Breaking News

Daily Archives: February 22, 2016

ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో అకడమిక్‌ కన్సల్టెంట్‌ పోస్టుకు మార్చి 1న ఇంటర్వ్యూ

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెస్సీ (ఆర్గానిక్‌ కెమిస్ట్రీ) సబ్జెక్టు బోధించడానికి అకడమిక్‌ కన్సల్టెంట్‌ కోసం వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ మార్చి 1న యూనివర్సిటీ కళాశాల, డిచ్‌పల్లి క్యాంపస్‌లో నిర్వహిస్తామని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. అకడమిక్‌ కన్సల్టెంట్‌ పోస్టు భిక్కనూరులోని సౌత్‌ క్యాంపస్‌లో ఉంటుంది. ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో ఆర్గానిక్‌ కెమిస్ట్రి స్పెషలైజేషన్‌తో 55 శాతం మార్కులు వచ్చినవారు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చన్నారు. నెట్‌, సిఎస్‌ఐఆర్‌, పిహెచ్‌డి, సెట్‌ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం లభిస్తుందన్నారు. ఇంటర్వ్యూలు మార్చి1 ఉదయం ...

Read More »

మరమ్మతులు చేయరా…

  నిజాంసాగర్‌ రూరల్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు జలాశయం 12వ వరద గేట్ల ముందు భాగంలోగల ఛత్రి బంగ్లా మరమ్మతులకు నోచుకోక శిథిలావస్థకు చేరుకుంది. ప్రాజెక్టు జలాశయంలో నీటిమట్టం పూర్తిగా పడిపోవడంతో ఛత్రిబంగ్లా దీనస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు శిథిలావస్థలో ఉన్న ఛత్రి బంగ్లానుచూసి ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల నిజాంకాలంలో నిర్మించిన ఈ ఛత్రి బంగ్లాకు ఇప్పటి వరకు మరమ్మతులు చేయలేదు. మరమ్మతులు చేయిస్తే ...

Read More »

తాగునీటి ఎద్దడిపై 24 గంటల్లోపు పనులు మంజూరు

  – సంయుక్త కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు తాగునీటిని అందించడం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతని జిల్లా సంయుక్త కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి ఆర్డీవోలు, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో నీటి ఎద్దడి నివారణకు చేపట్టిన పనులను సమీక్షించారు. నీటి ఎద్దడి నివారణ పనులకు నిధుల కొరత లేదని, మండలాల నుండి అందిన పనుల ప్రతిపాదనలను 24 గంటల్లోపు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. రూ. 10 లక్షలకు ...

Read More »

గ్రామాల్లో సారా తయారీ, విక్రయాలు జరిపితే కఠిన చర్యలు

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయాలు జరిపితే కఠిన చర్యలు చేపడతామని మోర్తాడ్‌ ఎక్సైజ్‌ సిఐ సహదేవుడు అన్నారు. సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. తాళ్ల రాంపూర్‌ శివారులోగల కాలనీలో బోదాసు లక్ష్మి నాటుసారా విక్రయిస్తుండగా దాడిచేసి పట్టుకున్నామని అన్నారు. కేసునమోదు చేసి నిందితురాలిని రిమాండ్‌కు తరలించినట్టు సిఐ పేర్కొన్నారు.

Read More »

నిర్బయంగా 10వ తరగతి పరీక్షలు రాయాలి

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు ఇష్టపడి చదివి, నిర్బయంగా 10వ తరగతి పరీక్షలు రాయాలని ఎంఇవో రాజేశ్వర్‌ అవగాహన కల్పించారు. సోమవారం మోర్తాడ్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రతిరోజు నిర్వహించాలని, ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఇవో అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, సిఆర్‌పిలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

తాగునీటి సమస్యపై సమీక్షా సమావేశం

  – హాజరుకాని అధికారులు మోర్తాడ్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాలమేరకు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణపై, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ది పనులపై వారం వారం సమీక్షా సమావేశాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ మండలాధికారులను ఆదేశించడంతో ప్రతి సోమవారం మండల పరిసత్‌ కార్యాలయంలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మోర్తాడ్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో తాగునీటి సమస్యపై ఎంపిడివో శ్రీనివాస్‌, మండల కార్యదర్శులతో, విఆర్వోలతో, కారోబార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో, కాలనీల్లో తాగునీటి ఎద్దడిపై, కల్పించిన ...

Read More »

ప్రభుత్వ వైద్యుల పనితీరుపై జడ్పిటిసి ఆగ్రహం

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌లోని క్లస్టర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది విధులు సరిగా నిర్వర్తించడం లేదని మోర్తాడ్‌ జడ్పిటిసి ఎనుగందుల అనిత, పూర్ణానందం, మోర్తాడ్‌ ఉపసర్పంచ్‌ గంగారెడ్డి, ఎంపిటిసిలు పాపాయి పవన్‌, మురళీగౌడ్‌, తెరాస మండల అధ్యక్షుడు ఏలియా, పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మోర్తాడ్‌లో ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి పరిశీలించారు. రోగులకు వైద్య చికిత్సలు సరిగా చేయడం లేదని, సమయ పాలన పాటించడం లేదని, ప్రభుత్వ వైద్యులు ప్రయివేటు వైద్యానికే పరిమితం ...

Read More »

డయల్‌ యువర్‌ ఎస్పీకి 20 ఫిర్యాదులు

  నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ ఎస్పీకి నేడు 20 ఫిర్యాదులు వచ్చినట్టు జిల్లా పోలీసు శాఖాధికారి వెల్లడించారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆద్వర్యంలో డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమం ఎస్‌పి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌, కామారెడ్డి, ఆర్మూర్‌, బోధన్‌ సబ్‌ డివిజన్‌ పరిధి నుంచి వివిధ రకాల సమస్యలపై మొత్తం 20 ఫిర్యాదులు వచ్చినట్టు ...

Read More »

ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలి

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం మహిళల గౌరవాన్ని పెంపొందించేందుకు, గ్రామాల్లో పరిశుభ్రత, పారిశుద్యం కల్పించేందుకు స్వచ్ఛభారత్‌ అమలు చేస్తుందని మోర్తాడ్‌ ఎంపిపి కల్లడ చిన్నయ్య, సర్పంచ్‌ సత్తమ్మ, హనుమాగౌడ్‌, ఎంపిడివో శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం మండలంలోని ఆయా గ్రామాల్లో స్వచ్ఛభారత్‌ పథకం కింద మండల సర్పంచ్‌లు, అధికారులు భూమిపూజ చేసి మరుగుదొడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోర్తాడ్‌ మండలంలోని అన్ని గ్రామాలకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేకచొరవ తీసుకొని ...

Read More »

పక్కాగా పల్స్‌పోలియో చుక్కలు వేయాలి

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లోని చిన్నారులు పోలియోబారిన పడకుండా పక్కాగా పల్స్‌పోలియో చుక్కలు వేయించాలని మోర్తాడ్‌ జడ్పిటిసి ఎనుగందుల అనిత, సర్పంచ్‌ మారుత, లోలం లావణ్య, రాజగంగారాం, బుక్యా అంజిబాయిలు అన్నారు. సోమవారం మండలంలోని ఆయా గ్రామాల్లో రెండోరోజు ఇంటింటికి పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు చుక్కలు వేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు తల్లిదండ్రులు సైతం 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలన్నారు.

Read More »

వైద్య ఆరోగ్యశాఖ సమావేశం

  ఆర్మూర్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో వైద్యఆరోగ్య శాఖమంత్రి లక్ష్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన వైద్యఆరోగ్య శాఖ సమావేశంలో సోమవారం ఎంపి కవితతో కలిసి ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈసమావేశంలో ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌గుప్త, ప్రశాంత్‌రెడ్డి, షకీల్‌, జడ్పి ఛైర్మన్‌దపేదార్‌ రాజు, వైద్య ఆరోగ్య శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

క్షత్రియ కళాశాల ఘటనపై సమగ్ర విచారణ జరపాలి

  ఆర్మూర్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని క్షత్రియ జూనియర్‌ కళాశాలలో 4వ అంతస్తు నుంచి సుమలత అనే విద్యార్థిని కిందపడి తీవ్ర గాయాలపాలైన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు పిడిఎస్‌యు జిల్లాప్రధాన కార్యదర్శి ఎం.సుమన్‌ తెలిపారు. సోమవారం ఈ ఘటనకు సంబంధించి ఒక నిర్దారణ బృందాన్ని ఏర్పాటు చేసుకొని కళాశాలకు వెళ్ళి ఘటన స్థలాన్ని, ప్రిన్సిపాల్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్‌ కథనం ప్రకారం.. విద్యార్థిని గత రెండు ...

Read More »

ప్రజావాణికి 5 ఫిర్యాదులు

  ఆర్మూర్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని తహసీల్‌ కార్యాలయంలో సోమవారం ప్రజావాణికి 5 ఫిర్యాదులు వచ్చినట్టు ఆర్మూర్‌ తహసీల్దార్‌ శ్రీధర్‌ తెలిపారు. ఇందులో రెండు ఆహారభద్రత కార్డుల్లో పేర్లు జతపరచడానికి, ఒకటి ఎస్‌కెఎస్‌ స్పీటింగ్‌, రెండు పహాణి ఆన్‌లైన్‌ ఎంట్రీకి సంబంధించి ఫిర్యాదులు వచ్చినట్టు ఆయన చెప్పారు.

Read More »

పిఇటి కాదు… కామాంధుడు

  రామాయంపేట ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓ స్కూల్లో పిఇటి టీచర్‌గా పనిచేస్తున్న కిరణ్‌ పిఇటి టీచరే కాదు కామాంధుడు కూడా…7 సంవత్సరాల చిన్నారిపై కొన్నిరోజులుగా అత్యాచారానికి పాల్పడి అడ్డంగా దొరికిపోయాడు. ఇపుడు జైళ్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. వివరాల్లోకి వెళితే… మెదక్‌ జిల్లా దుబ్బాక మండలం భూంపల్లి ఎక్స్‌రోడ్డు లోగల వికాస్‌ పబ్లిక్‌ స్కూల్లో కిరణ్‌ పిఇటి టీచర్‌గా పనిచేస్తున్నాడు. 7 సంవత్సరాల విద్యార్థినిని గత 20 రోజులుగా అత్యాచారానికి గురిచేస్తున్నాడు. విషయం ఎవరికైనా చెబితే కొడతానని, భవనం ...

Read More »

ఘనంగా సాందీపని కళాశాల వార్షికోత్సవం

  కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని సాందీపని కళాశాల 15వ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ సుందర్‌కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువును కష్టంగా కాకుండా ఇస్టపడి చదివితే అద్భుతాలు సృస్టిస్తారని పేర్కొన్నారు. ప్రణాళిక బద్దంగా, దిశా నిర్దేశం చేసుకొని విద్యార్తులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. టెక్నాలజిని వినియోగించుకొని చదువులో ముందుకు సాగాలన్నారు. ప్రధానవక్తగా హాజరైన బ్రహ్మశ్రీ మాడగుల నాగఫణిశర్మ, జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ...

Read More »

ఘనంగా గంగామాత వార్షికోత్సవాలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ సమీపంలోని పెద్దచెరువు వద్దగల గంగామాత ఆలయ 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ప్రారంభమైన ఉత్సవాలు మంగళవారంతో ముగియనున్నాయి. సోమవారం గ్రామదేవతల పూజ నిర్వహించారు. ఉదయం వేళ అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక హోమం చేశారు. సాయంత్రం వేళ అమ్మవారికి మంగళహారతులు ఇచ్చారు. వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Read More »

బంగారు తెలంగాణ దిశగా విద్యార్థి లోకం కదలాలి

  విద్యార్థి జేఏసి, బిసి జేఏసి రాష్ట్ర ఛైర్మన్‌ బాలరాజు కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థి లోకం క్రియాశీలక పాత్ర పోషించిందని, నేటి బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ విద్యార్థులంతా ఒక్కటై ముందుకు కదలాలని తెలంగాణ విద్యార్థి, బిసి జేఏసి రాష్ట్ర ఛైర్మన్‌ బాల్‌రాజు పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించిన తెలంగాణ బిసి జేఏసి గర్జనలో పాల్గొని మార్గమధ్యంలో కామారెడ్డి ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ అన్ని రంగాల్లో ...

Read More »

రీయంబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి

  టిఎన్‌విఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌ కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రీయంబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ నవనిర్మాణ్‌ విద్యార్థి సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌ డిమాండ్‌ చేశారు. కామారెడ్డిలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమను చూపిస్తుందన్నారు. రెండు సంవత్సరాల నుంచి విద్యార్తులకు చెల్లించాల్సిన ఫీజు రీయంబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన ...

Read More »

కస్తూర్బా పాఠశాలలో వీడ్కోలు సమావేశం

  బీర్కూర్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌ గ్రామంలోగల కస్తూర్బా పాఠశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి వారికి వీడ్కోలు పార్టీని ఏర్పాటు చేశారు. తమ పాఠశాలలో ఒకరితో ఒకరికి ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. మరికొన్నిరోజుల్లో ఉపాధ్యాయులను విడిపోవడం బాధగా ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలో ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ప్రత్యేకాధికారిణి గీత మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు ...

Read More »

ప్రజాప్రతినిధులకు ఓడిఎఫ్‌పై అవగాహన సదస్సులు

  – జిల్లా కలెక్టర్‌ యోగితారాణా నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని గ్రామాలను బహిరంగ మల విసర్జన రహితంగా తీర్చిదిద్దే ప్రక్రియలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. ఈనెల23న నిజామాబాద్‌రూరల్‌, 24న బాల్కొండ నియోజకవర్గ స్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల ఎంపిపి, జడ్పిటిసి, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, స్వయం సహాయక సంఘాల గ్రామ సమాఖ్య ...

Read More »