత్‌ సిబ్బంది శనివారం సన్మానించారు. బాలకృష్ణ ఇటీవల తెలంగాణ పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా కౌన్సిల్‌మెంబరుగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపిడివో చంద్రకాంత్‌రావు, సీనియర్‌ అసిస్టెంట్‌ సూర్యాజిరావు, జూనియర్‌ అసిస్టెంట్‌ భక్తియారుద్దీన్‌, సిబ్బంది వేణుగోపాల్‌, ఎంపిటిసిలు నర్సింలు, పైడి జానకిలు పాల్గొన్నారు.

Read More »

హరితహారం మొక్కలకు నీటి సరఫరా

  నిజాంసాగర్‌ రూరల్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ హరితహారం పథకం కింద రోడ్డు ప్రక్కన నాటినమొక్కలను సంరక్షించేందుక సోషల్‌ ఫారెస్టు ఆధ్వర్యంలో వాటర్‌ ట్యాంర్ల ద్వారా నీటిని పోసి మొక్కలను సంరక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సిఎం కెసిఆర్‌ హరితహారం పథకాన్ని ఎంతో ఆర్భాటంగా అమలుచేసినప్పటికి ఈ సంవత్సరం వర్షాలు కురియకపోవడంతో ఆశించినంత మేర మొక్కలను నాటలేకపోయారు. నాటిన మొక్కల్ని కాపాడేందుకు అధికారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిజాంసాగర్‌ నుంచి నాగిరెడ్డిపేట మండలం పోచారం వరకు రోడ్డుకుఇరుపక్కల 10 ...

Read More »

ప్రణమిల్లిన జనవాహిని

మేడారం జనవాహినిగా మారింది. సమ్మక్కసారలమ్మలకు జై…. మమ్మల్ని సల్లంగా సూడు తల్లీ…. అనే నినాదాలతో మార్మోగింది. జాతర ప్రాంగణం కిక్కిరిసిపోగా అయిదు కిలోమీటర్ల వరకు భక్తులు బారులు తీరారు. శుక్రవారం ఒక్క రోజే 50 లక్షల మంది దర్శించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రాంగణంలో మహారద్దీ కొనసాగింది. అనారోగ్యం కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన రద్దయింది. పెద్ద సంఖ్యలో మంత్రులు, ఇతర ప్రముఖులు అమ్మవార్లను దర్శించుకున్నారు. బుధవారం సారలమ్మ, గురువారం సమ్మక్కలు గద్దెల మీదికి వచ్చారు. ఇద్దరు వనదేవతలు సంపూర్ణ దర్శనం విశిష్టమైంది ...

Read More »

తెలంగాణ యువతకు విదేశాల్లో ఉద్యోగాలు

 హైదరాబాద్‌: తెలంగాణ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తరపున విదేశాల్లో ఉద్యోగాలను ఇప్పిస్తామని, ఎవరూ దళారులను ఆశ్రయించి మోసపోవద్దని కార్మిక, హోం శాఖల మంత్రి నాయిని నర్సింహారెడ్డి సూచించారు. దుబాయి పర్యటనకు వెళ్లిన మంత్రి శుక్రవారం సోనాపూర్‌ క్యాంపులోని తెలంగాణ కార్మికులను కలిశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ విదేశీ మానవ వనరుల సంస్థ(టామ్‌కామ్‌) ద్వారా విదేశీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని చెప్పారు. దుబాయిలో జరిగే సదస్సులో పాల్గొనడంతో పాటు పలు కంపెనీలతో అవగాహన ఒప్పందాల కోసం ...

Read More »

రిజర్వేషన్ల చిచ్చు

రిజర్వేషన్ల కోసం జాట్లు జరుపుతున్న ఉద్యమం తీవ్రహింసాకాండకు దారి తీసింది. హరియాణా రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చింది. పలుజిల్లాల్లో భారీఎత్తున హింసాత్మక సంఘటనలు, విధ్వంసం చోటుచేసుకున్నాయి. దీంతో రెండు జిల్లాల పరిధిలో కర్ఫ్యూ విధించి, కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. తొమ్మిది జిల్లాల్లో సైన్యాన్ని మోహరించారు. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒక వ్యక్తి మరణించగా, 25 మంది గాయపడ్డారు. పలువురు పోలీసుల్ని నిరసనకారులు తమ వద్ద బందీలుగా పట్టుకున్నారు. రాష్ట్ర ఆర్థికమంత్రి ఇంటిని, అధికారపార్టీ భాజపాకు చెందిన ఓ ఎమ్మెల్యే ...

Read More »

రివ్యూ.. కృష్ణాష్టమి

తారాగణం: సునీల్‌, నిక్కీ గల్రాని, డింపుల్‌ చోపడే, ముఖేష్‌ రుషి, అశుతోష్‌ రాణా, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, బ్రహ్మానందం తదితరులు సాంకేతికవర్గంసంగీతం: దినేష్‌, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కూర్పు: గౌతంరాజు, కళ:రవీందర్‌, నిర్మాత: దిల్‌రాజు, దర్శకత్వం: వాసువర్మ. సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, విడుదల: 19 ఫిబ్రవరి 2015 ‘సంతోషం’ సమయంలో వచ్చిన ఆలోచనని… ‘1’ (నేనొక్కడినే) సమయంలో రాసుకొన్నదంటూ… చెపుతూ ఫార్ములా (విలన్‌ ఇంట్లో హీరో చేరిపోయి సందడి చేయడం) కథలతో ప్రేక్షకులు విసుగెత్తిపోయిన సమయంలో – మళ్లీ అదే ఫార్ములాని నమ్ముకొని ...

Read More »

బాబా అణు పరిశోధన కేంద్రం డైరెక్టరుగా కె.ఎన్‌.వ్యాస్‌

దిల్లీ: బాబా అణు పరిశోధన కేంద్రం డైరెక్టరుగా ప్రముఖ శాస్త్రవేత్త కె.ఎన్‌.వ్యాస్‌ నియమితులయ్యారు. శేఖర్‌బసు స్థానంలో ఈ బాధ్యతలను స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం బాబా అణుపరిశోధన కేంద్రం అసోసియేట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Read More »

యువరాజా మెరవవా?

ఇంకా ఆడతాడు.. ఇంకా ఆడతాడు అనుకుంటే ఇప్పుడు ప్రతి మ్యాచ్‌లోనూ నిరాశే! యువరాజ్‌ను ఆరంభం నుంచి చూస్తున్నవారికి అతడిపై ఎంతో నమ్మకం. కానీ అతడు మళ్లీ జట్టుకు ఎంపికైన తర్వాత రెండు టోర్నీలు అయిపోయాయి! అయినా యువరాజ్‌ పుంజుకోలేదు. మరి ఆసియాకప్‌ ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌లో యువీ తనదైన ముద్ర వేస్తాడా? ఆస్ట్రేలియాలో చారిత్రక టీ20 సిరీస్‌ విజయంలో యువరాజ్‌ సింగ్‌ పాత్ర కూడా ఉంది! అతను ఒక సిక్స్‌, ఫోర్‌ బాదకుంటే భారత్‌ చివరి టీ20 మ్యాచ్‌ను గెలిచేదే కాదేమో! ఐతే ...

Read More »

ఇప్పట్లో రిటైర్‌కాను!

దిల్లీ: ఇప్పట్లో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరయ్యే ఉద్దేశం లేదని టీమ్‌ ఇండియా వన్డే, టీ20 కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని పరోక్షంగా చెప్పాడు. ‘‘ఆసియాకప్‌, టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఐపీఎల్‌ ఉంది. ఆ తర్వాత జట్టు ఎక్కువగా టెస్టు క్రికెట్టే ఆడనుంది. వన్డేలు ఐదారే ఉండొచ్చు. అవి కూడా త్వరగానే జరుగుతాయి’’ అని శుక్రవారం ఓ కార్యక్రమం సందర్భంగా ధోని అన్నాడు. రిటైర్మెంట్‌పై వూహాగానాల నేపథ్యంలో వచ్చే కొన్నేళ్లలో వ్యాపారానికి ఎక్కువ సమయం కేటాయిస్తారా అని అడిగినప్పుడు ధోని ఇలా స్పందించాడు. ప్రపంచకప్‌కు ...

Read More »

బతుకు భారమై తండ్రి, కూతురు బలవన్మరణం

తాడ్వాయి: కుల వృతి(కుమ్మరి పని)నే నమ్ముకున్న ఓ సగటు జీవికి వృత్తి పని కూడు పెట్టకపోగా బతుకు భారంగా మారింది. పూట గడవడమే కష్టంగా బతుకు భారమైన తండ్రి తన కూతురుతో సహా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తాడ్వాయి మండలంలోని గుండారం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తండ్రి నరహారి(55), కూతురు మౌనిక(14) మృతిచెందారు. ఈ మేరకు ఏఎస్సై గంగాధర్‌గౌడ్‌ తెల్పిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కమ్మరి నరహారి(55)కు ముగ్గురు భార్యలు. మొదటి భార్య 20 ఏళ్ల క్రితమే చనిపోయింది. ఆమెకు ...

Read More »

అం‘తరంగాల’తో అనర్థాలు..!

‘మీ ఇంటి పరిసర ప్రాంతంలో సెల్‌టవర్లను ఏర్పాటు చేశారా..? రేడియో ధార్మిక ప్రభావంతో అనారోగ్యానికి గురవుతున్నారా..? విచ్చలవిడిగా ఏర్పాటైన టవర్లతో సమస్యలు ఎదుర్కొంటున్నారా..? గాయాలపాలైనపుడు తీవ్రమైన బాధ కలుగుతోందా..? దీనికి టవర్ల నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాల ప్రభావమే కారణం. ఇటీవల టెక్సాస్‌ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనంలో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. సెల్‌ టవర్ల తరంగాలతో గాయాల పాలైన వ్యక్తులు, పక్షులకు తీవ్రమైన నొప్పి కలుగుతోందని నిర్ధరించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పరిస్థితులపై ‘న్యూస్‌టుడే’ కథనం. జిల్లాలో 718 గ్రామ పంచాయితీలున్నాయి. 1 ...

Read More »

రాకున్నా జీతం… రాజీకి పాఠం..!

నిజాంసాగర్‌ మండలంలో 32 మంది విద్యావలంటీర్లు సెప్టెంబర్‌ 24న విధుల్లో చేరారు. వారిలో నలుగురు వెళ్లిపోయారు. దీంతో ఇద్దరిని మండల విద్యాశాఖాధికారి నిర్ణయంతో నియమించుకున్నారు. మిగిలిన రెండు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అయినప్పటికి జనవరి నెలలో కూడా మొత్తం 32 మంది హాజరైనట్లు వేతనాల కోసం సిఫారసు చేశారు. * జుక్కల్‌ మండలంలో 83 మందిని నియమించగా వారిలో 17 మంది వెళ్లిపోయారు. ఈ మండలంలో విద్యావలంటీర్లుగా విధుల్లో చేరిన తర్వాత వారం పది రోజులు మాత్రమే సక్రమంగా విధులకు హాజరయ్యారు. అనంతరం వారు ...

Read More »

ఘనంగా కాకా విగ్రహ ఆవిష్కరణ

మాచారెడ్డి : మండలంలోని ఫరీద్‌పేట గ్రామంలో కాకా విగ్రహాన్ని క్రవారం మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో వివేక్ మాట్లాడుతూ కార్మికుల కోసం కాకా పింఛన్ వ్యవస్థను ప్రారంభించేలా కృషి చేశారని తెలిపారు. బహుజనుల కోసం అంబేద్కర్ యూనివర్సిటీని నెలకొల్పడంతో లక్ష మందికి పైగా చ దువుకొని పట్టభద్రులు అయినట్లు చెప్పారు. మాజీ మంత్రి వినోద్ మా ట్లాడుతూ దేశంలో మచ్చలేని నాయకుడిగా కాకా పేరుపొందారన్నారు. కాంగ్రెస్ ...

Read More »

వెయ్యికోట్లతో మండలానికో గోదాం నిర్మాణం

మోర్తాడ్: రాష్ట్రంలో వెయ్యి కోట్ల రూపాయలతో ప్రతి మండల కేంద్రంలో 5వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంలు నిర్మించనున్నామని భారీ నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు అన్నా రు. మోర్తాడ్ మండల కేంద్రంలో శుక్రవారం 5వేల మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రైతుల సౌలభ్యం కోసమే గోదాం నిర్మాణాలు చేపడుతున్నామన్నారు.గోదాం సౌకర్యం లేక రైతులు ధాన్యాన్ని తక్కువ ధరలకే విక్రయించి నష్టపోతున్నారని అన్నారు. ఆ సమస్యను దూరం చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం గోదాంల ...

Read More »

ఖిల్లా రామాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

డిచ్‌పల్లి,  : డిచ్‌పల్లి ఖిల్లా రామాలయంలో సీతారామ చంద్రస్వామి బ్రహ్మోత్సవాలుప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటి రోజు మాఘశుద్ధ ఏకాదశి గురువా రం రాత్రి 9 గంటలకు పుణ్యహవచనం, అంకురార్పణం, అఖం దీపారాదన, రక్షాబంధనం, నివేదన, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు ప్రధాన అర్చకుడు వానమాములై వెంకట కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ఆకుల లలిత కుటుంబీకు లు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచి రూప్‌సింగ్ రాథోడ్, డీసీసీబీ డైరెక్టర్ గజవాడ జైపాల్, ఎంపీటీసీ మేక లింబా ద్రి, ...

Read More »

అమ్మాయిలను వేధించిన ఐదుగురు పోకిరీల అరెస్టు

నిజామాబాద్ క్రైం: జిల్లా కేంద్రంలోని పలు ఏరియాల్లో రోడ్డుపై నడిచివెళ్తున్న అమ్మాయిలను వేధించిన పోకిరీలను నిఘా వేసి పట్టుకొన్నట్లుగా నగర సీఐ నర్సింగ్ యాదయ్య తెలిపారు. స్థానిక సుభాష్‌నగర్ ప్రాంతంలోని నిర్మల హృదయ స్కూల్ వద్ద రోడ్డు వెంట నడిచివెళ్తున్న అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేసిన నలుగురు యువకులను షీ టీం పట్టుకొని సంబంధిత మూడో టౌన్ పోలీసులకు అప్పగించారు. ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న కిరణ్ గౌడ్, రాజేశ్, ప్రశాంత్, వంశీకిరణ్‌పై కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై టి.శ్రీహరి తెలిపారు. అలాగే జగిత్యాల్ పరిధిలోని ...

Read More »