Breaking News

Daily Archives: February 23, 2016

బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి

  నందిపేట, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధికల్పించే వరకు బీడీ పరిశ్రమపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదని, 85 శాతం పుర్రె గుర్తు తొలగించాలని కోరుతూ మంగళవారం మండల కేంద్రంలోని నందిగుడి వద్ద జరిగిన సమావేశంలో సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసి జిల్లా ఉపాధ్యక్షులు గంగాదర్‌ ప్రభుత్వాన్ని కోరారు. మండలంలో బీడీ పరిశ్రమపై జీవించే కార్మికులు పనిలేక తల్లడిల్లుతున్నారని, తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ...

Read More »

బోరుబావి ప్రారంభం

  ఆర్మూర్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని 8వ వార్డులో ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ బబ్లు బోరు బావిని మంగళవారం ప్రారంభించారు. ఈబోరుబావిని మోసిన్‌, అబ్దుల్‌ హకీంలు తమ స్వంత స్తలంలో వేయించారు. అక్కడ పుష్కలంగా నీరు రావడంతో మునిసిపల్‌ పాలకవర్గం అభ్యర్థిత్వం మేరకు బోరుబావిని పాలకవర్గానికి అందజేశారు. ఇందులో ఛైర్మన్‌ మోటారును బిగించి మంగళవారం ప్రారంభించారు. బోరునుంచి పట్టనంలోని 5, 6 వార్డులకు నీటి సరఫరా చేస్తామని ఆమె చెప్పారు. కార్యక్రమంలో కో ఆప్షన్‌ సభ్యులు మాలిక్‌బాబా, ...

Read More »

సాయి వోకేషనల్‌ కళాశాలలో వీడ్కోలు సమావేశం

  ఆర్మూర్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని సాయి వోకేషనల్‌ కళాశాలలో మంగళవారం విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. మొదటి సంవత్సరం విద్యార్తులు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు పలికారు. ఈ సందర్బంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను అలరించాయి. కార్యక్రమంలో కళాశాల ఛైర్మన్‌ సిలివేరి సురేశ్‌ బాబు, ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Read More »

మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు

  ఆర్మూర్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని మామిడిపల్లి చౌరస్తాలో సోమవారం రాత్రి ఆర్మూర్‌ ఎస్‌ఐలు సంతోష్‌కుమార్‌, యాకూబ్‌లు పోలీసు సిబ్బందితో వాహనాల తనికీ నిర్వహించారు. బ్రీత్‌ అనలైజర్‌ ద్వారా వాహనాలు నడుపుతున్న వారిని పరీక్షించారు. ఇందులో మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి ఐదు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోస్వాధీనం చేసుకొని వారిని కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలిపారు. ఇంకా ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ...

Read More »

25న బయోటెక్నాలజి జాతీయ సెమినార్‌

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ బయోటెక్నాలజి విభాగం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 25న మంచి ఆహారం, పోషకత అనే అంశంపై ఒకరోజు జాతీయ సెమినార్‌ నిర్వహిస్తున్నట్టు సెమినార్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ ప్రవీణ్‌ మామిడాల తెలిపారు. సమావేశంలో ముఖ్య అతిథిగా విసి సి.పార్థసారధి, స్పెషల్‌ గెస్టుగా ప్రొఫెసర్‌ సుభాష్‌, ప్రత్యేక అతిథులుగా రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, ప్రొఫెసర్‌ ఎన్‌.రామస్వామి, డాక్టర్‌ రాజీవ్‌, ప్రొఫెసర్‌ కనకయ్యలు పాల్గొంటారన్నారు. వీరితోపాటు విషయ నిపుణులు ప్రొఫెసర్‌ కుల్దీప్‌ సింగ్‌, డాక్టర్‌ ...

Read More »

ఇంకా గుడిసెల్లోనే పేదల బతుకులు

  నందిపేట, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వాలు మారినా పేదల బతుకులు మారడం లేదు. ఎన్నికల ముందు అది చేస్తాం.. ఇది చేస్తాం… పేదల బతుకులు మారుస్తాం… పేదలకు అండగా నిలుస్తామని వాగ్దానాలు చేసిన నాయకులు ఎన్నికలు కాగానేచేసిన వాగ్దానాలు మర్చిపోతున్నారు. నందిపేట మండలంలో చాలా మంది నిరుపేదలు గుడిసెల్లోనే జీవితం వెళ్లదీస్తున్నారు. గుడిసెల్లో జీవనం సాగిస్తూ పడరాని పాట్లు పడుతున్నారు. సి.హెచ్‌.కొండూరు గ్రామంలోని 20 పేద కుటుంబాలు ఇంకా గుడిసెల్లోనే జీవనం సాగిస్తున్నాయి. గత ప్రభుత్వాలు ఇందిరమ్మ ...

Read More »

అదనపు కట్నం కోసం వేధించిన భర్త అరెస్టు

  నందిపేట, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివాహమై మూడేళ్లు గడిచింది… ఇద్దరు సంతానం కూడా ఉన్నారు… భర్త మద్యపానానికి బానిసయ్యాడు… అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే…నందిపేట మండలం ఆంధ్రానగర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని జోజిపేట గ్రామానికి చెందిన శ్రీరాంసాగర్‌తో శైలజకు గత మూడేళ్ళ క్రితం వివాహమైంది. పెళ్ళయిన మూడేళ్ళు కాపురం చక్కగా కొనసాగింది. ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. గత కొంతకాలంగా అదనపు కట్నం కోసం భార్య శైలజను తరచూ సాగర్‌ వేధిస్తున్నాడు. మద్యానికి ...

Read More »

ప్రతిఒక్కరు పర్యావరణానికి కృషి చేయాలి

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో పర్యావరణం కోసం కృషి చేసిన గాడ్కే బాబా ఆశయాల మేరకు ప్రతి ఒక్కరు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ కృషి చేయాలని మోర్తాడ్‌, పాలెం, రామన్నపేట అంబేడ్కర్‌ సంఘం నాయకులు అన్నారు. మంగళవారం మండలంలోని మోర్తాడ్‌, రామన్నపేట, పాలెం గ్రామాల్లో గాడ్కేబాబా 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. దేశంలో రైతులకు వ్యవసాయ సాగుపై, కుమ్మరులకు మట్టి పాత్రలు తయారుచేయడంపై నేర్పించిన ఘనత ...

Read More »

విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లోగల ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మంగళవారం మోర్తాడ్‌ ఎంఇవో రాజేశ్వర్‌ కంటి అద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి చూపులోపంగల విద్యార్థులను గుర్తించి వైద్య చికిత్సలు అందించామని, వారికి కంటి అద్దాలు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రదానోపాధ్యాయులు ప్రేమలత, మాస్టర్‌, సిఆర్‌పిలు పలువురు పాల్గొన్నారు.

Read More »

వెంకటేశ్వరస్వామి ఆలయ పరిశీలన

  కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని పంచముఖి ఆలయాన్ని మంగళవారం ప్రముఖ స్థపతి వల్లినాయక్‌ పరిశీలించారు. పంచముఖి ఆలయ ప్రాంగణంలోని వివిధ దేవాలయ గర్భగుడులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ సరైన అవగాహనతో దేవాలయం నిర్మించబడలేదని, దాంతో భక్తులు స్వామివార్ల అనుగ్రహాన్ని పొందలేకపోతున్నారన్నారు. దేవాలయ అభివృద్దికి ఎంత డుబ్బు ఖర్చయినా భరిస్తామని, ఆలయాన్ని పునరుద్దరించాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు గోనె శ్రీనివాస్‌, ప్రకాశ్‌, ముకుందాచారి, కౌన్సిలర్‌ కుంబాల రవి, అనిల్‌, ...

Read More »

వైభవంగా బోనాల ఊరేగింపు

  కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో మంగళవారం మత్స్య పారిశ్రామిక సంఘం ఆద్వర్యంలో బోనాలు వైభవంగా ఊరేగించారు. శ్రీగంగామాత ఆలయ 14వ వార్సికోత్సవాన్ని పురస్కరించుకొని బోనాలు ఊరేగించారు. అందంగా అలంకరించిన బోనాలను మహిళలు నెత్తికెత్తుకొని డప్పు వాయిద్యాల నడుమ పట్టణంలోని పెద్దబజార్‌, రైల్వేకమాన్‌, నిజాంసాగర్‌ చౌరస్తా, ఆర్‌అండ్‌బి అతిథి గృహం మీదుగా పెద్ద చెరువు వరకు ఊరేగించారు. అనంతరం నిర్వహించిన శివగంగ కళ్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు సామూహిక కుంకుమార్చనలు చేశారు. కార్యక్రమంలో ...

Read More »

ప్రగతి పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 22వ వార్డులో మంగళవారం సిసిరోడ్డు పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారన నిధులు రూ. 2 లక్షలతో సిసి రోడ్డు నిర్మించనున్నట్టు తెలిపారు. పనులు నాణ్యతతో జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని, నాణ్యతతో చేయాలని కాంట్రాక్టరును ఆదేశించారు. ఆమె వెంట కౌన్సిలర్‌ సయ్యద్‌, నిమ్మ దామోదర్‌రెడ్డి, ఎఇ. గంగాధర్‌, నాయకులు పిప్పిరి వెంకటి, గోనె శ్రీనివాస్‌, ముదాం ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Read More »

అభివృద్ది పనులను పరిశీలించిన ఎంపిడివో

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాళ్లరాంపూర్‌, తడపాకల్‌, దోంచంద, గుమ్మిర్యాల్‌, బట్టాపూర్‌ గ్రామాల్లో మోర్తాడ్‌ ఎంపిడివో శ్రీనివాస్‌ మంగళవారం పర్యటించి తాగునీటి సమస్యను, అభివృద్ది పనులను పరిశీలించారు. రాంపూర్‌లో ఇజిఎస్‌ కింద జరుగుతున్న ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ పనులను ఎంపిడివోతోపాటు జడ్పిటిసి ఎనుగందుల అనిత, సర్పంచ్‌ తుమ్మల మారుత, ఎంపిటిసి దిబ్బ సరస్వతి, సుదర్శన్‌లు పరిశీలించారు. పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రతను గుర్తించి తక్షణమే ప్రయివేటు బోర్లుఅద్దెకు తీసుకొని తాగునీరు అందించాలని మండల కార్యదర్శులను, విఆర్వోలను ...

Read More »

ఉర్దూభాష చాలా గొప్పది

  – విసి పార్థసారధి డిచ్‌పల్లి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో మంగళవారం ఉర్దూ ఫెస్టివల్‌ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వైస్‌ ఛాన్స్‌లర్‌ సి.పార్థసారధి మాట్లాడుతూ ఉర్దూ ప్రపంచ భాష అని, ఉర్దూచాలా గొప్ప భాష అని అన్నారు. భారతీయ ఉర్దూ గొప్పదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూ రెండో అధికారభాషగా ఉందని, ఉర్దూను కాపాడుకోవడం, ప్రోత్సహించడం మనందరి బాద్యత అన్నారు. ఉర్దూ సామాన్యుని భాష అన్నారు. ఉర్దూ మనదేశంలో దాదాపు 10 కోట్ల మంది మాట్లాడుతారు, ...

Read More »

మొదటి సెమిస్టర్‌ పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన రిజిస్ట్రార్‌

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎం, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రి, అప్లయిడ్‌ ఎకనామిక్స్‌ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతున్న తెయు కళాశాల భవనాన్ని మంగళవారం రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తనికీ చేశారు. మొత్తం 112 మంది విద్యార్తులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. రిజిస్ట్రార్‌ వెంట ప్రిన్సిపాల్‌ ఆచార్య పి.కనకయ్య, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ పాతనాగరాజు ఉన్నారు. పరీక్షలు జరుగుతున్న తీరు, వసతుల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

Read More »

ముగిసిన పల్స్‌పోలియో

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత మూడురోజులుగా కొనసాగుతున్న పల్స్‌పోలియో కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా మహ్మద్‌నగర్‌ గ్రామంలో వైద్యాధికారి డాక్టర్‌ స్పందన ఆధ్వర్యంలో మంగళవారం ఇంటింటికి తిరుగుతూ పల్స్‌పోలియో కార్యక్రమం చేపట్టారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే పూర్తిచేయడం జరిగిందన్నారు. వందశాతం 5 సంవత్సరాలలోపు చిన్నారులందరికి పోలియో చుక్కలు వేయడం జరిగిందని ఈసందర్భంగా అన్నారు. ఆమె వెంట సిబ్బంది సాయిలు, ఏఎన్‌ఎంలు సావిత్రి, సత్తెవ్వ, నాగమణి ఉన్నారు.

Read More »

దుమ్మురేగుతున్న రోడ్డు

  నిజాంసాగర్‌ రూరల్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నర్సింగరావుపల్లి ప్రధాన రహదారి డబుల్‌ రోడ్డు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 8 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఈ రహదారికి రోడ్డుకు ఇరుపక్కల పెద్ద వృక్షాలను తొలగించి రోడ్డు విస్తరణ పనులు నిర్వహిస్తున్నారు. రోడ్డుపై నాలుగు కిలోమీటర్ల మేర మొరం వేశారు. నిజాంసాగర్‌ నుండి పిట్లంవైపు వెళ్తున్న వాహనాలు వెళ్లడంలో దుమ్మురేగుతుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రహదారిగుండా నిత్యం వందల సంఖ్యలో ద్విచక్రవాహనదారులు, ...

Read More »

స్వయం పరిపాలనా దినోత్సవం

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ జడ్పిహెచ్‌ఎస్‌ పాఠశాల విద్యార్తులు మంగళవారం స్వయంపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి ఆయా తరగతి గదుల్లో చక్కగా పాఠాలు బోధించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమంగా పాఠాలు బోధించిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు మల్లికార్జున్‌, స్వప్న, నాగరాజు, తదితరులున్నారు.

Read More »

అచ్చంపేట నుంచి శ్రీశైలం బయల్దేరిన శివస్వాములు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అచ్చంపేట గ్రామం నుంచి శివస్వాములు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి కాలినడకన బయల్దేరారు. మంగళవారం ఉదయం గ్రామంలోని దేవాలయం నుంచి సుమారు 15 మంది స్వాములు శ్రీశైల పుణ్యక్షేత్రానికి కాలినడకన బయల్దేరారు. వారంరోజుల పాటు నడక కొనసాగుతుందన్నారు. ఈయాత్ర సుమారు 400 కి.మీ.లు కొనసాగుతుందన్నారు. శ్రీశైలం బయల్దేరిన వారిలో లక్ష్మణ్‌, శ్రీను, సంపత్‌, సత్యనారాయణ, మరికొందరు స్వాములు ఉన్నారు.

Read More »

హసన్‌పల్లిలో మిషన్‌ భగీరథ సర్వే

  నిజాంసాగర్‌ రూరల్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ సర్వే వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో రోడ్డుకు ఇరుపక్కలా సర్వే నిర్వహించారు. హసన్‌పల్లి గేటు నుంచి గ్రామ వాటర్‌ ట్యాంకు వరకు రోడ్డుకు ఇరువైపులా టోటల్‌ స్టేషన్‌ యంత్రాంగం ద్వారా సర్వే నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన మెగా కంపెనీ ఆద్వర్యంలో మిషన్‌ భగీరథకు సంబంధించిన సర్వే నిర్వహిస్తున్నట్టు ఆపరేటర్‌ రాజు చెప్పారు. ఇప్పటి వరకు ఎల్లారెడ్డి, ...

Read More »